The young woman
-
ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
కడప : జిల్లా పోలీసు యంత్రాం గంలో ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న విక్రమ్ కుమార్ రెడ్డి (25)(ఏఆర్ పిసి 2963) మంగళవారం తాను నివసిస్తున్న గదిలో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. 2011 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన విక్రమ్ కుమార్‌రెడ్డి కడప నగరంలోని ఓ యువతిని ప్రేమించి, తాను వివాహం చేసుకుంటానని ఆ యువతి తల్లిదండ్రులతో వెళ్లి మాట్లాడాడు. వారు అందుకు నిరాకరించడంతో మనస్థాపానికి గురై ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసింది. తన గదిలో ఉరేసుకున్న విషయాన్ని సహచర కానిస్టేబుళ్లు గమనించి అతన్ని హుటాహుటిన స్థానిక తిరుమల హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తమిళనాడులోని రాయవేలూరుకు తీసుకెళ్లారు. ఆత్మహత్యకు యత్నించిన కానిస్టేబుల్‌ను ఏఆర్ డీఎస్పీ మురళీధర్ తదితరులు పరామర్శించారు. ఈ సంఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
యువతిని కిడ్నాప్ చేసిన పూజారి అరెస్ట్
పూజల పేరుతో పరిచయం పెదకాకాని : పూజల పేరుతో యువతికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసిన పూజారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పెదకాకాని శివాలయంలో చదలవాడ కిషన్‌కుమార్ అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళ తన కుమార్తెను వెంట బెట్టుకుని ఆలయానికి పూజల కోసం వెళుతుండేది. ఈ క్రమంలో పరిచయమైన కిషన్ కుమార్ అలియాస్ కిషోర్ పూజా కార్యక్రమాల పేరుతో మహిళతో పరిచయం పెంచుకుని ఇంటికి వెళుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఆమె కుమార్తెకు మాయ మాటలు చెప్పి ఈనెల 12వ తేదీ తెల్లవారుజామున ఇంటి నుంచి తీసుకువెళ్ళాడు. అదే రోజు రాత్రి మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం ఇద్దరం ఇష్టపూర్వకంగా పెళ్ళి చేసుకున్నామంటూ పోలీసు స్టేషన్‌కు వచ్చారు. అయితే, పూజారికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో మాయమాటలు చెప్పి యువతిని కిడ్నాప్ చేసిన కేసులో కిషన్‌కుమార్‌ను మంగళవారం అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచినట్లు సీఐ సీహెచ్ చంద్రమౌళి తెలిపారు. నిందితుడికి 15 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. -
వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య
పొన్నూరు రూరల్: ప్రేమ వేధింపులను తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చోటుచేసుకుంది. పొన్నూరు రూరల్ ఎస్ఐ మీసాల రాంబాబు కథనం ప్రకారం వివరాలు.. మండల పరిధి కసుకర్రు గ్రామానికి చెందిన కంచర్ల శ్రీనివాసరావు కుమార్తె అమూల్య(19) బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన కూరపాటి సర్వోత్తమరావు ప్రేమపేరుతో కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. తాను చదువుకుని ఉన్నత స్థితికి చేరేందుకు శ్రమిస్తున్నానని, ప్రేమ పేరుతో తనను