‘ట్విటర్లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్ అగర్వాల్ ట్వీట్ వైరల్
ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలుతో ఆ సంస్థలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిర్వాహణ ఖర్చుల్ని తగ్గించుకునేందుకు సంస్థలోని సగానికిపైగా సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. వారిలో భారత్‌కు చెందిన 25 ఏళ్ల యశ్ అగర్వాల్ ఒకరు . సాధారణంగా ట్విటర్లాంటి సంస్థలో ఉద్యోగం కోల్పోతే సర్వసం కోల్పోయామనే భావన సర్వ సాధారణం. కానీ యశ్ అగర్వాల్ అందుకు విభిన్నంగా వ్యవహరిస్తున్నారు. ట్విటర్లో నా ఉద్యోగం ఊడింది అంటూ ఆ యువకుడు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి👉 ట్విటర్లో మస్క్ సలహా దారుడిగా భారతీయుడు, ఎవరీ శ్రీరామ్ కృష్ణన్?
యశ్ అగర్వాల్ ట్విటర్ తనని ఉద్యోగం నుంచి తొలగించిన విషయాన్ని సోషల్‌మీడియాలో తన స్నేహితులతో, సహచర ఉద్యోగులతో పంచుకున్నాడు. అయితే, ఉద్యోగం పోయినందుకు బాధపడలేదు. బదులుగా, అతను ట్విటర్లో గడిపిన సమయాన్ని ఎంతో విలువైనదిగా భావించాడు. ట్విటర్ లోగోలు ఉన్న రెండు కుషన్లను పట్టుకుని సంతోషంగా ఉన్న ఫోటోల్ని ట్వీట్ చేశాడు.
‘ఇప్పుడే ట్విటర్ నన్ను ఉద్యోగం నుంచి తొలగించింది. బర్డ్ యాప్. ఇది ఒక గొప్ప గౌరవం. ట్విటర్ బృందంలో, సంస్కృతిలో భాగమవ్వడం గొప్ప హక్కు’ అని ట్వీట్లో పేర్కొన్నాడు. ఆ ట్వీట్‌కు అతని సహచర ఉద్యోగులు స్పందించారు. (Elon Musk మరో ప్రైవేట్ జెట్‌కు ఆర్డర్: ఖరీదెంతో తెలుసా?)
Just got laid off.
Bird App, it was an absolute honour, the greatest privilege ever to be a part of this team, this culture 🫡💙#LoveWhereYouWorked #LoveTwitter pic.twitter.com/bVPQxtncIg
— Yash Agarwal✨ (@yashagarwalm) November 4, 2022
‘నువ్వు అద్భుతమైన వ్యక్తివి యశ్.ట్విటర్ మిమ్మల్ని పొందడం అదృష్టం! జాగ్రత్తగా ఉండండి. మీరు మాట్లాడాలనుకుంటే లేదా మీకు ఉద్యోగ రిత్యా ఎలాంటి సహాయం కావాలన్నా నేను ఇక్కడే ఉన్నానన్న విషయాన్ని మరిచిపోకండి అంటూ అతని కొలీగ్ ఒకరు ట్వీట్‌కు రిప్లయి ఇచ్చారు.
You are an amazing person, yash. Twitter was lucky to have you! Please take care and know that I am here if you want to talk or anything.
— Manvi Tyagi(She/her) (@ManviTyagi9) November 4, 2022
‘మీరు అద్భుతమైన ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించడంలో సహాయం చేశారు. మిమ్మల్ని విధుల నుంచి తొలగించడం వారికే నష్టమని అనుకుంటున్నాను.ట్విటర్ కంటే అద్భుతమైన అవకాశాలు మీ కోసం ఎదురు చూస్తున్నాయి. ఆల్ ది బెస్ట్’ అని మరొక ట్విటర్ యూజర్ ట్వీట్ చేశాడు.
Yashhhh 💙💙. It’s been so lovely working with you! Thank you for all your help with building Re:Set. Onward and upward 🚀🚀
— Aakanksha Tangri (@AakankshaT) November 4, 2022
ఆఫీస్‌కు రావొద్దు.. ఇంటికి వెళ్లిపోండి
ట్విటర్‌ను కొనుగోలు చేసిన టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారీ ఎత్తున లే ఆఫ్స్‌కు తెరతీసినట్లు తెలుస్తోంది. ఖర్చు తగ్గించుకోవటంలో భాగంగా ఉద్యోగాల కోత ప్రారంభించారు. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ట్విటర్లో మొత్తం ఉద్యోగులు 7,500మంది ఉండగా.. శుక్రవారం రోజు వారిలో సగం మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపింది.
ఈ మేరకు ఉద్యోగులకు మెయిల్స్ పంపింది ట్విటర్ సంస్థ. ఆఫీస్‌కు రావొద్దని, ఇంటికి వెళ్లొచ్చని సమాచారం ఇచ్చింది. మీరు ఆఫీస్‌లో ఉన్నా..ఆఫీస్‌కు బయలు దేరినా దయచేసి ఇంటికి తిరిగి వెళ్లండి’ అంటూ తమ ఉద్యోగులకు పంపిన మెయిల్స్‌లో ట్విటర్ రాసింది.
కంపెనీని విజయవంతంగా ముందుకు తీసుకొని వెళ్లేందుకు ఈ చర్య తప్పడం లేదని ట్విటర్ వెల్లడించింది. ఉద్యోగం నుంచి తీసేసిన ఉద్యోగులకు 2నెలల జీతంతో పాటు.. వారి ఈక్విటీలకు సమానమైన నగదును 3నెలల్లో చెల్లించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దాదాపూ 3,800 మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు సమాచారం.
చదవండి👉 ‘ఆఫీస్‌కు వస్తే రండి.. లేదంటే వెళ్లిపోండి’!