
ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
కడప : జిల్లా పోలీసు యంత్రాం గంలో ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న విక్రమ్ కుమార్ రెడ్డి (25)(ఏఆర్ పిసి 2963) మంగళవారం తాను నివసిస్తున్న గదిలో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. 2011 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన విక్రమ్ కుమార్‌రెడ్డి కడప నగరంలోని ఓ యువతిని ప్రేమించి, తాను వివాహం చేసుకుంటానని ఆ యువతి తల్లిదండ్రులతో వెళ్లి మాట్లాడాడు. వారు అందుకు నిరాకరించడంతో మనస్థాపానికి గురై ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసింది. తన గదిలో ఉరేసుకున్న విషయాన్ని సహచర కానిస్టేబుళ్లు గమనించి అతన్ని హుటాహుటిన స్థానిక తిరుమల హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తమిళనాడులోని రాయవేలూరుకు తీసుకెళ్లారు. ఆత్మహత్యకు యత్నించిన కానిస్టేబుల్‌ను ఏఆర్ డీఎస్పీ మురళీధర్ తదితరులు పరామర్శించారు. ఈ సంఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.