Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Pinnelli Villagers Meets YSRCP President YS Jagan Mohan Reddy1
బహిష్కరణకు గురైన కుటుంబాలకు అండగా వైఎస్ జగన్‌

తాడేపల్లి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసే మంచి ఏమీ లేకపోయినా కక్ష సాధింపు చర్యలు మాత్రం తీవ్రతరమవుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే పల్నాడు జిల్లా పిన్నెళ్లి గ్రామంలోని 400 కుటుంబాలపై బహిష్కరణ వేటు వేసింది. బహిష్కరణకు గురైన వారంతా ఎస్సీ, బీసీ, మైనార్టీలే. గురువారం తాడేప‌ల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామస్తులు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. బహిష్కరణకు గురైన పిన్నెళ్లి గ్రామంలోని కుటుంబాలకు అండగా నిలిచారు వైఎస్‌ జగన్‌ఈ క్రమంలోనే అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు వైఎస్‌ జగన్‌. గ్రామంలోకి వస్తే తమను చంపుతామని బెదిరిస్తున్నారని వారు వైఎస్‌ జగన్‌కు విన్నవించుకున్నారు. వీరికి వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. దీనిలో భాగంగా ‘చలో పిన్నెళ్లి’ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ‘ సిద్ధమైంది. రెండు నెలల్లో చలో పిన్నెళ్లి’ కార్యక్రమం చేపట్టాలని వైఎస్సార్‌సీపీ‘ నిర్ణయించింది. వైఎస్‌ జగన్‌ను కలిసిన వారిలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సహా పిన్నెల్లి, తురకపాలెం, మాదెనపాడు, చెన్నాయపాలెం గ్రామస్తులున్నారు.

MLA Jagadish Reddy Suspended From The House2
అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి సస్పెన్షన్‌

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి (Jagadish Reddy) సస్పెన్షన్‌ గురయ్యారు. ఆయన్ను సభ నుంచి సస్పెండ్‌ చేస్తూ అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ నిర్ణయం తీసుకున్నారు. గురువారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశిస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంపై దుమారం చెలరేగింది. దీంతో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు జగదీష్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. మధ్యాహ్నం వరకు ఇదే అంశంపై చర్చ జరిగింది. ఆ సమయంలో అసెంబ్లీ వాయిదా పడింది. దీంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు.. స్పీకర్‌ను ఉద్దేశిస్తూ జగదీష్‌ రెడ్డి మాట్లాడిన వీడియోని వీక్షించారు.తిరిగి మధ్యాహ్నం సభ ప్రారంభం కావడంతో జగదీష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు, మంత్రులు డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా.. ఏ తప్పు చేయకపోయినా కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సంపత్‌ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎథిక్స్‌ కమిటీకి సిఫార్స్‌లు చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డిని సభ నుంచి సస్పెండ్‌ చేశారు. బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్‌ కొనసాగుతుందని అసెంబ్లీలో ప్రకటించారు. సస్పెండ్‌ అయిన సభ్యుడిని బయటకు పట్టాలని ఆదేశించారు. స్పీకర్‌ గురించి జగదీష్‌ రెడ్డి ఏం మాట్లాడారంటే?తొలుత జగదీష్‌ రెడ్డి స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘ఈ సభ అందరిదీ.. సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. మా అందరి తరఫున పెద్ద మనిషిగా, స్పీకర్‌గా మీరు కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కాదు’’ అని వ్యాఖ్యానించారు.

Relief for Posani Krishna Murali in AP High Court3
ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట

సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. తనపై బాపట్ల పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును క్వాష్‌ చేయాలంటూ హైకోర్టులో పోసాని పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. BNS 35(3) సెక్షన్‌ను ఫాలో కావాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.కాగా, పోసానిని సీఐడీ పోలీసులు నిన్న (బుధవారం) రాత్రి( గుంటూరులో ఎక్సైజ్‌ కోర్టు న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరు పరిచారు. ఈ సందర్భంగా పోసాని అనారోగ్య సమస్యల గురించి విన్నవించుకున్నారు. బెయిల్‌ రాకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని పోసాని కృష్ణమురళి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులకు సంబంధించి తనకు ఎటువంటి పాపం తెలియదని, తానేం చేయలేదని న్యాయమూర్తి ఎదుట బోరున విలపించారు.నిజం మాట్లాడినందుకు తన మీద కక్ష కట్టి ఇలాంటి అన్యాయమైన కేసులు పెట్టారని విన్నవించారు. తల్లి మీద, పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నానని తనకే పాపమూ తెలియదని న్యాయమూర్తిని వేడుకొన్నారు. బెయిల్‌ ఇవ్వాలని కోరారు. వయసు మీదపడడంతో కూర్చోలేక పోతున్నానని చెప్పుకొచ్చారు. పోలీసులు ఎక్కడినుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియడం లేదని, ఇప్పటికే కొన్ని వందల మైళ్లు ప్రయాణం చేయించారని, ఎందుకు నన్ను తిప్పుతున్నారో అర్థం కావడం లేదని, ఇలా చేస్తే తాను ఎక్కువ రోజులు బతకనని మొరపెట్టుకున్నారు.టీడీపీలోకి రమ్మంటే రానందుకు లోకేశ్‌ తనను వేధిస్తున్నారని, నంది అవార్డుల ప్రకటనలో పక్షపాతాన్ని ఎత్తిచూపడంతో కక్ష కట్టారని తెలిపారు. అన్నీ నిజాలే చెబుతున్నానని నార్కో ఎనాలసిస్‌ టెస్టుకూ సిద్ధమన్నారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే ఇన్ని కేసులు కడతారా అని ఆవేదన వ్యక్తం చేశారు.

