Zepto
-
క్విక్ కామర్స్ ఏఐ రైడ్!
పదే పది నిమిషాల్లో డెలివరీతో రప్పా రప్పా దూసుకుపోతున్న క్విక్ కామర్స్ దిగ్గజాలు... దీని కోసం అధునాతన టెక్నాలజీని విరివిగా వాడేసుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా ఎనలిటిక్స్ వంటి సాంకేతికతల దన్నుతో కస్టమర్ల ఆర్డర్ ధోరణులు, ప్రోడక్ట్ ప్రాధాన్యతలు, ఏ సమయంలో ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారనే అంశాలను అధ్యయనం చేయడం, డార్క్ స్టోర్ నుంచి గమ్యస్థానికి అత్యంత వేగవంతమైన రూట్‌ను ఎంచుకోవడం వంటివన్నీ చకచకా చక్కబెట్టేస్తున్నాయి.క్విక్ కామర్స్ దిగ్గజాలైన బ్లింకిట్, బిగ్‌బాస్కెట్ నౌ, జెప్టో లేదంటే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్... చెప్పింది చెప్పినట్లుగా పది నిమిషాలలోపే ఆర్డర్లను అంతవేగంగా ఎలా డెలివరీ చేసేస్తున్నాయో తెలుసా? ఇప్పటికే తమ వద్దనున్న వినియోగదారుల డేటాను ఏఐతో సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారానే ఇదంతా సాధ్యమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. తగినంత కన్జూమర్ సమాచారం ఉన్న క్విక్ కామ్ కంపెనీలకు ఏఐ వరప్రదాయినిగా మారుతోంది. వినియోగదారుల కొనుగోలు స్వభావం నుంచి వారు ఎంత విరివిగా ఆర్డర్ చేస్తున్నారు, ఏయే ఉత్పత్తులను ఎక్కువగా కొంటున్నారు వంటివన్నీ ఏఐ టూల్స్ రియల్ టైమ్‌లో విశ్లేషించి అందిస్తున్నాయి. అంతేకాదు దగ్గరలో ఉన్న డార్క్ స్టోర్ (క్విక్ కామ్ కంపెనీలు ప్రోడక్టులను నిల్వ ఉంచుకునే చిన్నపాటి గిడ్డంగులు) నుంచి ట్రాఫిక్ రద్దీగా ఉన్న సమయంలో, అలాగే పెద్దగా రద్దీ లేనప్పుడు గమ్యస్థానానికి అత్యంత వేగంగా చేరుకునే రూట్‌ను కూడా అధ్యయనం చేసి ఈ ఏఐ టూల్స్ నేరుగా డెలివరీ బాయ్‌కు చేరవేస్తున్నాయి.అంతా క్షణాల్లో... జెప్టో వంటి కీలక క్విక్ కామ్ సంస్థలు ఉపయోగిస్తున్న తెరవెనుక (బ్యాకెండ్) టెక్నాలజీ... ఏకకాలంలో పికర్స్, ప్యాకర్స్, ఇంకా రైడర్లను రియల్‌టైమ్‌లో కనెక్ట్ చేస్తోంది. ఒకసారి యాప్‌లో ఆర్డర్ కన్ఫర్మ్ అవ్వగానే, ఈ సిస్టమ్‌లోని అందరూ అనుసంధానమైపోతారు. ఆర్డర్‌ను పిక్ చేయడం, డిస్పాచ్ చేయడం 2 నిమిషాల్లోపే జరిగిపోతుంది. ఆపై ట్రాఫిక్, ఇంధన మైలేజీ, వాహన టెలీమెట్రీ, ప్రయాణ సమాయాల చరిత్ర, దూరం వంటి డేటాను ఉపయోగించుకుని రియల్ టైమ్ రూటింగ్ తగిన రూట్లను సూచిస్తుంది. దీనివల్ల ఆర్డర్‌ను డెలివరీ పార్టనర్ ఎంత సమయంలో కస్టమర్ చెంతకు చేర్చగలరనే అంచనా ట్రావెల్ టైమ్ (ఈటీఏ)ను పక్కాగా పేర్కొంటుంది. దీని ప్రకారం సగటున 8 నిమిషాల్లోపే ఆర్డర్ డెలివరీ జరిగేందుకు వీలవుతోందని నిపుణులు చెబుతున్నారు. 