young boy dead
-
ఆర్జీ కర్ నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలి!
బెంగాల్ వైద్యురాలిపై హత్యాచార ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న తరుణంలో.. ఘటన జరిగిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా ఓ యువకుడు మరణించాడు. అయితే తన కొడుకు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని అతడి తల్లి ఆరోపిస్తోంది.వివరాలు.. కోల్‌కతాకు 25 కి. మీ దూరంలో ఉన్నహుగ్లీలోని కొన్నాగర్‌లో 28 ఏళ్ల యువకుడు విక్రమ్ భట్టాచాజీ నివాసముంటున్నాడు. ఇటీవల అతడిని ట్రక్కు ఢీకొట్టడంతో ఆర్జీకర్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం బిక్రమ్ మరణించాడు. అయితే ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు అందుబాటులో లేరని, కొడుక్కి చికిత్స అందించడంలో ఆలస్యం చేయడం వల్లే మరణించినట్లు అతని తల్లి ఆరోపించింది.ఆసుపత్రికి వచ్చిన సమయంలో డాక్టర్ అందుబాటులో లేరు. చాలా సమయం వృధా అయింది. ఆ లోపు అతని సర్జరీ పూర్తి కావాల్సి ఉంది. కనీసం అత్యవసర వైద్యుడు కూడా లేడు’ అని ఆమె వాపోయింది. అయితే, ఆర్జి కర్ ఆసుపత్రి అధికారులు మాత్రం మృతుడి కుటుంబ వాదనలను తోసిపుచ్చారు. శుక్రవారం ఉదయం విక్రమ్‌ను ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు వెంటనే ట్రామా కేర్‌కు తీసుకెళ్లారని వైద్య సూపరింటెండెంట్ కమ్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సప్తర్షి ఛటర్జీ పేర్కొన్నారు. అతని శరీరంపై తలపై పెద్ద గాయం అయ్యిందని, సీటీ స్కాన్ కోసం తీసుకెళ్లినట్లు చెప్పారు. అయితే సీటీ స్కాన్ చేస్తున్నప్పుడు విక్రమ్ ఆరోగ్యం క్షీణించి మరణించినట్లు తెలిపాడు.కాగా గత నెలలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణమైన అత్యాచారం, హత్యపై ఆర్జీ కర్ హాస్పిటల్ వైద్యులు నిరంతరం నిరసనలు చేస్తున్న తరుణంలో.. ఈ ఘటన చోటుచేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. -
విషాదం.. నాలాలో పడిపోయి నాలుగేళ్ల బాలుడు మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలో సోమవారం రాత్రి నుంచి కుండపోత వర్షం కురిసింది. ఈ క్రమంలో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. మరోవైపు.. భారీ వర్షాల నేపథ్యంలో బాచుపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్ ఎన్ఆర్ఐ కాలనీ వద్ద నాలాలో పడిపోయి నాలుగేళ్ల బాలుడు నితిన్ గల్లంతయ్యాడు. ఈ క్రమంలో నిజాంపేట రాజీవ్ గృహకల్ప వద్ద బాలుడి మృతదేహం కనిపించింది. దీంతో, నితిన్‌ను బయటకు తీసే ప్రయత్నం విఫలం కావడంలో అక్కడే ఉన్న తుర్క చెరువులోకి మృతదేహం కొట్టుకుపోయింది. చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు, డీఆర్ఎఫ్ బృందాలు బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. కొన్ని గంటల పాటు శ్రమించి బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. ఇదిలా ఉండగా.. జంట నగరాల్లో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇళ్లలోకి వరదు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు, మేడ్చల్‌లో అపార్ట్మెంట్లలో మొదటి అంతస్తు వరకు వరద నీరు చేరుకుంది. దీంతో, వరదల్లో చిక్కుకున్న వారిని జేసీబీల సాయంతో బయటకు తీసుకువచ్చారు అధికారులు. ఇది కూడా చదవండి: Hyderabad : వర్షం దెబ్బకు హైదరాబాద్ ఏమయిందంటే.? -
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
జనగాం: ప్రేమ విఫలమై తొర్రూరులోని చర్చి బజారుకు చెందిన అల్లం శ్యామ్ (26) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్యామ్ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో పట్టణంలోని ఓ యువతిని ప్రేమించాడు. ఆమె తిరస్కరించడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరి పస్తం స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
కలలు.. కల్లలయ్యాయి..