No Pakistan Player Picked In Hundred League Draft4
పాకిస్తాన్‌ క్రికెటర్లకు ఘోర అవమానం

పాకిస్తాన్‌ క్రికెటర్లకు ఘెర అవమానం జరిగింది. నిన్న (మార్చి 12) జరిగిన హండ్రెడ్‌ లీగ్‌ డ్రాఫ్ట్‌లో ఆ దేశానికి చెందిన ఒక్క క్రికెటర్‌ కూడా అమ్ముడుపోలేదు. మీడియా కథనం ప్రకారం హండ్రెడ్‌ లీగ్‌-2025 డ్రాఫ్ట్‌లో (వేలం) పాకిస్తాన్‌కు చెందిన 45 మంది పురుషులు, 5 మంది మహిళా క్రికెటర్లు పాల్గొన్నారు. వీరిలో ఒక్కరిపై కూడా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. గత సీజన్‌లో అత్యధిక ధర పలికిన పాక్‌ ఆటగాడు నసీం షాను ఈ సీజన్‌లో ఫ్రాంచైజీలు కన్నెత్తి కూడా చూడలేదు. గత సీజన్‌లో మంచి ధర దక్కించుకున్న ఇమాద్‌ వసీం, సైమ్‌ అయూబ్‌, షాదాబ్‌ ఖాన్‌, హసన్‌ అలీ, మహ్మద్‌ హస్నైన్‌ను ఫ్రాంచైజీలు తిరస్కరించాయి. పాక్‌ ఆటగాళ్లకు ఈ గతి పట్టడానికి వారి ఫామ్‌లేమితో పాటు మరో కారణం కూడా ఉంది. ఈ ఏడాది హండ్రెడ్‌ లీగ్‌లో ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు పెట్టుబడులు పెట్టాయి. ఎనిమిదింట నాలుగు ఫ్రాంచైజీలను ఐపీఎల్‌ ఫ్రాంచైజీల యజమానులు కొనుగోలు చేశారు. భారతీయ పెట్టుబడులు ఉండటం చేతనే హండ్రెడ్‌ ఫ్రాంచైజీలు పాక్‌ ఆటగాళ్లను ఎంపిక చేయలేదని టాక్‌ నడుస్తుంది. హండ్రెడ్‌ లీగ్‌లో పాక్‌ ఆటగాడు ఉసామా మిర్‌ అత్యధికంగా 13 మ్యాచ్‌లు ఆడాడు. హరీస్‌ రౌఫ్‌ 12, ఇమాద్‌ వసీం 10, మహ్మద్‌ అమిర్‌ 6, షాహీన్‌ అఫ్రిది 6, మహ్మద్‌ హస్నైన్‌ 5, జమాన్‌ ఖాన్‌ 5, షాదాబ్‌ ఖాన్‌ 3, వాహబ్‌ రియాజ్‌ 2 మ్యాచ్‌లు ఆడారు.బ్రేస్‌వెల్‌, నూర్‌ అహ్మద్‌కు జాక్‌పాట్‌హండ్రెడ్‌ లీగ్‌-2025 డ్రాఫ్ట్‌లో (వేలం) న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, ఆఫ్ఘనిస్తాన్‌ యువ స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌ జాక్‌పాట్‌ కొట్టారు. ఈ ఇద్దరు ఊహించని ధర 2 లక్షల పౌండ్లకు (రూ. 2.26 కోట్లు) అమ్ముడుపోయారు. బ్రేస్‌వెల్‌ను గత సీజన్‌ రన్నరప్‌ సధరన్‌ బ్రేవ్‌ దక్కించుకోగా.. నూర్‌ అహ్మద్‌ను మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ సొంతం చేసుకుంది.డ్రాఫ్ట్‌లో బ్రేస్‌వెల్‌, నూర్‌ అహ్మద్‌తో పాటు మరో ఇద్దరు ఇంగ్లండ్‌ ఆటగాళ్లు కూడా 2 లక్షల పౌండ్లకు (రూ. 2.26 కోట్లు) అమ్ముడుపోయారు. ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్‌ను లండన్‌ స్పిరిట్‌.. మరో ఆల్‌రౌండర్‌ డేవిడ్‌ విల్లేను ట్రెంట్‌ రాకెట్స్‌ సొ​ంతం చేసుకున్నాయి.నిన్నటి డ్రాఫ్ట్‌లో మరో మేజర్‌ సైనింగ్‌ ఆసీస్‌ వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌. గతేడాది డ్రాఫ్ట్‌లో అమ్ముడుపోని వార్నర్‌ను ఈసారి లండన్‌ స్పిరిట్‌ 1.2 లక్షల పౌండ్లకు (రూ. 1.35 కోట్లు) సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీ హీరో రచిన్‌ రవీంద్రను మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ ఇదే ధరకు (1.2 లక్షల పౌండ్లు) దక్కించుకుంది.ఈసారి డ్రాఫ్ట్‌కు అందుబాటులో ఉండిన ఇంగ్లండ్‌ మాజీ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌కు చుక్కెదురైంది. ఆండర్సన్‌ను డ్రాఫ్ట్‌లో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.మహిళల డ్రాఫ్ట్‌ విషయానికొస్తే.. సోఫి డివైన్‌, జార్జియా వాల్‌, పెయిజ్‌ స్కోల్‌ఫీల్డ్‌ మంచి ధరలు దక్కించుకున్నారు. పురుషులు, మహిళల డ్రాఫ్ట్‌లో మొత్తం 66 మంది ప్లేయర్లు అమ్ముడుపోయారు. ఈ డ్రాఫ్ట్‌ తర్వాత కూడా ఫ్రాంచైజీలకు వైల్డ్‌కార్డ్‌ డ్రాఫ్ట్‌ ద్వారా ప్లేయర్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ద హండ్రెడ్‌ లీగ్‌-2025 (పురుషులు, మహిళలు) ఆగస్ట్‌ 5 నుంచి ప్రారంభం కానుంది. లార్డ్స్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో లండన్‌ స్పిరిట్‌, ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌ తలపడతాయి.

BRS Harish Rao Reacts On Jagadish Reddy Speaker Row5
అవసరమైతే స్పీకర్‌పై అవిశ్వాసం పెడతాం: హరీష్‌ రావు

హైదరాబాద్‌, సాక్షి: స్పీకర్‌ను ‘మీ’ అని సంబోధించడం.. అవమానించడం ఎలా అవుతుంది? అని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌ రావు అంటున్నారు. గురువారం అసెంబ్లీలో జరిగిన పరిణామాలు.. జగదీష్‌రెడ్డి అంశంపై తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను జగదీష్‌రెడ్డి అవమానించలేదు. సభ మీ ఒక్కరిది కాదు.. అందరిదీ అన్నారు. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధమేమీ కాదు. అదేం అన్‌పార్లమెంటరీ పదమూ కాదు. కాంగ్రెస్‌ పార్టీ డిఫెన్స్‌లో పడింది. స్పీకర్‌ను కలిసి రికార్డులు తీయాలని అడిగాం. పదిహేను నిమిషాలు ఎదురు చూసినా.. ఆయన వీడియో రికార్డులు చూపించలేదు. అసలు సభ ఎందుకు వాయిదా వేశారో కూడా తెలియదు. స్పీకర్‌ గనుక ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించకపోతే.. అవిశ్వాసం పెట్టడానికైనా మేం సిద్ధం’’ అని హరీష్‌రావు అన్నారు. సభలో సభ్యులందరికీ సమానమైన హక్కులు ఉంటాయని సీనియర్‌ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ అంటే మాకు అపారమైన గౌరవం ఉంది. కానీ, కాంగ్రెస్ నేతలు మాట్లాడే మాటలు విచిత్రంగా ఉన్నాయి అని అన్నారాయన. మరోవైపు.. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. స్పీకర్ అందరికి సమానం.. అందరి తరఫున సభలో కూర్చున్నారని జగదీష్ రెడ్డి అన్నారు మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.. అందుకే స్పీకర్‌ కుర్చీతో డైవర్షన్‌ పాలిటిక్స్‌కు దిగింది అని ప్రశాంత్‌ రెడ్డి విమర్శించారు. ఇదీ చదవండి: స్పీకర్‌పై జగదీష్‌రెడ్డి వ్యాఖ్యలు.. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

Target 95% EVs By 2027, Delhi EV Policy 2.06
పెట్రోల్, డీజిల్ కార్ల కథ ముగిసినట్టే?.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసా..

