Top Stories
ప్రధాన వార్తలు

దాయాది.. మళ్ళీ బరితెగింపు
దాయాది బుద్ధి మారలేదు. తొలిరోజు భారత్‌పై విరుచుకుపడేందుకు విఫలయత్నం చేసి చావుదెబ్బ తిన్న పాకిస్తాన్.. రెండోరోజూ సరిహద్దు ప్రాంతాలపై దాడులకు ప్రయతి్నంచింది. శుక్రవారం చీకట్లు పడుతూనే జమ్మూకశీ్మర్ మొదలు రాజస్తాన్ దాకా 26కుపైగా ప్రాంతాలపైకి క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. అయితే ఈ దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. వాటిని ఎక్కడివక్కడ కూల్చేస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా బ్లాకౌట్ కొనసాగుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో శ్రీనగర్ మొదలుకుని జో«ద్‌పూర్ దాకా పలు పట్టణాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఓవైపు దాడులకు తెగబడుతూనే, మరోవైపు భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఇరాన్, సౌదీ, ఇతర గల్ఫ్ దేశాలను పాక్ ప్రాధేయపడుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, త్రివిధ దళాధిపతులతో శుక్రవారం రాత్రి సమీక్షించారు. న్యూఢిల్లీ: సరిహద్దు ప్రాంతాలపై పాక్ దాడులు వరుసగా రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగాయి. చీకట్లు పడుతూనే జమ్మూ కశ్మీర్ మొదలుకుని రాజస్తాన్ దాకా 26కు పైగా ప్రాంతాల్లో దాయాది మరోసారి క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది. జమ్మూ కశ్మీర్‌లోని ఉరి, సాంబా, నౌగావ్, పూంఛ్, జమ్మూ, ఉధంపూర్, నగ్రోటా, రాజౌరీ, పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, అమృత్సర్, రాజస్తాన్‌లోని జైసల్మేర్, ఫోక్రాన్ తదితర ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. అక్కడి పౌర ఆవాసాలతో పాటు సైనిక స్థావరాలను పాక్ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి. దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. వాటిని ఎక్కడివక్కడ కూల్చేస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలన్నింటా అప్రమత్తత పాటిస్తున్నారు. ముందు జాగ్రత్తగా బ్లాకౌట్ కొనసాగుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో శ్రీనగర్ మొదలుకుని జో«ద్‌పూర్ దాకా పలు పట్టణాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. మరోవైపు సరిహద్దుల పొడవునా పాక్ భారీగా కాల్పులకు తెగబడుతోంది. జమ్మూలోని రాంగఢ్, సుచేత్‌గఢ్ మొదలుకుని రాజస్తాన్‌లోని గంగానగర్ దాకా పలు ప్రాంతాలు కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలు సరిహద్దు జిల్లాలకు రెడ్ అలర్టులు జారీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్‌తో పాటు త్రివిధ దళాధిపతులు భేటీలో పాల్గొన్నారు. భావి కార్యాచరణపై లోతుగా చర్చించారు. అనంతరం విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, ఆ శాఖ కార్యదర్శి మిస్రీ, దోవల్‌తో కూడా మోదీ గంటన్నరకు పైగా భేటీ అయ్యారు. అంతకుముందు త్రివిధ దళాల మాజీ అధిపతులు, ఉన్నతాధికారులతో కూడా ఆయన సమావేశమై పరిస్థితిపై చర్చించారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా సరిహద్దుల వెంబడి పరిస్థితిపై కూలంకషంగా సమీక్ష జరిపారు. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని కూడా పూర్తిస్థాయిలో విధుల్లో నియోగించాల్సిందిగా ఆర్మీ చీఫ్‌ను కేంద్రం ఆదేశించింది. శత్రువుకు మర్చిపోలేని రీతిలో బుద్ధి చెప్పాలని సైన్యాన్ని రాజ్‌నాథ్ ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర అగ్నిమాపక సేవలు, పౌర రక్షణ విభాగాల డీజీ వివేక్ శ్రీవాత్సవ సర్క్యులర్ పంపారు. దేశవ్యాప్తంగా వైద్య సిబ్బందికి సెలవులను కూడా రద్దు చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దుల్లోని పలు విమానాశ్రయాల మూసివేతను మే 15 దాకా పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది.పేలుళ్లు, సైరన్లు శుక్రవారం అర్ధరాత్రి దాకా సరిహద్దుల పొడవునా పదులకొద్దీ పాక్ డ్రోన్లను సైన్యం కూల్చేసింది. మంటల్లో కాలుతూ కూలిపోతున్న డ్రోన్లతో ఆకాశం ప్రకాశమానంగా మారింది. అంతకుముందు శ్రీనగర్ విమానాశ్రయం, దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపురా వైమానిక బేస్‌పై డ్రోన్ దాడులకు పాక్ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టింది. అంతకుముందు జమ్మూతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు విని్పంచాయి. సైరన్లు మోగాయి. పాక్ కాల్పులకు ఒక మహిళ బలవగా 18 మందికి పైగా గాయపడ్డారు. లైట్లు ఆర్పేయాల్సిందిగా స్థానిక మసీదుల్లోని లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. తన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బాంబులు, కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయంటూ జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బారాముల్లా, కుప్వారా, బందీపురా వంటి సరిహద్దు జిల్లాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలు, బంకర్లకు తరలిస్తున్నారు. దాడులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సరిహద్దుల వెంబడి మరిన్ని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సైన్యం యుద్ధ ప్రాతిపదికన మోహరిస్తోంది. ఓవైపు దాడులకు తెగబడుతూనే, మరోవైపు భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఇరాన్, సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలను పాక్ ప్రాధేయపడుతోంది. పాక్‌తో యుద్ధ పరిస్థితి నెలకొని ఉందని అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాట్రా అభిప్రాయపడ్డారు.

జమ్మూకశ్మీర్‌లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులు
India-Pakistan War Updates:పాకిస్తాన్ మళ్లీ దాడులకు తెగబడుతోంది. శుక్రవారం(మే9వ తేదీ) రాత్రి కాగానే పాకిస్తాన్ మళ్లీ భారత్ ను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. ఎల్ఓసీలో పాక్ సైన్యం కాల్పులకు దిగడమే కాకుండా, డ్రోన్లను ప్రయోగిస్తూ సరహద్దు ప్రాంతాల్లో దాడులకు దిగింది. వీటిని భారత్ రక్షణ వ్యవస్థ సమర్ధవంతంగా తిప్పికొడుతోంది. జమ్మూ, సాంబా, పఠాన్ కోట్ తదితర ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగించింది. ఆ డ్రోన్లను భారత్ సైన్యం కూల్చివేసింది. దాంతో భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. శ్రీనగర్ లో భారీ పేలుడు శబ్దాలుపాక్ దాడులు.. ఇప్పటివరకూ దాయాదికి చెందిన 100 డ్రోన్లను కూల్చివేసిన భారత్‌ప్రధాని మోదీ నివాసంలో ముగిసిన కీలక సమావేశంసమావేశంలో పాల్గొన్న రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్సమావేశానికి హాజరైన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులుతాజా పరిణామాలను మోదీకి వివరించిన త్రివిధ దళాధిపతులు ఢిల్లీ :జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలపై డ్రోన్లు,మిస్సైల్స్ తో భారత సైనిక స్థావరాలు లక్ష్యంగా పాక్ దాడులుపాక్ డ్రోన్లను గగనతలం లో నిలువరిస్తున్న భారత రక్షణ వ్యవస్థకొనసాగుతున్న బ్లాక్ అవుట్సైరన్లతో ప్రజలను అప్రమత్తం చేస్తున్న భద్రతా బలగాలుఎల్ వో సి వద్ద కాల్పుల విరమణ ఒప్పందాలు ఉల్లంఘిస్తూ భారీగా కాల్పులుపాక్ కాల్పులను తిప్పి కొడుతున్న భారత సైన్యంఒమర్ అబ్దుల్లా ట్వీట్కాల్పులకు తెగబడుతున్న పాకిస్తాన్ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలి: ఒమర్ అబ్దుల్లాIt’s my earnest appeal to everyone in & around Jammu please stay off the streets, stay at home or at the nearest place you can comfortably stay at for the next few hours. Ignore rumours, don’t spread unsubstantiated or unverified stories & we will get through this together.— Omar Abdullah (@OmarAbdullah) May 9, 2025 ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశంహాజరైన నేవీ చీఫ్, జాతీయ భద్రతా సలహాదారుసరిహద్దుల్లో తాజా పరిస్థితిపై చర్చ సాంబా సెక్టార్లో పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత్భారత్ - పాక్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతజమ్మూకశ్మీర్‌లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులుసాంబా సెక్టార్లో పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత్వరుసగా రెండో రోజు చీకటి పడగానే డ్రోన్ దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్పాక్ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతున్న భారత్యూరీ, కుప్వారా, పూంఛ్, నౌగామ్ సెక్టార్లలో పాక్ కాల్పులుఫిరోజ్పూర్లో పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత్జైసల్మీర్, యూరీలో మోగిన సైరన్లు, బ్లాకౌట్ఎల్వోసీలో మళ్లీ పాక్ సైన్యం కాల్పులు యూరీ సెక్టార్ హెవీ షెల్లింగ్‌పాక్ కాల్పులను తిప్పికొడుతున్న భారత సైన్యం ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీప్రధాని మోదీ నివాసంలో జరిగిన సమావేశానికి త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు.నేవీ చీఫ్, జాతీయ భద్రతా సహదారు తాజా పరిణామాలను వెల్లడించారు.సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించారు.విశాఖ:విశాఖలో అప్రమత్తమైన బలగాలుకేంద్ర హోం శాఖ ఆదేశాలతో.. విశాఖ విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత పెంపుప్రతి ఒక్క ప్రయనికుడుని పూర్తిగా తనిఖీ చేస్తున్న CISF సిబ్బందివిమానాశ్రయం ఎంట్రీ లోనే చెకింగ్ చేస్తున్న CISF బలగాలుఆపరేషన్ సిందూర్‌పై విదేశాంగ శాఖ మీడియా సమావేశంగత రాత్రి పాక్.. సరిహద్దు ప్రాంతాలను టార్గెట్ చేసింది300 నుంచి 400 వరకూ డ్రోన్లను ప్రయోగించిందిఎల్‌ఓసీ దగ్గర కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందిజమ్మూ, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్ లక్ష్యంగా పాక్ దాడులు చేసిందిజమ్మూలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు చేశారు34 చోట్ల పాక్ దాడులకు పాల్పడిందిపాక్ దాడులను తిప్పికొట్టాంపౌర విమానాలను టార్గెట్ గా పాక్ దాడులు చేసిందిఆ డ్రోన్లు టర్కీకి చెందినవి తెలుస్తోందిలేహ్ నుంచి సర్ క్రీక్ వరకూ పాక్ దాడులకు ప్రయత్నించిందిబటిండా సైనిక స్థావరంపై దాడికి యత్నించారుకశ్మీర్‌లోని తంగ్దర్, యూరీలో పాక్ దాడులకు పాల్పడిందిభారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌పై దాడికి యత్నించారులేహ్ నుంచి సర్ క్రీక్ వరకూ పాక్ దాడులకు ప్రయత్నించిందిబటిండా సైనిక స్థావరంపై దాడికి యత్నించారుకశ్మీర్‌లోని తంగ్దర్, యూరీలో పాక్ దాడులకు పాల్పడిందిభారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌పై దాడికి యత్నించారుపాక్ ఉపయోగించిన డ్రోన్లు టర్కీకి చెందినవిపాక్ సైన్యం కాల్పుల్లో అనేకమంది గాయపడ్డారు.పాక్ దాడులను భారత వాయుసేన సమర్థవంతంగా అడ్డుకుందికర్తర్‌పూర్ కారిడార్ ను తాత్కాలికంగా మూసివేశాం అమృత్‌సర్‌లో పాక్ బాంబును నిర్వీర్యం చేసిన ఇండియన్ ఆర్మీమక్నా దిండి విలేజ్‌ను టార్గెట్ చేసిన పాకిస్తాన్‌బాంబును నిర్వీర్యం చేసిన భారత సైనికులుసరిహద్దుల్లో పాక్ దాడిని తిప్పికొడుతున్న భారత సైన్యంతిరుమలభారత్- పాక్ యుద్ద వాతావరణం నేపథ్యంలో తిరుమలలో భద్రత బలగాలు మాక్ డ్రిల్..తిరుమల ప్రవేశ మార్గంలో ఆక్టోపస్, పోలీస్, విజిలెన్స్, ఇతర బలగాలతో మాక్ డ్రిల్ నిర్వహణఢిల్లీ:అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంశాఖ లేఖసివిల్ డిఫెన్స్ రూల్స్ కు సంబంధించి అత్యవసర అధికారాలు ఉపయోగించి అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశంఅత్యవసర సమయంలో కావలసిన అన్ని వస్తువులను సేకరణకు అనుమతిస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచిస్తున్న 1968 సివిల్ డిఫెన్స్ రూల్స్ఢిల్లీ ;ఢిల్లీలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ఐటీఓ వద్ద టెస్ట్ సైరెన్ చేసిన అధికారులువైమానిక దాడి సైరన్లను పరిశీలించిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పరవేశ్ వర్మ8 కి.మీ వరకు వినిపించేలా సైరన్ ఏర్పాటుఅమరావతి:ఆపరేషన్ సిందూర్ కు సంఘీభావంగా ఏపీ సచివాలయ ఉద్యోగుల ర్యాలీర్యాలీలో పాల్గొన్న ఏపీ సచివాలయ ఉద్యోగులుఅమరుడైన మురళి నాయక్ అమర్ రహే అంటూ నినాదాలుపాక్‌స్తాన్‌తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హైఅలర్ట్‌జమ్మూకశ్మీర్, రాజస్తాన్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ జారీఢిల్లీ, హరియాణా, హిమాచల్‌లోనూ భద్రత కట్టుదిట్టంపోలీసులు, పాలనాధికారుల సెలవులు రద్దు చేసిన సరిహద్దు రాష్ట్రాలుగుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలుఅవసరమైతే టరిటోరియల్ ఆర్మీని పిలిపించుకునేందుకు అనుమతిఆర్మీ చీఫ్ కు పూర్తి స్వేచ్ఛనిచ్చిన రక్షణమంత్రి రాజ్ నాథ్‌టెరిటోరియల్ ఆర్మీలో ధోనీ, మోహన్‌లాల్, సచిన్ పైలట్, అనురాగ్ ఠాకూర్ దేశవ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భద్రత పెంపుభద్రతను రెండోస్థాయికి పెంచుతూ కేంద్రం ఆదేశాలు పోర్టులు, టర్మినళ్లు, నౌకలకు భద్రత పెంచిన కేంద్రంఇస్రో కేంద్రాల దగ్గర హైఅలర్ట్‌ఇస్రో కేంద్రాల దగ్గర సీఐఎస్ఎఫ్ భద్రత పెంపుశ్రీహరికోట, బెంగళూరు సహా 11 కేంద్రాల్లో అలర్ట్‌పాక్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం ప్రయాణికులు విమానయాన శాఖ అడ్వైజరీఎయిర్‌పోర్ట్‌లకు మూడు గంటల ముందుగానే చేరుకోవాలి75 నిమిషాల ముందే చెక్ ఇన్ క్లోజ్ అవుతుంది జాతీయ రక్షణ నిధికి తెలంగాణ నేతల విరాళంనెల వేతనం ఇవ్వాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం సూచననెల వేతనం విరాళంగా ప్రకటించనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు మెయిల్‌అప్రమత్తమైన అధికారులుఎయిర్ పోర్ట్ లో తనిఖీలు సరిహద్దు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ ఫోన్‌గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సీఎంలతో మాట్లాడిన మోదీసరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేయాలని సూచనప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్న ప్రధాని మోదీఢిల్లీ:అమిత్ షా నివాసంలో హైలెవల్‌మీటింగ్‌హాజరైన ధోవల్, ఐబీ చీఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ డీజీలుసరిహద్దుల్లో పరిస్థితులపై అమిత్ షా రివ్యూ ఢిల్లీ:ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ భేటీపాక్ పై దాడి, తదనంతర వ్యూహంపై చర్చ బ్యాంకులు, ఆర్థిక సంస్థల భద్రతపై నిర్మలా సీతారామన్ రివ్యూసైబర్ భద్రత సన్నద్ధతపై సమీక్షించనున్న నిర్మాలా సీతారామన్ పాక్ పార్లమెంట్ లో రక్షణ మంత్రి అసిఫ్ కీలక వ్యాఖ్యలుమన ఎయిర్ డిఫన్స్ వ్యవస్థ విఫలంపాక్ రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకలు చేసిందిమన రక్షణ విభాగం పూర్తి విఫలమైందిపాక్ ప్రభుత్వంపై ఎంపీలు విమర్శలుచేతగాని ప్రభుత్వం అంటూ మండిపాటు👉కాసేపట్లో ప్రధాని మోదీతో రాజ్‌నాథ్ భేటీపాక్‌పై దాడి, తదనంతర వ్యూహంపై చర్చఉదయం త్రివిధ దళాధిపతులతో రెండున్నర గంటల పాటు భేటీఅమిత్‌షా అత్యున్నతస్థాయి సమావేశంహాజరైన ధోవల్, ఐబీ చీఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ డీజీలుసరిహద్దు పరిస్థితులపై అమిత్‌షా సమీక్ష 👉పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బఒక్క పక్క భారత ఆర్మీదాడులతో పాక్ బెంబేలుమరో పక్క బీఎల్ఏ దాడులతో ఉక్కిరిబిక్కిరితెహ్రిక్‌ఇ-తాలిబన్ దాడుల్లో 20 మంది పాక్ సైనికులు హతం👉జమ్మూకశ్మీర్ లో తెలుగు జవాన్ వీర మరణంభారత్-పాక్ యుద్ధభూమిలో మురళీ నాయక్ మృతిజవాన్ స్వస్థలం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం కల్లితండా గ్రామం 👉ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదాఐపీఎల్ నిరవధిక వాయిదా వేసిన బీసీసీఐభారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయం👉జమ్మూ కశ్మీర్ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యే రైళ్లుపాకిస్థాన్ సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హై అలర్ట్‌ఇండియా గేట్, వార్ మెమోరియల్ వద్ద భద్రత కట్టుదిట్టంసరిహద్దు రాష్ట్రాల్లోని ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని సూచనబోర్డర్ వెళ్లిన 10 మంది పంజాబ్ మంత్రులుదేశంలోని అన్ని విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలకు ఆదేశాలు👉జమ్మూలో భద్రతా బలగాల భారీ ఆపరేషన్‌సాంబా సెక్టార్లో ఏడుగురు అనుమానిత ఉగ్రవాదుల హతంచైనా తయారీ పీఎల్-15 మిస్సైల్‌ను కూల్చేసిన భద్రతా బలగాలుపంజాబ్ పంట పొలాల్లో కూలిన పీఎల్-15 మిస్సైల్‌భారత్ భీకర దాడులతో పాక్ కకావికలంకంటోన్మెంట్లను ఖాళీ చేస్తున్న పాక్ ఆర్మీ కుటుంబాలు👉చండీగఢ్‌లో మోగిన సైరన్లుప్రజలు ఇళ్లలోనే ఉండాలిదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించిన ఎయిర్ ఫోర్స్👉త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ సింగ్ భేటీసరిహద్దులో ఉద్రిక్తతలపై రాజ్‌నాథ్ సింగ్ సమీక్షప్రస్తుత పరిస్థితులపై సమీక్షిస్తున్న రక్షణ మంత్రితదనంతర వ్యూహాలపై చర్చిస్తున్న రాజ్‌నాథ్ సింగ్👉అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రకటనభారత్ - పాక్ యుద్ధం మధ్యలో మేం జోక్యం చేసుకోంఇది మాకు సంబంధం లేని విషయంఆయుధాలు పక్కన పెట్టమని మేము ఎవరిని కోరంఏదైనా ఉంటే దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు చేస్తాంఈ ఘర్షణలు అణు యుద్ధానికి తీయకుండా ఉండాలని కోరుకుంటున్నాం👉ఢిల్లీలో హైఅలర్ట్.. ఇండియా గేట్ దగ్గర భద్రత పెంపుఢిల్లీ నుంచి జమ్మూ వెళ్లే రైళ్లన్నీ నిలిపివేతఢిల్లీ నుంచి గుజరాత్, రాజస్థాన్ వెళ్లే వాహనాలు బంద్👉కాసేపట్లో సీడీఎస్, త్రివిధ దళాల అధిపతులతో రాజ్‌నాథ్ సింగ్ భేటీపాకిస్థాన్ దాడులు, సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను సమీక్షించనున్న రక్షణ మంత్రిజమ్మూ చేరుకున్న సీఎం ఒమర్ అబ్ధుల్లాపరిస్థితిని సమీక్షిస్తున్న ఒమర్ అబ్ధుల్లాహోంమంత్రి అమిత్‌షాతో బీఎస్ఎఫ్ చీఫ్ భేటీ 👉ఆపరేషన్ సిందూర్.. పాక్ దాడులపై ఇండియన్ ఆర్మీ ప్రకటనపాకిస్థాన్ సాయుధ దళాలు నిన్న మధ్య రాత్రి పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు ఆయుధ సామగ్రితో అనేక దాడులను చేశాయి.జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాలు కాల్పుల విరమణ ఉల్లంఘనలను పాల్పడ్డాయిడ్రోన్ దాడులను భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయిభారత సైన్యం దేశం యొక్క సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి కట్టుబడి ఉందిదుర్మార్గపు కుట్రలకు దీటుగా స్పందిస్తాం👉పాకిస్థాన్‌లో మరోసారి బలూచిస్థాన్ ఆర్మీ దాడిహజారా, క్వెట్టాపై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ కాల్పులు👉పాకిస్థాన్‌లో అంతర్గత సంక్షోభంపాకిస్తాన్ వ్యాప్తంగా పీటీఐ నిరసన ర్యాలీలుప్రధాని షెహబాజ్ అసమర్థ ప్రధాని అంటూ నినాదాలుఇప్పటికే సురక్షిత ప్రాంతానికి పారిపోయిన షెహబాజ్👉ఆపరేషన్ సింధూర్ .3.o పై ఉదయం 10 గంటలకి మీడియా సమావేశంరాత్రి నిర్వహించిన దాడులపై బ్రీఫింగ్కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి, ఆర్మీ ప్రతినిధుల మీడియా బ్రీఫింగ్జమ్ము సరిహద్దు గ్రామాల్లో సీఎం ఒమర్ అబ్దుల్లా పర్యటనపాకిస్తాన్ కాల్పుల్లో చనిపోయిన గాయపడిన కుటుంబాలను పరామర్శించనున్న ఒమర్ 👉నేడు దేశ భద్రతపై ఢిల్లీలో కీలక సమావేశాలుపాక్ దాడులు, భారత్ ప్రతిదాడులపై ప్రధాని మోదీ సమీక్షసరిహద్దులతో పరిస్థితులపై అజిత్ ధోవల్‌తో చర్చసరిహద్దు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన ప్రధాని మోదీపాకిస్థాన్‌పై కౌంటర్ ఎటాక్ దిగిన భారత్‌లాహోర్, సియాల్కోట్, కరాచీపై భారత్ ప్రతిదాడిజమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్‌లో హై అలర్ట్‌ఆరేబియా సముద్రంలో భారత నౌకాదళం గర్జనపాక్‌పై గురిపెట్టిన 26 యుద్ధనౌకలుపాక్‌లోని ప్రధాన నగరాలను టార్గెట్ చేసిన ఇండియన్ నేవీఇప్పటికే కరాచీ సీ పోర్టును ధ్వంసం చేసిన భారత్ నేవీ👉సరిహద్దుల వెంబడి 15 సైనిక స్థావరాలపై దాడి యత్నాలు విఫలం కావడంతో గురువారం పాక్ మరింతగా పేట్రేగిపోయింది. రాత్రివేళ పాక్ ఫైటర్ జెట్లు భారత్‌పై తీవ్రస్థాయిలో దాడులకు తెరతీశాయి. రాజస్తాన్ మొదలుకుని జమ్మూ కశ్మీర్ దాకా సరిహద్దుల పొడవునా పలుచోట్ల సైనిక లక్ష్యాలతో పాటు విచక్షణారహితంగా పౌర ఆవాసాలపైనా గురిపెట్టాయి.👉శ్రీనగర్, జమ్మూ విమానాశ్రయాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేశాయి. జమ్మూ–శ్రీనగర్ హైవేపై భారీ పేలుడు చోటుచేసుకుంది. రాజౌరీ జిల్లాలో పలుచోట్ల పేలుళ్లు విని్పంచాయి. పాక్ దాడులన్నింటినీ సైన్యం సమర్థంగా అడ్డుకుంది. సత్వారీలోని జమ్మూ విమానాశ్రయం, సాంబా, ఆర్ఎస్ పుర, అరి్నయా తదితర ప్రాంతాలపైకి కనీసం 8కి పైగా క్షిపణులు దూసుకొచ్చే ప్రయత్నం చేయగా మధ్యలోని అడ్డుకుని కూల్చేసినట్టు ప్రకటించింది.👉మన ‘ఆకాశ్’, ఎంఆర్‌ఎస్‌ఏఎంతో పాటు అత్యాధునిక ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాక్ క్షిపణులు, డ్రోన్లను ఎక్కడివక్కడ కూల్చేశాయి. పఠాన్‌కోట్‌లో రెండు, జమ్మూలో ఒక పాక్ యుద్ధ విమానాన్ని ఎస్–400 వ్యవస్థ నేలకూలి్చంది. వాటిలో రెండు జేఎఫ్–17, ఒక ఎఫ్–16 ఉన్నాయి. రెండు యుద్ధ విమానాలను నష్టపోయినట్టు పాక్ కూడా అంగీకరించింది. పఠాన్‌కోట్‌లో ఇద్దరు పైలట్లు మన బలగాలకు చిక్కినట్టు సమాచారం. ఆ వెంటనే పాక్‌పై సైన్యం విరుచుకుపడింది.👉ఇస్లామాబాద్, లాహోర్, సియాల్కోట్, కరాచీ, రావలి్పండిలపై దీర్ఘశ్రేణి క్షిపణులతో రెండోసారి భారీస్థాయిలో దాడులకు దిగింది. లాహోర్ తదితర నగరాల్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలన్నింటినీ సమూలంగా నాశనం చేసేసింది. పాక్‌లోని పంజాబ్ ప్రాంతంలో నెలకొన్న కీలక ఎయిర్‌బోర్న్ వారి్నంగ్ అండ్ కంట్రోల్ సిస్టం (ఏడబ్ల్యూఏసీఎస్)ను తుత్తునియలు చేసింది. పాక్ నగరాలు బాంబు పేలుళ్లతో దద్దరిల్లినా పౌర ఆవాసాలు, వ్యవస్థలకు నష్టం కలగని రీతిలో సైనిక వ్యవస్థలను మాత్రమే ఎంచుకుని అత్యంత కచి్చతత్వంతో దాడులు నిర్వహించినట్టు సైన్యం పేర్కొంది.👉సరిహద్దు భద్రతా చీఫ్‌లతో అమిత్ షా భేటీ ఇరువైపులా పరస్పర దాడుల వేళ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సహా వేర్వేరు సరిహద్దు భద్రతా చీఫ్‌లతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. గురువారం రాత్రి ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) బలగాల అధినేతలు పాల్గొన్నారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంట తాజా పరిస్థితిని అడిగి తెల్సుకున్నారు.దేశవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ, జాతీయ విమానాశ్రయాల వద్ద భద్రతా పరిస్థితులపై సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) చీఫ్‌తో అమిత్ షా చర్చించారు. ఇండో–పాక్ సరిహద్దుసహా బంగ్లాదేశ్ సరిహద్దు వెంట భద్రతను బీఎస్ఎఫ్ బలగాలు చూసుకుంటున్నాయి. ఇక చైనాతో సరిహద్దు వెంట పహారా బాధ్యతలను ఐటీబీపీ, నేపాల్, భూటాన్లతో సరిహద్దు భద్రతను సశస్త్ర సీమాబల్(ఎస్ఎస్బీ) బలగాలు పర్యవేక్షిస్తున్న విషయం విదితమే.