340కి పైగా డార్క్ స్టోర్లున్న జెప్టో గతేడాది డెలివరీ దూరం 1.7 కిలోమీటర్లు కాగా, ఇప్పుడిది 1.5 కిలోమీటర్లకు తగ్గించుకుంది. అంతేకాదు, 3–4 సెకెన్లలో చెకవుట్ అయ్యే విధంగా అధునాతన టెక్నాలజీలు వినియోగించే పేమెంట్ గేట్‌వే సరీ్వసులను కంపెనీ వాడుకుంటోంది. ఇక బీబీనౌ విషయానికొస్తే, ఆర్డర్ ఏ డార్క్ స్టోర్‌కు వెళ్తుందో నిర్ణయించడానికి ముందే టెక్నాలజీ రంగంలోకి దిగుతుంది. ఉదాహరణకు సదరు ప్రాంతంలో ఉన్న రైల్వే ట్రాక్‌లు, పీక్, నాన్–పీక్ టైమ్‌లో ట్రాఫిక్, రోడ్డు స్థితిగతులు, ఇప్పటిదాకా కస్టమర్ షాపింగ్ ధోరణులు, వయస్సు, ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి పలు డేటా పాయింట్లను పరిగణనలోకి తీసుకుంటామని బిగ్‌బాస్కెట్ సీఓఓ టీకే బాలకుమార్ చెప్పారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా బీబీనౌ రోజుకు 5 లక్షల పైగా ఆర్డర్లను ప్రాసెస్ చేస్తోంది.→ జెప్టో డార్క్ స్టోర్ నుంచి ప్రస్తుత డెలివరీ దూరం 1.5 కిలోమీటర్లు; యాప్‌లో ఆర్డర్ చెకవుట్ సమయం 3–4 సెకన్లు. → ఆర్డర్లను తగిన డార్క్ స్టోర్లకు కేటాయించేందుకు బీబీనౌ జియో స్పేషియల్ డేటాను వినియోగిస్తోంది. → పికర్లు, ప్యాకర్లు, రైడర్లను అత్యంత వేగంగా కనెక్ట్ చేయడానికి జెప్టో ఏఐ ఆల్గోరిథమ్స్ దోహదం చేస్తున్నాయి.→ యూజర్ల అభిరుచులను బట్టి ఉత్పత్తులను సిఫార్సు చేయడంలో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ డేటా ఎనలిటిక్స్ది కీలక పాత్ర. వృథాకు చెక్.. డిమాండ్‌ను అంచనా వేయడానికి దాదాపు అన్ని క్విక్ కామ్ సంస్థలూ ఏఐ ఆల్గోరిథమ్స్, మెషీన్ లెర్నింగ్ మోడల్స్ ప్రయోజనాన్ని వాడుకుంటున్నాయి. దీనివల్ల ప్రోడక్ట్ నిల్వలను సరిగ్గా నిర్వహించేందుకు, వృథాను అరికట్టేందుకు వాటికి వీలు చిక్కుతోంది. అంతేగాకుండా, డార్క్ స్టోర్లలో ఉత్పత్తుల నిల్వలను నిరంతరం పర్యవేక్షించేందుకు క్విక్ కామ్ సంస్థలు రియల్ టైమ్ డేటాను కూడా ఎఫ్ఎంసీజీ కంపెనీలతో పంచుకుంటున్నాయి. పలు ఈ–కామర్స్ సంస్థల వృద్ధిలో కీలకంగా నిలుస్తున్న డేటా ఎనలిటిక్స్ క్విక్ కామ్‌లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఉదాహరణకు, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ షాపింగ్ అభిరుచులు, ప్రాధాన్యతల ఆధారంగా ఒక్కో కస్టమర్‌కు ఒక్కోలాంటి యూజర్ అనుభూతిని అందించేందుకు డేటా ఎనలిటిక్స్‌ను సద్వినియోగం చేసుకుంటోంది. ‘ఇలాంటి నిర్దిష్ట (టార్గెటెడ్) విధానం వల్ల వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను సిఫార్సు చేయడానికి వీలువుతుంది. అలాగే కస్టమర్లు ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేసే అవకాశాలను పెంచుతుంది’ అని ఈ–కామర్స్ నిపుణులు సోమ్దత్తా సింగ్ అభిప్రాయపడ్డారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
క్విక్ కామర్స్‌పై విమర్శలు ఎందుకు..