2027 నాటికి ఢిల్లీలో తిరిగే వాహనాలలో 95 శాతం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండాలని, దీనికోసం ప్రభుత్వం ఈవీ పాలసీ 2.0 ప్రారంభించింది. ఈ పాలసీ కింద దశల వారీగా ఫ్యూయెల్ వాహనాల సంఖ్యను తగ్గించడానికి కృషి చేస్తామని రవాణా మంత్రి పంకజ్ కుమార్ సింగ్ వెల్లడించారు.వేగంగా అభివృద్ధి చెందుతున్న ఢిల్లీ నగరం.. కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. దీనిని నివారించాలంటే.. ఫ్యూయెల్ వాహన స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావాలి. ఇందులో భాగంగానే.. ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, చిన్న కమర్షియల్ వాహనాలను మాత్రమే కాకుండా CNGతో నడిచే వాహనాల సంఖ్యను తగ్గించనున్నారు. ప్రజా రవాణా కోసం కూడా ఎలక్ట్రిక్ బస్సులనే ఉపయోగించనున్నట్లు చెబుతున్నారు.ఢిల్లీ ఈవీ పాలసీ 2.0ను ప్రోత్సహించడానికి.. ప్రభుత్వం ప్రోత్సాహకాలను కూడా అందించనుంది. ఇవి ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్స్, ట్రక్కులు మొదలైనవాటికి వరిస్తాయి. స్క్రాపేజ్ కింద కూడా కొన్ని ప్రోత్సాహకాలను అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. పాత వాహనాన్ని స్క్రాప్ చేస్తే.. కొత్త వెహికల్ కొనుగోలుపై కొన్ని రాయితీలు లభిస్తాయి.ఇదీ చదవండి: గుట్టు విప్పిన ఐటీ శాఖ: అలాంటి వారికి ట్యాక్స్ నోటీసులు?ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలంటే.. మౌలిక సదుపాయాలను పెంచాలి. దీని కోసం ఢిల్లీ ప్రభుత్వం ఛార్జింగ్ స్టేషన్లను పెంచనుంది. కొత్త భవనాలు, బహిరంగ ప్రదేశాలకు ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది. మొత్తం మీద 2027 నాటికి ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను గణనీయంగా పెంచాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం 'ఈవీ పాలసీ 2.0' ప్రారంభించింది.

Court: State Vs A Nobody Movie Review In Telugu7
Court Movie Review: నాని ‘కోర్ట్‌’ మూవీ రివ్యూ