వేధింపులకు గురిచేయవద్దని సర్వోత్తమరావును పలుమార్లు ప్రాథేయపడింది. అంతకంతకూ వేధింపులు అధికం చేయడంతో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. ఈ ఇబ్బందుల నుంచి తట్టుకునేందుకు కుమార్తె చదువు మాన్పించి హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో ఉంచి వివాహ ప్రయత్నాలు ప్రారంభించారు. మంగళగిరికి చెందిన యువకుడితో వివాహం చేసేందుకు పెద్దలు ముహూర్తం కుదిర్చారు. నిశ్చితార్థం కార్యక్రమానికి హాజరయ్యేందు అమూల్య హైదరాబాద్ నుంచి కసుకర్రుకు రెండు రోజుల క్రితం వచ్చింది. ఇది గమనించిన సర్వోత్తమరావు ఎవరూ లేని సమయంలో ఆమెను కలిసి తనను పెళ్లి చేసుకోకపోతే మీ కుటుంబం మొత్తాన్ని హతమారుస్తానని బెదిరించాడు. భయపడిపోయిన అమూల్య ఈ విషయాన్ని పొలంలో పనిచేస్తున్న తన తండ్రికి తెలియజేయడంతో ఈ విషయంపై మధ్యాహ్నం మాట్లాడతానని పొన్నూరు మార్కెట్‌కు వెళ్లాడు. ఈ ఘటనతో భీతిల్లిన అమూల్య శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిడుబ్రోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. -
చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన యువతి అరెస్టు
గుంటూరు ఈస్ట్: చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న యువతిని కొత్తపేట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నాలుగు సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 1వ తేదీ వెంకటేశ్వరవిజ్ఞాన మందిరం రోడ్డులో పెదకూరపాడు మండలం అబ్బురాజుపాలెం గ్రామానికి చెందిన అమరనేని అనసూయమ్మ సిటీ బస్సు దిగుతుండగా ఓ యువతి ఆమె మెడలోని నాలుగు సవర్ల బంగారం నానుతాడు తెంచుకుని పరారైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం తమిళనాడుకు చెందిన ప్రభుమారి అనే యువతిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె నుండి నానుతాడు స్వాధీనం చేసుకున్నారు. కేసు పురోగతిలో పాల్గొన్న హెడ్‌కానిస్టేబుల్ ఎం డీఎ ఖాన్, సిబ్బంది తనూజా, లక్ష్మి తిరుపతమ్మలను ఎస్సై అభినందించారు. -
ఆ యువతికి న్యాయం చేయండి
ఎమ్మెల్యే కాలె యాదయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి బాలమల్లేశ్ చేవెళ్ల రూరల్: మండల పరిధిలోని మొండివాగు గ్రామంలో ప్రియుడి ఇంటి ఎదుట మౌనదీక్షకు దిగిన యువతికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి బాలమల్లేశ్, మిహళా సమాఖ్య న్యాయ సలహాదారు విజయలక్ష్మి పండిట్ తదితరులు సోమవారం రాత్రి డీఎస్పీని కలిశారు. ఊరేళ్ల అనుబంధ మొండివాగుకు చెందిన హసీనాబేగంను అదేగ్రామానికి చెందిన మహ్మద్‌షఫీ ప్రేమించి పెళ్లి చే సుకునేందుకు ముఖం చాటేసిన విషయం తెలిసిందే. ప్రియుడి ఇంటి ఎదుట యువతి మౌనదీక్ష సోమవారంతో ఐదో రోజుకు చేరుకుంది. సోమవారం సీపీఐ నాయకులు, మహిళా సమాఖ్య సభ్యులు యువతికి మద్దతు తెలిపారు అనంతరం వారు డీఎస్పీని కలిసి విషయం తెలియజేశారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య దృష్టికి తీసుకెళ్లారు. రాత్రి 7 గంటల సమయంలో ఎమ్మెల్యే చేవెళ్లలో డీఎస్పీ రంగారెడ్డి, సీఐ ఉపేందర్‌ను