youngester
-
రెప్పపాటులో షాకింగ్ ఘటన.. ఆ కండక్టర్ దేవుడయ్యా సామీ
భూమి మీద నూకలు ఉన్నాయ్.. అనే మాటను మరణం అంచుల వరకూ వెళ్లొచ్చిన సందర్భాల్లో తరుచు వాడుతూ ఉంటాం. ఇక్కడ ఓ యువకుడికి భూమి మీద నూకలు ఉన్నాయ్ కాబట్టే తృటిలో పెద్ద ప్రమాదాన్ని తప్పించుకుని బయటపడ్డాడు.కేరళలో ఓ యువకుడు బస్సులో ప్రయాణిస్తుండగా, కండక్టర్ టికెట్లు తీసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో సదరు యువకుడు కూడా కండక్టర్ పక్కనే ఉన్నాడు. యువకుడు బస్సులో నిల్చొని ఉండగా, కండక్టర్ సీటుకు ఆనుకుని టికెట్లు ఇస్తున్నాడు. అయితే యువకుడు ఉన్నట్టుండి పట్టు తప్పాడు. ఆ సమయంలో బస్సు వేగంగా కదులుతూ ఉండటంతో ఆ యువకుడు కింద పడిపోయాడనే అనుకున్నారంతా. రెప్పపాటులో జరిగిన ఈ ఘటనతో అంతా షాకయ్యారు.కానీ ఆ కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి అత్యంత సమయ స్ఫూర్తితో ఆ యువకుడ్ని ఒక్క చేత్తో పట్టుకుని బస్సులోకి లాగేశాడు. అంతే క్షణం పాటు ఏమైందో తెలియని ఆ యువకుడు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. అయితే కండక్టర్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆ యువకుడు పడిపోబోతున్నాడు అనే విషయాన్ని మాత్రమే గ్రహించి చేయి అడ్డుపెట్టిన కండక్టర్‌ను అంతా కొనియాడుతున్నారు. ఆ కండక్టర్ దేవుడయ్యా సామీ అని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Kerala bus conductor with 25th Sense saves a guy from Falling Down from Buspic.twitter.com/HNdijketbQ— Ghar Ke Kalesh (@gharkekalesh) June 7, 2024 -
ఎర్రకాలువలో పడి దుర్మరణం
జంగారెడ్డిగూడెం రూరల్: జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం కేకేఎం ఎర్రకాలువ జలాశయం డ్యామ్‌పై నుంచి యువకుడు ఎర్రకాలువలో పడి ఆదివారం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామానికి చెందిన ఎస్కే బాజీ (20) తన సోదరులు సుభానీ, మదీన్, బావమరిది నజీర్‌తో కలిసి ఆదివారం లక్కవరంలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ నుంచి మధ్యాహ్న సమయంలో ఈ నలుగురు కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం వద్దకు చేరుకున్నారు. వీరంతా జలాశయం డ్యామ్‌పైకి ఎక్కారు. ఈ సమయంలో ఒక్కసారిగా నీళ్ల నుంచి శబ్దం రావడంతో జలాశయ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడ్డారు. డ్యామ్ పైకి ఎక్కిన నలుగురిలో బాజీ కనిపించకపోవడంతో స్థానికులు లక్కవరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు జాలర్ల సాయంతో గాలింపు చేపట్టి బాజీ మృతదేహాన్ని వెలికితీశారు. బాజీ ఎర్రకాలువలోకి దూకాడా లేదా ప్రమాదవశాత్తు జారీ పడ్డాడా అన్న అనుమానాలు ఉన్నాయి. బాజీ కాలుజారి పడ్డాడని ముగ్గురు యువకులు చెబుతున్నారు. దీనిపై లక్కవరం ఎస్ఐ శ్రీనివాసరావును వివరణ కోరగా బాజీ ఫో¯ŒS మాట్లాడుకుంటూ ప్రమాదవశాత్తు కాలు జారీ ఎర్రకాలువలోకి పడి మృతి చెందాడని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడు బాజీ తాపీపని చేసుకుంటూ జీవిస్తుంటాడు. మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్): తనను ప్రేమించాలంటూ యువతిని వేధిస్తున్న యువకుడిపై ఛత్రినాక పోలీసులు మంగళవారం నిర్భయ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన పదో తరగతి విద్యార్థిని (15)ని ఇంటి సమీపంలోనే ఉండే పాలిటెక్నిక్ విద్యార్థి సాయికుమార్(19) గత కొన్నాళ్లుగా ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. అతని వేధింపులు ఎక్కువ కావడంతో విద్యార్థిని విషయాన్ని ఇంట్లో తెలిపింది. ఈ విషయమై సోమవారం అడిగేందుకు వెళ్లిన విద్యార్థిని బాబాయి అమర్‌పై సాయికుమార్ దాడి చేసి గాయపరిచాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఛత్రినాక పోలీసులు సాయికుమార్సౌ నిర్భయ చట్టం (364డి-సెక్షన్) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.