yasan
-
ఆల్ రౌండర్
-
ఇది జీపీఎస్ ప్రేమసందేశం...
అమ్మాయి ప్రేమ పొందడానికి అబ్బాయిలు చాలా పాట్లు పడతారు. తొలుత ఆ భామ దృష్టిలో పడటానికే ఎన్నో ఫీట్లు చేస్తారు. తర్వాత తమ ప్రేమను ఎలా వ్యక్తీకరించాలా అని జుట్టు పీక్కుంటారు. ఈ ప్రపంచంలో ఎవరూ చెప్పలేనంత కొత్తగా ప్రపోజ్ చేసి నిచ్చెలి మనసు దోచుకోవాలని ఆరాటపడతారు. ఇలాంటివారిలో జపాన్‌కు చెందిన యాసన్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటాడు. ప్రేమించిన అమ్మాయికి తన మనసులో మాటను జీపీఎస్ డ్రాయింగ్ ద్వారా వ్యక్తీకరించి నివ్వెరపరిచాడు. ఇందుకోసం ఏకంగా తన ఉద్యోగాన్నే వదిలేసి ఎంతో శ్రమించాడు. ఓ జీపీఎస్ పరికరం, జపాన్ మ్యాప్ తీసుకుని ‘మ్యారీ మీ’ అనే ఆంగ్ల అక్షరాలను జీపీఎస్ డ్రాయింగ్‌లో రూపుదిద్దుకునేలా కొండలు, కోనలు, అడవుల్లో నడుస్తూ ఎంతో కష్టపడ్డాడు. తన ప్రేమ వ్యక్తీకరణ కోసం జపాన్‌లో ఆరు నెలల్లో దాదాపు 7వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇందులో ఎక్కువ దూరం నడవగా.. కొన్నిచోట్ల కారు, సైకిల్, పడవ వంటి ప్రయాణ సాధనాలు వినియోగించాడు. హొక్కాయిడో దీవి నుంచి ప్రారంభమైన అతడి జీపీఎస్ ప్రేమయాత్ర.. క్యూషు దీవిలోని హ్యోడో క్లిఫ్లో ముగిసింది. అనంతరం అతడి జీపీఎస్ పరికరంలో నమోదైన ప్రయాణాన్ని పరిశీలిస్తే.. ఇదిగో ఇలా కఅఖఖ్గ కఉ అనే అక్షరాలతోపాటు లవ్ సింబల్ దర్శనమిచ్చింది. యాసన్ దీనిని తీసుకెళ్లి తాను ప్రేమించిన అమ్మాయికి చూపించాడు. అంతే.. ఆమె కళ్లలో ఆనంబా ష్పాలు పెల్లుబికాయి. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే యాసన్ ప్రేమకు ఓకే చెప్పేసింది. ఇదంతా 2008లో జరిగింది. అప్పుడు యాసన్కు 31 సంవత్సరాలు. తన ప్రేమయాత్రకు సంబంధించి యాసన్ ‘వాక్యుమెంటరీ’ పేరుతో ఏడు నిమిషాల నిడివి కలిగిన ఓ డాక్యుమెంటరీని కూడా విడుదల చేశాడు. ప్రపంచంలో ఇప్పటివరకు చేసిన ప్రేమ వ్యక్తీకరణల్లో ఇదే అతిపెద్దదట. పైగా 7,164 కిలోమీటర్ల పొడవులో ఉన్న ఈ జీపీఎస్ డ్రాయింగ్ ఇప్పటివరకు ఉన్నవాటిలో అతిపెద్దదని గిన్నిస్‌బుక్ వాళ్లు కూడా సర్టిఫికెట్ ఇచ్చేశారు. -
ఇది జీపీఎస్ ప్రేమసందేశం...
అమ్మాయి ప్రేమ పొందడానికి అబ్బాయిలు చాలా పాట్లు పడతారు. తొలుత ఆ భామ దృష్టిలో పడటానికే ఎన్నో ఫీట్లు చేస్తారు. తర్వాత తమ ప్రేమను ఎలా వ్యక్తీకరించాలా అని జుట్టు పీక్కుంటారు. ఈ ప్రపంచంలో ఎవరూ చెప్పలేనంత కొత్తగా ప్రపోజ్ చేసి నిచ్చెలి మనసు దోచుకోవాలని ఆరాటపడతారు. ఇలాంటివారిలో జపాన్‌కు చెందిన యాసన్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటాడు. ప్రేమించిన అమ్మాయికి తన మనసులో మాటను జీపీఎస్ డ్రాయింగ్ ద్వారా వ్యక్తీకరించి నివ్వెరపరిచాడు. ఇందుకోసం ఏకంగా తన ఉద్యోగాన్నే వదిలేసి ఎంతో శ్రమించాడు. ఓ జీపీఎస్ పరికరం, జపాన్ మ్యాప్ తీసుకుని ‘మ్యారీ మీ’ అనే ఆంగ్ల అక్షరాలను జీపీఎస్ డ్రాయింగ్‌లో రూపుదిద్దుకునేలా కొండలు, కోనలు, అడవుల్లో నడుస్తూ ఎంతో కష్టపడ్డాడు. తన ప్రేమ వ్యక్తీకరణ కోసం జపాన్‌లో ఆరు నెలల్లో దాదాపు 7వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇందులో ఎక్కువ దూరం నడవగా.. కొన్నిచోట్ల కారు, సైకిల్, పడవ వంటి ప్రయాణ సాధనాలు వినియోగించాడు. హొక్కాయిడో దీవి నుంచి ప్రారంభమైన అతడి జీపీఎస్ ప్రేమయాత్ర.. క్యూషు దీవిలోని హ్యోడో క్లిఫ్లో ముగిసింది. అనంతరం అతడి జీపీఎస్ పరికరంలో నమోదైన ప్రయాణాన్ని పరిశీలిస్తే.. ఇదిగో ఇలా కఅఖఖ్గ కఉ అనే అక్షరాలతోపాటు లవ్ సింబల్ దర్శనమిచ్చింది. యాసన్ దీనిని తీసుకెళ్లి తాను ప్రేమించిన అమ్మాయికి చూపించాడు. అంతే.. ఆమె కళ్లలో ఆనంబా ష్పాలు పెల్లుబికాయి. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే యాసన్ ప్రేమకు ఓకే చెప్పేసింది. ఇదంతా 2008లో జరిగింది. అప్పుడు యాసన్కు 31 సంవత్సరాలు. తన ప్రేమయాత్రకు సంబంధించి యాసన్ ‘వాక్యుమెంటరీ’ పేరుతో ఏడు నిమిషాల నిడివి కలిగిన ఓ డాక్యుమెంటరీని కూడా విడుదల చేశాడు. ప్రపంచంలో ఇప్పటివరకు చేసిన ప్రేమ వ్యక్తీకరణల్లో ఇదే అతిపెద్దదట. పైగా 7,164 కిలోమీటర్ల పొడవులో ఉన్న ఈ జీపీఎస్ డ్రాయింగ్ ఇప్పటివరకు ఉన్నవాటిలో అతిపెద్దదని గిన్నిస్‌బుక్ వాళ్లు కూడా సర్టిఫికెట్ ఇచ్చేశారు.