కలిసి ఈ విషయమై చర్చించారు. ఓ యువతి తనకు న్యాయం చేయాలని దీక్ష కొనసాగిస్తున్నా స్పందించకపోవటం శోచనీయమన్నారు. న్యాయం జరిగే వరకు తాము యువతికి అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఎలాగైనా షఫీతో యువతి పెళ్లి చేయించాలని కోరారు. లేదంటే యువకుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బాలమల్లేశ్, జిల్లా కార్యవర్గం సభ్యులు జనార్దన్, జంగయ్య, రామస్వామి, బాలయ్య, మహిళా సమాఖ్య నాయకురాళ్లు విజయలక్ష్మి పండిట్, నీలమ్మ, లక్ష్మిలు మాట్లాడారు. న్యాయం జరిగే వరకు యువతికి అండగా ఉంటామన్నారు. డీఎస్పీ రంగారెడ్డి మాట్లాడుతూ.. ఈ విషయం సోమవారమే తన దృష్టికి రాగా విచారణ జరిపినట్లు తెలిపారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. గతంలో యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దాని ఆధారంగానే మహిళా సంఘాలు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారని పేర్కొన్నారు. ముందుగా షఫీకి కౌన్సెలింగ్ చేస్తామని, అతడు యువతిని పెళ్లి చేసుకుంటే సరేనని, లేకపోతే యువతి పిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రంగారెడ్డి స్పష్టం చేశారు. -
ఉన్మాదం
ప్రేమించమంటూ యువతికి వేధింపులు శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని కెలమంగలం : తనను ప్రేమించాలంటూ ఓ యువతిని వేధించడమే కాక తన శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని యువతిని కౌగిలించుకునేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు ఆస్పత్రి పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే... ఇంజినీరింగ్ చదివిన ధర్మపురి జిల్లా పాలక్కొడుకు చెందిన ఓ యువతి(24)కి ఎనిమిది నెలల క్రితం జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం దొరికింది. ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు ఆమెను ప్రేమించాలని నాడసంబట్టి గ్రామానికి చెందిన రామలింగం కొడుకు సంతోష్(24) వెంటపడేవాడు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు ఆ యువతి తెలిపింది. అయితే వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. దీంతో ఆమె అతని ప్రేమను తిరస్కరించింది. బుధవారం ఉదయం తన గ్రామం నుంచి బస్సులో బయలుదేరిన యువతిని సంతోష్ వెంబడించాడు. కెలమంగలం బస్టాండులో బస్సు దిగగానే ఆమె వాగ్వాదానికి దిగాడు. తనను ప్రేమించాలని పట్టుపట్టాడు. ఆ సమయంలో అతని చర్యలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులతోనూ అతను వాదనకు దిగాడు. అనంతరం తన కార్యాలయానికి వెళుతున్న యువతిని వెంబడిస్తూ సమీపంలోని పెట్రోల్ బంక్‌లో రెండు లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేశాడు. యువతిని అడ్డగించి తను ప్రేమించకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ పెట్రోల్‌ను తనపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. అనంతరం తనను చుట్టుముట్టిన మంటలతో యువతిని కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే మంటలను ఆర్పారు. అప్పటికే ఇద్దరికి కాలిన గాయాలయ్యాయి. చికిత్స కోసం ప్రభుతాస్పత్రికి బాధితులను తరలించారు. మెరుగైన వైద్యం కోసం సంతోష్‌ను హొసూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కెలమంగలం ఇన్స్పెక్టర్ జయశంకర్ కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. -
