Yuri reddy
-
నేడు సుప్రీంకోర్టులో యూరీ రెడ్డి కేసు విచారణ
-
రామోజీకి షాక్.. సుప్రీంకోర్టుకు యూరీ రెడ్డి
సాక్షి, అమరావతి: మార్గదర్శి విషయంలో ఈనాడు అధినేత రామోజీరావుకు మరోసారి షాక్ తగిలింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ సహ వ్యవస్థాపకుడు జీజే రెడ్డి కుమారుడు యూరి రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మార్గదర్శి విషయమై రామోజీరావుపై స్పెషల్ లీవ్ పిటిషన్‌ను యూరీ రెడ్డి దాఖలు చేశారు. అయితే, ఏపీ సీఐడీ విచారణపై హైకోర్టు ఇచ్చిన స్టేను ఛాలెంజ్ చేస్తూ యూరీ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, మార్గదర్శిలో తన షేర్లను బలవంతంగా బదలాయింపు చేశారని యూరీ రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రామోజీరావు తనను తుపాకీతో బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారని యూరీ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక, యూరీ రెడ్డి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఇది కూడా చదవండి: రామోజీ మా సంతకాలు ఫోర్జరీ చేశారు: యూరీ రెడ్డి -
చంద్రబాబు, రామోజీ అసలు బండారం బట్టబయలు: సజ్జల
-
షేర్ల కోసం తుపాకీతో రామోజీ రావు బెదిరింపు
-
రామోజీ మా సంతకాలు ఫోర్జరీ చేశారు
సాక్షి, అమరావతి: ‘రామోజీరావు పచ్చి మోసం చేశారు. తొలుత మమ్మల్ని ఓ గదిలో నిర్బంధించి, తుపాకీతో బెదిరించి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో షేర్లు బదిలీ చేయించుకోవాలని ప్రయత్నించారు. ప్రాణా లు దక్కించుకొనేందుకు ఆయనిచ్చిన ఖాళీ స్టాంపు పేపర్లపై సంతకాలు పెట్టి బయట పడ్డాం. షేర్లు మాత్రం బదిలీ చేయలేదు. ఆ తర్వాత ఫోర్జరీ సంతకాలతో మాకున్న 288 షేర్లను ఆయన కోడలు, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌కు బదలాయించుకున్నారు’ అని మార్గదర్శి చిట్‌ఫండ్స్ సహ వ్యవస్థాపకుడు జీజే రెడ్డి కుమారుడు యూరి రెడ్డి చెప్పారు. తమ షేర్లను బదిలీ చేసి రామోజీ మోసానికి పాల్పడ్డారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని సీఐడీని, న్యాయస్థానాన్ని కోరారు. యూరి రెడ్డి మంగళవారం తన న్యాయవాది శివరామిరెడ్డితో కలిసి విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రామోజీరావు ఏ విధంగా తమ షేర్లను అక్రమంగా బదలాయించుకున్నదీ వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. తుపాకితో బెదిరించి.. మా తండ్రి జీజే రెడ్డి చనిపోయిన తరువాత మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో మా అన్నయ్య మార్టిన్ రెడ్డి, నేను మా వాటా షేర్ల కోసం ఎన్నో ఏళ్లు రామోజీరావును సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి 2016లో హైదరాబాద్‌లో ఆయన్ని కలిశాము. మాకు డివిడెండ్ కింద చెక్ ఇచ్చారు. ఆ తరువాత మా షేర్లపై సర్టిఫికెట్ అడిగితే ఓ ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లారు. మమ్మల్ని లోపల ఉంచి తలుపులు వేసేశారు. చాలాసేపటి తరువాత రామోజీరావు వచ్చి ఖాళీ స్టాంపు పేపర్లు ముందు పెట్టారు. వాటిపై సంతకాలు చేయమన్నారు. మేము నిరాకరించడంతో మా తలలకు తుపాకి గురి పెట్టి ‘సంతకాలు పెడతారా లేదా.. మిమ్మల్ని కాపాడేవారు ఎవరూ లేరు ఇక్కడ’ అని బెదిరించారు. అది ఆయన సామ్రాజ్యం. అంతా ఆయన మనుషులే. మా బాధ చెప్పుకునేందుకు కూడా ఎవరూ లేరు. ఆ సమయంలో అక్కడి నుంచి ప్రాణాలతో బయట పడతామనుకోలేదు. ఆయనకు ఎదురు చెబితే ప్రాణాలు దక్కవన్నది అర్థమైంది. కేవలం ప్రాణాలు కాపాడుకొనేందుకే ఆ ఖాళీ స్టాంపు పేపర్లపై సంతకాలు చేసి బయటకు వచ్చాం. షేర్ల బదిలీకి మేము అంగీకరించలేదు. షేర్ల బదిలీ ప్రక్రియ పూర్తి చేయలేదు. రామోజీరావు మాకు ఇచ్చిన చెక్‌ను కూడా నగదుగా మార్చుకోలేదు. చట్ట ప్రకారం ఇది చెల్లదు కంపెనీల చట్టం ప్రకారం ఏదైనా షేర్ల బదిలీ ప్రక్రియ పూర్తి కావాలంటే మూడు అంశాలు తప్పనిసరి. ప్రతిపాదన (ఆఫర్), ఆమోదం (యాక్సెప్టెన్సీ), ప్రతిఫలం బదిలీ (కన్సిడరేషన్) తప్పనిసరి. మా షేర్ల బదిలీ విషయంలో ఆ మూడూ జరగలేదు. షేర్లు బదిలీ చేస్తామని మేము ఎక్కడా చెప్పలేదు. అందువల్ల ప్రతిపాదనే లేదు. రామోజీరావు కోరినా మేము ఆమోదించలేదు. అందువల్ల యాక్సెప్టెన్సీ లేదు. మా షేర్ల బదిలీకి ప్రతిఫలంగా మాకు ఎలాంటి ఆర్థిక ప్రతిఫలమూ దక్కలేదు. కాబట్టి మేము షేర్లు విక్రయించామన్న రామోజీరావు వాదన చెల్లదు. ఆయన వాదన పూర్తిగా అబద్ధం, మోసపూరితం. చేతి అప్పు అంటూ బుకాయింపు మా తండ్రికి చేతి అప్పుగా ఇచ్చిన దానికి ప్రతిఫలంగానే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడి నిధిని సమకూర్చారని రామోజీరావు ముందుగా బుకాయించారు. చేతి అప్పు తీర్చాలి అంటే నగదు ఇస్తారు గానీ కంపెనీలో పెట్టుబడి పెడతారా అని మేము ప్రశ్నిస్తే రామోజీరావు సరైన సమాధానం ఇవ్వలేదు. అనంతరం షేర్లు బదిలీ చేయాలని మమ్మల్ని తుపాకీతో బెదిరించారు. ఫోర్జరీ సంతకాలతో షేర్ల బదిలీ.. ఆర్వోసీకి ఫిర్యాదు మేము సమ్మతించకపోయినా, చెక్‌ను నగదుగా మార్చుకోకపోయినా మా వాటా 288 షేర్లను రామోజీరావు ఆయన కోడలు శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేశారని 2017లో గుర్తించాం. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)కి వెళ్లి సంబంధిత పత్రాలను పరిశీలిస్తే అసలు విషయం తెలిసింది. పలు పత్రాల్లో మా సంతకాలను ఫోర్జరీ చేశారు. దీనిపై అప్పట్లోనే ఆర్వోసీకి ఫిర్యాదు చేశాను. సీఐడీ దర్యాప్తుతో ధైర్యం వచ్చి.. రామోజీరావు తుపాకీతో బెదిరించారని కొందరికి మా ఆవేదన చెప్పుకున్నా అప్పట్లో ఫలితం లేకపోయింది. దాంతో ఫిర్యాదు చేసేందుకు ధైర్యం సరిపోలేదు. ఆయన రాజకీయ పరపతి ఎలాంటిదో అందరికీ తెలిసిందే. వ్యవస్థలన్నీ ఆయన గుప్పిట్లో ఉన్నాయి. మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారుల సొమ్ము అక్రమ పెట్టుబడులకు మళ్లించిన వ్యవహారంలో ఏపీ సీఐడీ రామోజీ, ఇతరులపై కేసు నమోదు చేసింది. సోదాలు నిర్వహిస్తోంది. దాంతో మాకు ధైర్యం వచ్చింది. అందుకే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో మా షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్నారని సీఐడీకి కొన్ని నెలల క్రితం ఫిర్యాదు చేశాము. సీఐడీ అధికారులు నాలుగైదు నెలలపాటు మా ఫిర్యాదును పరిశీలించారు. ఆధారాలు తెమ్మన్నారు. మేము ఇచ్చిన ఆధారాలను పరిశీలించారు. మా ఫిర్యాదు సరైనదే అని నిర్ధారించుకున్న తరువాతే కేసు నమోదు చేశారు. మూలధన నిధి ఏపీ నుంచే వచ్చింది కాబట్టి.. మా తండ్రి జీజే రెడ్డి కృష్ణా జిల్లాలోని తన వ్యవసాయ భూమి ద్వారా వచ్చిన ఆదాయాన్నే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడిగా పెట్టారు. అంటే మూలధన నిధిని ఏపీ నుంచే సమీకరించారు. ఆ పెట్టుబడితోనే మా పేరిట 288 షేర్లు వచ్చాయి. ఆ షేర్లనే రామోజీరావు ఆయన కోడలు శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేశారు. అందుకే ఈ కేసు ఏపీకి సంబంధించినదని న్యాయ నిపుణులు చెప్పారు. దాంతోనే ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశాం. మాకు జరిగిన అన్యాయంపై సీఐడీని సంప్రదించాం. సీఐడీ, న్యాయస్థానం మా ఆవేదనను గుర్తించి న్యాయం చేస్తాయని విశ్వసిస్తున్నాం. శైలజ పేరిట అప్పుడు 100 షేర్లే.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజ కిరణ్ పేరిట 2017 వరకు 100 షేర్లే ఉన్నాయి. జీజే రెడ్డి పేరిట మాత్రం 288 షేర్లు ఉన్నాయి. జీజే రెడ్డి షేర్లను అక్రమంగా బదిలీ చేసిన తరువాత ప్రస్తుతం శైలజ కిరణ్ పేరిట 388 షేర్లు ఉన్నాయి. జీజే రెడ్డి తప్ప మిగిలిన షేర్ హోల్డర్లంతా రామోజీ కుటుంబ సభ్యులే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో ఆరుగురు షేర్ హోల్డర్లే ఉన్నారు. ఎందుకంటే ఆ సంస్థ ఏనాడూ పబ్లిక్ ఇష్యూ జారీ చేయలేదు. ఉన్న ఆరుగురు షేర్ హోల్డర్లలో అయిదుగురు రామోజీరావు కుటుంబ సభ్యులే. జీజే రెడ్డి ఒక్కరే బయట వ్యక్తి. ఆయన పేరిట ఉన్న షేర్లను కూడా అక్రమంగా శైలజ కిరణ్ పేరిట బదిలీ చేశారు. ఆ అక్రమ వ్యవహారానికి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లోని ఇతర షేర్ హోల్డర్లు.. అంటే రామోజీ కుటుంబ సభ్యులు సహకరించారు. రామోజీరావు పెద్ద గూడుపుఠాణికి పాల్పడ్డారు. -
రామోజీ నన్ను తుపాకీతో బెదిరించారు: యూరి రెడ్డి
-
1962 నుంచి నా తండ్రి పేరు మీద మార్గదర్శిలో షేర్లు ఉన్నాయి
-
నా తండ్రి పేరు మీద షేర్స్ ఉన్నాయి: యూరిరెడ్డి
-
రామోజీరావు, శైలజ క్వాష్ పిటిషన్.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీజేరెడ్డి షేర్లు శైలజా కిరణ్ పేరిట అక్రమంగా మార్పు
-
రామోజీరావును పెంచి పోషించింది మా నాన్నే
‘సాక్షి’ ఇంటర్వ్యూలో జీజేఆర్ కుమారుడు యూరి మార్గదర్శి మా నాన్న నాటిన విత్తనమే ‘ఈనాడు’ ఆలోచన కూడా నాన్నదే పెట్టుబడి నుంచి యంత్రాల దాకా సమకూర్చి పెట్టారు డాల్ఫిన్ హోటల్స్‌లోనూ నాన్న పెట్టుబడులున్నాయి చాలా సంస్థల్లో ఆయన బినామీ పెట్టుబడులు పెట్టారు వ్యాపార భాగస్వాములని నమ్మినవారే ముంచేశారు మృత్యుశయ్య నుంచి ఆయన నాకు చెప్పిన విషయాలివి తొలినాళ్లలో రామోజీ ఎదుగుదల వెనక ఉన్నది జీజే రెడ్డేనని ఆయన కుమారుడు యూరీ రెడ్డి ధ్రువీకరించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తన తండ్రి పెట్టుబడులు పెట్టారని, ఆ సంస్థతో పాటు ‘ఈనాడు’ ఏర్పాటుకు కూడా అన్నివిధాలా సాయం చేశారని వివరించారు. ఢిల్లీ స్థాయిలో తన తండ్రి పలుకుబడి, పరిచయాలను రామోజీ పూర్తిగా వాడుకుని ఎదిగారని చెప్పారు.చట్టపరమైన మార్గాల ద్వారా తన తండ్రి వాటాలను, పెట్టుబడులను రాబట్టుకునే ఆలోచన ఉందని ‘సాక్షి’ ఇంటర్వ్యూలో తెలిపారు. వివరాలు... రామోజీ మీ నాన్న కోసం పని చేసేవారని అంటారు? అవును. రామోజీరావుకు మా నాన్నతో సన్నిహిత సంబంధముండేదన్నది నిజం. ఆయన మా నాన్న దగ్గర పని చేసేవారని విన్నాను. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తొలి నుంచీ మా నాన్నకు వాటాలుండేవి. అప్పట్లో రామోజీకి ఓ కంపెనీ పెట్టేంత స్తోమత ఉండేది కాదని, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు మీ నాన్నే ప్రైమ్ మూవర్ అని, అందుకే ఆ సంస్థలో ఆయన వ్యవస్థాపక ఇన్వెస్టర్‌గా చేరారని, అందులో ఉన్నది మీ నాన్న డబ్బేనని అంటారు. నిజమేనా? నిజమే. మా నాన్న మార్గదర్శి వ్యవస్థాపక డెరైక్టర్లలో ఒకరు. దాని ప్రారంభ పెట్టుబడి (సీడ్ క్యాపిటల్) పెట్టింది ఆయనే. మా నాన్నే నాతో ఎన్నోసార్లు చెప్పారిది. నవభారత్ ఎంటర్ప్రైజెస్, మార్గదర్శి వంటి ఈ కంపెనీలన్నీ పరస్పరం ఇంటర్ లింక్డ్ అనేవారు. మా నాన్న ఒక స్నేహితునిగా తన కంపెనీల నుంచి డబ్బును రామోజీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు. నేను కొంచెం ఎమోషనల్‌గా ఫీలవుతున్నాను. మరణశయ్య నుంచి ఒక తండ్రి తన కుమారునికి చెప్పిన సత్యాలను మీతో పంచుకుంటున్నాను. డాల్ఫిన్ హోటల్స్‌లో కూడా తన పెట్టుబడులున్నాయని మా నాన్న తన చివరి క్షణాల్లో నాతో చెప్పారు. ‘ఈనాడు’ పత్రికకు అవసరమైన ప్రింటింగ్ ప్రెస్‌ను కూడా తూర్పు జర్మనీ నుంచి మా నాన్నే దిగుమతి చేయించారని మా అంకుల్స్ నాకు చెప్పారు. ఇప్పుడు భారత్‌లో ఆస్తుల ధరలు బాగా పెరగడంతో నాటి మా నాన్న పెట్టుబడుల విలువ కూడా భారీగా పెరిగింది. భారత్‌లోని తన ఆస్తులు తదితరాలకు ఏఎస్ చౌదరి అనే ఆయన కేర్టేకర్అని మా నాన్న నాతో చెప్పారు. మీ నాన్న నాటిన విత్తనమే ఇప్పుడు ఏటా కొన్ని వేల కోట్ల టర్నోవర్‌తో కూడిన వ్యాపార సామ్రాజ్యంగా మారిందని భావిస్తున్నారా? అవును. ఇక్కడి తన ఆస్తులను, షేర్ల ద్వారా డివిడెండ్ వంటివేమైనా వస్తే వాటిని ఆంధ్రప్రదేశ్‌లోనే ధార్మిక కార్యకలాపాలకు వినియోగిస్తే ఎంతో సంతోషిస్తానని మా నాన్న తన చివరి రోజుల్లో మాతో చెప్పేవారు. మీ తల్లిదండ్రులకు హైదరాబాద్, ఢిల్లీల్లో భూములు, పలు కంపెనీల్లో మంచి పెట్టుబడులుండేవా? అవును. బిగ్ మనీ, బిగ్ పాలిటిక్స్. వాటి మధ్య విభజన రేఖ చాలా సన్ననిది! మీ నాన్న తన వ్యాపార భాగస్వాముల సంస్థల్లో చాలా పెట్టుబడులు పెట్టారని, వాటిని వారే నియంత్రించేవారని అంటారు. ఆయన తదనంతరం ఆ పెట్టుబడుల జాడే లేకుండా పోయిందంటారు. వ్యాపార భాగస్వాములే మీ నాన్నను ముంచారా? నిజం. ఢిల్లీలోని మీ బంగ్లాకు రామోజీరావు తరచూ వచ్చేవారట? అవును, నిజం. ఆయన తరచు అక్కడకు వస్తుండేవారు. ‘ఈనాడు’ పత్రిక పెట్టాలన్న ఆలోచన కూడా మీ నాన్నదేనటగా? అవును. ఆ ఐడియా మా నాన్నదే. ఈనాడుకు ప్రింటింగ్ ప్రెస్‌ను మీ నాన్నే సమకూర్చారటగా! అవును. తూర్పు జర్మనీ నుంచి వాయిదాల చెల్లింపు పద్ధతిన మా నాన్నే సమకూర్చారు. అప్పట్లో ఆయన చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. రామోజీ తన