టైటిల్‌:'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' నటీనటులు: ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్‌, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి తదితరులుసమర్పణ: నానినిర్మాణ సంస్థ: వాల్ పోస్టర్ సినిమానిర్మాత: ప్రశాంతి తిపిర్నేనికథ, దర్శకత్వం: రామ్ జగదీష్సంగీతం: విజయ్ బుల్గానిన్సినిమాటోగ్రఫీ: దినేష్‌ పురుషోత్తమన్‌ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్విడుదల తేది: మార్చి 14, 2023హీరో నాని ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కొత్త చిత్రాలను నిర్మిస్తున్నాడు. వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌ ద్వారా కొత్త కంటెంట్‌తో పాటు కొత్త నటీనటులను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. తాజాగా ఆయన బ్యానర్‌లో తెరకెక్కిన చిత్రమే ‘కోర్ట్‌’. ‘‘కోర్ట్‌’ నచ్చకపోతే నా ‘హిట్‌ 3’సినిమా చూడకండి’ అంటూ నాని సవాల్‌ విసరడంతో ఈ చిన్న చిత్రంపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. అంతేకాదు రిలీజ్‌కి రెండు రోజుల ముందే మీడియాకు స్పెషల్‌ షో వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2013లో సాగుతుంది. విశాఖపట్నంలో మంగపతి(శివాజీ)కి మంచి రాజకీయ పలుకుబడి ఉంటుంది. తన మామయ్య(శుఖలేఖ సుధాకర్‌) ఇంట్లో కూడా తన పెత్తనమే సాగుతుంది. ఆడవాళ్లను తన హద్దుల్లో పెట్టుకోవాలనే మనస్తత్వం తనది. ఇంట్లో ఉన్న అమ్మాయిలు కాస్త తేడా దుస్తులు ధరించిన సహించలేడు. అలాంటి వ్యక్తికి తన కోడలు జాబిలి(శ్రీదేవి) ప్రేమ కథ తెలుస్తుంది. ఇంటర్‌ చదువుతున్న జాబిలి.. ఇంటర్‌ ఫెయిల్‌ అయి పార్ట్‌ టైం జాబు చేస్తున్న వాచ్‌మెన్‌ కొడుకు చంద్రశేఖర్‌ అలియాస్‌ చందు(రోషన్‌)తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం మంగపతికి తెలిసి.. తనకున్న పలుకుబడితో చందుపై పోక్సో కేసు పెట్టించి అరెస్ట్‌ చేయిస్తాడు. మరి ఈ కేసు నుంచి చందు ఎలా బయటపట్టాడు? జూనియర్‌ లాయర్‌ సూర్యతేజ(ప్రియదర్శి) ఎలాంటి సహాయం చేశాడు? అసలు పోక్సో చట్టం ఏం చెబుతోంది? ఈ చట్టాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకుల్ని ఎలా బలి చేస్తున్నారు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘కోర్ట్‌’ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని రాజ్యాంగం చెబుతోంది. కానీ అదే చట్టాలను కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకులను జైలుపాలు చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ‘కోర్ట్‌’ సినిమా చూస్తున్నంతసేపు అలాంటి ఘటనలు గుర్తుకొస్తూనే ఉంటాయి. చిన్న పిల్లల రక్షణ కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పోక్సో చట్టాన్ని కొంతమంది ఎలా మిస్‌ యూజ్‌ చేస్తున్నారు? ఇలాంటి పవర్‌ఫుల్‌ చట్టాలలో ఉన్న లొసుగులను పోలీసులతో పాటు ‘లా’ వ్యవస్థ ఎలా వాడుకుంటుంది? పోక్సో చట్టం ఎం చెబుతోంది? అందులో ఉన్న ప్లస్‌, మైనస్‌ పాయింట్స్‌ ఏంటి? తదితర విషయాలను ఈ చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు రామ్‌ జగదీష్‌.దర్శకుడు ఎంచుకున్న టాపిక్‌ చాలా సెన్సిబుల్‌. ఎక్కడ అసభ్యతకు తావులేకుండా చాలా నీట్‌గా ఆ టాపిక్‌ని చర్చించాడు. ఈ విషయంలో దర్శకుడిని ప్రశంసించాల్సిందే. అయితే కథనం మాత్రం ఊహకందేలా సాగించాడు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి సీన్‌ మన ఊహకందేలా సాగుతుంది. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది. అలాగే లవ్‌ స్టోరీని కూడా రొటీన్‌గానే చూపించాడు. కుర్రాడిపై పోక్సో కేసు నమోదైన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. బెయిల్‌ కోసం ప్రయత్నించిన ప్రతిసారి చట్టంలోని లొసుగులు ఉపయోగించి లాయర్‌ దాము(హర్ష వర్ధన్‌) అడ్డుపడే విధానం ఆకట్టుకుంటుంది. క్రాస్ ఎగ్జామినేషన్ అవన్ని అబద్దాలని తేలిపోతాయని తెలిసినా..తెరపై చూస్తుంటే ఆసక్తికరంగా అనిపిస్తాయి. సెకండాఫ్‌ మొత్తం కోర్టు వాదనల చుట్టే తిరుగుతుంది. కొన్ని చోట్ల ప్రియదర్శి వాదనలు ఆకట్టుకుంటాయి. చిన్నచిన్న ట్విస్టులు కూడా ఎంటర్‌టైన్‌ చేస్తాయి. ఎమోషనల్‌ సీన్లను బలంగా రాసుకున్నాడు. క్లైమాక్స్‌ లో లా వ్యవస్థను ప్రశ్నిస్తూ ప్రియదర్శి చెప్పే సంభాషలు ఆలోచింపజేస్తాయి. ఎవరెలా చేశారంటే.. ప్రియదర్శి నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్ర అయినా సరే నేచురల్‌ యాక్టింగ్‌తో అదరగొట్టేస్తాడు. జూనియర్‌ లాయర్‌ సూర్యతేజ పాత్రలో ఒదిగిపోయాడు. కోర్టులో ఆయన వినిపించే వాదలను ఆకట్టుకుంటాయి. పలు సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన హర్ష రోషన్‌ ఈ సినిమాలో చందు పాత్ర పోషించి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. జాబిలిగా కొత్తమ్మాయి శ్రీదేవి చక్కగా నటించింది. ఇక ఈ సినిమాలో బాగా పండిన పాత్ర శివాజీది అని చెప్పాలి. తెరపై ఆయన పండించిన విలనిజం సినిమా స్థాయిని పెంచేసింది. సాయి కుమార్‌, రోహిణి, శుభలేఖ సుధాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. విజయ్ బుల్గానిన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలమైంది. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

No One Talking About Him Aakash Chopra on Opportunity for SRH Star IPL 20258
అతడి గురించి ఎవరూ మాట్లాడమే లేదు.. మూడో స్థానంలో ఆడిస్తారా?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL) ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. జస్‌ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్యా మొదలు.. తాజాగా అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, హర్షిత్‌ రాణా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి లాంటి వాళ్లు ఇందుకు నిదర్శనం. అయితే, ఒకప్పుడు టీమిండియా స్టార్‌గా వెలిగి.. ఇప్పుడు జట్టులో చోటే కరువైన ప్లేయర్‌ ఇషాన్‌ కిషన్‌(Ishan Kishan).సెలక్టర్లు అతడిని పట్టించుకోవడం లేదుజాతీయ జట్టు ఓపెనర్‌గా చిన్న వయసులోనే ఓ వెలుగు వెలిగిన 26 ఏళ్ల ఇషాన్‌.. క్రమశిక్షణా రాహిత్యం వల్ల బోర్డు ఆగ్రహానికి గురయ్యాడు. ఫలితంగా టీమిండియాలో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం ఓపెనింగ్‌ స్థానంతో పాటు వికెట్‌ కీపర్‌గానూ సెలక్టర్లు అతడిని పరిగణనలోకి తీసుకునే పరిస్థితి లేదు.కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, సంజూ శాంసన్‌ కీపర్ల కోటాలో పాతుకుపోగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma)కు ఓపెనింగ్‌ జోడీగా శుబ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌ ఆయా ఫార్మాట్లలో కొనసాగుతున్నారు. అయితే, ఇషాన్‌ కిషన్‌కు ఐపీఎల్‌-2025 రూపంలో సువర్ణావకాశం వచ్చిందంటున్నాడు భారత మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా. రూ. 11.25 కోట్లకు కొనుగోలుక్యాష్‌ రిచ్‌ లీగ్‌ పద్దెమినిదవ ఎడిషన్‌లో సత్తా చాటితే మరోసారి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించవచ్చని పేర్కొన్నాడు. కాగా గతేడాది వరకు ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడిన ఇషాన్‌ను మెగా వేలానికి ముందు ఫ్రాంఛైజీ వదిలేసింది. ఈ క్రమంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు అతడిని ఏకంగా రూ. 11.25 కోట్లకు కొనుగోలు చేసింది.అయితే, రైజర్స్‌ జట్టులో ఇప్పటికే విధ్వంసకర ఓపెనింగ్‌ జోడీగా ట్రవిస్‌ హెడ్‌- అభిషేక్‌ శర్మ తమ స్థానాలు సుస్థిరం చేసుకున్నారు. గతేడాది జట్టు ఫైనల్‌ వరకు చేరడంలో ఈ ఇద్దరిది కీలక పాత్ర. కాబట్టి ఇషాన్‌ కిషన్‌కు ఓపెనర్‌గా ఛాన్స్‌ రాదు. టాపార్డర్‌లోనే ఉండాలంటే.. అతడు మూడో స్థానంలో ఆడాల్సిన పరిస్థితి.ఎవరూ కనీసం మాట్లాడటం లేదుఈ నేపథ్యంలో కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా మాట్లాడుతూ.. ‘‘ఇషాన్‌ కిషన్‌కు మరోసారి గొప్ప అవకాశం వచ్చింది. కారణమేదైనా టీమిండియా సెలక్టర్లు అతడిని అస్సలు పట్టించుకోవడం లేదు. రంజీల్లో ఆడి తనను తాను నిరూపించుకున్నాడు. పరుగులు చేశాడు.అయినా సరే అతడి ప్రాధాన్యాన్ని సెలక్టర్లు గుర్తించడం లేదు. అతడి గురించి ఎవరూ కనీసం మాట్లాడటం లేదు. జాతీయ జట్టులో స్థానం కోసం చేయాల్సిందంతా చేస్తున్నాడు. కానీ.. అసలు అతడి పేరు కూడా తెరమీదకు రావడం లేదు. వన్డేల్లో డబుల్‌ సెంచరీ చేయడం అందరికీ సాధ్యం కాదు.కానీ ఇషాన్‌ ఆ పని చేసి చూపించాడు. భారీ సిక్సర్లు బాదగల సమర్థత, మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపు తిప్పగల సత్తా అతడికి ఉన్నాయి. ఇక సన్‌రైజర్స్‌ అతడిని మూడో స్థానంలో ఆడించేందుకు తీసుకుందని తెలిసి నేను ఆశ్చర్యపోయాను.సద్వినియోగం చేసుకుంటేఓపెనర్ల కోటా ఖాళీ లేదు కాబట్టి వాళ్లకూ వేరే ఆప్షన్‌ లేదు. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో వేరే స్థానంలో ఆడి పరుగులు రాబట్టడం అంత తేలికేమీ కాదు. అయితే, ఇషాన్‌ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అతడికి తిరుగు ఉండదు.ప్రస్తుతం టీమిండియలో బ్యాటర్ల స్థానాలు ఫిక్స్‌డ్‌గా ఏమీ లేవు. ఏస్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయగల ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ భావిస్తున్నాడు. కాబట్టి ఇషాన్‌ ఐపీఎల్‌-2025లో సత్తా చాటితే కచ్చితంగా టీమిండియాలోకి రాగలడు’’ అని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.కాగా మార్చి 22 నుంచి ఐపీఎల్‌ ఆరంభం కానుండగా.. సన్‌రైజర్స్‌ మార్చి 23న తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. రాజస్తాన్‌ రాయల్స్‌తో హైదరాబాద్‌ వేదికగా తలపడనుంది.చదవండి: టీమిండియా ఆడకుంటే రూ. 45 కోట్ల నష్టం!