ఎల్కతుర్తి: ఇటీవల బీటెక్ అయిపోయింది. ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. ఆ మేరకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ మనం ఒకటి తలిస్తే.. విధి మరోటి తలుస్తుందని అంటుటారు.. అదే ఈ యువకుడి విషయం జరిగింది. జ్వరంరాగా స్థానిక ఆర్ఎంపీ వద్ద చూయించుకున్నాడు. అతను ఇచ్చిన ఇంజక్షన్‌తో శరీరం నల్లగా మారడంతోపాటు అస్వస్థతకు గురై చనిపోయాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నాథ్‌పూర్ గ్రామంలో ఆలస్యంగా మంగళవారం వెలుగుచూసింది. మృతుడి కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బండి విజయ్(22) బీటెక్ పూర్తి చేశాడు. ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 12న విజయ్‌కి జ్వరం రావడంతో జీల్గులకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు శ్రీనివాస్‌ను సంప్రదించాడు. పరీక్షించిన వైద్యుడు మాత్రలు ఇచ్చాడు. అయినప్పటికి విజయ్‌కి జ్వరం తగ్గకపోవడంతో అదేరోజు సాయంత్రం ఆర్ఎంపీ వైద్యుడు ఇంజక్షన్ వేశాడు. మరుసటి రోజు తెల్లవారుజామున ఇంజక్షన్ వేసిన దగ్గర శరీరమంతా నల్లగా మారి ఇబ్బందులు పడ్డాడు. తిరిగి ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లగా మరికొన్ని మాత్రలు ఇచ్చి తగ్గకపోతే రావాలని సూచించాడు. అయినప్పటికి నొప్పి తగ్గకపోవడంతో మరోసారి ఆర్ఎంపీ వద్దకు వెళ్లాడు. దీంతో ఆర్ఎంపీ.. విజయ్ చేతికి మరో ఇంజక్షన్ వేసి పంపించాడు. ఆ నొప్పి తీవ్రతరం కావడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు అశ్రిత్‌రెడ్డి.. విజయ్ పరిస్థితి క్రిటికల్‌గా ఉందని, నాలుగు రోజుల తర్వాత రావాలని మందులు రాసి ఇంటికి పంపించాడు. ఇంటికి వచ్చిన విజయ్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఈనెల 14న వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని చెప్పారు. కాగా, ఆర్ఎంపీ వైద్యుడు ఇచ్చిన ఇంజక్షన్తోపాటు వైద్యం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్ అశ్రిత్‌రెడ్డి విజయ్ మృతికి కారకులని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. మృతుడికి తల్లిండ్రులు, ఓ సోదరుడు ఉన్నారు. మృతుడి తండ్రి రవిందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై జక్కుల పరమేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. కాగా ఇటీవలే బావుపేటలో ఆర్ఎంపీ వైద్యుడు శ్రీనివాస్ ఇచ్చిన ఇంజక్షన్ వికటించి బత్తిని సతీష్ అనే వ్యక్తి మృతిచెందిన విషయం మరువకముందే మరో సంఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. -
రక్త మార్పిడి కలకలం: యువకుడి మృతిపై అనుమానాలు?
ములకలపల్లి: రక్త మార్పిడి చేయించుకున్న యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆర్ఎంపీ అందించిన వైద్యం వికటించి మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమలాపురంలో కలకలం రేపింది. గ్రామానికి చెందిన యువకుడు జక్కా రామకృష్ణ (29) మంగళవారం ఆకస్మిక మృతి చెందగా..ఆర్ఎంపీ వైద్యం వికటించడంతోనేనని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రోజులుగా నీరసంగా ఉంటోందని మా«ధారంలోని ఓ ఆర్ఎంపీ వద్ద చికిత్స పొందుతున్నాడు. సోమవారం ములకలపల్లి సెంటర్లోని ఓ రక్తపరీక్షా కేంద్రంలో కమలాపురం గ్రామానికి చెందిన చెందిన ఓ యువకుడి రక్తాన్ని సేకరించి..సదరు మాధారం ఆర్ఎంపీ పర్యవేక్షణలో ఎక్కించారు. ఈ క్రమంలో రామకృష్ణ ఆరోగ్యం క్షీణించి..చనిపోయాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. చదవండి: ప్రాణం తీసిన పేకాట.. మద్యంమత్తులో బండరాయితో మోది.. ఆర్ఎంపీ నివాసంలో రక్తం పరిశీలిస్తున్న వైద్యారోగ్య శాఖ అధికారులు అధికారుల విచారణ మృతుడికి భార్య సమ్మక్క, ఏడాది వయసు కూతురు ఉంది. ప్రస్తుతం ఆమె గర్భిణి. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పోటు వినోద్ కమలాపురం వెళ్లి వివరాలు సేకరించారు. రక్తం ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ములకలపల్లిలోని రక్త పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసి తాత్కాలికంగా సీజ్ చేశారు. మాధారంలోని ఆర్ఎంపీ ఇంటికి వెళ్లగా ఆయన అందుబాటులో లేడు. అక్కడ మందులను పరిశీలించారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్ఓ తెలిపారు. మృతుడి తల్లి సత్యవతి ఫిర్యాదు మేరకు ఎస్సై సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: ‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు -
పొలం విక్రయంపై రభస.. తట్టుకోలేక యువకుడు
బిజినేపల్లి: భూమి విక్రయానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని మిట్యాతండాకు చెందిన రమావత్ చంద్రు (26) వృత్తిరీత్యా డ్రైవర్. ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే ఆటో నడుపుతుండేవాడు. ఈయనకు భార్య లక్ష్మితో పాటు కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామానికి వచ్చాడు. గతంలో చేసిన అప్పులు తీర్చడానికి తమకున్న రెండెకరాలను అమ్మి తీర్చాలనుకున్నాడు. అయితే వారు అంగీకరించక పోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయాడు. సోమవారం ఉదయం ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ వెంకటేశ్ కేసు దర్యాప్తు జరుపుతున్నారు. (చదవండి: ఎమ్మెల్యే స్వగ్రామంలో క‘న్నీటి’ కష్టాలు) చదవండి: పవిత్రబంధంలాంటి ఈ భార్యాభర్తలను ఆదుకోండి -
ప్రేయసి మైకంలో ప్రైవేటు పార్ట్‌కు డ్రగ్స్.. తెల్లారి లేచి చూస్తే
అహ్మదాబాద్: ప్రేయసితో కలిసి ఉన్న మైకంలో ఆ యువకుడు తీవ్ర తప్పిదం చేశాడు. ప్రైవేటు పార్ట్‌కు డ్రగ్స్ అంటించి ఆమెతో శారీరక సంబంధం కొనసాగించాడు. ఏమైందో తెలియదు గానీ తెల్లారి అతడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. పోలీసులు వచ్చి పరిశీలించగా మృతి చెందాడు. పోస్టుమార్టానికి తీసుకెళ్లగా సంచలన విషయాలు తెలిశాయి. గర్భం రాకుండా ప్రైవేటు పార్ట్‌కు రాసుకున్న డ్రగ్‌తో అతడు మృతి చెందాడని తేలింది. ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. (చదవండి: అచ్చం సినిమాలా? వ్యాపారి కుమారుడు కిడ్నాప్.. గంటల్లో) గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని ఫతేవాడికి చెందిన ఓ యువకుడు (25) తన ప్రేయసిని కలిశాడు. వారిద్దరూ మరో మహిళతో కలిసి ఓ హోటల్‌కు వెళ్లి ఒక గది తీసుకున్నారు. అంతకుముందు వారిద్దరూ డ్రగ్స్ తీసుకున్నారు. అనంతరం ఆ మత్తు మైకంలో వారు శారీరకంగా కలిసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ సమయంలో సంరక్షణ మరిచారు. గర్భం రాకుండా ఉండేందుకు ఎలాంటి వస్తువు తెచ్చుకోకపోవడంతో ఆ యువకుడు అక్కడే ఉన్న జిగురుతో పాటు వైట్నర్ అంటించుకున్నాడు. అనంతరం వారిద్దరూ కలుసుకున్నారు. ఇది జరిగిన రెండు రోజులకు అతడు అంబర్ టవర్ ప్రాంతంలో పొదల చాటున అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. మృతదేహానికి సోలాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించగా ఆ డ్రగ్ అతడికి తీవ్ర ప్రభావం చూపినట్లు తేలింది. అతడికి డ్రగ్స్ అలవాటు ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ‘ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం. ఏం జరిగిందో అందులో తెలుస్తుంది’ అని ఆ ప్రాంత డీసీపీ ప్రేమ్‌సుఖ్ డెలు తెలిపారు. ఈ ఘటన వైద్యులను నివ్వెరపరిచింది. సున్నితమైన అవయవాలకు ఇష్టమొచ్చినట్టు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని పలువురు వైద్యులు హెచ్చరిస్తున్నారు. కామం మైకంలో ఇష్టారీతిన ప్రవర్తిస్తే ఇలాగే ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. చదవండి: సీఎంపై అనుచిత వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అరెస్ట్ -
మహిళతో వివాహేతర సంబంధం; ఆమె కూతురిని పెళ్లి చేసుకోవాలని..
విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్లో మూడు నెలల కిందట నమోదైన అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. సారిక గ్రామానికి చెందిన బొద్దూరు పవన్‌కుమార్ (17) అదృశ్యం కేసులో సంచలన విషయాలు తేలాయి. అతడు హత్యకు గురయ్యాడని తేలింది. ఈ హత్యలో పాల్గొన్న ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. కేసు వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో పట్టణ డీఎస్పీ అనిల్‌కుమార్ తెలిపారు. తన కుమారుడు పవన్‌కుమార్ మే 8వ తేదీన సాయంత్రం పాలప్యాకెట్లు తెచ్చేందుకు ఇంటి నుంచి బైక్‌పై వెళ్లి తిరిగి రాలేదని మే 9న తల్లి లత పోలీసులకు ఫిర్యాదుచేసింది. అదృశ్యం కేసుగా నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే జూలై 27వ తేదీన సారిక గ్రామానికి దగ్గరలో ఉన్న వ్యవసాయ బావిలో ఓ మృతదేహాన్ని గుర్తించగా అది పవన్దిగా నిర్ధారించి దర్యాప్తు చేయగా పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా స్కెచ్‌తో... పవన్‌కుమార్ తండ్రి చనిపోయాడు. ఈ క్రమంలో తల్లి లతకు పద్మనాభ మండలం చిన్నాపురానికి చెందిన గిడిజాల జగదీశ్‌తో వివాహేతర సంబంధం ఉంది. దీనిపై పవన్ పలుమార్లు తల్లిని మందలించాడు. జగదీశ్‌ను సైతం హెచ్చరించినా వినకుండా వారి బంధం కొనసాగుతోంది. ఇదిలాఉండగా.. సారిక గ్రామానికి చెందిన వాలిపల్లి సురేశ్ (33)తో పవన్‌కు మంచి స్నేహం ఉంది. సురేశ్ కన్ను పవన్ చెల్లిపై పడింది. ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. దీనికి పవన్‌తో పాటు తల్లి నిరాకరించారు. పాఠశాలకు వెళ్తున్న చిన్నపిల్ల కావాల్సి వచ్చిందా అంటూ మందలించారు. ఆ అమ్మాయి మీద ప్రేమతో సురేశ్ లతతో వివాహేతర సంబంధం ఉన్న జగదీశ్‌ను సంప్రదించాడు. ఇద్దరూ ఏకమై పవన్‌ను చంపితే తమ లక్ష్యాలు నెరవేరుతాయని భావించారు. పవన్ హత్యకు తనవద్ద పనిచేస్తున్న సువ్వాడ శంకరరావును సురేశ్ సాయం కోరాడు. ట్రాక్టర్ డ్రైవర్ పిట్టా శంకర్, మరో స్నేహితుడు మేకల సోముల సాయంతో హత్యకు పథకం సిద్ధం చేశాడు. వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ అనిల్‌కుమార్, సీఐ మంగవేణి, ఎస్ఐలు నారాయణరావు, అశోక్‌కుమార్, కిరణ్ కుమార్‌నాయుడు, ప్రశాంత్ కుమార్ అయితే మే 8వ తేదీన పవన్‌కు డబ్బులు అవసరమై సురేశ్‌ను రూ.2 వేలు అప్పు అడిగాడు. సురేశ్ రూ.వెయ్యి ఇచ్చి మిగతా వెయ్యి సాయంత్రం ఇస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని శంకర్‌కి సురేశ్ చెప్పగా ఇదే అదును అని సారిక గ్రామ సమీపంలో కల్లు తాగే ప్రదేశం వద్ద మేకల సోములు, పిట్టా శంకర్లను తాళ్లు, ప్లాస్టిక్ గోనె సంచెతో పవన్‌ను హతమార్చేందుకు సిద్ధంగా ఉంచారు. సాయంత్రం కావడంతో రూ.వెయ్యి కోసం పవన్ ఫోన్ చేయగా సురేశ్ సువ్వాడ శంకర్‌తో కలిసి ముగ్గురూ ఒకే వాహనంపై కల్లుతాగే ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే కాపు కాస్తున్న సువ్వాడ శంకర్ బైక్ దిగుతుండగానే కర్రతో పవన్‌పై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో పవన్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని కనిపించకుండా సోములు, పిట్టా శంకర్ గోనె సంచిలో మూట కట్టి సమీపంలోని వ్యవసాయ బావిలో వేశారు. బైక్‌ను కూడా తాళ్లతో బావిలో పడేశారు. అయితే పవన్ ఇంటికి రాకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా అదృశ్య కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే కొన్ని క్లూలతో హంతకులు వాలిపల్లి సురేశ్, సువ్వాడ శంకరరావు, మేకల సోములు, పిట్టాశంకర్, గిడిజాల జగదీశ్ చిక్కారు. వారిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. కేసు ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన రూరల్ సీఐ మంగవేణి, ఎస్ఐలు నారాయణరావు, అశోక్‌కుమార్, గంట్యాడ ఎస్ఐ కిరణ్ కుమార్‌నాయుడు, సీసీఎస్ ఎస్ఐ ప్రశాంత్ కుమార్, ఏఎస్ఐ త్రినాథరావు, హెచ్‌సీలు శ్యామ్‌బాబు, రామారావు, సిబ్బంది షేక్ షఫీ, కోటేశ్వరరావు, రమణ, సాయిలను డీఎస్పీ అభినందించారు. వారికి నగదు పోత్సాహక బహుమతులను అందజేశారు. -
ఫేస్బుక్ లైవ్‌లో ఫ్రెండ్స్‌ను ఏప్రిల్ ఫూల్స్ చేయబోయి..
తిరువనంతపురం: ఏప్రిల్ 1వ తేదీని ఏప్రిల్ ఫూల్ డేగా భావిస్తారు. ఆ రోజు తమ వారిని కొంత ఫూల్‌ను చేద్దామని ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో వింత వింత చేష్టలు చేస్తారు. అవి కొందరికి కోపం తెప్పిస్తాయి. మరికొన్ని తీవ్ర పరిస్థితులకు దారి తీస్తాయి. తాజాగా ఓ విద్యార్థి తన స్నేహితులను ఏప్రిల్ ఫూల్ చేయబోయి ప్రాణాలు కోల్పోయాడు. ఫేస్బుక్లో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లైవ్ వీడియో తీసుకునేందుకు ప్రయత్నించి మరణించిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. కేరళ అలప్పుజ జిల్లాలోని తళవాడి పప్రాంతంలోని కిలిరోర్లో సిద్ధార్థ్ అజయ్ (17) తన తల్లిదండ్రులు, సోదరితో కలిసి నివసిస్తున్నాడు. ఏప్రిల్ 1వ తేదీ సందర్భంగా గురువారం రాత్రి భోజనం అనంతరం తన గదిలోకి వెళ్లాడు. తన స్నేహితులను ఏప్రిల్ ఫూల్ చేద్దామని భావించి ఓ ప్రాంక్‌గా ఆత్మహత్య చేసుకున్నట్లు నటిద్దామని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా ఫేస్బుక్ లైవ్ ఆన్ చేశాడు. బెడ్ షీట్‌తో ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు నటిద్దామని ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో ఆ బెడ్ షీట్ అతడికి బిగుతుగా బిగించుకుపోయి అతడికి ఊపిరాడకుండాపోయింది. అయితే కుమారుడిని పిలుద్దామని గదిలోకి వెళ్లిన తల్లి నిర్ఘాంతపోయింది. కుమారుడు ఫ్యాన్‌కు వేలాడుతుండడంతో కంగారుపడింది. వెంటనే కుటుంబసభ్యుల సహాయంతో అజయ్‌ని కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అజయ్ మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ యువకుడి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా ఇంకా ఫేస్బుక్ లైవ్ కొనసాగుతుండడం గమనార్హం. -
లారీ ఢీకొని యువకుడి మృతి
సాక్షి, గోవిందరావుపేట: లారీ ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా సమీపంలో గుండ్లవాగు బ్రిడ్జి సమీపంలో ఆదివారం జరిగింది. ఎస్సై మహేందర్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గోవిందరావుపేట మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన సాంబశివరావు గత కొన్నేళ్లుగా పస్రాలో నివాసముంటున్నాడు. ఆదివారం మద్యాహ్నం మోటర్‌సైకిల్‌పై పస్రా నుంచి తాడ్వాయి వైపు వెళుతున్న క్రమంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. సాంబశివరావు మృతి చెందిన విషయం తెలుసుకున్న ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి సీతక్క సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భార్య, పిల్లలను పరామర్శించి ఓదార్చారు. -
ఆదుకుంటావనుకుంటే.. శవమయ్యావా బిడ్డా..!
