yogitarana
-
లెక్కలుంటేనే మొక్కలున్నట్లు
పాఠశాలల్లో కూరగాయలను పండించాలి కలెక్టర్ యోగితారాణా డీఈవో లింగయ్యకు ప్రశంస డిచ్పల్లి : తెలంగాణకు హరితహారం కింద నాటిన మొక్కలకు ఉపాధి హామీ కూలీలతో అనుసంధానం చేసి మొక్కల సంరక్షణకు నీరు పోస్తున్నట్లు జాబ్‌కార్డుల ద్వారా చెల్లింపులు జరిపితేనే మొక్కలు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తుందని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా స్పష్టం చేశారు. శుక్రవారం డిచ్పల్లిలోని ట్రైజం ట్రైనింగ్ సెంటర్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో హరితహారం మొక్కల మనుగడకు చేపట్టిన చర్యలను కలెక్టర్ సమీక్షించారు. ఇక నుంచి ప్రతి మొక్కకు వారం, వారం నీరు పోయాలని ఆదేశించారు. నీరు పోసేందుకు ఉపాధిహామీ పథకం కింద జాబ్‌కార్డులను జారీ చేసి ప్రతినెలా చెల్లింపులు జరుపనున్నట్లు తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో నాటిన మొక్కలకు విద్యార్థులతో నీరు పోయించరాదని స్పష్టం చేశారు. విద్యా సంస్థల్లో నీరు పోసేందుకు ప్రతి మొక్కకు రోజుకు 45 పైసల చొప్పు నెలకు 26 రోజుల పాటు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి ఉపయోగపడే కూరగాయలను హరితహారంలో భాగంగా పెంచాలని సూచించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మునగ, ఉసిరి మొక్కలను నాటాలన్నారు. చనిపోయిన వాటి స్థానంలో ప్రత్యామ్నాయ మొక్కలను నాటాలని ఆదేశించారు. శాఖల వారీగా ఈనెల 25లోపు మొక్కల మనుగడపై నివేదిక ఇవ్వాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. చనిపోయిన మొక్కల స్థానంలో 44వేల 585 మొక్కలు నాటించిన జిల్లా విద్యాశాఖాధికారి లింగయ్యను కలెక్టర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. మొక్కల మనుగడపై క్షేత్రస్థాయి పరిశీలనకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేక అధికారుల బృందం రానున్నట్లు తెలిపారు. మొక్కలకు ముళ్లకంప కంచెలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ట్రీ గార్డుల ఏర్పాటుకు బ్యాంకు అధికారులు ఇప్పటి వరకు రూ. 6.30 లక్షలను విరాళంగా ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. నిజామాబాద్ మున్సిపాలిటీలో నాటిన మొక్కలకు ట్రీ గార్డుల ఏర్పాటు కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మున్సిపల్ ఇంజినీర్లను ఆదేశించారు. కళాశాలలు, పాఠశాలల ఆవరణలో ఫాం పాండ్స్, కమ్యూనిటీ సోక్పిట్స్ నిర్మించడానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో మోహన్‌లాల్, డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ పీడీ చంద్రమోహన్‌రెడ్డి, ఆర్డీవోలు యాదిరెడ్డి, నగేశ్, సుధాకర్‌రెడ్డి, yీ ఎఫ్‌వోలు సుజాత, ప్రసాద్, జోజి, హార్టికల్చర్ డీడీ సునంద తదితరులు పాల్గొన్నారు. -

జిల్లాకు భారీ వర్షసూచన
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాకు భారీ వర్షసూచన ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సీఎం కె చంద్రశేఖర్‌రావు జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితారాణాకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సోమవారం తెలంగాణలో భారీ వర్ష సూచనలున్న జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన సీఎం కే సీఆర్ మన జిల్లా కలెక్టర్‌తోనూ మాట్లాడినట్లు సమాచారం. ఈ మేరకు కలెక్టరేట్ ప్రాంగణంలోనే కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన కలెక్టర్ యోగితారాణా భారీ వర్షసూచనపై అధికారులను సైతం అప్రమత్తం చేశారు. తక్షణ చర్యలు, సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1800–425–6644 ఏర్పాటు చేశారు.. తన చాంబర్లో అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. బంగాళ ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తెలంగాణకు భారీ వర్షసూచన ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. మూడు, నాలుగు రోజులుగా తెలంగాణలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఇదివరకే కరీంనగర్, వరంగల్ ఇతర జిల్లాల్లో భారీ వర్షాల వల్ల పట్టణాలు, గ్రామాల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. అలాంటి పరిస్థితులు కలుగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ యోగితారాణా అధికారులను ఆదేశించారు. నిజామాబాద్‌లో ప్రస్తుతం భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో అప్రమత్తం ఉండాలని కలెక్టర్ స్థానిక అధికారులను ఆదేశించారు. వర్షాలు భారీగా కురిస్తే ప్రమాదాలు ఏర్పడే ప్రాంతాలను, లోతట్టు ప్రాంతాలను ముందస్తుగానే గుర్తించి తగిన ఏర్పాటు చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తుండాలన్నారు. వాగులు, కాల్వలు, చెరువుల ప్రాంతాల్లో సైతం పరిశీలన కొనసాగాలన్నారు. వర్షాలతో ఏర్పడే ఇబ్బందులను టోల్ ఫ్రీ నెంబర్‌కు తెలియజేయాలని ప్రజలకు, ఉద్యోగులకు సూచించారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు మండల, గ్రామ స్థాయి యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ అధికారులతో పేర్కొన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భారీ వర్షాలు సంభవించినప్పుడు, వాగులు, వంకలు పొంగి రహదారులు మూతపడి ఇబ్బందిపడే మారుమూల గ్రామాల ప్రజలకు అత్యవసర సేవలను అందుబాటులో ఉంచాలన్నారు. రోడ్డు, విద్యుత్తు వ్యవస్థకు నష్టం జరిగితే వెంటనే పునరుద్ధరించాలన్నారు. చెరువులు, కుంటలకు గండ్లు పడితే యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులను చేపట్టాలన్నారు. మిషన్ కాకతీయ చెరువులకు చేరే నీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని నీటి పారుదల శాఖ ఇంజనీర్లు, వీఆర్వో, వీఆర్ఏలను ఆదేశించారు. అత్యవసర మందులను అన్ని గ్రామాలు, ఉప కేంద్రాలలో సమృద్ధిగా నిలువ ఉంచాలన్నారు. తాగునీటి వనరులను క్లోరినేషన్ చేయాలని, వర్షాలు పడినప్పుడు గ్రామాల్లో అంటు వ్యాధులకు గురి కాకుండా సానిటేషన్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 104,108 వాహనాలను అందుబాటులో ఉంచాలన్నారు. నిత్యావసర వస్తువుల కొరత రాకుండా ముంపు ప్రభావానికి గురయ్యే గ్రామాలకు ఆక్టోబర్ మాసం రేషన్‌ను కూడా పంపించాలని సూచించారు. వాగులు, నదులపై తక్కువ ఎత్తులో ఉన్న బ్రిడ్జిల వద్ద భద్రత చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ రవీందర్ రెడ్డి, డీఆర్వో పద్మాకర్ డీఎంహెచ్‌వో వెంకట్, సీపీవో శ్రీరాములు, ఐకేపీ పీడీ చం్ర మోహన్‌రెడ్డి, డీఎస్వో కృష్ణ ప్రసాద్, ట్రాన్స్‌కో ఎస్ఈ ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. -
అర్హులకే మూడెకరాల భూమి
బోధన్ రూరల్: భూపంపిణీ పథకం కింద అర్హులైన దళితులకే మూడెకరాల భూమిని ఇవ్వనున్నట్లు కలెక్టర్ యోగితారాణా తెలిపారు. భూకొనుగోలు పథకం కోసం భూములు విక్రయించేందుకు వచ్చిన కామారెడ్డి, బోధన్ డివిజన్ రైతులతో ఆమె శనివారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ధర నిర్ధారణపై వారితో చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టాదారులతో చర్చించి 360 ఎకరాలకు చెందిన పొల్లాలోని వనరులు, పండించే పంటలను బట్టి ధరను నిర్ణయించినట్లు చెప్పారు. భూములను అమ్మేందుకు ముందుకు వచ్చే పట్టాదారులతో వారి పంట పొలాల్లో నీటి వనరులు, వెట్ మరియు డ్రై క్రాప్ వివరాలను సంబంధిత గ్రామ వీఆర్వో, తహసీల్దార్లతో మాట్లాడి భూముల ధరల వివరాలను ముందుగానే పట్టాదారులకు తెలియచేయాలని వివరించారు. భూములు విక్రయించగా వచ్చిన డబ్బును వృథా చేయొద్దని ఆమె రైతులకు సూచించారు. పట్టాదారుల నుంచి స్వీకరించిన భూములు రిజిస్ట్రేషన్ కాగానే, వారి ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఇందులో ఎవరు ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. జేసీ రవీందర్‌రెడ్డి, బోధన్, కామారెడ్డి ఆర్డీవోలు సుధాకర్‌రెడ్డి, నగేష్ రెడ్డి, విమాలాదేవి తదితరులు పాల్గొన్నారు. -
బోధన్ ఆస్పత్రి డాక్టర్‌పై సస్పెన్షన్ వేటు
నిజామాబాద్ జిల్లా బోధన్ ఆస్పత్రి గైనకాలజిస్టు డాక్టర్ దుర్గా ప్రమీలపై సస్పెన్షన్ వేటు పడింది. గురువారం మధ్యాహ్నం ఆస్పత్రిని కలెక్టర్ యోగితారాణా తనిఖీ చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విషయం ఈ సందర్భంగా ఆమె దృష్టికి వచ్చింది. దీనిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు గైనకాలజిస్టు దుర్గా ప్రమీలనే కారణమంటూ సస్పెన్షన్ ఉత్తర్వులిచ్చారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని కలెక్టర్ హెచ్చరించారు.