YSR awards 2022
-
YSR Awards 2022: మహోన్నత గౌరవం
దశాబ్దాలుగా మన సంస్కృతి, సాంప్రదాయాలకు వారధులుగా నిలుస్తున్న వారిని ఈ అవార్డులతో సత్కరిస్తున్నాం. సమాజం కోసం శ్రమించిన మానవతామూర్తులు, మహనీయులను రాష్ట్ర అత్యున్నత అవార్డులతో సత్కరించుకోవడం సంతోషంగా ఉంది. సామాన్యుల్లోని అసామాన్యులకు, మానవతామూర్తుల సేవలకు వందనంగా ‘వైఎస్సార్’ అవార్డులు నిలుస్తాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన వైఎస్సార్ అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వకంగా అభినందనలు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: సమాజంలో మానవత్వపు పరిమళాలు, ఎల్లలు దాటిన కీర్తి పతాకాలు పురస్కారాల పండుగలో పులకించాయి. నిలువెత్తు వ్యక్తిత్వం, మహోన్నత కీర్తి శిఖరం ‘వైఎస్సార్’ పురస్కారాలతో సగౌరవంగా సత్కరించి ప్రభుత్వం తన వినమ్రత చాటుకుంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మానవతామూర్తులు, విశిష్ట వ్యక్తులను వరుసగా రెండో ఏడాది రాష్ట్ర అత్యున్నత పురస్కారం ‘‘వైఎస్సార్’’ అవార్డులతో ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. వ్యక్తులుగా, సంస్థలుగా సమాజంలో గొప్ప పనులు చేస్తున్న ప్రతి ఒక్కరినీ గౌరవించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డులను నెలకొల్పింది. వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం విజయవాడలో నిర్వహించారు. తొలుత అమరజీవి పొట్టి శ్రీరాములు, దివంగత వైఎస్సార్ విగ్రహాలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 2022 సంవత్సరానికి గానూ వ్యవసాయం, కళలు–సంస్కృతి, సాహిత్యం, మహిళా – శిశు సాధికారత, విద్య, జర్నలిజం, వైద్యం, పరిశ్రమల రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు మొత్తం 30 అవార్డులను గవర్నర్, ముఖ్యమంత్రి ప్రదానం చేశారు. వీటిల్లో 20 వైఎస్సార్ జీవిత సాఫల్య, 10 వైఎస్సార్ సాఫల్య పురస్కారాలున్నాయి. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. వైఎస్సార్ అవార్డులను నెలకొల్పడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం, అవార్డు గ్రహీతల గొప్పతనాన్ని వివరించారు. వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డులు అందుకున్న వారితో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, సీఎం మాతృమూర్తి వైఎస్ విజయమ్మ పురస్కారం సాధించిన ‘దిశ’ వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి వైఎస్సార్ అవార్డులను ప్రదానం చేశారు. వ్యవసాయంలో 5, కళలు– సంస్కృతిలో 5, సాహిత్యంలో 3, మహిళా, శిశు సాధికారతలో 3, విద్యలో 4, జర్నలిజంలో 4, వైద్యంలో 5 అవార్డులు, పరిశ్రమల విభాగంలో ఒక అవార్డును అందజేశారు. వైఎస్సార్ జీవిత సాఫల్య అవార్డు కింద రూ.10 లక్షల నగదు, వైఎస్సార్ సాఫల్య అవార్డు కింద రూ.5 లక్షల నగదుతో పాటు వైఎస్సార్ కాంస్య విగ్రహం, జ్ఞాపిక, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. కళలు, సంస్కృతి రంగంలో కళాతపస్వి కె.విశ్వనాథ్ తరఫున వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ఆయన తనయుడు కాశీనాథుని నాగేంద్రనాథ్ అందుకోగా వైద్య రంగంలో ప్రతాప్ సి.