బొంరాస్‌పేట : ‘మీ నాన్న సచ్చినప్పుడు మూడేండ్లోడవుంటివి కొడుకా.. ఉడుకు నీళ్లంటేనే నీకు భయం.. చేతులార పెంచి పెద్ద చేస్తే ఇట్లా చెరువులో పడి శవమయ్యావా బిడ్డా’.. అంటూ ఓ తల్లి కొడుకు శవం వద్ద రోదించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లి గళ్లంతైన యువకుడి శవం శనివారం మధ్యాహ్నం లభ్యమైంది. బొంరాస్‌పేట మండల పరిధిలోని తుంకిమెట్లకు చెందిన లావ నర్సింలు, జయమ్మ దంపతుల కుమారుడు రాజు(20). మహబూబ్‌నగర్ జిల్లా కోస్గిలో ఐటీఐ చదువుతున్నాడు. స్నేహితులతో విందుకని ఏర్పుమళ్లకు వెళ్లాడు. శుక్రవారం నలుగురు స్నేహితులతో కలిసి ఏర్పుమళ్ల కాకర్‌వాణీ ప్రాజెక్టులో ఈతకు వెళ్లి గల్లంతైన సంఘటన శుక్రవారం చోటు చేసుకున్న విషయం విధితమే. కాగా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకొని శనివారం మధ్యాహ్నం గల్లంతైన యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు. చేతికొందొచ్చిన కొడుకు శవమై కనిపించడంతో ఆ తల్లి రోదన అంతాఇంతా కాదు.. తండ్రి చనిపోయినా.. బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నానని జయమ్మ ఏడ్చిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. స్నేహితులపై అనుమానం ఉంది.. శుక్రవారం రాత్రి తన కొడుకు లావ రాజును ఇంట్లో నుంచి పిలుచుకొని వెళ్లి ఇలా శవమై చేతికిచ్చారని మృతుడి తల్లి జయమ్మ గుండెలు బాదుకుంటూ విలపించింది. ఏర్పుమళ్లకు చెందిన స్నేహితులు విందుకు తీసుకువెళ్లి చెరువులో గల్లంతయ్యాడని చెప్పి శవంగా మార్చారని ఆరోపించింది. తన కొడుకు నీటిలో శవంగా కనిపించడంలో అనుమానం ఉందని, స్నేహితులే బాధ్యులని ఫిర్యాదు చేసింది. తన కొడుకు రాజు స్నేహితులు ఏర్పుమళ్లకు చెందిన సందారం ప్రవీణ్‌కుమార్, ఈడ్గి శ్రీకాంత్, బాబర్‌లపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొంది. గజ ఈతగాళ్లతో గాలింపు ప్రాజెక్టు నీటిలో గల్లంతైన లావరాజు కోసం శనివారం మధ్యాహ్నం వరకు ముమ్మరంగా గాలింపు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలించలేదు. శనివారం కోట్‌పల్లి ప్రాజెక్టు నుంచి నలుగురు గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చేయగా మృతదేహం లభ్యమైంది. సంఘటనా స్థలానికి కొడంగల్ సీఐ శంకర్ ఆరా తీశారు. మృతుడి తల్లి జయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కొడంగల్ ఆస్పత్రికి తరలించారు. -
మొబైల్ ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్
పెనగలూరు: మొబైల్ ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతనికి గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి వైఎస్సార్ జిల్లా పెనగలూరు మండలంలో చోటు చేసుకుంది. నడిమి సిద్దవరం గ్రామానికి చెందిన కోనేటి సుబ్బన్న, గంగమ్మల ఏకైక పుత్రుడు హరినాథ్(22) ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు తల్లిదండ్రులు వయో వృద్ధులు కావడంతో చదువు ఆపేసి రాజంపేటలో షూమార్ట్‌లో పనిచేస్తున్నాడు. మొబైల్ ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. బయట ఉన్న తల్లిదండ్రులు గదిలోకి Ðð ళ్లి చూడగా వెళ్లగా చార్జర్ పట్టుకుని అలానే నిలబడి ఉన్నాడు. వెంటనే కింద పడిన కుమారున్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. లేకలేక కలిగిన కుమారుడు కళ్లముందే కన్నుమూయడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.