zimbabwe cricketers
-
హీత్ స్ట్రీక్ అరుదైన రికార్డులు.. తొలి మ్యాచ్‌లో నో వికెట్! నాడు టీమిండియాను ఓడించి..
Heath Streak: జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ మరణించాడంటూ సహచర ఆటగాడు హెన్రీ ఒలంగ చేసిన ట్వీట్ గందరగోళానికి కారణమైంది. క్యాన్సర్‌తో పోరాడుతూ స్ట్రీక్ చనిపోయాడని ఒలంగ సంతాపం ప్రకటించాడు. అయితే, తాజాగా అతడు బతికే ఉన్నాడంటూ మరో ట్వీట్‌తో ముందుకు వచ్చాడు. తప్పుడు వార్త ప్రచారానికి కారణమై అభిమానుల చేత చివాట్లు తింటున్నాడు. ఇదిలా ఉంటే.. కాన్సర్‌తో పోరాడుతున్న హెన్రీ స్ట్రీక్ రికార్డుల గురించి తెలుసుకుందామా?! 13 ఏళ్ల ప్రయాణం 1993- 2005 మధ్య పదమూడేళ్ల పాటు జింబాబ్వే తరఫున హీత్ స్ట్రీక్ అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. తన కెరీర్లో మొత్తంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 254 మ్యాచ్‌లు ఆడిన ఈ పేస్ ఆల్‌రౌండర్.. వీటిలో 89 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. టెస్టుల్లో, వన్డేల్లో కలిపి 455 వికెట్లు కూల్చి నేటికీ జింబాబ్వే తరఫున అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్‌గా తన పేరును చరిత్రలో లిఖించుకున్నాడు. లెజెండరీ ఆల్‌రౌండర్ అంతేకాదు.. 100 వికెట్ల క్లబ్లో చేరిన ఏకైక జింబాబ్వేయన్ కూడా హీత్ స్ట్రీక్. బౌలర్‌గానే గాకుండా బ్యాటర్‌గానూ అదరగొట్టాడు ఈ పేస్ ఆల్‌రౌండర్. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసి 4000 పరుగులు సాధించాడు. PC: Twitter అరంగేట్రంలో నో వికెట్.. మరుసటి మ్యాచ్‌లో మాత్రం 1993లో పాకిస్తాన్‌తో టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన హీత్ స్ట్రీక్.. తొలి మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే, రావల్పిండిలో జరిగిన రెండో మ్యాచ్‌లో ఏకంగా 8 వికెట్లు కూల్చి సత్తా చాటాడు. మొత్తంగా.. టెస్టుల్లో 1990.. వన్డేల్లో 2943 రన్స్ సాధించాడు. హరారే వేదికగా వెస్టిండీస్ మీద టెస్టు మ్యాచ్‌లో ఓ సెంచరీ(127- నాటౌట్) కూడా సాధించాడు. టీమిండియాను ఓడించి.. హీత్ స్ట్రీక్ సారథ్యంలోని జింబాబ్వే జట్టు 2001లో టీమిండియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. ఇక వరల్డ్‌కప్-2003లోనూ జట్టును ముందుండి నడిపించాడు. స్ట్రీక్ కెప్టెన్సీలో నాడు జింబాబ్వే సూపర్ సిక్స్‌కు అర్హత సాధించింది. PC: Twitter కోచ్‌గా ఐపీఎల్‌లోనూ.. 2005లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన హీత్ స్ట్రీక్.. కోచ్‌గా కొత్త అవతారమెత్తాడు. జింబాబ్వేతో పాటు స్కాట్లాండ్, బంగ్లాదేశ్ జట్లకు మార్గదర్శనం చేశాడు. ఐపీఎల్లో గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కూడా కోచ్‌గా పనిచేశాడు హీత్ స్ట్రీక్. అంతకుముందు.. వార్విక్షైర్ కెప్టెన్‌గా 2006లో రెండేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్న స్ట్రీక్.. వ్యక్తిగత కారణాల వల్ల పూర్తికాలం పాటు సారథిగా సేవలు అందించలేకపోయాడు. దురదృష్టవశాత్తూ క్యాన్సర్ బారిన పడ్డాడు హీత్ స్ట్రీక్. చదవండి: వరల్డ్‌కప్ జట్టులో రోహిత్ వద్దంటూ.. ధోని అతడి కోసం పట్టుబట్టాడు! వెంటనే కోచ్.. -
Gary Ballance: రెండు దేశాల తరఫున సెంచరీలు.. ఎన్నో ఆసక్తికర విశేషాలు