రెడ్డి తరఫున వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ఆయన కుమార్తె సంగీతారెడ్డి స్వీకరించారు. వ్యవసాయంలో వైఎస్సార్ సాఫల్య పురస్కారాన్ని కట్టమంచి బాలకృష్ణారెడ్డి తరఫున ఆయన కుటుంబ సభ్యులు అందుకున్నారు. ముఖ్యమంత్రి మానస పుత్రిక ‘దిశ’ ద్వారా మహిళా రక్షణకు కృషి చేసిన ఐదుగురు పోలీసులకు ఉమ్మడిగా అవార్డులను బహూకరించారు. హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానమ్, హోంమంత్రి తానేటి వనిత, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా, తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, ప్రభుత్వ కార్యక్రమాల కన్వీనర్ తలశిల రఘురాం, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్), వైఎస్సార్ అవార్డుల కమిటీ కన్వీనర్ జీవీడీ కృష్ణ మోహన్, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, సాధారణ పరిపాలన (రాజకీయ) కార్యదర్శి రేవు ముత్యాలరాజు, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఐ అండ్ పీఆర్ కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మన కీర్తికి సత్కారం: సీఎం జగన్ దశాబ్దాలుగా మన సంస్కృతి, సాంప్రదాయాలకు వారధులుగా నిలుస్తున్న వారిని ఈ అవార్డులతో సత్కరిస్తున్నాం. సమాజం కోసం శ్రమించిన మానవతామూర్తులు, మహనీయులను రాష్ట్ర అత్యున్నత అవార్డులతో సత్కరించుకోవడం సంతోషంగా ఉంది. సామాన్యుల్లోని అసామాన్యులకు, మానవతామూర్తుల సేవలకు వందనంగా ‘వైఎస్సార్’ అవార్డులు నిలుస్తాయి. తమ శ్రమ, స్వేదంతో రాష్ట్ర చరిత్రను గొప్పగా లిఖిస్తున్న రైతన్నలను ఎక్కడా లేనివిధంగా ప్రతిష్టాత్మక ‘వైఎస్సార్’ అవార్డులతో ప్రభుత్వం సత్కరిస్తోంది. మహిళా రక్షణకు నిరంతరం పాటుపడే రక్షణ సారథులను, వెనుకబాటు, అణచివేత, పెత్తందారీ పోకడలపై ఎలుగెత్తిన సామాజిక ఉద్యమకారులను సవినయంగా గౌరవించుకుంటున్నాం. భిన్న కలాలు, గళాలు, పాత్రికేయులు, మన గడ్డపై పుట్టి వైద్య ఆరోగ్య రంగంలో ప్రపంచ కీర్తి గడించిన మహామహులు, అంతర్జాతీయంగా పేరొందిన మన పారిశ్రామిక దిగ్గజాలకు అవార్డులను అందజేస్తున్నాం. వైఎస్సార్ ఆచరించిన విధానాల స్ఫూర్తితో.. వ్యక్తులుగా, సంస్థలుగా సమాజంలో గొప్ప పనులు చేస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. అందుకు సంకేతంగానే ఏటా నాన్న (దివంగత వైఎస్సార్) పేరుతో ఈ అవార్డులను అందజేస్తున్నాం. ముఖ్యమంత్రిగా ఉన్న 5.3 ఏళ్ల స్వల్ప కాలంలోనే వైఎస్సార్ ఆచరించి చూపిన రైతు, మహిళా, నిరుపేద పక్షపాత విధానాలు, సామాజిక, ప్రాంతీయ న్యాయం, వైద్య రంగంలో తెచ్చిన విప్లవాత్మక మార్పులు, మనదైన తెలుగుతనం, మన కళలు, సాంప్రదాయాలు, శ్రమ, పరిశ్రమకు నిదర్శనంగా ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నాం. ఈ రోజు అత్యంత ప్రతిష్టాత్మకమైన వైఎస్సార్ అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వకంగా అభినందనలు తెలియచేస్తున్నా. మహోన్నత వ్యక్తి వైఎస్సార్: గవర్నర్ సామాజిక సేవా స్ఫూర్తితో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్’ అవార్డులతో సత్కరించడం సంతోషంగా ఉందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గొప్ప ప్రజానాయకుడని కొనియాడారు. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు, వారి సమస్యలను దగ్గరగా చూసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పలు ప్రజా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తెచ్చిన విప్లవాత్మక మార్పులతో ప్రజల గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. అంతటి మహోన్నత వ్యక్తి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా అవార్డులతో గౌరవించడం సముచితంగా ఉందన్నారు. రాష్ట్రం గొప్ప కళలు, సంస్కృతి, ఆధ్యాత్మికతకు నిలయంగా వెలుగొందుతోందన్నారు. ఎందరో మహనీయుల త్యాగఫలాలతో ఏర్పడిన రాష్ట్రంలో సామాజిక స్పృహతో నిరంతరం సేవలందిస్తూ మన ఖ్యాతిని చాటిన వారిని అవార్డులకు ఎంపిక చేయడం మంచి సాంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. వైఎస్సార్ బాటలోనే ఆయన తనయుడు సీఎం జగన్ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధికి చిరునామాగా నిలిపేందుకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి రంగాలవారీగా అవార్డులు ప్రదానం ఇలా.. వ్యవసాయం (అందరికీ వైఎస్సార్ అఛీవ్మెంట్ అవార్డులు 1) ఆదివాసీ క్యాష్యూనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ – సోడెం ముక్కయ్య – బుట్టాయగూడెం, ఏలూరు జిల్లా 2) కుశలవ కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ – ఎ.గోపాలకృష్ణ, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా 3) అన్నమయ్య మ్యూచువల్లీ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ – జయబ్బనాయుడు, తలుపల గ్రామం, పీలేరు మండలం, అన్నమయ్య జిల్లా 4) అమృతఫల ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ, –కె.ఎల్.ఎన్.మౌక్తిక, సబ్బవరం, అనకాపల్లి జిల్లా 5) కట్టమంచి బాలకృష్ణారెడ్డి, కట్టమంచి గ్రామం, చిత్తూరు జిల్లా కళలు–సంస్కృతి 1) కళాతపస్వి కె.విశ్వనాథ్, సినీ దర్శకుడు (లైఫ్ టైం) 2) ఆర్.నారాయణమూర్తి, సినీ నటుడు, దర్శకుడు (లైఫ్ టైం) 3) సుప్రసిద్ధ రంగస్థల కళాకారుడు నాయుడు గోపీ (అచీవ్మెంట్) 4) పెడన కలంకారీ నేతన్న పిచుక శ్రీనివాస్ (అచీవ్మెంట్) 5) దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఉదయగిరి ఉడెన్ కట్లరీ– షేక్ గౌసియా బేగం (అచీవ్మెంట్) సాహిత్య సేవ (అందరికీ లైఫ్ టైం అవార్డులు 1) విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ (మనోహర్ నాయుడు అవార్డు అందుకున్నారు) 2) ఎమెస్కో పబ్లిషింగ్ హౌస్ – సంస్థ సీఈవో విజయకుమార్ అవార్డును అందుకున్నారు 3) రాయలసీమ ప్రసిద్ధ రచయిత డాక్టర్ శాంతి నారాయణ మహిళా సాధికారత–రక్షణ 1) ప్రజ్వల ఫౌండేషన్– సునీతా కృష్ణ్ణణ్ (లైఫ్ టైం) 2) శిరీషా రిహేబిలిటేషన్ సెంటర్, ఉయ్యూరు – ఎం.సోమేశ్వరరావు అవార్డును అందుకున్నారు (లైఫ్ టైం) 3) దిశ పోలీసింగ్– రవాడ జయంతి, ఎస్వీవీ లక్ష్మీనారాయణ, రాయుడు సుబ్రహ్మణ్యం, హజరత్తయ్య, పి.శ్రీనివాసులు (ఉమ్మడిగా వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు) విద్యా రంగం 1) మదనపల్లి – రిషీ వ్యాలీ విద్యా సంస్థ – అనంత జ్యోతి అవార్డును అందుకున్నారు (లైఫ్ టైం) 2) కావలి– జవహర్ భారతి విద్యా సంస్థ– వినయ్‌కుమార్‌రెడ్డి అవార్డును అందుకున్నారు (లైఫ్ టైం) 3) వ్యక్తిత్వ వికాస నిపుణుడు బి.వి.పట్టాభిరాం (లైఫ్ టైం) 4) బ్యాంకింగ్ రంగంలో వేలాది మందికి దారి చూపిన నంద్యాలకు చెందిన దస్తగిరిరెడ్డి (అచీవ్మెంట్) జర్నలిజం (అందరికీ లైఫ్‌టైం అచీవ్మెంట్ 1) భండారు శ్రీనివాసరావు 2) సతీష్ చందర్ 3) మంగు రాజగోపాల్ 4) ఎంఈవీ ప్రసాదరెడ్డి వైద్య రంగం (అందరికీ లైఫ్ టైం అచీవ్మెంట్ 1) డాక్టర్ బి.నాగేశ్వరరెడ్డి, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ 2) డాక్టర్ వరప్రసాదరెడ్డి, శాంతా బయోటెక్ (హెపటైటిస్–బి వ్యాక్సిన్) 3) భారత్ బయోటెక్ డాక్టర్ కృష్ణా ఎల్లా, సుచిత్ర ఎల్లా (కోవ్యాగ్జిన్) (కృష్ణా ఎల్లా అవార్డు అందుకున్నారు) 4) అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి (ఆయన తరఫున కుమార్తె సంగీతా అవార్డు అందుకున్నారు) 5) ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్– గుళ్లపల్లి నాగేశ్వరరావు పారిశ్రామిక రంగం అంతర్జాతీయ పారిశ్రామిక వేత్త గ్రంథి మల్లికార్జునరావు (లైఫ్ టైం) -
వైఎస్సార్ అవార్డులు..
-
YSR Awards Ceremony: వైఎస్సార్ అచీవ్మెంట్-2022 అవార్డుల ప్రదానోత్సవం (ఫోటోలు)
-
Johnson Choragudi: భావోద్వేగాల బంధం
రాష్ట్రావతరణ దినమైన నవంబర్ ఒకటి, గత చరిత్రలోకి చేజారి పోకుండా మళ్ళీ ‘స్వాధీనం’ చేసుకుని, సకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గొప్ప పరిణతిని ప్రదర్శించింది. ఇక్కడ స్వాధీనం అంటున్నది– ‘క్లెయిమ్’ అనే ఆంగ్ల పదాన్ని దృష్టిలో ఉంచుకుని. తెలంగాణ మన నుంచి విడిపోయినప్పుడు, 1956 నుండి నైసర్గిక ఆంధ్రప్రదేశ్ చరిత్రను ‘క్లెయిమ్’ చేసుకోవలసిన – ‘పెద్దన్న’ పాత్రను గత ప్రభుత్వం తొలి ఐదేళ్లు వదులుకుంటే, చివరికి ఆ లోపాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సరిచేసింది. ముఖ్యమంత్రిగా ఆయనకు తొలి అనుభవం అయినప్పటికీ, నిర్ణయానికి అవసరమైన మేధోమథనం ఎంత వేగంగా జరిగింది అంటే, 2019 జూన్‌లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నుంచి అక్టోబర్ మూడవ వారం నాటికి – నవంబర్ 1 రాష్ట్రావతరణ దినోత్సవం అని ప్రకటన వెలువడింది. అది కూడా చీఫ్ సెక్రటరీ ఈ విషయాన్ని ప్రకటించడం ద్వారా, ఈ ప్రభుత్వం ‘బిజినెస్ లైక్’ పనిచేస్తుందనే సంకేతాలు కూడా మొదట్లోనే వెలువడ్డాయి. ఐదేళ్లు ఆలస్యం అయినప్పటికీ కడకు ప్రభుత్వం తల నెరిసినతనంతో, సమ్యక్ దృష్టి (హోలిస్టిక్ అప్రోచ్) తో వ్యవ హరించి ఒక చారిత్రిక తప్పిదాన్ని సరిచేసింది. అలా తొలి ఏడాది విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రాష్ట్రావతరణ దినోత్సవాలు – ‘స్టేట్ ఫంక్షన్’గా జరిగాయి. ఇది జరిగాక, అదే వారంలో 2019 నవంబర్ 6న దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. జాతీయ స్థాయిలో అత్యున్నత పురస్కారంగా భావిస్తున్న భారతరత్న, పద్మ విభూషణ్ తరహాలో రాష్ట్రంలో సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ ప్రజా రంగంలో విశేష సేవలు అందించిన వారికి రాష్ట్రావతరణ దినోత్సవం నాడు పురస్కరాలతో ప్రభుత్వం సత్కరిస్తుంది అని అందులో ప్రకటించింది. అయితే, కరోనా కారణంగా 2020లో ‘మెడికల్ ఎమర్జెన్సీ’ కావడంతో అది ఆగినా, ఆ తర్వాత రెండేళ్లుగా రాష్ట్రావతరణ దినోత్సవం నాడు ప్రభుత్వం పురస్కారాలతో సత్కరించడం గొప్ప విషయం. గత ఏడాది– ‘వైఎ స్సార్ లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డు’ పురస్కారానికి 10 లక్షల నగదు, మెమెంటో, ప్రశంసాపత్రం, అలాగే, ‘వైఎస్సార్ ఎచీవ్మెంట్ అవార్డు’ పురస్కారానికి 5 లక్షల నగదు, మెమెంటో, ప్రశంసా పత్రం అందించారు. పురస్కార గ్రహీతల ఎంపిక కోసం ప్రభుత్వం పకడ్బంది ‘స్క్రీనింగ్’ విధానాన్ని అనుసరిస్తున్నది. 2022 పురస్కారాలకు ‘వైఎస్సార్ లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డు’కు 20 మందినీ, ‘వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డు’కు 10 మందినీ ఎంపిక చేశారు. వీరిని – వ్యవసాయం, పరిశ్రమలు, వైద్య రంగం, విద్యా రంగం, కళారంగం, సాహిత్యం, మీడియా, స్త్రీ రక్షణ – సాధికారికత రంగాల నుంచి ఎంపిక చేశారు. (క్లిక్ చేయండి: తూర్పు కనుమల అభివృద్ధిపై విభిన్న వైఖరి!) అలజడి తర్వాత కుదురు కోవడం గురించి యోచించడానికి, అధినేతకు ప్రజలు – ప్రాంతము మధ్య ఉండే భావోద్వేగాల బంధం ఎటు వంటిదో తెలియాలి. లేనప్పుడు, అస్పష్టం అయోమయం మిగులుతుంది. ‘రాజ్యం’లో భాగమైన–’ఎగ్జిక్యూటివ్’ అందించే విలువైన మార్గదర్శనాలను అధినేత నిర్ణయాత్మకంగా వినియోగించుకున్నప్పుడు, ప్రజల తీర్పుతో ఎన్నికయిన ప్రభుత్వాలకు అది అదనపు విలువ అవుతుంది. ఇవన్నీ కాకుండా ప్రస్తుత సీఎంకీ ఏపీ ‘బ్యూరోక్రసీ’కీ మధ్య వయస్సులో కుదిరిన సారూప్యత వల్ల, ఇక్కడ తక్కువ కాలంలో ఎక్కువ ప్రభావవంతంగా ప్రస్తుతం ప్రభుత్వంలో పని సాగుతున్నది. - జాన్సన్ చోరగుడి అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత -
వైఎస్ఆర్ రైతు పక్షపాతిగా నిలిచారు: గవర్నర్ బిశ్వభుషణ్ హరిచందన్
-
అసామాన్య సేవలు అందిస్తున్న మానవత మూర్తులకు వందనం: సీఎం జగన్
-
రాష్ట్రాభివృద్ధికి వైఎస్సార్ విశేషమైన కృషి చేశారు: గవర్నర్
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ తన మార్క్ పాలనతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. అలాంటి మహానేత పేరుతో అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరుసగా రెండో ఏడాది 'వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య-2022' పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, విశిష్ట అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆత్మీయ అతిథిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ.. 'ఆంధ్రప్రదేశ్ గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగింది. బహుళ ప్రతిభలు కలగలిసిన రాష్ట్రం మనది. కళలు, చేతివృత్తులు, కూచిపూడి నృత్యం ఇక్కడ ప్రసిద్ధి చెందాయి. వెయ్యేళ్లు పైబడ్డ తెలుగు భాష చరిత్ర కలిగి ఉంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, గొప్ప వ్యక్తులు కలిగిన నేల ఆంధ్రప్రదేశ్. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేశారు. 4 సార్లు ఎంపీ, 5 సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. దేశ చరిత్రలోనే వైఎస్సార్ అరుదైన నాయకుడిగా నిలిచారు. ప్రజల సమస్యలను పాదయాత్ర ద్వారా తెలుసుకున్న గొప్ప నాయకుడు వైఎస్సార్. సీఎం అవ్వగానే సంక్షేమ కార్యక్రమాలతో పేదలకు మేలు చేశారు. ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, 108, పావలా వడ్డీ, గృహ నిర్మాణం, ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేశారు. గ్రామీణ పేదరికం నిర్మూలనకు కృషి చేశారు. జలయజ్ఞం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించారు. రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా కృషి చేశారని' గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. చదవండి: (అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ అభినందలు: సీఎం జగన్) -
అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య–2022’ పురస్కారాలను మంగళవారం ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరుసగా రెండో ఏడాది ఈ అవార్డులు అందించారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్లో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, విశిష్ట అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆత్మీయ అతిథిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. 'మహనీయుల సేవలకు వందనం. సామాన్యుల్లో ఉన్న అసామాన్యులకు.. అసామాన్య సేవలు అందిస్తున్న మానవతా మూర్తులకు వందనం. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అవార్డులు ఇస్తున్నాం. సంస్కృతి, సంప్రదాయాలకు వారధులుగా ఉన్నవారికి అవార్డులు అందజేస్తున్నాం. వెనకబాటు, అణచివేత, పెత్తందారీ పోకడలపై దండయాత్ర చేస్తున్న సామాజిక ఉద్యమకారులు, కళలు, పాత్రికేయులు, పారిశ్రామిక దిగ్గజాలకు అవార్డులు అందిస్తున్నాం. ఈ రోజు అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ అభినందలు' అని సీఎం జగన్ పేర్కొన్నారు. వ్యవసాయం, కళలు–సంస్కృతి, సాహిత్యం, మహిళా, శిశు సాధికారత, విద్య, జర్నలిజం, వైద్యం, పరిశ్రమ రంగాల్లో విశేషకృషి చేసిన 35 మంది వ్యక్తులు, సంస్థలకు 30 అవార్డులను అందజేయనున్నారు. ఇందులో 20 వైఎస్సార్ జీవిత సాఫల్య, 10 వైఎస్సార్ సాఫల్య పురస్కారాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాల తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘వైఎస్సార్’ అవార్డులను అందజేస్తోంది. వ్యవసాయంలో 5, కళలు–సంస్కృతిలో 5, సాహిత్యంలో 3, మహిళా, శిశు సాధికారతలో 3, విద్యలో 4, జర్నలిజంలో 4, వైద్యంలో 5 అవార్డులు, పరిశ్రమల విభాగంలో ఒక అవార్డును ప్రదానం చేయనున్నారు. ఆయా రంగాల్లో సామాజిక అభ్యున్నతి కోసం అసామాన్య కృషిచేసి, విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు అవార్డుల్లో రాష్ట్ర హైపవర్ స్క్రీనింగ్ కమిటీ పెద్దపీట వేసింది. వైఎస్సార్ జీవిత సాఫల్య అవార్డు కింద రూ.10 లక్షల నగదుతో పాటు వైఎస్సార్ కాంస్య విగ్రహం, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, వైఎస్సార్ సాఫల్య అవార్డుకు రూ.5 లక్షల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం బహూకరించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
శాంతినారాయణకు ‘వైఎస్సార్ లైఫ్‌టైం’ అవార్డు
అనంతపురం కల్చరల్: రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అనంతపురానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ శాంతినారాయణ దక్కించుకున్నారు. ఈ మేరకు వైఎస్సార్ అవార్డు కమిటీ సభ్యులు శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఈ పురస్కారాన్ని నవంబర్ ఒకటో తేదీన ప్రదానం చేస్తారు. రూ.10 లక్షల నగదుతో పాటు వైఎస్సార్ కాంస్య విగ్రహంతో గౌరవించనున్నారు. బలమైన గొంతుక ఆయన సొంతం డాక్టర్ శాంతినారాయణ అనంతపురం యాసకు, కరువు కథకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఈయన ఐదు దశాబ్దాలుగా సాహితీసేవలో తరిస్తున్నారు. తొలిరోజుల నుంచే ధార్మికుడు, మేధావి, అసలు సిసలైన సృజనశీలిగా కవిత్వాన్ని, గద్యాన్ని ఏకకాలంలో సమర్థవంతంగా నడిపించారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని తన కలంతో ఎదిరిస్తూ బాధితులకు అండగా నిలిచారు. ఒకే వ్యక్తి ఏకకాలంలో భిన్న ఇతివృత్తాల్ని ఎంచుకుని రచనలు చేయడం తెలుగు సాహిత్య రంగంలో అరుదనే చెప్పాలి. నవలా రచనలో కూడా వైవిధ్యం కనబరిచారు. జీవిత దృక్పథం, రచనల నేపథ్యం, ప్రపంచీకరణ పోకడలు, ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలు, సమాజంలోని అసమానతల గురించి, ఆది నుంచి ‘అనంత’కు జరుగుతున్న అన్యాయాలు, ప్రభావం చూపిన కథా సాహిత్యం, ఇక్కడ పురుడుపోసుకున్న ఉద్యమాల గురించి తన రచనలతో అందరినీ కదిలించారు. శింగనమల మండలం సి.