Tamil Nadu Replaces Rupee Symbol In State Budget 2025 269
రూపాయి చిహ్నం మార్చేసిన తమిళనాడు ప్రభుత్వం

జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు - కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం జరుగుతోంది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం 2025 - 26 బడ్జెట్‌లో సాధారణ రూపాయి చిహ్నానికి బదులుగా.. తమిళ చిహ్నంతో భర్తీ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కొత్త జాతీయ విద్యా విధానం ద్వారా 'హిందీ విధించడం'పై బీజీపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో.. అధికార డీఎంకే పోరాటం చేస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి చిహ్నం మార్చేసింది. ఈ మార్పుపై ఇప్పటివరకు తమిళనాడు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. తమిళనాడు చర్య భారతదేశంలో ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా ఉందని బీజేపీ ప్రతినిధి అన్నారు.అంతే కాకుండా తమిళంలో చదవడం, రాయడం వ‌చ్చి ఉంటేనే.. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని, మద్రాస్‌ హైకోర్టు మదురై బెంచ్‌ కీలక వ్యాఖ్యలు చేసింది.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ కార్ల కథ ముగిసినట్టే?.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసాతమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ''హిందీ, సంస్కృత ఆధిపత్యం కారణంగా ఉత్తర భారతదేశంలో 25 కంటే ఎక్కువ స్థానిక భాషలు కనుమరుగయ్యాయి. శతాబ్దాల నాటి ద్రవిడ ఉద్యమం అవగాహన, నిరసనల ద్వారా తమిళం.. దాని సంస్కృతిని రక్షించింది" అని ఆయన అన్నారు.

UK Girl Who Feels No Pain Hunger Or Fatigue10
కారు ఢీకొట్టి ఈడ్చుకెళ్లినా.. నొప్పి తెలియదట ఆమెకు..!