WI VS ZIM 1st Test: 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో జింబాబ్వే క్రికెటర్ గ్యారీ బ్యాలెన్స్ (137 నాటౌట్) అజేయ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. ఈ సెంచరీతో బ్యాలెన్స్ పలు అరుదైన రికార్డులను నెలకొల్పాడు. అరంగేట్రం టెస్ట్‌లోనే శతకం బాదిన 24వ క్రికెటర్‌గా, రెండు దేశాల తరఫున సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా (కెప్లర్ వెసెల్స్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తరఫున) రికార్డు పుటల్లోకెక్కాడు. బ్యాలెన్స్ ఈ రికార్డులు సాధించే క్రమంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. జింబాబ్వేలోనే పుట్టి పెరిగిన బ్యాలెన్స్ తొలుత తన సొంత దేశం తరఫున కాకుండా ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 33 ఏళ్ల బ్యాలెన్స్ ఇంగ్లండ్ తరఫున 23 టెస్ట్‌లు, 18 వన్డేల్లో 37.5 సగటున 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీల సాయంతో 1498 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ జట్టు తరఫున అవకాశాలు రాకపోవడంతో సొంత గూటికి చేరుకున్న బ్యాలెన్స్ అరంగేట్రం టెస్ట్‌లోనే సెంచరీ బాదాడు. ఇక్కడ మరో ఆసక్తికర విషయమేమిటంటే.. బ్యాలెన్స్ 8 ఏళ్ల కిందట తన చివరి టెస్ట్ సెంచరీని వెస్టిండీస్‌పైనే సాధించాడు. ఆ మ్యాచ్‌లో ప్రత్యర్ధి జట్టులో శివ్‌నరైన్ చంద్రపాల్ ఉండగా.. ప్రస్తుతం బ్యాలెన్స్ సెంచరీ బాదిన మ్యాచ్‌లో శివ్‌నరైన్ చంద్రపాల్ కొడుకు తేజ్‌నరైన్ చంద్రపాల్ ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో తేజ్‌నరైన్ అజేయమైన డబుల్ సెంచరీ బాది తన తండ్రి అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్‌ను అధిగమించాడు. ఇదిలా ఉంటే, విండీస్-జింబాబ్వే మధ్య జరుగుతున్న మ్యాచ్ డ్రా దిశగా సాగుతుంది. ఆట చివరి రోజు విండీస్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదిస్తూ.. జింబాబ్వే 4 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. ఆటలో చివరి సెషన్ మాత్రమే మిగిలింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం కష్టం. గ్యారీ బ్యాలెన్స్ (10), తఫడ్జా సిగా (10) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 447 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 203 పరుగులు చేసింది. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 379 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో తేజ్‌నరైన్ చంద్రపాల్ అజేయమైన 207 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ 182 రన్స్ చేశాడు. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో బ్యాలెన్స్ సెంచరీ చేయగా.. బ్రాండన్ మవుటా (56) అర్ధ శతకంతో రాణించాడు. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో రీఫర్ (58), బ్లాక్‌వుడ్ (57) హాఫ్ సెంచరీలతో రాణించగా.. జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో చాము చిబాబా (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
చరిత్ర సృష్టించిన జింబాబ్వే క్రికెటర్.. అత్యంత అరుదైన ఘనత సొంతం