కాస్మోస్ 482’ కూలిపోయే సమయం వచ్చేసింది..!
నాటి సోవియట్ యూనియన్ 53 ఏళ్ల క్రితం ప్రయోగించిన అంతరిక్ష నౌక ‘కాస్మోస్ 482’ శనివారం భూమ్మీద కూలబోతోంది. వాస్తవానికి ఇది శుక్ర గ్రహాన్ని పరిశోధించేందుకు సోవియట్ 1972లో ప్రయోగించిన ఓ ల్యాండర్ మాడ్యూల్. సాంకేతిక లోపం కారణంగా ఆ ప్రయోగం విఫలమై గత అర్ధ శతాబ్ద కాలానికి పైబడి ‘కాస్మోస్ 482’ వ్యోమనౌక భూమి దిగువ కక్ష్యలోనే పరిభ్రమిస్తోంది. గుండ్రటి ఆకృతిలో ఉన్న ఈ వ్యోమనౌక బరువు 495 కిలోలు. భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1:46 గంటల సమయంలో అది గంటకు 242 కిలోమీటర్ల వేగంతో భూమిపై కూలుతుందని యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) అంచనా వేసింది. భూమిపై 52 డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య గల సువిశాల ప్రదేశంలో అటు బ్రిటన్ మొదలుకొని ఇటు ఆస్ట్రేలియా వరకు అది ఎక్కడైనా కూలిపోవచ్చని భావిస్తున్నారు. ఉష్ణోగ్రతలు, పీడనం పరంగా భూమి వాతావరణంతో పోలిస్తే శుక్ర గ్రహంపై కఠినాతి కఠిన పరిస్థితులు ఉంటాయి. అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని శుక్రుడి ఉపరితలంపై సురక్షితంగా దిగేలా ‘కాస్మోస్ 482’ను ప్రత్యేకంగా డిజైన్ చేసి, టైటానియం ఉష్ణరక్షణ కవచంలో ఉంచి ప్రయోగించారు. అందువల్ల భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పటికీ ఇతర అంతరిక్ష నౌకలు, ఖగోళ వస్తువుల మాదిరిగా ‘కాస్మోస్ 482’ గాలి ఒరిపిడికి మండిపోయి శకలాలుగా రాలిపోదని, ‘ఫిరంగి గుండు’ మాదిరిగా ‘ఒకే ముక్క’గా చెక్కు చెదరకుండా భూమిపై కూలుతుందని భావిస్తున్నారు. ఫలితంగా రోదసి నుంచి భూమిపై కూలిపోయే ఇతర వ్యర్థాలతో పోలిస్తే ఈ స్పేస్ క్రాఫ్ట్ పతనం వల్ల తలెత్తే ప్రమాదం తక్కువేనని అంటున్నారు. శుక్రుడిపై దిగే సమయంలో ‘కాస్మోస్ 482’ వేగాన్ని తగ్గించడానికి పారాచూట్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. అయితే 50 ఏళ్లకు పైగా నౌక అంతరిక్షంలోనే ఉండిపోయినందున సౌర వికిరణం ప్రభావానికి ఆ పారాచూట్ వ్యవస్థ పాడైపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఒమన్ సింధుశాఖ, ఈశాన్య ఆఫ్రికా, బోర్నియో, పశ్చిమార్ధ గోళంలోని ప్రదేశాల్లో వ్యోమనౌక కూలవచ్చని, అయితే భూమిపై సముద్ర ప్రాంతాలతో కూడిన జలావరణమే 70% ఉంది కనుక జనావాస ప్రాంతాల్లో అది కూలే అవకాశాలు స్వల్పమని భావిస్తున్నారు. ఇక అది నేరుగా ఒక వ్యక్తిపై పడే సంభావ్యత వేలు, లక్షల వంతుల్లో ఒక శాతం వంతు మాత్రమే. 1961-1984 మధ్య కాలంలో నాటి సోవియట్ తన ‘వెనెరా మిషన్స్’లో భాగంగా శుక్ర గ్రహంపైకి 29 అంతరిక్ష నౌకలను ప్రయోగించగా 10 వ్యోమనౌకలు శుక్రుడిపై విజయవంతంగా దిగాయి. - జమ్ముల శ్రీకాంత్

పాకిస్తాన్‌కు భారీ షాక్.. పీఎస్ఎల్ నిర్వహణకు యూఏఈ నో?
పాకిస్తాన్ సూపర్ లీగ్-2025లో మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని భావించిన పాక్ క్రికెట్ బోర్డుకు భారీ షాక్ తగిలింది. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు పీసీబీ అభ్యర్ధను తిరష్కరించినట్లు తెలుస్తోంది. పీఎస్ఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు యూఏఈ సిద్దంగా లేనట్లు సమాచారం. ఇప్పటికే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు తమ నిర్ణయాన్ని పీసీబీ తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి."బీసీసీఐతో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు మంచి సంబంధాలు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్-2021, ఐపీఎల్ ఎడిషన్లు, ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తమ మ్యాచ్‌లను యూఏఈలోనే ఆడింది. యూఈఏలో చాలా మంది క్రికెట్ అభిమానులు దక్షిణాసియా నుంచే ఉన్నారు. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య పీఎస్ఎల్ వంటి టోర్నమెంట్ నిర్వహించడం వల్ల ఇరు దేశాల మైత్రి దెబ్బతింటుంది. భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే పీఎస్ఎల్ను నిర్వహించేందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు సిద్దంగా లేదని" క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా రావాల్పిండి స్టేడియం సమీపంలో డ్రోన్ అటాక్ జరగడంతో పీఎస్ఎల్-2025 సీజన్‌ను పీసీబీ వాయిదా వేసింది.