ఓ పట్టాన అంతుచిక్కని కొన్ని రకాల వ్యాధులు వైద్యులకు భలే గమ్మత్తైన సవాళ్లని విసురుతుంటాయి. ఒక్కోసారి అదెలా సాధ్యం అని వైద్యులకే చెమటలు పట్టించేస్తాయి. అచ్చం అలాంటి వైద్య పరిస్థితితోనే పోరాడుతోంది ఈ చిన్నారి. వైద్యపరంగా ఆమె ఓ అద్భుతంగా మారింది. ప్రతి వ్యక్తి మనుగడకు, ఆరోగ్యానికి ప్రధానమైన మూడు ప్రాథమిక అవసరాలు లేకుండానే బతికేస్తుంది ఆమె. మరీ ఆ చిన్నారి ఎలాంటి వైద్యపరిస్థితితో బాధపడుతోందంటే..యూకేకి చెందిన ఒలివియా పార్న్స్‌వర్త్‌ అనే అమ్మాయి అరుదైన జన్యుపరమైన సమస్యతో పోరాడుతోంది. ఆ ప్రత్యేకమైన పరిస్థితి కారణంగా వైజ్ఞానికంగా అద్భతమైన అమ్మాయిగా మారిందామె. ప్రపంచంలో ప్రతి మానవుడికి కీలమైన మూడు ప్రాథమిక అవసరాలు లేకుండానే జీవించగలదామె. సింపుల్‌గా చెప్పాలంటే ఆమె ఆ మూడు సవాళ్లను ఒకేసారి అధిగమించగల అసాధారణ అమ్మాయి. అంతెందుకు వైద్యులు కూడా ఆమెను ఓ ఆద్బుతంగా పరిగణించారు. ఏంటా వైద్యపరిస్థితి అంటే..ఒలివియాకి నొప్పి, ఆకలి, నిద్ర అనేవి ఉండవట. ఇది మనిషిలో ఉండే ఆరవ క్రోమోజోమ్‌లోని జన్యుపరమైన అసాధారణత ఫలితంగా ఆమెకు ఇలాంటి పరిస్థితని వైద్యలు భావిస్తున్నారు. ఒకరకంగా ఇది వరంలా కనిపించినా ఆమెకు ఈ పరిస్థితి ఆందోళనకరమైనదే అనే ఒలివియా తల్లి ఆవేదనగా చెప్పారు. ఈ మూడింటి ఫీలింగ్స్‌ ఆమెకు తెలియదు కాబట్టి ఏ క్షణంలో తనను తాను ఎలా గాయపరుచుకుంటుందో అనే భయపడుతూ బతకాల్సి వస్తోందంటూ కన్నీటి పర్యాంతమైంది ఒలివియా తల్లి. ఇక ఆమెకు ఆకలి ఉండదు కాబట్టి ఆమె పోషకాహార లోపంతో బాధపడకుండా మంచి ఆహారాన్ని ఇచ్చేలా పర్యవేక్షించక తప్పదని చెబుతోంది. అంతేగాదు ఒలివియాకు ఏడేళ్ల వయసులో జరిగిన ప్రమాదం గుర్తించేసుకుంటూ..నాడు తామంతా ఒలివియా పరిస్థితి చూసి కంగుతిన్నామని చెప్పింది. ఆమె చిన్నతనంలో ఓ కారు ఆమెను ఢీకొట్టి చాలాదూరం ఈడ్చుకుని వెళ్లిపోయిందని నాటి ఘటనను వివరించారు. ఒళ్లంతా నెత్తురోడుతున్న...ఆ ఆకస్మిక ఘటనకు మా కుటుంబం అంతా షాక్‌లో ఉండిపోయింది. కొద్దిపాటి మెరుపు వేగంలో తేరుకుని ఒలివియాను రక్షిద్దాం అనుకునేలోగా ..ఒలివియా ఏమి కానట్లుగా తనంతాట తానే లేచి తమ వద్దకు రావడంతో హుతాసులైపోయాం అంటూ నాటి సంఘటనను గుర్తుచేసుకున్నారామె. ఒంటినిండా గాయలైనా ఏం కానట్లు ఒలివియా ప్రవర్తించిన తీరు ఇప్పటికీ మర్చిపోలేనంటోంది తల్లి. "ఒలివియాకి నిద్ర కూడా ఓ సవాలు. ఎందుకంటే మందులు లేకుండా సహజంగా నిద్రపోలేదు. మనం గనుక మందులు వేయకపోతే అలా మూడు రోజుల వరకు మేల్కొనే ఉంటుందట. ఆ నిద్రలేమిని నిర్వహించేలే కఠినమైన నిద్ర సహాయాలను అనుసరిస్తున్నట్లు చెప్పారు". ఒలివియా తల్లి. ఆ అమ్మాయి పరిస్థితిని ఆస్పత్రి వారు బయోనిక్‌గా అబివర్ణించారు. ఈ అరుదైన కేసు జీవశాస్త్రం సంక్లిష్టతలు, జన్యుఉత్పరివర్తనాల ప్రభావంపై అంతర్‌దృష్టిని అందిస్తోందని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఆ అమ్మాయి కేసు తమ వైద్యానికే అంతపట్టని చిక్కుప్రశ్నలా ఉందన్నారు. ఒలివియా పరిస్థితిని ప్రపంచంలోనే అత్యంత అరుదైన వాటిలో ఒకటిగా పేర్కొన్నారు. నిజంగా ఆ అమ్మాయి పరిస్థితి వైద్య నిపుణులకేకాదు సాధారణ ప్రజలకు కూడా ఆశ్చర్యం కలిగించేలా ఉంది కదూ..!.(చదవండి: కిడ్నీలు పదిలమేనా..? మదుమేహం లేకపోయినా వస్తుందా..?)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
ప్రమాదంలో విద్యార్థుల భవిష్యత్‌.. పేపర్‌ లీకేజీలపై రాహుల్‌ ట్వీట్‌

ఢిల్లీ: ప్రశ్నాపత్రాల లీకేజీలను వ్యవస్థాగత వైఫల్యంగా కాంగ్రె

title
‘స్వార్‌గేట్‌’ కేసు : నిందితుడి పోలీసు కస్టడీ పొడిగింపు

‘స్వార్‌గేట్‌’అత్యాచారం కేసు నిందితుడికి కోర్టు మార్చి 26 వరకు పోలీసు కస్టడీ విధించింది.

title
రూపాయి చిహ్నం మార్చేసిన తమిళనాడు ప్రభుత్వం

జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు - కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం జరుగుతోంది.

title
నిర్మలమ్మ వ్యాఖ్యలకు విజయ్‌ కౌంటర్‌

చెన్నై: ద్రవిడ ఉద్యమ నేత, తమిళ సామాజికవేత్త పెరియార్‌పై కేంద

title
ఆ మహానగరంలో 11 అంతస్థుల రైల్వే స్టేషన్‌

ముంబై: భారతీయుల కలల నగరం ముంబై(

NRI View all
title
ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

title
భారత విద్యార్థుల చూపు.. ఆ దేశాలవైపు!

ఉన్నత విద్య కోసం అగ్ర రాజ్యాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.

title
సుదీక్ష మిస్సింగ్‌.. కిడ్నాపైందా?

న్యూఢిల్లీ: కరీబియన్‌ దేశం డొమినికన్‌ రిపబ్లిక్‌లో తెలుగు వి

title
టీటీఏ (TTA) న్యూయార్క్‌ చాప్టర్‌ రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపురి

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA)  న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి &

title
న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు

మహిళలకు  ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి  పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోస

Advertisement

వీడియోలు

Advertisement