జింబాబ్వే క్రికెటర్ గ్యారీ బాలెన్స్ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. రెండు దేశాల (ఇంగ్లండ్, జింబాబ్వే) తరఫున టెస్ట్ క్రికెట్ ఆడిన 16వ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. బ్యాలెన్స్ తొలుత పరాయి దేశం (ఇంగ్లండ్) తరఫున ఆడి, ఆతర్వాత సొంత దేశానికి ఆడటం. చరిత్రలో ఇలా ఓ క్రికెటర్ తొలుత ఇతర దేశానికి, ఆతర్వాత సొంత దేశానికి ఆడటం ఇదే మొదటిసారి. రెండు దేశాల తరఫున టెస్ట్ క్రికెట్ ఆడిన 15 మంది క్రికెటర్లు తొలుత సొంత దేశం తరఫున.. ఆతర్వాత వివిధ కారణాల చేత ఇతర దేశాల తరఫున ఆడారు. బ్యాలెన్స్ పుట్టి, పెరిగి, విద్యనభ్యసించింది జింబాబ్వేలోనే. అయితే బ్యాలెన్స్ 2006లో తన తాతముత్తాతల దేశమైన బ్రిటన్‌కు వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. ఇంగ్లండ్ తరఫున క్రికెట్ ఆడాలని కలలు కన్న బ్యాలెన్స్.. ఆ క్రమంలో కౌంటీల్లో సత్తా చాటి 2013లో ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అప్పటి నుంచి నాలుగేళ్లపాటు (2017 వరకు) ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన బ్యాలెన్స్.. ఆతర్వాత ఫామ్ కోల్పోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. ఆతర్వాత యువ ఆటగాళ్లు జట్టులో స్థానాలను సుస్థిరం చేసుకోవడంతో బ్యాలెన్స్‌కు అవకాశాలు రాలేదు. దీంతో అతను తిరిగి సొంతగూటికి (జింబాబ్వే) చేరాడు. వెస్టిండీస్‌తో నిన్న (ఫిబ్రవరి 4) మొదలైన టెస్ట్ మ్యాచ్ ద్వారా బ్యాలెన్స్ జింబాబ్వే తరఫున టెస్ట్ అరంగేట్రం చేశాడు. 33 ఏళ్ల బ్యాలెన్స్ ఇంగ్లండ్ తరఫున 23 టెస్ట్‌లు, 18 వన్డేలు ఆడాడు. టెస్ట్‌ల్లో బ్యాలెన్స్‌ను మంచి రికార్డు ఉంది. బ్యాలెన్స్ 37.5 సగటున 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీల సాయంతో 1498 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. వర్షం కారణంగా పలుమార్లు అంతరాయం కలిగిన తొలి మ్యాచ్‌లో విండీస్ టీమ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 112 పరుగులు చేసింది. ఓపెనర్లు టగెనరైన్ చంద్రపాల్ (55), క్రెయిగ్ బ్రాత్‌వైట్ (55) అజేయమైన అర్ధసెంచరీలతో క్రీజ్‌లో ఉన్నారు. రెండు దేశాల తరఫున టెస్టులు ఆడిన క్రికెటర్లు.. బిల్లీ మిడ్ వింటర్ (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) విలియమ్ లాయిడ్ ముర్డాక్ (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) జె జె ఫెర్రిస్ (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) సామీ వుడ్స్ (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) ఫ్రాంక్ హియర్న్ (ఇంగ్లండ్, సౌతాఫ్రికా) అల్బర్ట్ ట్రాట్ (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) ఫ్రాంక్ మిచెల్ (ఇంగ్లండ్, సౌతాఫ్రికా) ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడి (ఇంగ్లండ్, ఇండియా) గుల్ మహ్మద్ (ఇండియా, పాకిస్తాన్) అబ్దుల్ హఫీజ్ కర్దార్ (ఇండియా, పాకిస్తాన్) అమీర్ ఇలాహి (ఇండియా, పాకిస్తాన్) సామీ గుయిలెన్ (వెస్టిండీస్, న్యూజిలాండ్) జాన్ ట్రైకోస్ (సౌతాఫ్రికా, జింబాబ్వే) కెప్లర్ వెసల్స్ (ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా) బాయ్డ్ రాంకిన్ (ఇంగ్లండ్, ఐర్లాండ్) గ్యారీ బ్యాలెన్స్ (ఇంగ్లండ్, జింబాబ్వే) -
చచ్చీ చెడీ గెలిచారు!
