ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు | youngester harassed minor girl, police filed nirbhaya case | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు

Published Tue, Apr 5 2016 6:25 PM | Last Updated on Wed, Sep 26 2018 6:09 PM

youngester harassed minor girl, police filed nirbhaya case

చాంద్రాయణగుట్ట (హైదరాబాద్): తనను ప్రేమించాలంటూ యువతిని వేధిస్తున్న యువకుడిపై ఛత్రినాక పోలీసులు మంగళవారం నిర్భయ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన పదో తరగతి విద్యార్థిని (15)ని ఇంటి సమీపంలోనే ఉండే పాలిటెక్నిక్ విద్యార్థి సాయికుమార్(19) గత కొన్నాళ్లుగా ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. అతని వేధింపులు ఎక్కువ కావడంతో విద్యార్థిని విషయాన్ని ఇంట్లో తెలిపింది.

 

ఈ విషయమై సోమవారం అడిగేందుకు వెళ్లిన విద్యార్థిని బాబాయి అమర్‌పై సాయికుమార్ దాడి చేసి గాయపరిచాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఛత్రినాక పోలీసులు సాయికుమార్‌సౌ నిర్భయ చట్టం (364డి-సెక్షన్) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement