కేంద్రీయ విద్యాలయ స్థలాన్ని పరిశీలించిన ఎంపీ వైవీ
రాజంపల్లి(పెద్దారవీడు) : మార్కాపురం డివిజన్ విద్యలో ముందంజలో ఉండాలనే ఉద్దేశంతో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయిస్తున్నామని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. గిద్దలూరు, కంభం, మార్కాపురం ప్రాంతాల్లో ఎక్కువ మంది మిలటరీలో ఉద్యోగాలు చేస్తుండడంతో ఈ ప్రాంతానికి పాఠశాల ఆవశ్యకతను గుర్తించామన్నారు.
నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ వైవీ, ఎమ్మెల్యే డేవిడ్‌రాజు గురువారం మండలానికి వచ్చారు. గొడ్రాలికొండ తిరుమలనాథ స్వామి ఆలయ సమీపంలో విద్యాలయానికి అవసరమైన ప్రభుత్వ భూమిని ఎంపీ పరిశీలించారు. ఒంగోలు కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ ప్రసాదరావు ఉన్నారు. రాజంపల్లి గ్రామంలోని శ్రీ గొడ్రాలి కొండ తిరుమలనాథ స్వామి దేవాలయంలో ఎంపీ, ఎమ్మెల్యేలను ఆలయ చైర్మన్ ఏర్వ నారాయణరెడ్డి, ఆలయ మేనేజర్ ఏవీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు భవానీ ప్రసాద్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
వారు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ చైర్మన్, మేనేజర్‌తోపాటు ఎంపీపీ ఏర్వ భాగ్యలక్ష్మి దంపతులు వారికి పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. జెడ్పీటీసీ సభ్యులు దుగ్గెంపూడి వెంకటరెడ్డి, అమిరెడ్డి రామిరెడ్డి, మంత్రునాయక్, ఆలయ మాజీ చైర్మన్ ఏర్వ చిన్న కోటిరెడ్డి, పార్టీ నేతలు గొట్టం శ్రీనివాసరెడ్డి, జంకె ఆవులరెడ్డి, కాసు వెంకటరెడ్డి, ఎస్కే బుజ్జి, ఏర్వ బ్రహ్మానందరెడ్డి, గొట్టం సూర్య నారాయణరెడ్డి, మూడమంచు కొండగురవయ్య, సాయి కృష్ణ, కాశయ్య, డీ వెంకటరెడ్డి, నందిరెడ్డి రఘునాథరెడ్డి, పాలిరెడ్డి కృష్ణారెడ్డి, ఏర్వ చలమారెడ్డి, అల్లు చలమారెడ్డి, బి.సాలయ్య, సర్వేయర్ శివశంకర్, వీఆర్వో శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచ్ కొలగొట్ల వెంకట నారాయణరెడ్డి, వెలిగొండ ప్రాజెక్టు ముంపు పరిధిలోని కలనూతల గ్రామస్తులు తమకు నష్టపరిహారం ఇప్పించాలని ఎంపీకి వినతి పత్రం అందజేశారు.