కాకినాడలో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం
-
కాకినాడలో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం
*జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితులు *సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సోకినట్టు అనుమానం *నివారణ ఔషధాలు పుష్కలంగా ఉన్నాయన్న వైద్యాధికారి కాకినాడ క్రైం : సరిగ్గా రెండేళ్ల క్రితం జిల్లాను వణికించిన స్వైన్ ఫ్లూ భూతం మరోసారి జిల్లాలో కలకలం రేపుతోంది. తాళ్లరేవు మండలం చినబొడ్డు వెంకటాయపాలెం, పరిసరాల్లో 2012 డిసెంబర్ లో స్వైన్ ఫ్లూ వ్యాపించింది. వ్యాధిపీడితుల్లో ఒకరు తక్కిన వారు కోలుకున్నారు. ప్రస్తుతం ఓ యువతికి, మరో యువకుడికి వారం రోజుల క్రితమే స్వైన్ ఫ్లూ సోకినప్పటికీ ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. రాజమండ్రికి చెందిన 22 ఏళ్ల యువకుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్న సమయంలో అతనికి స్వైన్ ఫ్లూ సోకి ఉంటుందని, అతని ద్వారా చిత్తూరుకు చెందిన 22 ఏళ్ల యువతికి కూడా సోకి ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. బాధితులు మూడు రోజుల క్రితమే కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడి వైద్యులు వారికి పరీక్షలు నిర్వహించి స్వైన్ ఫ్లూగా నిర్ధారించారు. వారిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అంటువ్యాధుల వార్డులో చికిత్సనందిస్తున్నారు. వారికి గండం తప్పినట్టేనని వైద్యులు అంటున్నారు. భీతిల్లుతున్న జ్వరపీడితులు స్వైన్ ఫ్లూ బాధితులు జీజీహెచ్‌లో చికిత్స పొందుతుండడంతో జీజీహెచ్‌లో కలకలం రేగింది. ఎక్కడిక్కడ మాస్కులు ధరించి వెళ్తున్నారు. నాలుగైదు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న వారు భీతిల్లుతున్నారు. మత్స్యకారులు అండమాన్, నికోబార్ వంటి సుదూర ప్రాంతాలకు చేపల వేట నిమిత్తం వెళ్లి వస్తుంటారని, వారి ద్వారా కూడా వ్యాధి జిల్లాలో ప్రవేశించే అవకాశాలు లేకపోలేదని వైద్యులు పేర్కొంటున్నారు. కాగా కాకినాడ, సామర్లకోట, రాజమండ్రితో పాటు ఇతర ప్రాంతాల్లో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జ్వరపీడితులు రైళ్లలో ప్రయాణిస్తుంటే వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కాకినాడ నుంచి విశాఖ, విజయవాడ, తిరుపతి, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. సొంత వైద్యం వద్దు... జ్వరం వచ్చిన సందర్భంలో చాలా మంది మెడికల్ షాపునకు వెళ్లి తోచిన మాత్ర కొనుక్కుని వేసుకోవడం పరిపాటి. దీనిని వైద్యులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. స్వైన్ ఫ్లూ తగ్గేందుకు టామీ ఫ్లూ మందు పనిచేస్తుందని తెలిసి చాలా మంది