కిరాణా సరుకులు, నిత్యావసర వస్తువులను నిమిషాల్లో డెలివరీ చేస్తామని హామీ ఇస్తున్న క్విక్ కామర్స్ బిజినెస్ పట్టణ ప్రాంతాల్లో వేగంగా ప్రజాదరణ పొందుతోంది. ఇప్పటికే బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్, జెప్టో.. వంటి సంస్థలు ఈ సర్వీసులు అందిస్తున్నాయి. అయితే ఈ బిజినెస్‌పై ప్రజాదరణతోపాటు విమర్శలు సైతం పెరుగుతున్నాయి. ఇందుకు కొన్ని కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.వ్యతిరేక పోటీ విధానాలుక్విక్ కామర్స్ సంస్థలు వ్యతిరేక పోటీ విధానాలను అనుసరిస్తున్నాయనే వాదనలున్నాయి. సాంప్రదాయ రిటైలర్లు, ముఖ్యంగా కిరాణా దుకాణాదారులపై క్విక్ కామర్స్ ప్రభావం భారీగా ఉంది. ఈ సంస్థలు అందించే డిస్కౌంట్లు, నేరుగా ఇంటికే డెలివరీ చేసే సేవలతో కిరాణాదారుల వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది. వినియోగదారులకు వేగంగా సర్వీసులు అందించేందుకు స్థానికంగా డార్క్ స్టోర్లను, చిన్న, ఆటోమేటెడ్ గోదాములను ఉపయోగిస్తున్నాయి.ఆకర్షణీయ ధరలుసాంప్రదాయ రిటైల్ విధానంలో వివిధ దశల్లో ఉండే మధ్యవర్తుల కమీషన్ల బాదరబందీ లేకపోవడంతో క్విక్ కామర్స్ సంస్థలు ఆకర్షణీయమైన ధరకే ఉత్పత్తులను అందిస్తుండటం సైతం కస్టమర్లు వాటివైపు మొగ్గు చూపేందుకు దోహదపడుతోంది. ఈ నేపథ్యంలో నిత్యావసరాల మార్కెట్లో ఆధిపత్యం ఉన్న కిరాణా స్టోర్స్ మనుగడ కోసం పోరాడే పరిస్థితులు నెలకొంటున్నాయి. క్విక్ కామర్స్ వినియోగం 2024-25లో 74% వృద్ధి నమోదు చేయనుంది. 2023–28 మధ్యలో 48% వార్షిక వృద్ధితో అత్యంత వేగంగా ఎదిగిన మాధ్యమంగా నిలవనుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.విదేశీ పెట్టుబడుల దుర్వినియోగంక్విక్ కామర్స్ వాణిజ్యం పెరగడం స్థానిక రిటైలర్లకు గొడ్డలిపెట్టుగా మారింది. సౌలభ్యం, తక్కువ ధరలకు ఆకర్షితులైన చాలా మంది వినియోగదారులు తమ షాపింగ్ అలవాట్లను మార్చుకుంటున్నారు. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ మార్పు ఫలితంగా సాంప్రదాయ దుకాణాల్లో అమ్మకాలు తగ్గిపోయాయి. రిటైల్ మార్కెట్‌ను పూర్తి తమ వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు విదేశీ పెట్టుబడులను దుర్వినియోగం చేస్తున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఆరోపించింది.ప్రభుత్వ సంస్థల దర్యాప్తుక్వాక్ కామర్స్ కంపెనీలు అనుసరిస్తున్న విధానాలపై ఆందోళనలు ఉన్నాయి. ఈ సంస్థలు పోటీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్న ఆరోపణలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తు చేస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్‌లు ధరలను కట్టడి చేస్తూ పోటీ చట్టాలను ఉల్లంఘించేలా ఇన్వెంటరీని నియంత్రిస్తున్నాయని సాంప్రదాయ రిటైలర్లు పేర్కొన్నారు. ఈ మేరకు వస్తున్న ఆరోపణలపై సీసీఐ తన దర్యాప్తును కొనసాగించడానికి మరింత వివరణాత్మక సాక్ష్యాలను కోరుతోంది.