ట్రాన్స్‌కో సిబ్బందిపై రైతుల తిరుగుబాటు
చిన్నశంకరంపేట, న్యూస్‌లైన్ : బకాయి వసూళ్లకు వెళ్లిన ట్రాన్స్‌కో సిబ్బందిపై మండలంలోని జంగరాయి గ్రామ ఎర్రగుంట తండా రైతులు తిరగబడ్డారు. తమ ప్యానల్ బోర్డులను వదిలి వెళ్లాలని సిబ్బందితో వాదనకు దిగారు. ఈ పెనుగులాటలో ట్రాన్స్‌కో లైన్‌మన్ గోవింద్, సీఎల్ ఎల్లంలు స్ప ల్పంగా గాయపడ్డారు. అయితే రైతు లు తమను దుర్భాషలాడారని సిబ్బంది శం కర్, దిగంబర్, శ్రీనివాసరెడ్డి, సీఎల్ చం ద్రారెడ్డిలు ట్రాన్స్‌కో ఏఈ అహ్మద్అలీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన బా ధితులను వెంటబెట్టుకుని రైతులు మ డావత్ బిక్యా, లాల్యా, పెంటియా, కిమిలియలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విద్యుత్ సరఫరా కట్
బకాయిల వసూలులో భాగంగా సోమవారం చిన్నశంకరంపేటలో రైతులకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లుకు అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపేశారు. విత్తనం అలికేందుకు వెళ్లిన రైతన్నలు విషయాన్ని గమనించి ‘సాక్షి’ జనసభ వద్దకు వచ్చిన తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే సభలో ట్రాన్స్ కో ఏఈ లేకపోవడంతో అక్కడే ఉన్న తహశీల్దార్, ఎంపీడీఓ, స్థానిక సర్పంచ్ల దృష్టికి స మస్యను తెచ్చారు. బకా యి అడగకుం డానే విద్యుత్ సరఫరా నిలిపివేయడం ఎం త వరకు సమంజసమన్నారు. అయి తే న్యూస్‌లైన్ ట్రాన్స్‌కో ఏఈని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. దీంతో స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఉన్నతాధికారులుతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు వెనుతిరిగారు.