బండమీదపల్లిలో నిరుపేద కుటుంబంలో జని్మంచిన శాంతినారాయణ తెలుగు అధ్యాపకునిగా పనిచేస్తూనే రచనా వ్యాసంగం కొనసాగించారు. ఎటువంటి అభిప్రాయాన్నైనా నిక్కచ్చిగా, నిర్భయంగా బలమైన గొంతుకతో వినిపించగల్గిన ఆయన ఇనుప గజ్జెల తల్లి, పెన్నేటి మలుపులు, పల్లేరు ముళ్లు, నమ్ముకున్న రాజ్యం, కల్లమయిపాయే, ఉక్కుపాద వంటి ప్రసిద్ధ కథలు రాశారు. ముఖ్యంగా ఆయన రాసిన ‘నాగులకట్ట సుద్దులు’ నవల తెలుగు సాహిత్యంలోనే సంచలనంగా నిలిచింది. ఇటీవలే ఆయన పంచసప్తతి కార్యక్రమం అనంతపురం వేదికగా జరిగింది. తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రఖ్యాత రచయితలు, కవులు శాంతినారాయణ సాహితీ కృషిని అభినందించారు. పలువురి హర్షం ప్రతిష్టాత్మక వ్యక్తులకందించే వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుకు శాంతినారాయణ ఎంపిక కావడంపై కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు డాక్టర్ రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, బండి నారాయణస్వామి, జిరసం అధ్యక్షుడు శ్రీహరిమూర్తి, డాక్టర్ ఉమర్ అలీషా సాహితీ సమితి అధ్యక్షుడు రియాజుద్దీన్ అహ్మద్, సీనియర్ కథా రచయిత వెంకటేష్ తదితరులు వేర్వేరు ప్రకటనలో హర్షం ప్రకటించారు. విమలాశాంతి పురస్కారాల పేరిట ఎంతోమంది యువ రచయితలకందించి ప్రోత్సహిస్తున్న శాంతినారాయణను ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డుతో సమున్నతంగా గౌరవించడం అభినందనీయమని పేర్కొన్నారు. (చదవండి: ఐదు నెలల ఉత్కంఠకు తెర! ఆ అమ్మను నేనే..) -
వైఎస్సార్ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ‘వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్–2022’ అత్యున్నత పురస్కారాల కోసం వివిధ రంగాలు, విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు లేదా సంస్థల నుంచి ఈ నెల 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అర్హత కలిగిన వ్యక్తులు, సంస్థలను ఎంపిక చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన హైపవర్ స్క్రీనింగ్ కమిటీ శుక్రవారం విజయవాడలో సమావేశమైంది. ఈ కమిటీలో సభ్యులుగా ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడి కృష్ణమోహన్, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీలు రేవు ముత్యాలరాజు, అనూరాధ రాజారత్నం, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, పౌర సరఫరాల శాఖ స్పెషల్ సెక్రటరీ, కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి, సాధారణ పరిపాలన శాఖ ఉప కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యంరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వివిధ రంగాలలో అసాధారణ నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలు కలిగి సమాజాన్ని విశేషంగా ప్రభావితం చేసిన వ్యక్తులకు, సంస్థలకు అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత భారతరత్న, పద్మశ్రీ తదితర పురస్కారాల తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పురస్కారాలను అందిస్తోందన్నారు. అవార్డు ఎంపిక కోసం విద్య, వైద్య, వ్యవసాయ, మహిళాభ్యు దయం, సామాజిక న్యాయం, దేశ–విదేశాల్లో గుర్తింపు పొందిన సామాజిక, సాహిత్య, సాంస్కృతిక తదితర రంగాల్లో రాణిస్తున్న వ్యక్తులు, సంస్థల నుంచి∙దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, వారి బయోడేటాను secy&political@ap.gov.in కు మెయిల్ చేయాలని తెలిపారు. గతేడాది 59 మందిని సత్కరించినట్లు గుర్తుచేశారు. ఇక వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ కింద రూ.10 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య విగ్రహం, జ్ఞాపిక, ప్రశంసాపత్రం ఇస్తారన్నారు. వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు కింద రూ.5 లక్షల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందిస్తారని తెలిపారు.