ఆ డ్రోన్లు టర్కీవే.. పాకిస్తాన్ కుట్రలను బయటపెట్టిన విదేశాంగ శాఖ
పాకిస్తాన్ దుశ్చర్యలను భారత విదేశాంగ శాఖ తాజాగా వెల్లడించింది. గత రాత్రి(గురువారం) పాకిస్తాన్ చేపట్టిన దుస్సాహసాన్ని భారత్ ఎండగట్టింది. భారత సరిహద్దు ప్రాంతాలను టార్గెట్ చేసి 300 నుంచి 400 డ్రోన్లను పాక్ ప్రయోగించిందని స్పష్టం చేసింది. సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని పాక్ ప్రయోగించిన ఈ డ్రోన్లను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసిందని పేర్కొంది.. జమ్మూలో సుమారు 34 చోట్ల పాక్ దాడులకు పాల్పడిందని.. పాక్ ప్రయోగించిన డ్రోన్లన్నీ టర్కీకి చెందినవిగా బహిర్గతం చేసింది.‘నాలుగు ఎయిర్ బేస్‌లను టార్గెట్ చేసుకుని.. భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌పై పాకిస్తాన్ దాడికి ప్రయత్నించింది. అయితే భారత్ చేసిన దాడితో పాకిస్తాన్ తీవ్ర నష్టాన్ని చూసింది. పౌర విమానాలను సైతం పాక్ టార్గెట్ చేసి దాడులు చేసింది., వాటన్నింటిని పేల్చేశాం.లేహ్ నుంచి సర్‌క్రీక్ వరకు 36 చోట్ల పాకిస్తాన్ దాడులకు పాల్పడింది. పాక్ డ్రోన్లన్నింటిని భారత్ ధ్వంసం చేసింది. డ్రోన్ శిధిలాలను పరిశీలిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ పేర్కొన్నారు. అసలు విషయాన్ని పక్కన పెట్టి.. ఈ ఘర్షణలకు మత రంగు పులిమెందుకు పాక్ ప్రయత్నం చేస్తోంది. గత రాత్రి పాకిస్తాన్ భారత నగరాలపై.. పౌరులపై ఉద్దేశపూర్వకంగానే దాడులు జరిపింది. కానీ భారత్ ఉద్రిక్తతను పెంచకుండా, బాధ్యతాయుతంగా ఈ దాడులకు తగిన సమాధానం ఇచ్చింది.పాక్ దాడులకు సంబంధించి ప్రభుత్వ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. పూంఛ్‌లో గుడ్వారాపై జరిపిన దాడిలో స్థానిక సిక్కులతో పాటు.. ధార్మిక గాయకుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ పాక్ ఈ దాడిని ఒప్పుకోకుండా నాటకాలు ఆడుతోంది. నన్కానా సాహిబ్ గురుద్వారాపై భారత్ దాడి చేసినట్టు పాక్ అబద్ద ప్రచారం చేస్తోంది. పాక్ తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తూ, నన్కానా సాహిబ్ గురుద్వారాపై భారత్ దాడి చేసిందని అబద్ద ఆరోపణలు చేస్తూ.. భారత్‌ను అంతర్జాతీయంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోంది’ అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.#WATCH | Delhi: Foreign Secretary Vikram Misri says, "... IMF meeting is going on today, we will present our side in the meeting. Our perspective on these things will be shared with the fellow members. It is on the board to decide further... India has responsibly and adequately… pic.twitter.com/dyEevy8wfa— ANI (@ANI) May 9, 2025

ఎయిర్ ఇండియా కీలక ప్రకటన: ఈ నెల 15 వరకు విమానాలు రద్దు
భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా (Air India) కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్కోట్లకు ఈ నెల 15 వరకు ఎయిర్ ఇండియా విమానాలను రద్దు చేసింది. ఆ తరువాత విమానాలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయాన్ని సంస్థ వెల్లడించాల్సి ఉంది.ఈ సమయంలో ప్రయాణించడానికి ప్రయాణికులు ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకుని ఉంటే.. రీషెడ్యూలింగ్ లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం.. ఎయిర్ ఇండియా కాంటాక్ట్ సెంటర్లకు కాల్ చేయవచ్చు. లేదా అధికారిక వెబ్సైట్ సందర్శించి తెలుసుకోవచ్చని సంస్థ వెల్లడించింది.#TravelAdvisoryFollowing a notification from aviation authorities on continued closure of multiple airports in India, Air India flights to and from the following stations – Jammu, Srinagar, Leh, Jodhpur, Amritsar, Chandigarh, Bhuj, Jamnagar and Rajkot – are being cancelled till…— Air India (@airindia) May 9, 2025

రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ సూచనలు
భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులు, పరిపాలనాధికారులకు లేఖ రాసింది. సివిల్ డిఫెన్స్ రూల్స్‌కు సంబంధించి అత్యవసర అధికారాలు ఉపయోగించి అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించింది.ప్రజలు, ఆస్తుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టడానికి.. శత్రు దాడి సమయంలో కీలకమైన సేవల నిరంతరాయ పనితీరును నిర్ధారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని హోం మంత్రిత్వ శాఖ తమ లేఖలో గుర్తు చేసింది.1968 నాటి పౌర రక్షణ నియమాలలోని సెక్షన్ 11, రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను, ఆస్తులను హాని లేదా నష్టం నుండి రక్షించడానికి త్వరిత చర్యలు తీసుకునే అధికారం ఇస్తుంది. అటువంటి సంక్షోభాల సమయంలో విద్యుత్, నీటి సరఫరా, రవాణాతో సహా ముఖ్యమైన సేవలు నిరంతరాయంగా పనిచేస్తాయని కూడా ఇది నిర్ధారిస్తుంది.As per the communique, Section 11 of the Civil Defence Rules, 1968, can be invoked and necessary Emergency Procurement Powers to the Director Civil Defence of state/UT, may be granted so that efficient implementation of the necessary precautionary measures can be implemented.— ANI (@ANI) May 9, 2025

మన రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకలు చేసింది: పాక్ రక్షణమంత్రి
లాహోర్, కరాచీ, రావల్పిండితో సహా పలు ప్రాంతాలకు భారతదేశం పంపిన 25 డ్రోన్లను పాకిస్తాన్ అడ్డుకట్టవేయలేకపోయిందన్నారు రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. తమ దళాలు అడ్డగించి కూల్చివేసాయని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిన ఒక రోజు తర్వాత.. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ పార్లమెంటులో ప్రసంగిస్తూ.. భారత డ్రోన్లను పాక్ అడ్డుకోలేకపోయిందంటూ క్లారిటీ ఇచ్చారు. ‘మన ఎయిర్ డిఫన్స్ వ్యవస్థ విఫలమైంది. పాక్ రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకలు చేసింది. మన రక్షణ విభాగం పూర్తిగా విఫలమైంది. ఇంతకు మించి ఇంకేమీ చెప్పలేను. గోప్యత పాటించాల్సిన కారణంగా ఇంకా వివరణ ఇవ్వలేను’ అని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేశారు. దీనిపై పాక్ ప్రతిపక్ష ఎంపీలు(పీటీఐ పార్టీకి చెందిన వారు) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత పాకిస్తాన్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. ఇదిలా ఉంచితే, ప్రస్తుతం పాకిస్తాన్ అన్ని రకాలుగా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒక్క పక్క భారత ఆర్మీదాడులతో పాక్ బెంబేలెత్తిపోతుండగా.. మరో పక్క బీఎల్ఏ దాడులతో ఊపిరి తీసుకోలేని పరిస్థితికి చేరుకుంది. తెహ్రిక్‌ఇ-తాలిబన్ దాడుల్లో 20 మంది పాక్ సైనికులు హతమయ్యారు.పాక్ ప్రధానిని ఆ దేశ ఎంపీలు టార్గెట్ చేశారు. పాక్ పార్లమెంట్ సాక్షిగా ప్రధాని షెహబాజ్‌పై విమర్శలు గుప్పించారు. షెహబాజ్ పిరికిపంద అంటూ పాక్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.భారత సైన్యం దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్లో సామాన్యులతో పాటు చట్టసభల సభ్యులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. సైనిక రిటైర్డ్ మేజర్, సీనియర్ ఎంపీ అయిన తాహిర్ ఇక్బాల్ ఆ దేశ పార్లమెంటులోనే ఏకంగా ఏడ్చేశారు. అధికార పార్టీ ఎంపీ అయిన ఇక్బాల్.. పార్లమెంటులో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ ఇంటి సమీపంలో భారత్ దాడులకు దిగింది. దీంతో తన నివాసం నుంచి పాక్ ప్రధాని పరారైనట్లు సమాచారం.“We didn’t intercept Indian drones as it would have given away our defence positions”This isn’t parody, this is scene from Pakistani parliamentPakistani parliament is funnier than parody 😹 pic.twitter.com/7zWbzXzyKA— BALA (@erbmjha) May 9, 2025 “We didn’t intercept Indian drones as it would have given away our defence positions”This isn’t parody, this is scene from Pakistani parliamentPakistani parliament is funnier than parody 😹 pic.twitter.com/7zWbzXzyKA— BALA (@erbmjha) May 9, 2025

Miss World 2025: అందమూ.. అంతకుమించి...
‘దేవుదే దిగొచ్చి మిమ్మల్నేమైనా కోరుకోమంటే ఏం కోరుకుంటారు?’ ‘పిల్లలు అమాయకులు.. పువ్వులాంటి వారు. దేవుడికి అత్యంత ఇష్టమైన వారు. అందుకే సమాజం చేసే తప్పులకు వాళ్లు బలి కాకూడదు.. వాళ్లు మంచి వాతావరణంలోనే పెరగాలని కోరుతాను!’ అని సమాధానమిచ్చింది కె. అభిమానికా యాదవ్! ఈ జవాబుతో ఆమె ‘2016 మిసెస్ ఇండియా’ పోటీలో నెగ్గారు. తర్వాత మిసెస్ ఆసియా పసిఫిక్ యూనివర్స్ కిరీటాన్ని పొందారు. ‘2017.. మిసెస్ యూనివర్స్ పోటీ’కీ వెళ్లారు. అక్కడ ఆమెను జడ్జెస్ మూడు నిమిషాల్లో డొమెస్టిక్ వయొలెన్స్ గురించి మాట్లాడమన్నారు. దానిమీద మూడు నిమిషాల్లో ఆమె పవర్ పాయింట్ ప్రెజెంటేషనే ఇచ్చారు. జడ్జెస్ ఇంప్రెస్ అయ్యి.. ‘2017.. మిసెస్ యూనివర్స్ ఇంటెలిజెన్స్’ సబ్టైటిల్నిచ్చారు. హైదరాబాద్ వాసి అయిన ఆమె.. సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్, పాజెంట్ గ్రూమర్, మోటివేషనల్ స్పీకర్, ఫ్యాషన్ స్టయిలిస్ట్! ఇప్పుడు తెలంగాణలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో అసలు బ్యూటీ పాజెంట్స్ ఎలా జరుగుతాయి, ఎలాంటి రౌండ్స్ ఉంటాయి, ఎలా గ్రూమ్ అవుతారు వంటి విషయాలను ‘ఫ్యామిలీ’తో పంచుకున్నారు.‘2016లో జరిగిన మిసెస్ ఇండియా పోటీల టైమ్‌కి నేను డివోర్సీని. అప్పుడు మా బాబుకు అయిదేళ్లు. నా పెంపకంలోనే ఉన్నాడు. బీటెక్ చదివి, కొన్నాళ్లు కార్పొరేట్ జాబ్ చేసి వదిలేసి.. జుంబా ట్రైనర్‌గా మారాను. క్లాసికల్ డాన్సర్ (ఆంధ్రనాట్యం)ని కూడా! ఫిట్‌నెస్‌లోనూ ట్రైనింగ్ తీసుకుని ఫిట్నెస్ కోచ్‌గానూ ఉన్నాను. డివోర్స్ మీద సమాజంలో ఉన్న అప్రకటిత నిషేధాలు, సంకోచాలను కాదని దానిమీద చాలా మాట్లాడేదాన్ని, విరివిగా చర్చించి దాన్ని నార్మలైజ్ చేయడానికి ప్రయత్నించాను. దాంతో అందరికీ సుపరిచితురా లనయ్యా. బ్యూటీ పాజెంట్‌లో పాల్గొనాలనేది మాత్రం అప్పటికప్పుడు తీసుకున్న డెసిషనే. దీనికి సంబంధించి అప్పుడిక్కడ గ్రూమింగ్ సెంటర్స్ లేవు. ముంబై, లేదంటే ఢిల్లీ వెళ్లాలి. నేను ఢిల్లీ వెళ్లాను. లక్కీగా మంచి కోచ్ దొరికారు. కాన్ఫిడెంట్‌గా నన్ను నేను ప్రెజెంట్ చేసుకున్నాను. టైటిల్ గెలుచుకున్నాను. ఆ ఉత్సాహంతోనే మిసెస్ యూనివర్స్ పాజెంట్కీ వెళ్లాను. అయితే మిసెస్ ఇండియా, మిసెస్ యూనివర్స్ పాజెంట్స్ మధ్య సంవత్సరం టైమ్ ఉండింది. అయినా గ్రూమింగ్ కోసం బాబును వదిలిపెట్టి వేరే సిటీకి వెళ్లే పరిస్థితి లేదు. దాంతో అంతకుముందు కోచ్ దగ్గర్నుంచే కొన్ని టిప్స్, యూట్యూబ్‌లో మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పాజెంట్స్‌కి సంబంధించిన వీడియోలు, అందులోని పార్టిసిపెంట్స్ ఇంటర్వ్యూలు చూసి నన్ను నేను గ్రూమ్ చేసుకున్నాను.→ ఆ పోటీలు ఎలా ఉంటాయంటే.. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, మిసెస్ యూనివర్స్.. ఇలా ఏ అందాల పోటీలైనా దాదాపుగా ఒకేరకంగా ఉంటాయి. నెల రోజులు జరుగుతాయి. అయితే నెలంతా పోటీలుండవు. ఈ పోటీలను ఏ దేశం హోస్ట్ చేసినా దాని ప్రధాన లక్ష్యం.. అక్కడి టూరిజాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే! సో.. మా పోటీలు దక్షిణాఫ్రికాలో జరిగాయి. 86 దేశాల నుంచి కంటెస్టెంట్స్ వచ్చారు. పోటీల షెడ్యూల్ అంతా కంటెస్టెంట్స్‌కి ముందే ఇచ్చేస్తారు. పోటీలు లేని రోజుల్లో ఆ దేశంలోని చారిత్రక ప్రాంతాల పర్యటన ఉంటుంది. వాళ్లు ఫుడ్, కల్చర్‌ను తెలుసుకునే పర్యటనలుంటాయి. పోటీల విషయానికి వస్తే.. ఏ రోజు ఏ ఈవెంట్ ఉంటుందో దానికి సంబంధించిన కాస్ట్యూమ్ ఉంటుంది. ఈ కాస్ట్యూమ్స్ కోసం కొంతమంది కంటెస్టెంట్స్ స్పాన్సర్స్‌ని వెదుక్కుంటారు. స్విమ్ వేర్ రౌండ్ ఉంటుంది. స్విమ్ సూట్‌తో స్టేజ్ మీద కనిపించాలి. దానికి ఫొటో షూట్ ఉంటుంది. ఆ కాస్ట్యూమ్ని మనమెంత కాన్ఫిడెంట్‌గా క్యారీ చేస్తున్నాం, బాడీలాంగ్వేజ్ వంటివన్నీ అసెస్ చేస్తారు. ఇంటెలిజెన్స్ రౌండ్ ఉంటుంది. ఇందులో క్విజ్ ఉండొచ్చు, సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల మీద చర్చలు, మహిళల సమస్యలకు సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వచ్చు. వాళ్లిచ్చిన టాపిక్‌ని వాళ్లిచ్చిన వ్యవధిలో ఎంత చక్కగా మాట్లాడామనేది చూస్తారు. బ్యూటీ విత్ పర్పస్ రౌండ్ ఉంటుంది. కంటెస్టెంట్స్ ఏదైనా స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో భాగస్వాములై ఉండాలి. ఆ పోటీ కోసం దరఖాస్తు చేసుకునేప్పుడు అందులో దానిగురించి పొందుపరచాలి. ఈ రౌండ్లో దాని గురించి అడుగుతారు. మనం చేసిన పనిని ఎంత స్మార్ట్‌గా ప్రెజెంట్ చేశామనేదాన్ని బట్టి పాయింట్స్ ఉంటాయి. దీనిమీద ఆన్లైన్ ఓటింగ్ ఉంటుంది. మాగ్జిమమ్ ఓట్లు వచ్చిన వాళ్లకు మిస్ పాపులర్ అనే సబ్ టైటిల్ ఇస్తారు. ఫిట్నెస్ రౌండ్ ఉంటుంది. అలాగే టాలెంట్ రౌండ్ ఉంటుంది. మనకొచ్చిన కళలను ప్రదర్శించాలి. ఇందులో ది బెస్ట్ పెర్ఫార్మర్కు మిస్ టాలెంటెడ్ సబ్ టైటిల్ ఇస్తారు. ట్రెడిషనల్ రౌండ్ కూడా ఉంటుంది. ఇందులో మనం దేన్ని, ఎంత క్రియేటివ్‌గా రిప్రెజెంట్ చేస్తున్నామనేది ఫోకస్ అవుతుంది. → తలపై బోనంతో....నేను లంగా, ఓణీ వేసుకుని, తల మీద బోనం పెట్టుకుని ర్యాంప్ వాక్ చేసి, బోనం గురించి వర్ణించాను! గౌన్ రౌండ్, ఇంట్రడక్షన్ రౌండ్, వన్ టు వన్ పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్, ప్రిలిమినరీ రౌండ్స్ ఉంటాయి. ఇవేకాక ఫినాలే రోజు.. టైమ్ లేకుంటే అంతకంటే ముందు రోజు మిస్ బ్యూటిఫుల్ స్కిన్,హెయిర్, ఫొటోజెనిక్, స్మైల్, బెస్ట్ స్విమ్ సూట్ లాంటి సబ్టైటిల్స్నిస్తారు. ర్యాంప్ వాక్ ఉంటుంది. ఫినాలే రోజు అందరూ తప్పకుండా గౌనే వేసుకోవాలి. కొన్నిసార్లు ఏ దేశం హోస్ట్ చేస్తుందో ఆ దేశానికి సంబంధించిన ట్రెడిషనల్ వేర్ని ఇస్తారు. మాకు సౌత్ ఆఫ్రికన్ ప్రింట్స్, యాక్ససరీస్‌తో డిఫరెంట్ అవుట్‌ఫిట్స్ ఇచ్చారు. కిందటిసారి ముంబైలో జరిగిన మిస్‌వరల్డ్ పోటీల్లో అందరికీ లెహెంగాలు ఇచ్చారు. ఫినాలే రోజు టాప్ టెన్, లేదా టాప్ ఫైవ్ స్టేజ్ మీద ఉంటారు. వాళ్లందరికీ ఒక క్వశ్చన్ ఇస్తారు. ఒకవేళ మల్టిపుల్ జడ్జెస్ ఉంటే డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి ఎంత వేగంగా స్పందించి.. ఎంత కాన్ఫిడెంట్‌గా.. ఎంత కూల్‌గా ఆన్సర్ చేస్తారో దాన్ని బట్టి టైటిల్ విన్నర్‌ని, ఫస్ట్ అండ్ సెకండ్ రన్నరప్స్ని అనౌన్స్ చేస్తారు.→ కొరియోగ్రఫీ..గ్రూమింగ్ అవుతున్నప్పుడు ఆర్గనైజర్స్ వస్తారు.. ఎవరు ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారో చూస్తుంటారు. ఈ పోటీలకు కొరియోగ్రఫీ ఉంటుంది. ఎవరు ఎక్కడ నిలబడాలి, ఎలా నడవాలి.. ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి వంటివన్నీ ట్రైన్ చేస్తారు. దీనికి పాజెంట్ కోచ్ ఉంటారు. వాళ్లే నేర్పిస్తారు. మిసెస్ ఇండియా మొదలు మిసెస్ యూనివర్స్ వరకు గ్రూమింగ్‌కి కాస్ట్యూమ్స్, ఫుట్‌వేర్,యాక్ససరీస్ సహా నాకు రూ. 12 లక్షల వరకు ఖర్చయింది. పాజెంట్‌లో పార్టిసిపేట్ అవడమనేది చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం. ఏమైనా నాకు ఫిట్నెస్ కోచ్‌గా కొనసాగడమే ఇష్టం. పదేళ్లుగా అదే రంగంలో కొనసాగుతున్నాను. పాజెంట్స్‌కి సంబంధించి వర్క్‌షాప్స్ పెట్టాను. త్వరలోనే ఇక్కడొక గ్రూమింగ్ సెంటర్ పెట్టాలని ΄్లాన్ చేస్తున్నాను. – సరస్వతి రమ

నాది లేటెస్ట్ మోడల్
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో ఇప్పటిదాకా గుజరాత్ మోడల్ గురించి చర్చ జరుగుతోంది. కానీ అది 2000 సంవత్సరం కంటే ముందున్న మోడల్. ప్రస్తుత తెలంగాణ మోడల్ 2025లో ఉన్న అప్ డేటెడ్ మోడల్. మోదీ మోడల్ వాట్సాప్ యూనివర్సిటీ అయితే, నాది స్కిల్స్ యూనివర్సిటీ. గుజరాత్లో ఉద్యోగాల్లేవు. నేను ఏడాదిలో 60 వేల ఉద్యోగాలిచ్చా. అక్కడ రైతుల రుణమాఫీ లేదు.. నేను రూ.21 వేల కోట్లు మాఫీ చేశా. గుజరాత్లో మద్దతు ధర లేదు. తెలంగాణలో మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇస్తున్నాం. బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం.మేం రిజర్వేషన్ల పెంపును సమర్థిస్తాం. కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ మోడల్లో మీడియాకు స్వేచ్ఛ లేదు. మా మోడల్లో ఈ స్వేచ్ఛ ఉంది. అందుకే మోదీ మోడల్ అవుట్ డేటెడ్. నాది అప్ టు డేట్ మోడల్. అందుకే తెలంగాణను కేంద్రం అనుసరిస్తోంది..’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం బెంగళూరు వేదికగా జాతీయ దినపత్రిక ది హిందూ నిర్వహించిన ‘ది హిందూ హడిల్’ చర్చాగోష్టిలో ఆయన హైదరాబాద్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ‘ముందుగా ఈ దేశాన్ని రక్షిస్తున్న భారత ఆర్మికి సెల్యూట్ చేస్తున్నా. సైనికులకు సంఘీభావం ప్రకటించే సమయం ఇది..’ అని సీఎం అన్నారు. అనంతరం పలు అంశాలపై తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. కులగణన భవిష్యత్ తరాలకు దారి చూపిస్తుంది ‘సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్. దేశంలో లేదా ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కులగణన చేపడతామని ప్రజలకు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. ఆ మేరకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సర్వే చేపట్టింది. మేము చేసిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని చేపట్టింది. కులగణన చేయడం మినహా కేంద్రానికి మరో మార్గం లేదు. ఈ కులగణన భవిష్యత్ తరాలకు దారి చూపిస్తుంది. నాలుగు దశాబ్దాలుగా ఎస్సీల వర్గీకరణ కోసం పోరాటం జరుగుతోంది. ఎస్సీల్లో 59 కులాలున్నాయి.వీటిలో కొన్ని కులాలు విద్య, ఉపాధి రంగాల్లో లబ్ధి పొందుతున్నాయి. కొన్ని వర్గాలకు న్యాయం జరగడం లేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శనం చేసింది. మేం వెంటనే రంగంలోకి దిగాం. కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు మేరకు ఏకసభ్య కమిషన్ నియమించాం. ఈ కమిషన్ మూడు కేటగిరీల్లో ఎస్సీలను వర్గీకరించాలని చెప్పింది. ఆ సిఫారసుకు అనుగుణంగా ఎస్సీల వర్గీకరణను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. విద్యార్థి దశలోనే కులం సమస్య గుర్తించా ‘గ్రామీణ ప్రాంతం నుంచి వచి్చన నాయకుడిగా సమాజంపై కులం ఎంత ప్రభావం చూపిస్తుందో నాకు బాగా తెలుసు. విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచే ఆ సామాజిక వర్గాలకు చెందిన వారితోనే కలిసి ఉండడం ద్వారా సమాజం వారిని విస్మరిస్తోందని, దూరంగా ఉంచుతోందని గుర్తించా. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా కులాల పేరుతో విభజించి చదివించడం మంచిది కాదు. అందుకే నా కేబినెట్ సహచరులకు, అధికారులకు చెప్పా.అన్ని వర్గాల ప్రజలకు మంచి విద్యా సదుపాయాలు కల్పించాలని, మంచి వాతావరణంలో వారికి విద్యాబుద్ధులు నేర్పాలని. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాలకు చెందిన విద్యార్థులందరినీ కలిపి చదివించాలని వారు సూచించారు. అందులో భాగంగానే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. మొత్తంగా రూ.25 వేల కోట్ల పెట్టుబడి భవిష్యత్ కోసం పెడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలను చేపట్టాలి..’ అని రేవంత్ అన్నారు. రైతుల కోసం ఎన్నో చేస్తున్నాం.. ‘సంక్షేమం విషయంలో తెలంగాణ దేశంలోనే మంచి మోడల్. అయితే సంక్షేమానికి సమాంతరంగా అభివృద్ధి జరగాలి. సంక్షేమం, అభివృద్ధి కలిసి ముందుకెళ్లాలి. నేను ఈ విధంగానే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నా. రుణమాఫీ, పెట్టుబడి సాయం, మద్దతు ధర కోసం రైతులు ఇప్పుడు కూడా పోరాడుతున్నారు. మేం తొలి ఏడాదిలోనే 25.30 లక్షల మంది రైతులకు రూ.20,617 కోట్ల రుణమాఫీ చేశాం. ప్రతి యేటా రూ.18 వేల కోట్ల పెట్టుబడి సాయం చేస్తున్నాం. 24 గంటల పాటు రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం. సోనియాగాంధీ నేతృత్వంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి తీసుకొచి్చన పథకమిది. ఈ పథకం కింద ఏడాదికి రూ.12 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. ధాన్యానికి మద్దతు ధర, బోనస్ కలిపి క్వింటాల్‌కు రూ.2,800 ఇస్తున్నాం..’ అని సీఎం వెల్లడించారు. నా పోటీ మన దేశ నగరాలతో కాదు.. ‘స్వయం సహాయక సంఘాల (67 లక్షల మంది) మహిళలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశం కల్పించాం. రాష్ట్రంలోని 10 వేల ఆర్టీసీ బస్సుల్లో వెయ్యి బస్సులు మహిళలకు కేటాయించాం. విద్యార్థులు డ్రెస్సులు కుట్టే కాంట్రాక్టు మహిళలకు ఇచ్చాం. యువకుల కోసం యంగ్ ఇండియా స్కిల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నాం. దావోస్ వేదికగా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చాం. రాష్ట్రంలో డ్రైపోర్టు, నెట్‌జీరో సిటీ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దీనికి భారత్ ఫ్యూచర్ సిటీగా నామకరణం చేశాం. నా పోటీ బెంగళూరు, అమరావతి, ముంబై, ఢిల్లీలతో కాదు. న్యూయార్క్, టోక్యో, దుబాయ్, సింగపూర్లు నా లక్ష్యం..’ అని రేవంత్ పేర్కొన్నారు. వన్ పర్సన్–వన్ పార్టీ విధానం అంగీకరించం ‘లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు మేం వ్యతిరేకం కాదు. అయితే ముందు అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మాట్లాడి నిబంధనలు రూపొందించాలని అడుగుతున్నాం. జనాభా ప్రాతిపదికన ముందుకెళితే దక్షిణాది రాష్ట్రాలతో పాటు పంజాబ్ కూడా నష్టపోతుంది. మీరు నియోజకవర్గాలను ఎలా పెంచినా మాకు 33 శాతం సీట్లు ఇవ్వాలని అడుగుతున్నాం. లేనిపక్షంలో అది నియోజకవర్గాల పునర్విభజన కాదు. వన్ పర్సన్–వన్ పార్టీ విధానం ఇది. దీన్ని మేం అంగీకరించేది లేదు..’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జాతీయ భద్రతా సలహాదారుడిగా పనిచేసిన ఎం.కె.నారాయణన్ చర్చాగోష్టిలో సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశంసించారు. ఉన్నది ఉన్నట్టు కుండబద్ధలు కొట్టి చెపుతున్నారంటూ అభినందించారు. ఈ కార్యక్రమానికి హిందూ తెలంగాణ పొలిటికల్ ఎడిటర్ ఆర్.రవికాంత్‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు.
పాక్‌కు బిలియన్ డాలర్లు
పాశుపతాలు
సీఐసీగా చంద్రశేఖర్‌రెడ్డి ప్రమాణం
రెండ్రోజులు తేలికపాటి వానలు
జాతీయ రక్షణ నిధికి సీఎం విరాళం
మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలి
యాక్షన్ ప్లాన్‌తో రెడీగా ఉండాలి
దాయాది.. మళ్ళీ బరితెగింపు
నాది లేటెస్ట్ మోడల్
పుట్టినరోజు ప్రత్యేకం
బిడ్డకు జన్మనిచ్చి మరణించిన స్టార్ హీరోయిన్.. అతనే 'హిట్-3' విలన్
ఐదు విమానాలు కూల్చేశాం: పాక్ ప్రధాని షరీఫ్
ఆపరేషన్ సిందూర్
ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు
Operation Sindoor: పాక్ క్రికెట్ బోర్డుకు దెబ్బ మీద దెబ్బ!
ఆపరేషన్ సిందూర్‌తో పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి
జమ్మూకశ్మీర్‌లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులు
చల్లని కబురు
ఈ రాశి వారికి ఆస్తి లాభం.. ఉద్యోగులకు కొత్త హోదాలు
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం.. వ్యాపారాలలో ముందడుగు
మాపై దాడి చేస్తే ప్రపంచంలో ఎవరు మిగలరు- పాక్ రక్షణ మంత్రి ఖవాజా
ఐపీఎల్ వాయిదా?
దాయాది దుస్సాహసం.. దీటుగా బదులిచ్చిన భారత్
Operation Sindoor: ఈ ఒక్క ఫొటో చాలు: సానియా మీర్జా పోస్ట్ వైరల్
నీ శరీరం.. నీ ఇష్టం అన్నాడు : దీపికా పదుకొణె
138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో
అరుణాచల దర్శనం చేసుకున్న నటుడు ప్రభాకర్ ఫ్యామిలీ (ఫొటోలు)
ఈ ముక్క ఏదో పహల్గాం దాడికి ముందు చెప్పాల్సిందేమో సార్..!
కష్టార్జితం చెదల పాలు... లారెన్స్ పెద్ద సాయం
పాక్ ప్రధాని ఇంటి సమీపంలో భారీ పేలుళ్లు.. నివాసం నుంచి షరీఫ్ తరలింపు
పాక్‌కు బిలియన్ డాలర్లు
పాశుపతాలు
సీఐసీగా చంద్రశేఖర్‌రెడ్డి ప్రమాణం
రెండ్రోజులు తేలికపాటి వానలు
జాతీయ రక్షణ నిధికి సీఎం విరాళం
మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలి
యాక్షన్ ప్లాన్‌తో రెడీగా ఉండాలి
దాయాది.. మళ్ళీ బరితెగింపు
నాది లేటెస్ట్ మోడల్
పుట్టినరోజు ప్రత్యేకం
బిడ్డకు జన్మనిచ్చి మరణించిన స్టార్ హీరోయిన్.. అతనే 'హిట్-3' విలన్
ఐదు విమానాలు కూల్చేశాం: పాక్ ప్రధాని షరీఫ్
ఆపరేషన్ సిందూర్
ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు
Operation Sindoor: పాక్ క్రికెట్ బోర్డుకు దెబ్బ మీద దెబ్బ!
ఆపరేషన్ సిందూర్‌తో పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి
జమ్మూకశ్మీర్‌లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులు
చల్లని కబురు
ఈ రాశి వారికి ఆస్తి లాభం.. ఉద్యోగులకు కొత్త హోదాలు
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం.. వ్యాపారాలలో ముందడుగు
మాపై దాడి చేస్తే ప్రపంచంలో ఎవరు మిగలరు- పాక్ రక్షణ మంత్రి ఖవాజా
ఐపీఎల్ వాయిదా?
దాయాది దుస్సాహసం.. దీటుగా బదులిచ్చిన భారత్
Operation Sindoor: ఈ ఒక్క ఫొటో చాలు: సానియా మీర్జా పోస్ట్ వైరల్
నీ శరీరం.. నీ ఇష్టం అన్నాడు : దీపికా పదుకొణె
138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో
ఈ ముక్క ఏదో పహల్గాం దాడికి ముందు చెప్పాల్సిందేమో సార్..!
కష్టార్జితం చెదల పాలు... లారెన్స్ పెద్ద సాయం
పాక్ ప్రధాని ఇంటి సమీపంలో భారీ పేలుళ్లు.. నివాసం నుంచి షరీఫ్ తరలింపు
Operation Sindoor సలాం, హస్నాబాద్!
సినిమా

మంచు మనోజ్.. 'కన్నప్ప'తో పోటీ పడట్లేదు
కొన్నిరోజుల క్రితం మంచు ఫ్యామిలీలో గొడవలు జరిగాయి. ప్రస్తుతం అంతా సైలెంట్ గా ఉన్నారు. అయితే వివాదం నడుస్తున్న టైంలో కన్నప్ప గురించి మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తన సినిమాకు భయపడే విష్ణు 'కన్నప్ప' వాయిదా వేశాడని చెప్పుకొచ్చాడు. అసలు విషయానికొస్తే.. ఏప్రిల్ 25న వస్తుందనుకున్న కన్నప్ప సినిమాని జూన్ 27కి వాయిదా వేశారు. ఇదే టైంలో మంచు మనోజ్ 'భైరవం' కూడా చాలారోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. లెక్క ప్రకారం గత డిసెంబరులోనే రిలీజ్ ప్లాన్ చేశారు. మరి ఓటీటీ డీల్ కుదరకపోవడమే, మరేదైనా కారణాలు తెలియదు గానీ రిలీజ్ లేటు చేస్తూ వచ్చారు.(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్.. ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్) ఫైనల్ గా ఇప్పుడు కొత్త విడుదల తేదీని ప్రకటించారు. మే 30న థియేటర్లలోకి వస్తామని పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే మనోజ్ ఆశపడ్డట్లు ఈసారి అన్న విష్ణు 'కన్నప్ప'తో పోటీ పెట్టుకోలేదు. అదే టైంలో విజయ్ దేవరకొండ 'కింగ్డమ్'కి పోటీగా బరిలో నిలిచారు.మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మినీ మల్టీస్టారర్ కి విజయ్ కనకమేడల దర్శకుడు. డైరెక్టర్ శంకర్ కూతురు అదితీ ఈ సినిమాతోనే టాలీవుడ్ లోకి హీరోయిన్ గా పరిచయమవుతోంది. తమిళ హిట్ 'గరుడన్'కి రీమేక్ దీన్ని తెరకెక్కించడం విశేషం.(ఇదీ చదవండి: బడా నిర్మాత కూతురి పెళ్లి.. ఇండస్ట్రీ మొత్తం అక్కడే) This summer, get ready for a cinematic experience like no other! We are thrilled to announce that #BHAIRAVAM is hitting the big screens worldwide on May 30th! Prepare for an epic journey filled with action, emotion, and the unbreakable spirit of brotherhood. For me, this release… pic.twitter.com/sJ73HPiGIk— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) May 9, 2025

మా సపోర్ట్ సైనికులకే.. లాభాల్లో కొంత భాగం వాళ్లకే
ప్రముఖ నిర్మాత, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ మంచి మనసు చాటుకున్నారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. మన సైనికులకు అండగా ఉంటానని మాటిచ్చారు. తన లేటెస్ట్ మూవీ వసూళ్ల నుంచి వచ్చే లాభాల్లో కొంత భాగం మన సైనికులకు విరాళంగా ఇస్తానని మాటిచ్చారు.(ఇదీ చదవండి: మీరు అలా చేస్తే శత్రువుకు సాయం చేసినట్లే: రాజమౌళి) చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న అల్లు అరవింద్.. గతంతో పోలిస్తే సినిమాలు తీయడం బాగా తగ్గించేశారు. కొన్ని చిన్న చిత్రాల్ని నిర్మిస్తున్నారు. అలా తీసిన లేటెస్ట్ మూవీ '#సింగిల్'. శ్రీ విష్ణు, కేతిక, ఇవానా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం.. తాజాగా థియేటర్లలోకి వచ్చింది.సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన సందర్భంగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తాను భారత ఆర్మీకి అండగా ఉంటానని, సినిమాకు వచ్చిన లాభాల్లో కొంతమేర ఆర్థిక సాయం చేస్తానని చెప్పుకొచ్చారు. ఈయనలానే మిగతా దర్శక నిర్మాతలు హీరోహీరోయిన్లు కూడా సాయం చేసి తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరుకుందాం.(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్)

మీరు అలా చేస్తే శత్రువుకు సాయం చేసినట్లే: రాజమౌళి
ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏం జరుగుతుందో భారత ప్రభుత్వానికి మాత్రమే తెలుసు. కానీ సోషల్ మీడియాలో లెక్కకు మించి ఫేక్ వీడియోలు, ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు రాజమౌళి.. ప్రజలకు తనవంతు బాధ్యతగా ఓ సూచన చేశారు.(ఇదీ చదవండి: బడా నిర్మాత కూతురి పెళ్లి.. ఇండస్ట్రీ మొత్తం అక్కడే) 'పాజిటివ్, అప్రమత్తంగా ఉంటే విజయం మనదే. దేశ రక్షణ కోసం పనిచేస్తున్న సాయుధ దళాలని మెచ్చుకోవాల్సిందే. ఒకవేళ భారత సైనిక చర్యలని మీరు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు. ఇలా చేయడం వల్ల మీరు శత్రువలకు సాయం చేసినవాళ్లు అవుతారు. అనధికారిక ప్రకటనలు, అసత్య ప్రచారం నమ్మకండి' అని రాజమౌళి చెప్పుకొచ్చారు.మొన్నటివరకు రాజమౌళి.. మహేశ్ బాబుతో సినిమా షూటింగ్ చేశారు. ప్రస్తుతం చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చారు. తిరిగి జూన్ లో ప్రారంభించనున్నారు. అప్పటిలోపు పరిస్థితులు సద్దుమణిగితే సరేసరి. లేదంటే సినిమాల షూటింగ్స్ కూడా వాయిదా పడొచ్చేమో? ఇకపోతే రాజమౌళి.. తన ట్విటర్ ప్రొఫైల్ పిక్ గా ఆపరేషన్ సిందూర్ అని రాసి ఉన్న ఫొటోని పెట్టుకున్నారు.(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్) If you see any movement of the Indian Army, don’t take pictures or videos.Don’t share them as you might be helping the enemy. Stop forwarding unverified news or claims. You’ll only create noise, which the enemy wants.Stay calm, alert and positive.Victory is ours. 🇮🇳— rajamouli ss (@ssrajamouli) May 9, 2025Saluting our Brave Indian Armed Forces for their unwavering courage in protecting our nation from terrorism. Let’s stand together as a nation, inspired by their valor, to build a future of peace and unity. Jai Hind! 🇮🇳— rajamouli ss (@ssrajamouli) May 9, 2025