వైద్యుడిని సంప్రదించకుండా వినియోగిస్తున్నారని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. అనవసరంగా మందులు వాడితే వ్యాధి సోకినపుడు అది పనిచేయక ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందంటున్నారు. హెచ్-1ఎన్-1 వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా వ్యాధి సోకకుండా జాగ్రత్త పడవచ్చంటున్నారు. అవగాహనతో ఆపద దూరం స్వైన్ ఫ్లూ సోకిన వ్యక్తికి జ్వర లక్షణాలతో పాటు వాంతులు, విరేచనాలు కావడంతో ఆయాసం ఉంటుందని స్వైన్ ఫ్లూ నోడల్ అధికారి డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు తెలిపారు. ఒక్కోసారి రోగి అపస్మారక స్థితికి చేరుకుంటాడని, ఆక్సిజన్ సక్రమంగా అందక శరీరం నల్లగా మారుతుందని చెప్పారు. రోగి రోగ నిరోధక శక్తి ఆధారంగా సోకిన వారం రోజుల్లో వ్యాధి బయటపడే అవకాశాలున్నాయన్నారు. మధుమేహం, గుండె వ్యాధులున్నవారికి, మద్యం సేవించే వారికి తొందరగా బయటపడుతుందన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులకు కూడా త్వరగా సోకుతుందన్నారు. దీని నివారణ నిమిత్తం టామీ ఫ్లూ టాబ్లెట్లు అందిస్తున్నామన్నారు. జిల్లాలో ఈ టాబ్లెట్లు పుష్కలంగా ఉన్నాయన్నారు. స్వైన్ ఫ్లూ రోగికి వైద్య సేవలందించే క్రమంలో ఎక్కువగా వైద్య సిబ్బందికి వ్యాధి సోకే ప్రమాదమున్నందున వారికి హెచ్-1 ఎన్-1 వ్యాక్సిన్లు ఇచ్చినట్లు చెప్పారు. దగ్గు, తుమ్ముల నుంచి వచ్చే తుంపర్ల ద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతుందని తెలిపారు. స్ట్రిప్పుల ద్వారా గొంతు, ముక్కుల నుంచి స్రావాన్ని సేకరించి, ప్రత్యేక కంటైనర్లలో భద్రపరిచి హైదరాబాద్‌లోని లేబ్‌కు పంపుతామన్నారు. స్ట్రిప్‌లు కావాల్సినన్ని అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. చాలా మంది జబ్బు ముదిరిపోయాక వైద్యులను ఆశ్రయిస్తున్నారని, అటువంటి సమయంలో తామేమీ చేయలేకపోతున్నామని చెప్పారు. ముందుగా అప్రమత్తమై అవగాహనతో వైద్య పరీక్షలు చేయించుకుంటే మంచిదన్నారు. -
కూతురి ఆచూకీ తెలియక దిగులు
పహాడీషరీఫ్: ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న కుటుంబానికి ఆసరాగా ఉందామని జల్పల్లి శ్రీరాం కాలనీ నుంచి ఖతార్ దేశానికి వెళ్లిన ఓ యువతి ఆచూకీ లేకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. యువతి తల్లి మాధవి ‘సాక్షి’కి తెలిపిన వివరాల ప్రకారం... మాధవి భర్త సత్యనారాయణ 8 ఏళ్ల క్రితం చనిపోయాడు. రెండేళ్ల క్రితం కుమారుడు ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న మాధవికి ఆసరా ఉండేందుకు ఆమె కుమార్తె లత (22) ముందుకొచ్చింది. ఇంటర్ వరకు చదువుకున్న ఆమె ఏదైనా ఉద్యోగం చేస్తానని గతేడాది అక్టోబర్‌లో పాస్‌పోర్టు తీసుకుంది. తన ఇంటి ముందు ఉండే ఒడిశా వాసి విదేశాలకు వెళ్తే మంచి జీతం ఇస్తారని చెప్పాడు. తన మిత్రుడు విదేశాలకు పంపిస్తాడని చెప్పి చార్మినార్‌కు చెందిన రషీద్‌ను మాధవి, లతలకు పరిచయం చేశాడు. ఖతార్‌లో తన వదిన స్నేహితురాలి ఇంట్లో పనిచేస్తే నెలకు రూ. 