♦ రాయుడు వీరోచిత సెంచరీ ♦ తొలి వన్డేలో భారత్ విజయం ♦ ఓడినా ఆకట్టుకున్న జింబాబ్వే ♦ చిగుంబురా శతకం వృథా ఆ ఏముందిలే... జింబాబ్వే జట్టేగా..! అంటూ ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో వెళ్లిన భారత్ తొలి వన్డేలో ఉలిక్కి పడింది. సొంతగడ్డపై జింబాబ్వే క్రికెటర్లు అద్భుతంగా పోరాడి భారత్‌కు ముచ్చెమటలు పట్టించారు. అన్ని విభాగాల్లోనూ ఢీ అంటే ఢీ అనే తరహాలో పోరాడారు. ఫలితంగా రహానే సేన తొలి వన్డేలో చచ్చీ చెడీ నాలుగు పరుగులతో గట్టెక్కింది. తెలుగుతేజం అంబటి రాయుడు అమోఘమైన ఇన్నింగ్స్‌తో అజేయ సెంచరీ చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. హరారే : బంగ్లాదేశ్ చేతిలో సిరీస్ ఓడి విమర్శలపాలైన భారత్... మరో ఘోర పరాజయం నుంచి తృటిలో తప్పించుకుంది. జింబాబ్వే కెప్టెన్ ఎల్టన్ చిగుంబురా (101 బంతుల్లో 104 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) ఎదురుదాడికి బెంబేలెత్తిన టీమిండియా... చివర్లో తేరుకుని మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. తెలుగుతేజం అంబటి తిరుపతి రాయుడు (133 బంతుల్లో 124 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్), స్టువర్ట్ బిన్నీ ((76 బంతుల్లో 77; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 4 పరుగుల స్వల్ప తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. మొదట భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 255 పరుగులు చేసింది. తర్వాత జింబాబ్వే 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసి ఓడింది. ఆదుకున్న రాయుడు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలో జింబాబ్వే బౌలర్లు ఝలక్ ఇచ్చారు. ఓపెనర్లలో మురళీ విజయ్ (1) తొందరగా అవుటైనా.. రహానే (49 బంతుల్లో 34; 5 ఫోర్లు), రాయుడు నెమ్మదిగా ఆడారు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. అయితే రహానే అవుటైన తర్వాత స్వల్ప విరామాల్లో మనోజ్ తివారీ (2), ఉతప్ప (0), కేదార్ జాదవ్ (5)లు వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో భారత్ 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తడబడింది. ఈ దశలో రాయుడు, బిన్నీలు నాణ్యమైన ఇన్నింగ్స్‌తో చెలరేగారు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నెమ్మదిగా పరుగులు జోడిస్తూ పోయారు. 29వ ఓవర్లో 72 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన రాయుడు ఆ తర్వాత మరింత బాధ్యతగా ఆడాడు. మరోవైపు క్రీమర్ బౌలింగ్‌లో బిన్నీ భారీ హిట్టింగ్‌కు తెరలేపడంతో స్కోరు బోర్డు వేగంగా కదిలింది. 63 బంతుల్లో బిన్నీ అర్ధ సెంచరీ పూర్తి చేయగా, రాయుడు 117 బంతుల్లో శతకాన్ని నమోదు చేశాడు. ఈ ఇద్దరు ఆరో వికెట్‌కు 160 పరుగులు జోడించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. తిరిపానో, చిబాబా చెరో రెండు వికెట్లు తీశారు. చిగుంబురా పోరాటం భారీ లక్ష్యం కళ్లముందున్నా... జింబాబ్వే ఆటగాళ్లు స్ఫూర్తిదాయకమైన ఆటతీరుతో చెలరేగారు. 47 పరుగులకే ఓపెనర్లిద్దరూ అవుటైనా... పెద్దగా తడబడకుండా ఇన్నింగ్స్‌ను నిర్మించారు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన చిగుంబురా యాంకర్ పాత్రతో ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. మసకద్జా (34)తో కలిసి మూడో వికెట్‌కు 42, రజా (37)తో కలిసి నాలుగో వికెట్‌కు 48 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. భారత బౌలర్ల విజృంభణకు ఓ దశలో జింబాబ్వే 160 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. కానీ లోయర్ ఆర్డర్లో క్రెమెర్ (27) సాయంతో చిగుంబురా టీమిండియా బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. ఏడో వికెట్‌కు ఏకంగా 86 పరుగులు జోడించి భారత్ శిబిరంలో ఆందోళన కలిగించాడు. అయితే చివరి 12 బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన దశలో క్రెమెర్ను ధవల్ అవుట్ చేయగా, భువనేశ్వర్ ఆఖరి ఓవర్‌ను కట్టుదిట్టంగా వేసి అనూహ్య ఓటమిని అడ్డుకున్నాడు. బిన్నీ, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే ఆదివారం జరుగుతుంది. 2 రాయుడు కెరీర్లో ఇది రెండో సెంచరీ. గతేడాది లంకపై తొలి శతకం సాధించాడు. 160 రాయుడు, బిన్నీ ఆరో వికెట్‌కు నెలకొల్పిన భాగస్వామ్యం. వన్డేల్లో ఈ వికెట్‌కు భారత్‌కు ఇదే అత్యుత్తమం. గతంలో జింబాబ్వేపై ధోని, యువరాజ్ 158 పరుగులు జోడించారు. 124 (నాటౌట్) వన్డేల్లో రాయుడుకు ఇదే అత్యధిక స్కోరు స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రహానే (సి) మసకద్జా (బి) తిరిపానో 34; విజయ్ (సి) సిబండా (బి) విటోరి 1; రాయుడు నాటౌట్ 124; మనోజ్ తివారీ ఎల్బీడబ్ల్యూ(బి) చిబాబా 2; ఉతప్ప రనౌట్ 0; జాదవ్ (సి) ముత్తుబామి (బి) చిబాబా 5; బిన్నీ (సి) ముత్తుబామి (బి) తిరిపానో 77; అక్షర్ పటేల్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (50 ఓవర్లలో 6 వికెట్లకు) 255. వికెట్ల పతనం: 1-9; 2-60; 3-74; 4-77; 5-87; 6-247. బౌలింగ్: పన్యాగరా 9.2-1-53-0; విటోరి 9-0-63-1; తిరిపానో 8.4-1-48-2; చిబాబా 10-2-25-2; క్రెమెర్ 10-0-47-0; సీన్ విలియమ్స్ 3-0-17-0. జింబాబ్వే ఇన్నింగ్స్: సిబండా (సి) హర్భజన్ (బి) బిన్నీ 20; చిబాబా (సి) రహానే (బి) భువనేశ్వర్ 3; మసకద్జా (సి) తివారీ (బి) అక్షర్ 34; చిగుంబురా నాటౌట్ 104; విలియమ్స్ (బి) అక్షర్ 0; రజా (సి) అక్షర్ (బి) హర్భజన్ 37; ముత్తుబామి (సి) హర్భజన్ (బి) బిన్నీ 7; క్రెమెర్ (సి) బిన్నీ (బి) ధవల్ 27; తిరిపానో నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: (50 ఓవర్లలో 7 వికెట్లకు) 251. వికెట్ల పతనం: 1-16; 2-47; 3-89; 4-94; 5-142; 6-160; 7-246. బౌలింగ్: భువనేశ్వర్ 10-1-35-1; ధవల్ 9-0-60-1; బిన్నీ 10-0-54-2; హర్భజన్ 10-0-46-1; అక్షర్ పటేల్ 10-1-41-2; మనోజ్ తివారీ 1-0-6-0. -
జింబాబ్వే క్రికెటర్ల తిరుగుబాటు
హరారే: జింబాబ్వే క్రికెటర్లు తమ బోర్డుపై తిరుగుబాటుకు దిగారు. తమకు రావాల్సిన వేతనాలను వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో శనివారం పాకిస్థాన్‌తో జరగాల్సిన కీలక వన్డే ఆడేది లేదని అల్టిమేటం జారీ చేశారు. వాస్తవానికి జట్టు ఆటగాళ్లకు ఈనెల 28న బకాయిలు చెల్లిస్తామని, శుక్రవారం బ్యాంకు ఖాతాల్లో చూసుకోవచ్చని జింబాబ్వే క్రికెట్ బోర్డు ఇంతకుముందు ప్రకటించింది. అయినా తమ ఖాతాలో డబ్బులు జమ కాకపోవడంతో ఆటగాళ్లు ప్రాక్టీస్‌ను బాయ్‌కాట్ చేశారు. పాక్‌తో సిరీస్‌కు ముందు ఆటగాళ్లు తమ సమస్యల పరిష్కారం కోసం ఓ సంఘంగా ఏర్పడ్డారు.