సంస్థ ఎదుగుదలకు మా నాన్న పలుకుబడిని, పరిచయాలను వాడుకోవడాన్ని ఆయనెప్పుడూ కాదనలేదు. రామోజీ గురించి మీ నాన్న ఏం చెప్పేవారు? ఆయన్ను తన కొలీగ్‌గా, క్లోజ్ ఫ్రెండ్‌గా భావించేవారు. మీ నాన్న తీర్చిదిద్దిన రామోజీ, 1985 నాటికి ప్రభుత్వాలనే మార్చగలిగే స్థాయికి ఎదిగారు. దీనిపై మీ నాన్న ఏమంటుండేవారు? పోలియో బాధితుడైన మా నాన్న తన జీవితంలో చాలామందికి సాయం చేశారు. ఎంతోమందిని పెంచి పోషించారు. తన పర్యవేక్షణలో విజయం సాధించిన రామోజీని చూసి, అలాంటి వ్యక్తిని పెంచి పోషించింది తానేనని ఆయన చాలా సంతోషపడేవారు. అప్పట్లో మా నాన్నకు డబ్బు ప్రధానం కాదు. రామోజీ సంస్థల్లో డబ్బు ఇన్వెస్ట్ చేసినా, మెషినరీ వంటిది ఏర్పాటు చేసినా... సాయపడాలన్నది మాత్రమే ఆయన తత్వం. మార్గదర్శి-నవభారత్ లింకు గురించి మీ నాన్న ఏం చెప్పేవారు? వాటిది చాలా సన్నిహిత సంబంధం. భారత్‌లో అప్పట్లో పన్ను భారం ఎక్కువగా ఉండేది. దాన్ని తప్పించుకునేందుకు మిగులు నిధులన్నింటినీ బినామీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేవారు. అదంతా ఇప్పటి ప్రమాణాల ప్రకారం చట్టబద్ధం కాకపోవచ్చు. మా నాన్న పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ఆస్తులు కొన్నారు. కానీ వాటిని ఆయన పేరుతో పెట్టేందుకు వీల్లేకపోవడంతో ఎన్నో కంపెనీల్లో బినామీ పేర్లతో పెట్టారు. అలా ఎందుకు చేశారో నాకిప్పటికీ అర్థం కాదు. బహుశా అప్పట్లో పరిస్థితులు, వ్యాపార వాతావరణం అలా ఉండేవేమో. అయితే ఇలాంటి అనధికారిక విషయాల గురించి నేను మాట్లాడటం లేదు. చట్టప్రకారం మా తండ్రికి వారసులుగా మాకుండే హక్కుల గురించే మాట్లాడుతున్నాం. మా నాన్న ఇన్వెస్ట్ చేసిన సంస్థల్లో మా వాటాను మాకిప్పించమని కోరుతున్నాం. అప్పట్లో వీటి గురించి మేం పట్టించుకోలేదు. నాన్న పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి, పోలియో బాధితులకు ఆసరాగా ఉండటం నా ఆశయం. ఒక వ్యక్తిగా రామోజీ గురించి ఏమంటారు? కొన్నేళ్ల క్రితం ఆయన్ను కలిశాను. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో మా నాన్న పెట్టుబడి రూ.35 వేలు మాత్రమేనని ఆయనన్నారు. అదంత పెద్ద మొత్తం కాదనిపించింది. దాంతో వదిలేశాను. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో మీ నాన్నకు ఇప్పటికీ 288 షేర్లున్న విషయం మీకు తెలుసా? ఇటీవలే తెలిసింది. అయితే 90 షేర్లేనన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లోని మీ నాన్న వాటాల విలువను తెలుసుకునే ప్రయత్నమేమైనా చేశారా? రామోజీ కంపెనీల్లోని మీ నాన్న పెట్టుబడులను రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తారా? దీనిపై చర్చిస్తాను. నా సోదరుడు నాకిప్పటికే పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాడు. అయినా ఆయనతో కూడా ఈ విషయమై మాట్లాడాలి. రామోజీ ఎప్పుడన్నా మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేశారా? అప్పట్లో ప్రాగ్ (చెకస్లొవేకియా రాజధాని)లో నేను ప్రియా పచ్చళ్ల వ్యాపారం చేసేవాడిని. కొన్నేళ్ల క్రితం దాన్ని తిరిగి మొదలు పెట్టాలనుకున్నాను. అందుకు రామోజీ ఆఫర్ ఇచ్చారు.