బడా నిర్మాత కూతురి పెళ్లి.. ఇండస్ట్రీ మొత్తం అక్కడే
తమిళ ప్రముఖ నిర్మాత ఇషారీ గణేష్ తన కుమార్తెకు అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. చెన్నైలో శుక్రవారం ఉదయం జరిగిన ఈ శుభకార్యానికి తమిళ ఇండస్ట్రీ మొత్తం దాదాపు హాజరైంది. రజనీకాంత్ దగ్గర నుంచి మొదలు పెడితే చిన్న హీరోల వరకు వచ్చి నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు.(ఇదీ చదవండి: ‘#సింగిల్’ మూవీ రివ్యూ)వెల్స్ యూనివర్సిటీ ఛైర్మన్ గా అందరికీ తెలిసిన ఇషారీ గణేశ్.. 2016 నుంచి సినిమా నిర్మాతగా మారారు. చిన్నాపెద్దా హీరోలతో మూవీస్ చేశారు. ప్రస్తుతం రెండు మూడు చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇకపోతే తన పెద్ద కూతురు ప్రీతా గణేశ్ ని లస్విన్ కుమార్ అనే కుర్రాడికి ఇచ్చి వివాహం చేశారు.గురవారం రాత్రి సంగీత్ జరగ్గా.. హీరో సూర్య హాజరయ్యారు. శుక్రవారం జరిగిన పెళ్లికి మాత్రం రజనీకాంత్, కమల్ హాసన్, మణిరత్నం-సుహాసిని, ప్రభు, అధిక్ రవిచంద్రన్, దర్శకుడు వాసు, గౌతమ్ మేనన్, హీరో జీవా, జయం రవి, సత్యరాజ్, సుందర్ సి, ఖుష్బూ తదితరులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్)
న్యూస్ పాడ్‌కాస్ట్

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభం... సరిహద్దుల్లో దాడులతో కవ్వించిన పాక్ సైన్యం.. దీటుగా తిప్పికొడుతున్న భారత సేనలు... మూడు పాక్ ఫైటర్ జెట్ల కూల్చివేత, ఇద్దరు పైలట్ల పట్టివేత

పాకిస్తాన్ ఉగ్రవాద తండాలపై 'రక్త సిందూరం' 100 మందికి పైగా ముష్కరులు హతం..

పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..

దుష్ట పాకిస్తాన్ భరతం పట్టడానికి ముహూర్తం ఖరారు... ఈ వారాంతంలోపే భారీ ఆపరేషన్ జరిగే అవకాశం... బుధవారం రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్స్

యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో చంద్రబాబు సర్కారు అడ్డగోలు ఒప్పందం... అత్యధిక ధరకు 400 మెగావాట్ల విద్యుత్ కొనడానికి అంగీకారం

అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

వణుకుతున్న పాకిస్తాన్. భారత్‌ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన: కేంద్రం కీలక నిర్ణయం

ఏపీలో అంతులేని అవినీతి, అంతా అరాచకమే: వైఎస్ జగన్
క్రీడలు

పాకిస్తాన్‌కు భారీ షాక్.. పీఎస్ఎల్ నిర్వహణకు యూఏఈ నో?
పాకిస్తాన్ సూపర్ లీగ్-2025లో మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని భావించిన పాక్ క్రికెట్ బోర్డుకు భారీ షాక్ తగిలింది. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు పీసీబీ అభ్యర్ధను తిరష్కరించినట్లు తెలుస్తోంది. పీఎస్ఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు యూఏఈ సిద్దంగా లేనట్లు సమాచారం. ఇప్పటికే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు తమ నిర్ణయాన్ని పీసీబీ తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి."బీసీసీఐతో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు మంచి సంబంధాలు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్-2021, ఐపీఎల్ ఎడిషన్లు, ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తమ మ్యాచ్‌లను యూఏఈలోనే ఆడింది. యూఈఏలో చాలా మంది క్రికెట్ అభిమానులు దక్షిణాసియా నుంచే ఉన్నారు. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య పీఎస్ఎల్ వంటి టోర్నమెంట్ నిర్వహించడం వల్ల ఇరు దేశాల మైత్రి దెబ్బతింటుంది. భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే పీఎస్ఎల్ను నిర్వహించేందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు సిద్దంగా లేదని" క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా రావాల్పిండి స్టేడియం సమీపంలో డ్రోన్ అటాక్ జరగడంతో పీఎస్ఎల్-2025 సీజన్‌ను పీసీబీ వాయిదా వేసింది.

IPL 2025: ఐపీఎల్ వాయిదా.. టికెట్ల డబ్బులు రీఫండ్
పాకిస్తాన్-భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగా ఐపీఎల్-2025ను వారం రోజుల పాటు బీసీసీఐ తాత్కాలికంగా వాయిదా వేసింది. ఆటగాళ్ల భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. త్వరలోనే కొత్త షెడ్యూల్, వేదికలను ఖారారు చేస్తామని భారత క్రికెట్ బోర్డు తెలిపింది.దీంతో మే 9(శుక్రవారం) నుంచి మ్యాచ్‌లు ఆగిపోనున్నాయి. ఐపీఎల్ నిరవధిక వాయిదా పడడంతో ఆయా ఫ్రాంచైజీలు అభిమానులకు టిక్కెట్ల డబ్బులను రీఫండ్ చేయడం ప్రారంభించాయి. షెడ్యూల్ ప్రకారం..ఏక్నా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడాల్సింది. కానీ వాయిదా పడడంతో టిక్కెట్ల డబ్బులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు లక్నో సూపర్ జెయింట్స్ ప్రకటించింది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా టిక్కెట్ల డబ్బులను రీఫండ్ చేస్తామని వెల్లడించింది. కాగా గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా అర్ధాంతంగా రద్దు అయ్యింది. ఐపీఎల్-2025లో మిగిలిన మ్యాచ్‌లో యూఏఈలో నిర్వహించే అవకాశముంది.

'ఐపీఎల్‌ను ఇంగ్లండ్‌లో నిర్వహించండి'.. బీసీసీఐకి మాజీ క్రికెటర్ సూచన
ఐపీఎల్-2025ను భారత క్రికెట్ బోర్డు వారం రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేసింది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నీ ఎప్పుడు పునఃప్రారంభమవుతుందో స్పష్టమైన తేదీని మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు.దీంతో విదేశీ ఆటగాళ్లు తమ స్వదేశానికి పయనం కానున్నారు. ఆ తర్వాత ఐపీఎల్ తిరిగి ప్రారంభమైన కూడా చాలా మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోవచ్చు. అయితే మిగిలిన టోర్నీని విదేశాలకు తరలించిన ఆశ్చర్యపోనక్కర్లలేదు. బీసీసీఐకు యూఏఈ మొదటి అప్షన్‌గా ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లను కూడా యూఏఈలోనే నిర్వహించాలని పీసీబీ నిర్ణయించింది. దీంతో బీసీసీఐ ఐపీఎల్ మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహిస్తుందా? లేదా భారత్‌లోనే కొనసాగుస్తుందా అన్నది వేచి చూడాలి. ఈ క్రమంలో భారత క్రికెట్ బోర్డుకు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కీలక సూచనలు చేశాడు. ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్‌లను పూర్తి చేయడానికి ఇంగ్లండ్‌ను మంచి ఎంపికగా బీసీసీఐ పరిగణించాలని వాన్ అభిప్రాయపడ్డాడు. "ఐపీఎల్-2025లో మిగిలిన మ్యాచ్‌లను యూకేలో నిర్వహిస్తే బాగుటుంది. మాకు చాలా స్టేడియాలు ఉన్నాయి.అంతేకాకుండా భారత ఆటగాళ్లు ఐపీఎల్‌ను పూర్తి చేసుకుని టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్‌లోనే ఉండిపోవచ్చు. ఇది కేవలం నా ఆలోచన మాత్రమే" అని ఎక్స్‌లో వాన్ రాసుకొచ్చాడు. కాగా ఈ ఏడాది జూన్‌లో భారత జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది.చదవండి: IPL 2025: ఐపీఎల్ వాయిదా ఎన్ని రోజులంటే? బీసీసీఐ కీలక ప్రకటన

శ్రీలంకను చిత్తు చేసిన సౌతాఫ్రికా..
సొంతగడ్డపై జరుగుతున్న మహిళల ముక్కోణపు వన్డే సిరీస్‌లో శ్రీలంకకు మరో పరాభావం ఎదురైంది. శుక్రవారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో శ్రీలంక ఓటమి పాలైంది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 9 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోర్ చేసింది.సౌతాఫ్రికా బ్యాటర్లలో అన్నేరీ డెర్క్సెన్(104) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. క్లోయ్ ట్రయాన్(74), లారా వోల్వార్డ్(33), బ్రిట్స్(38), నాడిన్ డి క్లెర్క్(32) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లంక బౌలర్లలో దేవ్మీ విహంగా ఐదు వికెట్లు పడగొట్టగా.. ఆతపట్టు, మనుడి నానాయక్కర తలా వికెట్ సాధించారు. అనంతరం 316 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 42.5 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్లలో చామరి ఆతపట్టు(52) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అనుష్క సంజీవని(43), హర్షితా సమరవిక్రమ(33), పెరీరా(30) రాణించారు.సఫారీ బౌలర్లలో క్లోయ్ ట్రయాన్ ఐదు వికెట్లతో చెలరేగింది. అందులో ఓ హ్యాట్రిక్ కూడా ఉంది. ఆమెతో పాటు ఖాఖా రెండు, శేష్నీ నాయుడు, స్మిత్ తలా వికెట్ సాధించారు. ఇక మే 11(ఆదివారం) జరగనున్న ఫైనల్ పోరులో భారత్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి.
బిజినెస్

2-3 రోజులు ఏటీఎం సర్వీసులు రద్దు..?
టెక్నాలజీ, సామాజిక మాధ్యమాల వాడకం పెరుగుతున్న ఈ రోజుల్లో ఫేక్ న్యూస్ వ్యాప్తి కూడా అధికమవుతుంది. భారత్-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో ఇండియాలోని ఏటీఎంలపై రాన్సమ్వేర్ దాడి కారణంగా మూడు రోజులపాటు సర్వీసులు పని చేయవన్నట్లు ఫేక్ వార్తలొస్తున్నాయి. వచ్చే వారం మే 12 సోమవారం వరకు ఏటీఎం సర్వీసులు నిలిపేస్తున్నారని అందులో ఉంది. అయితే ఈ రాన్సమ్వేర్ దాడులు కేవలం భారత్‌ను మాత్రమే కాకుండా 74 ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అబద్ధపు వార్తలు వైరల్ అవుతున్నాయి.ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వార్తలను కోట్ చేస్తూ ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. వాట్సప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను గుడ్డిగా నమ్మకూడదని తెలిపింది. దేశంలోని ఏటీఎంలపై ఎలాంటి సైబర్ దాడులు జరగలేదని తెలిపింది. గతంలోలాగే యథావిధిగా ఏటీఎం సర్వీసులు కొనసాగుతాయని పేర్కొంది. ఇదీ చదవండి: 60 నుంచి 45 ఏళ్లకు రిటైర్మెంట్ వయసు?Are ATMs closed⁉️A viral #WhatsApp message claims ATMs will be closed for 2–3 days.🛑 This Message is FAKE✅ ATMs will continue to operate as usual❌ Don't share unverified messages.#IndiaFightsPropaganda pic.twitter.com/BXfzjjFpzD— PIB Fact Check (@PIBFactCheck) May 9, 2025ప్రజలు సాధారణ రోజులతోపాటు ఇలాంటి భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ సమయాల్లో ఫేక్ న్యూస్‌కు సంబంధించి మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి అంశాన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని వార్తలపై ఓ నిర్ణయానికి రావాలని చెబుతున్నారు.

ఐటీలో ఒక్కో ఉద్యోగి వల్ల ఆదాయం ఎంతంటే..
దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో 2025 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రతి ఉద్యోగి ద్వారా సమకూరే ఆదాయం(రెవెన్యూ పర్ ఎంప్లాయి-ఆర్పీఈ) పెరిగింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల ద్వారా సమకూరే ఆదాయం ఏడేళ్ల గరిష్టాన్ని తాకినట్లు కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. మెరుగైన వనరుల వినియోగం, ఆటోమేషన్, కార్యాచరణ సామర్థ్యాల ద్వారా ఇది సాధ్యమైందని కంపెనీలు తెలిపాయి. కాగా, ఇటీవల సంస్థల త్రైమాసిక లాభాలు తగ్గుముఖం పట్టడం గమనార్హం. ఒక్కో ఉద్యోగి ద్వారా 2024-25లో ఏయే సంస్థకు ఎంత సమకూరిందో కింద తెలుసుకుందాం.టీసీఎస్: 49,638 డాలర్లు(సుమారు రూ.41.67 లక్షలు) గతేడాది కంటే ఇది 2.7 శాతం పెరిగి ఏడేళ్ల గరిష్టాన్ని చేరింది. టీసీఎస్ కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 6,07,979.ఇన్ఫోసిస్: 59,575 డాలర్లు(సుమారు రూ.50 లక్షలు). గతంలో కంటే 1.8% పెరిగి ఏడేళ్ల గరిష్టానికి చేరింది. ఇన్ఫోసిస్ కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 3,17,240.హెచ్‌సీఎల్ టెక్: 61,946 డాలర్లు (సుమారు రూ.51.9 లక్షలు). గతంలో కంటే 6.2% పెరిగింది. హెచ్‌సీఎల్ టెక్ కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 2,27,000.విప్రో, టెక్ మహీంద్రా రెండూ ఆర్‌పీఈలో క్షీణతను నమోదు చేశాయి.క్రమబద్ధీకరించిన కార్యకలాపాలు, సమర్థవంతంగా ప్రాజెక్ట్‌ల అమలు, అధునాతన ఆటోమేషన్ వ్యూహాల కారణంగా ఆర్‌పీఈలో మెరుగుదల కనిపించినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, లేఆఫ్స్ పేరుతో ఇటీవల కాలంలో చాలామంది ఉద్యోగులను తొలగించడంతోనే కంపెనీలకు ఇలా ఆర్పీఈ పెరిగినట్లు కనిపిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: 60 నుంచి 45 ఏళ్లకు రిటైర్మెంట్ వయసు?కంపెనీలకు లాభాలు ఉన్నప్పటికీ ప్రపంచ స్థూల ఆర్థిక అనిశ్చితితో ఐటీ రంగం సవాళ్లు ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఐటీ సేవలకు డిమాండ్ మందగించడం, వ్యయ ఒత్తిళ్లు, లేఆఫ్స్ ఆందోళనలు భవిష్యత్ రాబడులపై ప్రభావం చూపనున్నాయని కొందరు అంచనా వేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలతో ఐటీ సంస్థలు స్కిల్ డెవలప్మెంట్, ఆటోమేషన్, కాస్ట్ ఎఫిషియెన్సీలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు.

60 నుంచి 45 ఏళ్లకు రిటైర్మెంట్ వయసు?
శరవేగంగా మారుతున్న భారత కార్పొరేట్ ప్రపంచంలో 60 ఏళ్ల వరకు హాయిగా పనిచేయాలనే ఆలోచన మెల్లమెల్లగా కనుమరుగవుతోంది. ఈ రోజుల్లో వృత్తి నిపుణులు పని వాతావరణంలో చాలా ఒత్తిడిని అనుభవిస్తున్నారు. దాంతో యువ ఉద్యోగుల్లో 45 ఏళ్లు వచ్చేవరకే రిటైర్ అవ్వాలనే ధోరణి పెరుగుతోంది. అయితే ఇది ఆదోళన కలిగించే అంశమని కొందరు నిపుణులు భావిస్తున్నారు.ఈ సందర్భంగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, అడ్వైజర్ సార్థక్ అహుజా మాట్లాడుతూ..‘ఉద్యోగుల్లో ఈ మార్పు వాస్తవమే. ఇది ఆందోళన కలిగించే అంశం. రిటైర్మెంట్ వయసు 60 నుంచి 45 ఏళ్లకు మారుతుండడంతో భారతీయ కార్పొరేట్లలో ఆందోళన కలిగించే అంశం. ఇది మంచి పద్ధతి కాదు. లీగల్ లేదా వైద్యం వంటి రంగాల్లో పని చేస్తున్న వృత్తి నిపుణుల వయసు పెరిగే కొద్దీ ఎక్కువ గౌరవం, అధిక వేతనం అందుతాయి. అదే సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ప్రొడక్ట్, టెక్ వంటి కార్పొరేట్ ఉద్యోగాలు ఇందుకు పూర్తి విరుద్ధం. వయసు పెరిగేకొద్దీ పనితీరు కాస్త తగ్గుతుంది. కొత్త టెక్నాలజీలకు అలవాటుపడే మనస్తత్వం ఉండదు. సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ ముఖ్యంగా టెక్నాలజీ వంటి విభాగాల్లో 40 ఏళ్ల పైబడినవారు పనికిరారని చాలా కంపెనీలు భావిస్తున్నాయి’ అన్నారు.ఇదీ చదవండి: ఒక్కరోజులో భారీగా క్షీణించిన రూపాయి విలువ‘40 ఏళ్లు పైబడినవారు నైపుణ్యం లేనివారు కాదు. వారు యువ ప్రతిభావంతుల మాదిరి చురుకుగా ఉండకపోవచ్చు. కానీ వారి అనుభవం కచ్చితంగా ఉపయోగపడుతుంది. అందుకే చాలా కంపెనీలు వీరిని పూర్తిగా తొలగించడం లేదు. అయితే కంపెనీల్లో కొత్త విభాగాలు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు మాత్రం వీరికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో 40 ఏళ్లు పైబడిన వారికి మెరుగైన నైపుణ్యాలు ఇచ్చేందుకు అప్ స్కిల్ సెంటర్లకు డిమాండ్ పెరుగుతోంది’ అని అహుజా వివరించారు.

ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు (Gold Prices) ఒక్కసారిగా పడిపోయాయి. వరుసగా నాలుగు రోజులుగా భగ్గుమన్న పసిడి ధరలు నేడు (మే9) భారీగా దిగివచ్చాయి. గత నాలుగు రోజుల్లో పసిడి 10 గ్రాములకు ఏకంగా రూ.4వేలకు పైగా ఎగిసి మళ్లీ రూ.లక్షకు చేరువైంది. దీంతో ఆందోళన చెందుతున్న కొనుగోలుదారులకు నేటి భారీ తగ్గుదల ఊరట కలిగించనుంది. మే 9 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.1250, రూ.1150 చొప్పున క్షీణించాయి.👉ఇది చదివారా? బంగారం మాయలో పడొద్దు.. సీఏ చెప్పిన లెక్కలు చూస్తే..చెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.1250, రూ.1150 చొప్పున క్షీణించాయి.ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,500- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,300ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్‌ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్‌మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.1250, రూ.1150 చొప్పున క్షీణించాయి.ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.1250, రూ.1150 చొప్పున క్షీణించాయి.బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.1250, రూ.1150 చొప్పున క్షీణించాయి.వెండి ధరలు ఇలా..దేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,11,000 వద్ద, ఢిల్లీ ప్రాంతంలో రూ. 99,000 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
ఫ్యామిలీ

స్ట్రీట్ వేర్.. షీక్ స్టైల్.. ఐపీఎల్ క్రికెటర్ @ఐవేర్..
సాక్షి, సిటీబ్యూరో : ఫ్యాషన్ ప్రపంచంలో స్ట్రీట్ వేర్‌కు తనకంటూ ఓ స్టైల్ ఉంది.. ప్రముఖ బ్రాండ్స్ తమదైన శైలిలో వీటిని డిజైన్ చేసి యూత్‌ని ఆకట్టుకుంటుంటాయి.. అదే క్రమంలో ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ షీక్ తమ స్ట్రీట్ వేర్‌ను నగరంలో ప్రదర్శించింది. మాదాపూర్‌లోని నోవోటెల్ హోటల్లో నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది.. ఈ సందర్భంగా బ్రాండ్‌ను సిటీలో లాంచ్ చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీఅగ్రగామి క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ నగరంలో సందడి చేశాడు. అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు, షేక్ హ్యాండ్స్ ఇస్తూ వారిని అలరించాడు. నగరంలోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్లోని ఐవేర్ బ్రాండ్ అయిన ఎఓ ఆప్టికల్స్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాండ్ రూపొందించిన సరికొత్త కళ్లజోళ్ల కలెక్షన్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రాండ్ డైరెక్టర్ ప్రియాంక గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి : Operation Sindoor సలాం, హస్నాబాద్!ఇంటర్న్ షిప్‌తో కెరీర్‌కు ఊతం నగరంలోని కేఎల్‌హెచ్ డీమ్డ్ యూనివర్సిటీ, అజీజ్ నగర్ క్యాంపస్, తమ విద్యార్థులు ప్రముఖ బహుళజాతి సంస్థలు ( MNఇలు) సహా ప్రఖ్యాత కంపెనీల నుంచి పెద్ద సంఖ్యలో ప్లేస్మెంట్ ఆఫర్లు పొందారు. ఈ విషయాన్ని యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ కోనేరు లక్ష్మణ్ హవిష్ తెలిపారు. పలు సంస్థల్లో విద్యార్థులకు ఇంటర్న్íÙప్ ఆధారిత ఉద్యోగాలు లభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కెరీర్‌కు ఎంతో మేలు చేస్తాయని, పెద్ద సంఖ్యలో తమ విద్యార్థులు ఒప్పో వంటి సంస్థల్లో ఇంటర్న్íÙప్ టూ ప్లేస్‌మెంట్స్ ఆఫర్స్ ద్వారా రూ.19లక్షల ప్యాకేజీ దక్కించు కోనున్నారని వెల్లడించారు. మరికొందరు విద్యార్థులు సీమన్స్ సంస్థ నుంచి నేరుగా ప్లేస్మెంట్ ఆఫర్స్ దక్కించుకున్నారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

Rahu Ketu రాహుకేతువుల కథ
భారతీయ సంస్కృతిలో సూర్య, చంద్రగ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇందుకు ఈ కథ ఒక కారణం: విష్ణువు జగన్మోహినిగా దేవతలకు అమృతాన్ని పంచిపెడుతుంటాడు. రాక్షసులకు సుర మాత్రం ఇచ్చి తాగిస్తుంటాడు. దీనిని దక్షప్రజాపతి శాపవశంతో రాహువు తెలుసుకునిఅసురుల వైపు నుంచి లేచొచ్చి సూర్యచంద్రుల మధ్య కూర్చుంటాడు. ఈ విషయాన్ని సూర్య చంద్రులు కను సైగలతో విష్ణువుకి తెలియ జేస్తారు. అయితే అప్పటికే రాహువుకి విష్ణువు అమృతం ఇవ్వడం వల్ల అతడు అమృతాన్ని తాగుతాడు.తర్వాత విషయం తెలుసుకున్న విష్ణువు వెంటనే తన చక్రాయుధాన్ని ప్రయోగించి రాహువు కంఠాన్ని ఖండిస్తాడు. కానీ అప్పటికే రాహువు అమృతాన్ని సేవించడం వల్ల అతని తల, మొండెం కూడా సజీవాలై ఉంటాయి. తల విష్ణువుతో ‘మహాత్మా! అకారణంగా నా కంఠాన్ని తెగగొట్టావు. నువ్వు ఇస్తేనే కదా నేను అమృతం తాగాను. నువ్వే ఇలా చేయడం మంచిదా’అని అడుగుతాడు.రాహువు మాటలు విన్న విష్ణువు మనసు కరుగుతుంది. ‘సరే జరిగిపోయిన దానినే తలచి బాధ పడడం తగదు. అది విధివిధానం. నీకేం కావాలో కోరుకో’ అంటాడు విష్ణువు. అప్పుడు రాహువు ‘దేవా! సూర్యచంద్రులు చెప్పబట్టే కదా నువ్వు నా మీద ఈ చర్యకు పాల్పడ్డావు. కనుక వారిద్దరిని మింగడానికి నాకు అనుమతి ఇవ్వు’ అంటాడు.ఇదీ చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీఅందుకు విష్ణువు ‘నువ్వు సూర్యచంద్రులను మింగితే లోకాలన్నీ సంక్షోభంలో చిక్కుకుంటాయి. ఏడాదిలో ఏదైనా ఓ అమావాస్యనాడు సూర్యుడిని, పౌర్ణమినాడు చంద్రుడిని మింగి వెంటనే విడిచిపెట్టు. నువ్వు విడిచిపెట్టకపోతే నీ తల వెయ్యి ముక్కలయి చనిపోతావు. సూర్యచంద్రులు నీకు చేసిన తప్పుకు వారికీ శిక్ష చాలు’ అంటాడు.రాహువుకు తల, మొండెం వేర్వేరు అయినప్పటికీ అమృతం సేవించిన కారణంగా ఒకరిద్దరయ్యారు. తల కేతువుగా సూర్యుడిని మింగడానికి, మొండెం రాహువుగా చంద్రుని మింగడానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ విధంగా సూర్యచంద్రులు రాహుకేతువుల పాల్పడి గ్రహణాలు మొద లయ్యాయని పురాణ కథ. అయితే గ్రహణాలు ఏర్పడడానికి శాస్త్రీయ కారణాలు ఉన్నాయన్నది గమనించాలి. – యామిజాల జగదీశ్

మినీ ఆఫ్రికా@ టోలిచౌకీ..!
టోలిచౌకీని ఆనుకుని ఉన్న పారామౌంట్ కాలనీ మినీ ఆఫ్రికాను తలపిస్తుంది. అధునాతన నివాస గృహాలు ఎత్తయిన ప్రదేశంలో ఉన్న ఈ కాలనీ ప్రస్తుతం సూడాన్, సొమాలియా వాసుల అడ్డాగా పేరుగాంచింది. ఇక్కడ ఉంటున్న వారిలో 90 శాతం మంది మినీ ఆఫ్రీకాకు చెందిన వారే. ప్రశాంత వాతావరణంలో ఉండడంతో పాటు ఫిలింనగర్, జూబ్లీహిల్స్, టోలిచౌకీ చౌరస్తా తదితర ప్రదేశాలకు అత్యంత సమీపంలో ఉన్న పారామౌంట్ కాలనీ ఆఫ్రీకా దేశాలకు చెందిన విద్యార్థులకు అడ్డాగా నిలుస్తోంది. పదేళ్ల క్రితం స్థానికులతో నిండి ఉన్న ఈ కాలనీ నేడు ఆఫ్రికా దేశస్తులతో నిండివుంది. కొత్తగా నిర్మితమవుతున్న భవనాలను సైతం సూడాన్, సొమాలియా దేశాలకు చెందిన విద్యార్థులు అద్దెకు ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. గతంలో ఇక్కడ ఉన్న ఇరానీ రెస్టారెంట్లు, చిన్న చిన్న కిరాణా దుకాణాలు మాయమై వాటి స్థానంలో అత్యాధునిక ఆఫ్రికన్ కిచెన్లు వెలిశాయి. ఆఫ్రికన్ తరహా జీవనశైలి.. టీ సెంటర్లలో సైతం అరేబియన్ టీ అందుబాటులో ఉంటుంది. ఇక్కడి షాపులు ఆఫ్రికన్ దేశాల వారికి అవసరమయ్యేవే ఎక్కువగా లభిస్తున్నాయి. రేడీమేడ్ షాపుల్లో సైతం సూడాన్ యువకులు ఇష్టపడి తొడిగే టీషర్ట్స్ మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఆఫ్రికన్ దేశాల నుంచి విద్యాబ్యాసం కోసం వచ్చే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు సైతం పలు కారణాలతో ఇక్కడకు వస్తున్నారు. ఒక సూడానీస్‌తో పాటు అదనంగా ఇద్దరు ముగ్గురు వారి కుటుంబ సభ్యులు ఒక్కొ ప్లాట్‌లో ఉంటున్నారు. దీంతో స్థానికులు, వ్యాపారులు సైతం నెమ్మదిగా ఇంగ్లిష్తో పాటు సూడానీస్, సొమాలియా భాషను నేర్చుకుంటున్నారు. (చదవండి: రేపటి నుంచే ప్రతిష్టాత్మక మిస్ వరల్డ పోటీలు..!)

Miss world 2025: అందరి చూపు.. భాగ్యనగరం వైపు..
ప్రస్తుతం ప్రపంచమంతా హైదరాబాద్ నగరం వైపే చూస్తోంది. దాదాపు 120 దేశాలకు పైగా ఆయా దేశ అధికార ప్రతినిథులు, ప్రముఖులు నగరానికి గగనతల ప్రయాణం చేస్తున్నారు. నగర వేదికగా ప్రతిష్టాత్మక 72వ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతి రోజూ వివిధ దేశాలకు చెందిన సుందరీమణులతో కళకళలాడుతోంది. అయితే రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ సుందరి పోటీల నేపథ్యంలో నగరంతో పాటు దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లోనూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పోటీల్లో పాల్గొనే 109 దేశాలకు చెందిన పోటీదారులు ఇప్పటికే నగరానికి చేరుకోగా మరికొన్ని దేశాలకు చెందిన వారు శుక్రవారం రానున్నారు. ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్ ఘన వేదికగా మారిన విషయం విధితమే.. ఇందులో పాల్గొనే సుందరీమణులు ఇప్పటికే ప్రీ ట్రయల్స్‌లో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తాతో పాటు, అథెనా క్రాస్బీ (అమెరికా), ఎమ్మా మోరిసన్ (కెనడా), వాలేరియా కాన్యావో (వెనిజులా) వంటి తారలు మిస్ వరల్డ్ వేదిక పై ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. అంతేకాకుండా అమెరికా, దక్షిణాఫ్రికా, వెనిజులా వంటి ప్రముఖ దేశాలతో పాటు గ్వాడలూప్, గిబ్రాల్టర్, మార్టినిక్, క్యురాకావ్ వంటి చిన్న దేశాల నుంచి కూడా 72వ మిస్ వరల్డ్ పోటీల్లో అభ్యర్థులు పాల్గోనుండడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో వరల్డ్ టాప్ మోడల్స్‌తో పాటు విద్యార్థులు, డాక్టర్లు, న్యాయవాదులు, సామాజిక వేత్తలు, ఆరి్టస్టులు, విభిన్న రంగాలకు చెందిన ఉద్యమకారులు తమ దేశాల తరపున ప్రాతినిధ్యం వహిస్తూ పోటీపడుతుండటం మరో విశేషం. దేశవ్యాప్తంగా డిజిటల్ వెల్కమ్.. పోటీదారులు దాదాపు నెల రోజులపాటు తెలంగాణలో పర్యాటక, సాంస్కృతిక, వైద్య, చేనేత, ఆవిష్కరణ కేంద్రాలను సందర్శించనున్నారు. గతేడాది ముంబయిలో మిస్ వరల్డ్ ఈవెంట్ జరగగా, ఈ ఏడాది మే 31న హైదరాబాద్, హైటెక్స్ వేదికగా గ్రాండ్ ఫినాలే జరగనుంది. మిస్ వరల్డ్ పోటీలను వరుసగా రెండేళ్ల పాటు భారత్‌లో నిర్వహించడం తొలిసారి. ఈ అరుదైన గౌరవం దేశానికి మాత్రమే కాదు, తెలంగాణకు కూడా విశ్వవేదికపై విశిష్ట గుర్తింపునిస్తుంది. ఈ విశిష్ట కార్యక్రమానికి సంబంధించి దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు చెందిన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ వెల్కమ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పోటీలను తిలకించడానికి సామాన్యులకు సైతం ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడంతో వివిధ నగరాల నుంచి ఫ్యాషన్ ఔత్సాహికులు నగరానికి రావడానికి సన్నద్ధమవుతున్నారు. (చదవండి: Miss World 2025: అందాల పోటీలో హైలెట్‌గా 'పోచంపల్లి చీరలు')
ఫొటోలు


భారత సైన్యానికి మద్దతుగా.. (ఫొటోలు)


ట్రెడిషనల్ + వెస్ట్రన్... లాపతా లేడీ సరికొత్త స్లైల్ (ఫొటోలు)


ఫ్రెండ్ పెళ్లిలో ఒకప్పటి హీరోయిన్ మీనా సందడి (ఫొటోలు)


హీరోయిన్ సోనమ్ కపూర్ పెళ్లి రోజు.. భర్తతో ఇలా (ఫొటోలు)


తమిళ సినీ నిర్మాత కూతురి పెళ్లిలో ప్రముఖులు (ఫోటోలు)


బర్త్ డే స్పెషల్.. సాయిపల్లవి గురించి ఇవి మీకు తెలుసా? (ఫొటోలు)


అన్నవరం : కన్నుల పండువగా సత్యదేవుని దివ్య కల్యాణోత్సవం (ఫొటోలు)


హైదరాబాద్ : సైన్యానికి సంఘీభావం..సీఎం రేవంత్ క్యాండిల్ ర్యాలీ (ఫొటోలు)


తిరుపతి : గంగమ్మా..కరుణించమ్మా సారె సమర్పించిన భూమన (ఫొటోలు)


బర్త్‌డే స్పెషల్.. విజయ్ దేవరకొండ గురించి 10 ఆసక్తికర విషయాలు (ఫొటోలు)
అంతర్జాతీయం