ఇదీ చదవండి: ఖో-ఖోకు పెరుగుతున్న స్పాన్సర్షిప్ఏం చేయాలంటే..ఈ ఆందోళనలపై స్పందించిన ప్రభుత్వం వాటికి అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. రిటైలర్లకు నష్టం కలగకుండా, క్విక్ కామర్స్ సంస్థలు అంగీకరించేలా సమన్వయం చేస్తూ మార్గదర్శకాలు తయారు చేయాల్సి ఉంది. రిటైల్ వ్యవస్థలో భాగస్వాములందరి ప్రయోజనాలను పరిరక్షిస్తూనే సృజనాత్మకతకు మద్దతు ఇచ్చేలా పరిష్కారాలు కనుగొనాలి. -
‘విలీనానికి ఆర్బీఐ ఎన్ఓసీ అవసరం లేదు’
ప్రముఖ ఆన్లైన్ క్విక్ కామర్స్ యూనికార్న్ జెప్టో మాతృ సంస్థల విలీనానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి నిరభ్యంతర పత్రం (NOC) అవసరం లేదని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) స్పష్టం చేసింది. ఈ నిర్ణయం జెప్టో తన కార్పొరేట్ కార్యకలాపాలు క్రమబద్ధీకరించడానికి, రాబోయే ఐపీఓకు సిద్ధం కావడానికి మార్గం సుగమం చేస్తుంది.భారత్‌లో జెప్టోను నిర్వహిస్తున్న ముంబైకి చెందిన కిరాణాకార్ట్ టెక్నాలజీస్‌ను, సింగపూర్‌కు చెందిన అనుబంధ సంస్థ కిరాణాకార్ట్ పీటీఈ లిమిటెడ్‌తో విలీనం చేయడానికి ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఆమోదం తెలిపింది. ఈ విలీనం ‘క్రాస్ బోర్డర్ విలీన నిబంధనల రెగ్యులేషన్ 9’ కిందకు వస్తుందని ట్రైబ్యునల్ పేర్కొంది. దీనికి ఆర్బీఐ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంతో విలీన ప్రక్రియ సులువైనట్లు అధికారులు తెలిపారు.చట్టపరమైన సంస్థల సంఖ్యను తగ్గించడం ద్వారా కార్పొరేట్ కంపెనీల కార్యకలాపాలను, వాటి నిర్మాణాన్ని సరళీకృతం చేయాలనే ఉద్దేశంతో ఎన్సీఎల్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. జెప్టో సైతం తన వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించేందుకు రివర్స్ ఫ్లిప్(మాతృ సంస్థల విలీనం) నిర్ణయం తీసుకుంది. ఈ చర్య వ్యాపార కార్యకలాపాలను పెంచుతుందని, వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు దోహదం చేస్తుందని, ఖర్చులను తగ్గిస్తుందని, భవిష్యత్తు నిధుల సేకరణను సులభతరం చేస్తుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: పండగ వేళ పసిడి ప్రియులకు గుడ్న్యూస్కంపెనీ బోర్డు 2024 అక్టోబర్‌లో ఈ విలీనం కోసం ఎన్సీఎల్టీలో అప్పీలు చేసుకుంది. అయితే ఈ ప్రక్రియ ఏప్రిల్ 2025 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. రోజర్‌పే, ఫ్లిప్‌కార్ట్, పైన్ ల్యాబ్స్, మీషో వంటి కంపెనీలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు తాజా ఎన్సీఎల్టీ నిర్ణయంతో ఆమోదం తెలిపినట్లయింది.