13 వేలు ఇస్తారని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన ఆమె ఈ ఏడాది జనవరిలో ఖతార్ వెళ్లింది. అనంతరం వారం.. పది రోజులకోసారి తల్లి మాధవితో ఫోన్లో మాట్లాడి బాగానే ఉన్నానని చెప్పేది. కాగా నెలన్నర క్రితం చివరిసారిగా తల్లికి ఫోన్ చేసిన లత.. ‘అమ్మా నాతో నాలుగు ఇళ్లల్లో పని చేయిస్తున్నారు....ఇక్కడ నరకం కనిపిస్తోంది... చంపేసేలా ఉన్నారు....మా మేడం గుండె ఆపరేషన్ కోసం యూరఫ్ వెళ్లింది...రషీద్ వాళ్ల వదిన నన్ను కర్రతో కొడుతోంది....ఎలాగైనా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లు’.. అని రోదిస్తూ చెప్పింది. వెంటనే మాధవి రషీద్‌ను సంప్రదించగా దుర్భాషలాడాడు. రషీద్ వదిన కూడా ఫోన్లో అదుబాటులోకి రాకపోవడంతో మాధవి చివరకు పహాడీషరీఫ్ పోలీసులను ఆశ్రయిం చింది. పోలీసులు మాధవి వెంట ఇద్దరు కానిస్టేబుళ్లను ఇచ్చి రషీద్ ఇంటికి పంపగా అతను ఆ ఇంట్లో లేడు. అదే సమయంలో లత యజమానురాలు మాధవికి ఫోన్ చేసి.. మీ కుమార్తెను బక్రీద్ తర్వాత ఇండియాకు పంపిస్తా, ఇలా అర్థంతరంగా పంపించాలంటే ఇంట్లో ఎవరైనా చనిపోయారని చెప్పాలని సూచించింది. దీంతో మాధవి తానే చనిపోయినట్టు ఫొటోలు తీయించి మెయిల్లో ఖతార్‌కు పంపించింది. బక్రీద్ అనంతరం ఫోన్ చేయగా ఎవరూ కూడా అందుబాటులోకి రాకపోవడంతో మాధవి మరింత ఆందోళనకు గురైంది. దీంతో ఆందోళనకు గురైన ఆమె ఆదివారం పోలీసులను మరోసారి కలిసి తన కుమార్తె ఆచూకీ గుర్తించి, ఎలాగైనా నగరానికి రప్పించాలని కోరింది. కాగా, ఆధార్ కార్డు, ఫొటోలు తీసుకొస్తే సోమవారం కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పడంతో ఆమె ఇంటికి తిరిగి వెళ్లిపోయింది. -
అమ్మా.. నన్ను కాపాడు
ఖతర్ నుంచి కన్నపేగు ఘోష కుటుంబ భారాన్ని మోయడానికి ఖతర్ వెళ్లిన యువతి కష్టాల్లో చిక్కుకుంది. అక్కడ నరకం చూస్తున్నానని నెల క్రితం తల్లికి ఫోన్లో చెప్పిన యువతి నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదు.. ఎనిమిదేళ్ల క్రితం తండ్రి మృతి చెందగా, పెద్ద దిక్కుగా ఉన్న సోదరుడు మంచం పట్టాడు..ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లిన యువతి సమాచారం అందకపోవడంతో ఆ తల్లి పడ రాని పాట్లు పడుతోంది.. సాక్షి, సిటీబ్యూరో: ‘‘అమ్మా.. నన్ను రక్షించు, దేశం కాని దేశానికి పంపించావు, వాళ్లు ఇక్కడ నరకం చూపిస్తున్నారు, నీవు నన్ను త్వరగా రప్పించుకో లేకపోతే నా ప్రాణాలు పోతాయి’’ అని ఓ యువతి ఖతర్ దేశం నుంచి నగరంలోని తన తల్లికి ఫోన్ చేసి వేడుకుంది. దీంతో ఆ తల్లి తన కూతురు కోసం తల్లిడిల్లుతోంది. ఎనిమిదేళ్ల క్రితం భర్త మృతి.. మంచం పట్టిన పెద్ద కుమారుడు... కాటేదాన్‌కు చెందిన మాధవి , సత్యనారాయణ దంపతులు. వీరికి కుమారులు కార్తీక్ (20), అర్జున్ (18), కూతురు లత (22) సంతానం. పాతబస్తీలో ఓ వెల్డింగ్ షాపులో పనిచేసే సత్యనారాయణ ఎనిమిదేళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబానికి కష్టాలు ప్రారంభమయ్యాయి. అయినా మాధవి ధైర్యం కూడగట్టుకుని కాటేదాన్‌లోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో కూలీ పనులు చేస్తూ ముగ్గురు