గాల్లో దీపం పాక్ గగనతలం
పాకిస్తాన్‌పై ప్రళయ భీకరంగా భారత వైమానిక బలగాలు దాడి చేస్తుంటే ఆ దేశ రక్షణ వ్యవస్థ చేష్టలుడిగి చూసిందన్న వార్త నేపథ్యంలో అసలు ఈ ధూర్తదేశ గగనతలానికి రక్షణ ఉందా? ఉంటే ఎలాంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను పాకిస్తాన్ మోహరించిందనే సందేహాలు సర్వత్రా వ్యక్తమ వుతున్నాయి. శతఘ్నులు, యుద్ధ విమానాలు మొదలు జలాంతర్గాములదాకా చాలా రకాల ఆ యుధాలపై పాకిస్తాన్ చైనా మీదనే ఆధారపడు తోంది. గగనతల రక్షణ వ్యవస్థలను సైతం చైనా నుంచే కొనుగోలు చేసింది. పాకిస్తాన్ మోహరించిన హెచ్‌క్యూ–9పీ, హెచ్‌క్యూ–16 గగనతల రక్షణ వ్యవస్థలను భారత్ నాశనంచేసింది. ము ఖ్యంగా లాహోర్, సియాల్కోట్లలో మోహరించిన హెచ్‌క్యూ–9పీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత వైమానిక దళాలు ధ్వంసంచేశాయి. చైనా తన కోసం తయారుచేసుకున్న హెచ్‌క్యూ–9 రకం వ్యవస్థను పాకిస్తాన్ కోసం కాస్త మార్పులు చేర్పులుచేసి ఆ దేశానికి అమ్మేసింది. ‘‘రష్యా తయారుచేసిన ఎస్–300 మిస్సైల్ వ్యవస్థను చైనా తయారీ హెచ్‌క్యూ–9 క్షిపణి వ్యవస్థ పోలి ఉంటుంది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సుపై భారత క్షిపణులు విరుచుకుపడుతున్నా పాకిస్తాన్ గగనతల రక్షణవ్యవస్థలు ఏమాత్రం పసిగట్టలేక పోయాయి. ఇది పూర్తిగా ఎయిర్‌డిఫెన్స్ వ్యవస్థ వైఫల్యాన్ని అద్దంపడుతోంది’’ అని యుద్ధరంగ నిపుణుడు సందీప్ ఉన్నిథాన్ చెప్పారు. ‘‘ దూసుకొస్తున్న శత్రుదేశాల క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లను ముందుగా కనిపెట్టాల్సిన గురుతర, కీలక బాధ్యత ఈ ఎయిర్‌డిఫెన్స్ వ్యవస్థలదే. రక్షణ, వైమానిక స్థావరాల రక్షణకు ఇదే ప్రాణం. అలాంటి వ్యవస్థలే విఫలమైన నేపథ్యంలో త్వరలో భారత్ జరపబోయే దాడులను అడ్డుకునే వ్యవస్థ ఇక లాహోర్, సియాల్కోట్ వంటి చోట్ల లేదనే చెప్పాలి’’ అని ఉన్నిథాన్ వ్యాఖ్యానించారు. అంతా మేకపోతు గాంభీర్యంభారత్ దాడి చేస్తే ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ గతంలోనే ప్రకటించింది. తమ వైమానిక, క్షిపణి విధ్వంసక వ్యవస్థలను వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించామని, ఎలాంటి దాడినైనా ఎదుర్కొనే సత్తా తమకు ఉందని ఇన్నాళ్లూ పాకిస్తాన్ చేసిన భీష్మ ప్రతిజ్ఞలన్నీ కేవలం మేకపోతు గాంభీర్యమని బుధవారం నాటి భారతదాడితో తేలిపోయింది. అరగంటలోపు రెండు డజన్లకుపైగా క్షిపణులతో భారత్ విరుచుకుపడుతుంటే వాటిని పాక్ గగనతల వ్యవస్థలు అడ్డుకోలేకపోయాయి. మూడేళ్ల క్రితం అత్యాధునిక బ్రహ్మోస్‌కు సంబంధించిన డమ్మీ క్షిపణి పొరపాటున పాకిస్తాన్ గగనతలంలోకి దూసుకెళ్లినప్పుడు కూడా పాక్ ఎయిర్‌డిఫెన్స్ వ్యవస్థ దానిని కూల్చలేకపోయాయి. అటుగా మన క్షిపణి వెళ్లిన విషయాన్ని మొదట స్వయంగా భారతే ప్రకటించింది. ఇప్పుడు లాహోర్, సియాల్కోట్లోనూ ఇదే వైఫల్యం పునరావృతమైంది. 2019లో భారత వైమానిక దాడులు చేసిన బాలాకోట్‌లో ముష్కరుల స్థావరాలను నేలమట్టంచేసింది. ఆరోజు సైతం భారత గగనతల సంచారాన్ని పాక్ గగనతల వ్యవస్థలు ఏమాత్రం కనిపెట్టలేకపోయాయి. వేధిస్తున్న సాంకేతిక సమస్యలుచైనా తయారీ రక్షణ వ్యవస్థలు తరచూ మొరాయి స్తుండటం, రిపేర్లమయం కావడం పాకిస్తాన్‌కు పెద్ద సమస్యగా తయారైంది. పాకిస్తాన్ తన రక్షణవ్యవ స్థలకు భారీగా నిధులను కేటాయించలేకపో వడమూ ఇందుకు ప్రధాన కారణం. ఉన్న ఆయు« దాలతోనే ఎలాగోలా పాక్ సాయుధబలగాలు నెట్టుకొస్తున్నట్లు తెలుస్తోంది. గగనతల రక్షణ వ్యవ స్థలను వాస్తవానికి ఎప్పటికప్పుడు ఆధునీకరించుకోవాలి. ఇప్పటికే పేదరికం, ద్రవ్యోల్బణం, అప్పులతో కుదేలైన పాకిస్తాన్‌కు ఎప్పటికప్పుడు కొత్త వ్యవస్థను కొనే ఆర్థిక దమ్ము లేదు. ఇవన్నీ కలిసి ఇప్పుడు దాని గగనతల రక్షణ వ్యవస్థను మరింత నిర్వీర్యం చేస్తున్నాయి.పాకిస్తాన్ వద్ద ఉన్న వ్యవస్థలేంటి?హెచ్‌క్యూ–9పీ, హెచ్‌క్యూ–9బీఈ, ఎఫ్ డీ– 2000, హెచ్‌క్యూ–16ఎఫ్ఈ గగనతల రక్షణ వ్యవస్థలపై పాక్ ఆధా రపడుతోంది. వీటితోపాటే పాతతరం ఎల్వై–80, ఎఫ్ఎం–90 రకాలూ ఎంతోకొంత పాక్‌కు సాయపడుతున్నాయి. 40 కిలోమీటర్ల స్థాయిలో లక్ష్యాలను ఛేదించడానికి ఎల్వై–80ను పాక్ వాడుతోంది. మే 7వ తేదీ అర్థరాత్రి దాటాక భారత్ చేసిన దాడిలో హెచ్‌క్యూ–16 వ్యవస్థ నాశనమైంది. చైనా నుంచి 2021లో హెచ్‌క్యూ–9పీ దీర్ఘశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థను దిగుమతి చేసుకుంది. తమ గగనతలంలోకి వచ్చిన శత్రు క్షిపణులను 125 కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించి నేలమట్టంచేయగలదు. యుద్ధ విమానాలనూ అడ్డుకోగలదు. – సాక్షి, నేషనల్ డెస్క్

లాహోర్‌ను వీడండి.. తమ పౌరులకు అమెరికా హెచ్చరిక
పాక్ ఉన్న తమ పౌరులు వెంటనే వెనక్కి వచ్చేయాలని అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తమైంది. ఈ మేరకు పాక్‌లోని తమ పౌరులు, దౌత్యవేత్తలను అప్రమత్తం చేసింది. వెంటనే లాహోర్‌ను వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఈ మేరకు లాహోర్‌లోని యూఎస్ ఎంబసీ సూచనలు జారీ చేసింది. లాహోర్‌లో విమానాశ్రయం మూసివేయడంతో దౌత్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అమెరికా సూచించింది.కాగా, మరిన్ని సైనిక దాడులకు సిద్ధంగా ఉన్నామని భారత రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. పీవోకేలో ఉగ్ర వాదులను వేటాడుతున్నామని ఆయన తెలిపారు. పాకిస్థాన్ గగనతల రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా భారత్ ప్రతీకార దాడులు చేస్తోంది. లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ధ్వంసమైనట్లు తెలుస్తోందని భారత్ ఇప్పటికే వెల్లడించింది. పాకిస్థాన్ మిస్సైళ్లను భారత దళాలు కూల్చివేశాయి.యాంటి మిస్సైల్ సిస్టమ్ ద్వారా పాకిస్థాన్ మిస్సైళ్లను గాల్లోనే భారత్ పేల్చేసింది. ఎస్-400 మిస్సైళ్లను ఉపయోగించి పాక్‌కు భారత్ బుద్ధి చెప్పింది. గత రెండు రోజులుగా భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో దాడులకు పాకిస్థాన్ యత్నిస్తుండగా, వీటిని భారత రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకుంటున్నాయి. ఈ క్రమంలోనే లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసమైనట్లు తెలిసిందని భారత రక్షణశాఖ వెల్లడిచింది.

ఉన్నట్టుండి భారత్ వచ్చిన సౌదీ మంత్రి
న్యూఢిల్లీ: సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి అదెల్ అల్ జుబేర్ ఉన్నట్టుండి భారత్‌లో ప్రత్యక్షమయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ జరిపిన సైనిక దాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా మంత్రి అప్రకటిత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.చెప్పాపెట్టకుండా భారత్ వచ్చిన అదెల్ అల్ జుబేర్ గురువారం న్యూఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కలిశారు. సౌదీ అరేబియా వాతావరణ రాయబారి కూడా అయిన అదెల్ అల్ జుబేర్ తనను కలిసినట్లు జైశంకర్ నుండి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "ఈ ఉదయం సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి అదెల్ అల్ జుబేర్‌తో మంచి సమావేశం జరిగింది" అని ఆయన అన్నారు. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని తొమ్మిది చోట్ల ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బుధవారం భారత్ జరిపిన సైనిక దాడులను ప్రస్తావిస్తూ ఉగ్రవాదాన్ని గట్టిగా ఎదుర్కోవడంపై భారత్ దృక్పథాలను సౌదీ మంత్రితో పంచుకున్నట్లు జైశంకర్ పేర్కొన్నారు.భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో ద్వైపాక్షిక జాయింట్ కమిషన్ సమావేశానికి సహ అధ్యక్షత వహించేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి బుధవారం అర్ధరాత్రి న్యూఢిల్లీకి చేరుకున్న కొద్ది గంటల్లోనే జైశంకర్ తో సౌదీ మంత్రి భేటీ కావడం గమనార్హం.A good meeting with @AdelAljubeir, Minister of State for Foreign Affairs of Saudi Arabia this morning. Shared India’s perspectives on firmly countering terrorism. 🇮🇳 🇸🇦 pic.twitter.com/GGTfItZ3If— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 8, 2025

పాకిస్తాన్ లాహోర్‌లో పేలుళ్లు.. పరుగు తీసిన ప్రజలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని లాహోర్‌లో పేలుడు ఘటన చోటుచేసుకుంది. లాహోర్‌లోని వాల్టన్ విమానాశ్రయం సమీపంలోని లాహోర్‌లోని గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతాలలో వరుసగా బాంబు పేలుడు ఘటన సంభవించింది. ఎయిర్‌పోర్టు వద్ద గురువారం ఉదయం ఒక్కసారిగా సైరన్లు మోగడంతో ఇళ్ల నుంచి పాక్ ప్రజలు బయటకు పరుగులు తీశారు.అయితే, డ్రోన్ కారణంగానే పేలుడు సంభవించినట్లు పాక్ పోలీసులు చెబుతున్నారు. 5-6 అడుగుల పొడవున్న డ్రోన్ పేలుడు సంభవించి ఉండవచ్చని పోలీసు వర్గాలు తెలిపాయి. డ్రోన్ వ్యవస్థను జామ్ చేయడం ద్వారా కూల్చివేసినట్లు చెప్పుకొచ్చారు. వరుస బాంబు పేలుడు ఘటనలతో పాకిస్తాన్‌లోని కరాచీ, ఇస్లామాబాద్ సహా పలు విమనాశ్రయాలను అధికారులు మూసివేశారు. ఇక, భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన మరుసటి రోజే పేలుళ్లు సంభవించడం గమనార్హం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ బాంబు పేలుడుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.Panic in Lahore after blast near laWhore airport pic.twitter.com/zsQNyoE4hx— Team Jhaat Official (@TeamJhaant__) May 8, 2025 Utter chaos in Lahore after drone strike at Walton Road which leads to Lahore cantonment. People out on streets in panic. Asim Munir's Jihadist policies have invited war to Pakistan's streets. pic.twitter.com/1195BQxlhf— Divya Kumar Soti (@DivyaSoti) May 8, 2025Something hit Naval college besides #Askari 5. Sirens are #lahore One 1x Drone intercept in #Walton road.#IndiaPakistanWar#Pakistan#PakistanZindabadpic.twitter.com/XN8HkYsi4S— Muhammad Asif (Parody) (@MuhammadAsif26_) May 8, 2025
జాతీయం

ఢిల్లీలో హై అలర్ట్.. సెలవులు రద్దు
ఢిల్లీ: భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. నగరంలో హై అలర్ట్ ప్రకటించి అత్యవసర పరిస్థితులకు సన్నద్ధంలో భాగంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులకు సెలవులు రద్దు చేసింది.ఢిల్లీ నగరంలోని రద్దీ ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తూ కనిపించారు. ప్రముఖ సందర్శనా స్థలం ఇండియా గేట్ లోని సి-హెక్సాగాన్ చుట్టూ ఉన్న రహదారిలో జనాన్ని పోలీసులు ఖాళీ చేయించారు. అయితే, ఈ ప్రాంతంలో సాధారణంగా నిర్వహించే సాధారణ ట్రాఫిక్ నియంత్రణ కసరత్తులో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏ అధికారికి సెలవులు మంజూరు చేయరాదని కాంపిటెంట్ అథారిటీ ఆదేశించిందని సర్వీసెస్ డిపార్ట్మెంట్ గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల సెలవులను కూడా రద్దు చేసినట్లు అధికారులు ధృవీకరించారు.

భారత్, పాక్ యుద్ధం.. అమెరికా మద్ధతుపై జెడి వాన్స్ క్లారిటీ
'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. ఈ క్రమంలో భారత్, పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, వాన్స్ మాట్లాడుతూ.. నన్ ఆఫ్ అవర్ బిజినెస్ (అది ప్రాథమికంగా మాకు సంబంధించినది కాదు) అని అన్నారు.ఈ రెండు దేశాలను తాము నియంత్రించలేమని జెడి వాన్స్ అన్నారు. ఇరుదేశాలు దాడులకు పాల్పడుతున్నాయని తెలిపారు. రెండు అణుశక్తి దేశాల మధ్య ఇలాంటి ఘర్షణలు అందరికీ ఆందోళనకరమేనని అమెరికా ఉపాధ్యక్షుడు అన్నారు. వీలైనంత త్వరగా ఉద్రిక్తతలు తగ్గాలని తాము కూడా ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. సాధరణ ప్రజలకు నష్టం జరగకుండా చూడాలని తాము కోరుతున్నామని చెప్పారు. ఇండియా, పాకిస్థాన్ యుద్ధంలో అమెరికా కలుగజేసుకోదని క్లారిటీ ఇచ్చారు. తమ సైన్యం ఎవరికి సాయం చేయదని ప్రకటించారు. ఆపై అటు భారత్‌కు గాని పాకిస్థాన్‌కు గాని యుద్ధం ఆపమని చెప్పలేమన్నారు. అలా అని అణ్వాయుధాల ఉపయోగం ఎట్టిపరిస్థితిల్లోనూ జరగదని ఆయన తేల్చి చెప్పారు. 🚨🇺🇸 ‘NONE OF OUR BUSINESS’: JD Vance on 🇮🇳Indo-🇵🇰Pak escalation pic.twitter.com/EgQuySKbLt— Sputnik India (@Sputnik_India) May 8, 2025