పిల్లల్ని చదివించింది. రెండేళ్ల క్రితం చేతికి ఎదిగిన కొడుకు కార్తీక్ పురానాపూల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి నేటికి కూడా ఇంట్లో మంచంమీదే ఉండే పరిస్థితి. మరోపక్క అప్పులు పెరిగిపోయాయి. కుటుంబం చాలా కష్టంగా నడుస్తోంది. ఈ స్థితిలో వనితా కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన లత తాను కూడా కుటుంబానికి ఆసరాగా ఉండాలనుకుంది. ఈ క్రమంలోనే చార్మినార్‌కు చెందిన రషీద్ మాధవికి పరిచయం అయ్యాడు. జీతం రూ.13 వేలని నమ్మించి.. ఖతర్ దేశంలో మా వదినే ఇంట్లో పనిచేసేందుకు లతను పంపిస్తే నెలకు రూ.13 వేలు వ స్తాయి, అప్పులన్నీ తీర్చ వచ్చని రషీద్ ఆమెతో నమ్మబలికాడు. కుటుంబ భారం మోయడానికి లత ఖతర్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యింది. రషీద్ లతకు పాస్‌పోర్టు ఇప్పించి, జనవరిలో ఖతర్‌కు పంపించాడు. నాలుగైదు నెలలు లత అక్కడ బాగానే ఉందని మాధవికి రషీద్ చెప్పేవాడు. కాగా గత నెల మొదటి వారంలో లత తన తల్లికి ఫోన్ చేసింది. అమ్మా ఇక్కడ నాకు నరకం చూపిస్తున్నారు, నన్ను వెంటనే తీసుకెళ్లు, ఇక్కడుంటే చంపేస్తారు అని కన్నీరుమున్నీరైంది. రషీద్‌తో మాట్లాడి తీసుకువస్తానని ఆమెకు ధైర్యం చెప్పింది. తన కూతురుకు ఏదో అపాయంలో ఉందని భావించిన మాధవి, రషీద్ వద్దకు వెళ్లి తన కూతురు గురించి అడిగింది. వెంటనే తన కూతురు కావాలని కోరింది. రషీద్‌ను గట్టిగా నిలదీయడంతో రెపో మాపో రప్పిస్తానని సముదాయించాడు. ఖతర్‌లో ఉన్న రషీద్ వదినకు ఫోన్‌చేసిన మాధవికి ‘‘ నీ కూతురు ఎక్కడికో వెళ్లిపోయింది, బతికుంటే వస్తుందిలే అని నిరక్ష్యంగా సమాధానం చెప్పడంతో, నెల రోజులు పూర్తయినా కూతురు జాడ లేకపోవడంతో వారం రోజుల క్రితం పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించింది. అయితే వారు స్పందించలేదు. కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. ఇంటి ఆర్థిక పరిస్థితి చూసి తట్టుకోలేకనే భారాన్ని భుజాన వేసుకున్న నా కూతురు లత విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు వెళ్లి ఆపదలో చిక్కుకుందని మాధవి సాక్షితో తన ఆవేదనను వ్యక్త పర్చింది. తన కూతుర్ని రక్షించి క్షేమంగా నగరానికి రప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. ఇదిలావుండగా దుబాయ్‌లో అరబ్‌షేక్ చేతుల్లో చిక్కుకున్న నగరానికి చెందిన ఓ మహిళను చైతన్యపురి పోలీసులు స్పందించి ఆమెను రక్షించి క్షేమంగా నగరానికి వారం రోజుల క్రితం రప్పించారు. అలాగే లతను కూడా రప్పించాలని ఆమె కోరుతుంది. -
మధ్యప్రదేశ్‌లో యువతిపై గ్యాంగ్‌రేప్
బార్వా (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో ఓ యువతిపై ఆరుగురు యువకులు గురువారం గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఓ యువకుడు ఆమెను సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి మరో ఐదుగురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టాడు. కీచకుల్లో మాజీ ఎమ్మెల్యే దాల్సింగ్ సోలంకీ కుమారుడు నంగూడా అలియాస్ సంతోష్ ఉన్నాడు.