జమ్మూకశ్మీర్‌లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులు
India-Pakistan War Updates:పాకిస్తాన్ మళ్లీ దాడులకు తెగబడుతోంది. శుక్రవారం(మే9వ తేదీ) రాత్రి కాగానే పాకిస్తాన్ మళ్లీ భారత్ ను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. ఎల్ఓసీలో పాక్ సైన్యం కాల్పులకు దిగడమే కాకుండా, డ్రోన్లను ప్రయోగిస్తూ సరహద్దు ప్రాంతాల్లో దాడులకు దిగింది. వీటిని భారత్ రక్షణ వ్యవస్థ సమర్ధవంతంగా తిప్పికొడుతోంది. జమ్మూ, సాంబా, పఠాన్ కోట్ తదితర ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగించింది. ఆ డ్రోన్లను భారత్ సైన్యం కూల్చివేసింది. దాంతో భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. శ్రీనగర్ లో భారీ పేలుడు శబ్దాలుపాక్ దాడులు.. ఇప్పటివరకూ దాయాదికి చెందిన 100 డ్రోన్లను కూల్చివేసిన భారత్‌ప్రధాని మోదీ నివాసంలో ముగిసిన కీలక సమావేశంసమావేశంలో పాల్గొన్న రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్సమావేశానికి హాజరైన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులుతాజా పరిణామాలను మోదీకి వివరించిన త్రివిధ దళాధిపతులు ఢిల్లీ :జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలపై డ్రోన్లు,మిస్సైల్స్ తో భారత సైనిక స్థావరాలు లక్ష్యంగా పాక్ దాడులుపాక్ డ్రోన్లను గగనతలం లో నిలువరిస్తున్న భారత రక్షణ వ్యవస్థకొనసాగుతున్న బ్లాక్ అవుట్సైరన్లతో ప్రజలను అప్రమత్తం చేస్తున్న భద్రతా బలగాలుఎల్ వో సి వద్ద కాల్పుల విరమణ ఒప్పందాలు ఉల్లంఘిస్తూ భారీగా కాల్పులుపాక్ కాల్పులను తిప్పి కొడుతున్న భారత సైన్యంఒమర్ అబ్దుల్లా ట్వీట్కాల్పులకు తెగబడుతున్న పాకిస్తాన్ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలి: ఒమర్ అబ్దుల్లాIt’s my earnest appeal to everyone in & around Jammu please stay off the streets, stay at home or at the nearest place you can comfortably stay at for the next few hours. Ignore rumours, don’t spread unsubstantiated or unverified stories & we will get through this together.— Omar Abdullah (@OmarAbdullah) May 9, 2025 ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశంహాజరైన నేవీ చీఫ్, జాతీయ భద్రతా సలహాదారుసరిహద్దుల్లో తాజా పరిస్థితిపై చర్చ సాంబా సెక్టార్లో పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత్భారత్ - పాక్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతజమ్మూకశ్మీర్‌లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులుసాంబా సెక్టార్లో పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత్వరుసగా రెండో రోజు చీకటి పడగానే డ్రోన్ దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్పాక్ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతున్న భారత్యూరీ, కుప్వారా, పూంఛ్, నౌగామ్ సెక్టార్లలో పాక్ కాల్పులుఫిరోజ్పూర్లో పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత్జైసల్మీర్, యూరీలో మోగిన సైరన్లు, బ్లాకౌట్ఎల్వోసీలో మళ్లీ పాక్ సైన్యం కాల్పులు యూరీ సెక్టార్ హెవీ షెల్లింగ్‌పాక్ కాల్పులను తిప్పికొడుతున్న భారత సైన్యం ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీప్రధాని మోదీ నివాసంలో జరిగిన సమావేశానికి త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు.నేవీ చీఫ్, జాతీయ భద్రతా సహదారు తాజా పరిణామాలను వెల్లడించారు.సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించారు.విశాఖ:విశాఖలో అప్రమత్తమైన బలగాలుకేంద్ర హోం శాఖ ఆదేశాలతో.. విశాఖ విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత పెంపుప్రతి ఒక్క ప్రయనికుడుని పూర్తిగా తనిఖీ చేస్తున్న CISF సిబ్బందివిమానాశ్రయం ఎంట్రీ లోనే చెకింగ్ చేస్తున్న CISF బలగాలుఆపరేషన్ సిందూర్‌పై విదేశాంగ శాఖ మీడియా సమావేశంగత రాత్రి పాక్.. సరిహద్దు ప్రాంతాలను టార్గెట్ చేసింది300 నుంచి 400 వరకూ డ్రోన్లను ప్రయోగించిందిఎల్‌ఓసీ దగ్గర కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందిజమ్మూ, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్ లక్ష్యంగా పాక్ దాడులు చేసిందిజమ్మూలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు చేశారు34 చోట్ల పాక్ దాడులకు పాల్పడిందిపాక్ దాడులను తిప్పికొట్టాంపౌర విమానాలను టార్గెట్ గా పాక్ దాడులు చేసిందిఆ డ్రోన్లు టర్కీకి చెందినవి తెలుస్తోందిలేహ్ నుంచి సర్ క్రీక్ వరకూ పాక్ దాడులకు ప్రయత్నించిందిబటిండా సైనిక స్థావరంపై దాడికి యత్నించారుకశ్మీర్‌లోని తంగ్దర్, యూరీలో పాక్ దాడులకు పాల్పడిందిభారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌పై దాడికి యత్నించారులేహ్ నుంచి సర్ క్రీక్ వరకూ పాక్ దాడులకు ప్రయత్నించిందిబటిండా సైనిక స్థావరంపై దాడికి యత్నించారుకశ్మీర్‌లోని తంగ్దర్, యూరీలో పాక్ దాడులకు పాల్పడిందిభారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌పై దాడికి యత్నించారుపాక్ ఉపయోగించిన డ్రోన్లు టర్కీకి చెందినవిపాక్ సైన్యం కాల్పుల్లో అనేకమంది గాయపడ్డారు.పాక్ దాడులను భారత వాయుసేన సమర్థవంతంగా అడ్డుకుందికర్తర్‌పూర్ కారిడార్ ను తాత్కాలికంగా మూసివేశాం అమృత్‌సర్‌లో పాక్ బాంబును నిర్వీర్యం చేసిన ఇండియన్ ఆర్మీమక్నా దిండి విలేజ్‌ను టార్గెట్ చేసిన పాకిస్తాన్‌బాంబును నిర్వీర్యం చేసిన భారత సైనికులుసరిహద్దుల్లో పాక్ దాడిని తిప్పికొడుతున్న భారత సైన్యంతిరుమలభారత్- పాక్ యుద్ద వాతావరణం నేపథ్యంలో తిరుమలలో భద్రత బలగాలు మాక్ డ్రిల్..తిరుమల ప్రవేశ మార్గంలో ఆక్టోపస్, పోలీస్, విజిలెన్స్, ఇతర బలగాలతో మాక్ డ్రిల్ నిర్వహణఢిల్లీ:అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంశాఖ లేఖసివిల్ డిఫెన్స్ రూల్స్ కు సంబంధించి అత్యవసర అధికారాలు ఉపయోగించి అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశంఅత్యవసర సమయంలో కావలసిన అన్ని వస్తువులను సేకరణకు అనుమతిస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచిస్తున్న 1968 సివిల్ డిఫెన్స్ రూల్స్ఢిల్లీ ;ఢిల్లీలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ఐటీఓ వద్ద టెస్ట్ సైరెన్ చేసిన అధికారులువైమానిక దాడి సైరన్లను పరిశీలించిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పరవేశ్ వర్మ8 కి.మీ వరకు వినిపించేలా సైరన్ ఏర్పాటుఅమరావతి:ఆపరేషన్ సిందూర్ కు సంఘీభావంగా ఏపీ సచివాలయ ఉద్యోగుల ర్యాలీర్యాలీలో పాల్గొన్న ఏపీ సచివాలయ ఉద్యోగులుఅమరుడైన మురళి నాయక్ అమర్ రహే అంటూ నినాదాలుపాక్‌స్తాన్‌తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హైఅలర్ట్‌జమ్మూకశ్మీర్, రాజస్తాన్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ జారీఢిల్లీ, హరియాణా, హిమాచల్‌లోనూ భద్రత కట్టుదిట్టంపోలీసులు, పాలనాధికారుల సెలవులు రద్దు చేసిన సరిహద్దు రాష్ట్రాలుగుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలుఅవసరమైతే టరిటోరియల్ ఆర్మీని పిలిపించుకునేందుకు అనుమతిఆర్మీ చీఫ్ కు పూర్తి స్వేచ్ఛనిచ్చిన రక్షణమంత్రి రాజ్ నాథ్‌టెరిటోరియల్ ఆర్మీలో ధోనీ, మోహన్‌లాల్, సచిన్ పైలట్, అనురాగ్ ఠాకూర్ దేశవ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భద్రత పెంపుభద్రతను రెండోస్థాయికి పెంచుతూ కేంద్రం ఆదేశాలు పోర్టులు, టర్మినళ్లు, నౌకలకు భద్రత పెంచిన కేంద్రంఇస్రో కేంద్రాల దగ్గర హైఅలర్ట్‌ఇస్రో కేంద్రాల దగ్గర సీఐఎస్ఎఫ్ భద్రత పెంపుశ్రీహరికోట, బెంగళూరు సహా 11 కేంద్రాల్లో అలర్ట్‌పాక్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం ప్రయాణికులు విమానయాన శాఖ అడ్వైజరీఎయిర్‌పోర్ట్‌లకు మూడు గంటల ముందుగానే చేరుకోవాలి75 నిమిషాల ముందే చెక్ ఇన్ క్లోజ్ అవుతుంది జాతీయ రక్షణ నిధికి తెలంగాణ నేతల విరాళంనెల వేతనం ఇవ్వాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం సూచననెల వేతనం విరాళంగా ప్రకటించనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు మెయిల్‌అప్రమత్తమైన అధికారులుఎయిర్ పోర్ట్ లో తనిఖీలు సరిహద్దు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ ఫోన్‌గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సీఎంలతో మాట్లాడిన మోదీసరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేయాలని సూచనప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్న ప్రధాని మోదీఢిల్లీ:అమిత్ షా నివాసంలో హైలెవల్‌మీటింగ్‌హాజరైన ధోవల్, ఐబీ చీఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ డీజీలుసరిహద్దుల్లో పరిస్థితులపై అమిత్ షా రివ్యూ ఢిల్లీ:ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ భేటీపాక్ పై దాడి, తదనంతర వ్యూహంపై చర్చ బ్యాంకులు, ఆర్థిక సంస్థల భద్రతపై నిర్మలా సీతారామన్ రివ్యూసైబర్ భద్రత సన్నద్ధతపై సమీక్షించనున్న నిర్మాలా సీతారామన్ పాక్ పార్లమెంట్ లో రక్షణ మంత్రి అసిఫ్ కీలక వ్యాఖ్యలుమన ఎయిర్ డిఫన్స్ వ్యవస్థ విఫలంపాక్ రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకలు చేసిందిమన రక్షణ విభాగం పూర్తి విఫలమైందిపాక్ ప్రభుత్వంపై ఎంపీలు విమర్శలుచేతగాని ప్రభుత్వం అంటూ మండిపాటు👉కాసేపట్లో ప్రధాని మోదీతో రాజ్‌నాథ్ భేటీపాక్‌పై దాడి, తదనంతర వ్యూహంపై చర్చఉదయం త్రివిధ దళాధిపతులతో రెండున్నర గంటల పాటు భేటీఅమిత్‌షా అత్యున్నతస్థాయి సమావేశంహాజరైన ధోవల్, ఐబీ చీఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ డీజీలుసరిహద్దు పరిస్థితులపై అమిత్‌షా సమీక్ష 👉పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బఒక్క పక్క భారత ఆర్మీదాడులతో పాక్ బెంబేలుమరో పక్క బీఎల్ఏ దాడులతో ఉక్కిరిబిక్కిరితెహ్రిక్‌ఇ-తాలిబన్ దాడుల్లో 20 మంది పాక్ సైనికులు హతం👉జమ్మూకశ్మీర్ లో తెలుగు జవాన్ వీర మరణంభారత్-పాక్ యుద్ధభూమిలో మురళీ నాయక్ మృతిజవాన్ స్వస్థలం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం కల్లితండా గ్రామం 👉ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదాఐపీఎల్ నిరవధిక వాయిదా వేసిన బీసీసీఐభారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయం👉జమ్మూ కశ్మీర్ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యే రైళ్లుపాకిస్థాన్ సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హై అలర్ట్‌ఇండియా గేట్, వార్ మెమోరియల్ వద్ద భద్రత కట్టుదిట్టంసరిహద్దు రాష్ట్రాల్లోని ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని సూచనబోర్డర్ వెళ్లిన 10 మంది పంజాబ్ మంత్రులుదేశంలోని అన్ని విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలకు ఆదేశాలు👉జమ్మూలో భద్రతా బలగాల భారీ ఆపరేషన్‌సాంబా సెక్టార్లో ఏడుగురు అనుమానిత ఉగ్రవాదుల హతంచైనా తయారీ పీఎల్-15 మిస్సైల్‌ను కూల్చేసిన భద్రతా బలగాలుపంజాబ్ పంట పొలాల్లో కూలిన పీఎల్-15 మిస్సైల్‌భారత్ భీకర దాడులతో పాక్ కకావికలంకంటోన్మెంట్లను ఖాళీ చేస్తున్న పాక్ ఆర్మీ కుటుంబాలు👉చండీగఢ్‌లో మోగిన సైరన్లుప్రజలు ఇళ్లలోనే ఉండాలిదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించిన ఎయిర్ ఫోర్స్👉త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ సింగ్ భేటీసరిహద్దులో ఉద్రిక్తతలపై రాజ్‌నాథ్ సింగ్ సమీక్షప్రస్తుత పరిస్థితులపై సమీక్షిస్తున్న రక్షణ మంత్రితదనంతర వ్యూహాలపై చర్చిస్తున్న రాజ్‌నాథ్ సింగ్👉అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రకటనభారత్ - పాక్ యుద్ధం మధ్యలో మేం జోక్యం చేసుకోంఇది మాకు సంబంధం లేని విషయంఆయుధాలు పక్కన పెట్టమని మేము ఎవరిని కోరంఏదైనా ఉంటే దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు చేస్తాంఈ ఘర్షణలు అణు యుద్ధానికి తీయకుండా ఉండాలని కోరుకుంటున్నాం👉ఢిల్లీలో హైఅలర్ట్.. ఇండియా గేట్ దగ్గర భద్రత పెంపుఢిల్లీ నుంచి జమ్మూ వెళ్లే రైళ్లన్నీ నిలిపివేతఢిల్లీ నుంచి గుజరాత్, రాజస్థాన్ వెళ్లే వాహనాలు బంద్👉కాసేపట్లో సీడీఎస్, త్రివిధ దళాల అధిపతులతో రాజ్‌నాథ్ సింగ్ భేటీపాకిస్థాన్ దాడులు, సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను సమీక్షించనున్న రక్షణ మంత్రిజమ్మూ చేరుకున్న సీఎం ఒమర్ అబ్ధుల్లాపరిస్థితిని సమీక్షిస్తున్న ఒమర్ అబ్ధుల్లాహోంమంత్రి అమిత్‌షాతో బీఎస్ఎఫ్ చీఫ్ భేటీ 👉ఆపరేషన్ సిందూర్.. పాక్ దాడులపై ఇండియన్ ఆర్మీ ప్రకటనపాకిస్థాన్ సాయుధ దళాలు నిన్న మధ్య రాత్రి పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు ఆయుధ సామగ్రితో అనేక దాడులను చేశాయి.జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాలు కాల్పుల విరమణ ఉల్లంఘనలను పాల్పడ్డాయిడ్రోన్ దాడులను భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయిభారత సైన్యం దేశం యొక్క సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి కట్టుబడి ఉందిదుర్మార్గపు కుట్రలకు దీటుగా స్పందిస్తాం👉పాకిస్థాన్‌లో మరోసారి బలూచిస్థాన్ ఆర్మీ దాడిహజారా, క్వెట్టాపై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ కాల్పులు👉పాకిస్థాన్‌లో అంతర్గత సంక్షోభంపాకిస్తాన్ వ్యాప్తంగా పీటీఐ నిరసన ర్యాలీలుప్రధాని షెహబాజ్ అసమర్థ ప్రధాని అంటూ నినాదాలుఇప్పటికే సురక్షిత ప్రాంతానికి పారిపోయిన షెహబాజ్👉ఆపరేషన్ సింధూర్ .3.o పై ఉదయం 10 గంటలకి మీడియా సమావేశంరాత్రి నిర్వహించిన దాడులపై బ్రీఫింగ్కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి, ఆర్మీ ప్రతినిధుల మీడియా బ్రీఫింగ్జమ్ము సరిహద్దు గ్రామాల్లో సీఎం ఒమర్ అబ్దుల్లా పర్యటనపాకిస్తాన్ కాల్పుల్లో చనిపోయిన గాయపడిన కుటుంబాలను పరామర్శించనున్న ఒమర్ 👉నేడు దేశ భద్రతపై ఢిల్లీలో కీలక సమావేశాలుపాక్ దాడులు, భారత్ ప్రతిదాడులపై ప్రధాని మోదీ సమీక్షసరిహద్దులతో పరిస్థితులపై అజిత్ ధోవల్‌తో చర్చసరిహద్దు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన ప్రధాని మోదీపాకిస్థాన్‌పై కౌంటర్ ఎటాక్ దిగిన భారత్‌లాహోర్, సియాల్కోట్, కరాచీపై భారత్ ప్రతిదాడిజమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్‌లో హై అలర్ట్‌ఆరేబియా సముద్రంలో భారత నౌకాదళం గర్జనపాక్‌పై గురిపెట్టిన 26 యుద్ధనౌకలుపాక్‌లోని ప్రధాన నగరాలను టార్గెట్ చేసిన ఇండియన్ నేవీఇప్పటికే కరాచీ సీ పోర్టును ధ్వంసం చేసిన భారత్ నేవీ👉సరిహద్దుల వెంబడి 15 సైనిక స్థావరాలపై దాడి యత్నాలు విఫలం కావడంతో గురువారం పాక్ మరింతగా పేట్రేగిపోయింది. రాత్రివేళ పాక్ ఫైటర్ జెట్లు భారత్‌పై తీవ్రస్థాయిలో దాడులకు తెరతీశాయి. రాజస్తాన్ మొదలుకుని జమ్మూ కశ్మీర్ దాకా సరిహద్దుల పొడవునా పలుచోట్ల సైనిక లక్ష్యాలతో పాటు విచక్షణారహితంగా పౌర ఆవాసాలపైనా గురిపెట్టాయి.👉శ్రీనగర్, జమ్మూ విమానాశ్రయాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేశాయి. జమ్మూ–శ్రీనగర్ హైవేపై భారీ పేలుడు చోటుచేసుకుంది. రాజౌరీ జిల్లాలో పలుచోట్ల పేలుళ్లు విని్పంచాయి. పాక్ దాడులన్నింటినీ సైన్యం సమర్థంగా అడ్డుకుంది. సత్వారీలోని జమ్మూ విమానాశ్రయం, సాంబా, ఆర్ఎస్ పుర, అరి్నయా తదితర ప్రాంతాలపైకి కనీసం 8కి పైగా క్షిపణులు దూసుకొచ్చే ప్రయత్నం చేయగా మధ్యలోని అడ్డుకుని కూల్చేసినట్టు ప్రకటించింది.👉మన ‘ఆకాశ్’, ఎంఆర్‌ఎస్‌ఏఎంతో పాటు అత్యాధునిక ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాక్ క్షిపణులు, డ్రోన్లను ఎక్కడివక్కడ కూల్చేశాయి. పఠాన్‌కోట్‌లో రెండు, జమ్మూలో ఒక పాక్ యుద్ధ విమానాన్ని ఎస్–400 వ్యవస్థ నేలకూలి్చంది. వాటిలో రెండు జేఎఫ్–17, ఒక ఎఫ్–16 ఉన్నాయి. రెండు యుద్ధ విమానాలను నష్టపోయినట్టు పాక్ కూడా అంగీకరించింది. పఠాన్‌కోట్‌లో ఇద్దరు పైలట్లు మన బలగాలకు చిక్కినట్టు సమాచారం. ఆ వెంటనే పాక్‌పై సైన్యం విరుచుకుపడింది.👉ఇస్లామాబాద్, లాహోర్, సియాల్కోట్, కరాచీ, రావలి్పండిలపై దీర్ఘశ్రేణి క్షిపణులతో రెండోసారి భారీస్థాయిలో దాడులకు దిగింది. లాహోర్ తదితర నగరాల్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలన్నింటినీ సమూలంగా నాశనం చేసేసింది. పాక్‌లోని పంజాబ్ ప్రాంతంలో నెలకొన్న కీలక ఎయిర్‌బోర్న్ వారి్నంగ్ అండ్ కంట్రోల్ సిస్టం (ఏడబ్ల్యూఏసీఎస్)ను తుత్తునియలు చేసింది. పాక్ నగరాలు బాంబు పేలుళ్లతో దద్దరిల్లినా పౌర ఆవాసాలు, వ్యవస్థలకు నష్టం కలగని రీతిలో సైనిక వ్యవస్థలను మాత్రమే ఎంచుకుని అత్యంత కచి్చతత్వంతో దాడులు నిర్వహించినట్టు సైన్యం పేర్కొంది.👉సరిహద్దు భద్రతా చీఫ్‌లతో అమిత్ షా భేటీ ఇరువైపులా పరస్పర దాడుల వేళ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సహా వేర్వేరు సరిహద్దు భద్రతా చీఫ్‌లతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. గురువారం రాత్రి ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) బలగాల అధినేతలు పాల్గొన్నారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంట తాజా పరిస్థితిని అడిగి తెల్సుకున్నారు.దేశవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ, జాతీయ విమానాశ్రయాల వద్ద భద్రతా పరిస్థితులపై సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) చీఫ్‌తో అమిత్ షా చర్చించారు. ఇండో–పాక్ సరిహద్దుసహా బంగ్లాదేశ్ సరిహద్దు వెంట భద్రతను బీఎస్ఎఫ్ బలగాలు చూసుకుంటున్నాయి. ఇక చైనాతో సరిహద్దు వెంట పహారా బాధ్యతలను ఐటీబీపీ, నేపాల్, భూటాన్లతో సరిహద్దు భద్రతను సశస్త్ర సీమాబల్(ఎస్ఎస్బీ) బలగాలు పర్యవేక్షిస్తున్న విషయం విదితమే.

‘ఆపరేషన్ సిందూర్’ టైటిల్ కోసం క్యూ!
ముంబై: ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం ఉగ్రవాదంపై పోరు చేస్తుంటే.. ఆ పేరు కోసం బాలీవుడ్ దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’, ‘మిషన్ సిందూర్’, ‘సిందూర్ : ది రివెంజ్’అంటూ ఆపరేషన్ కోడ్‌నేమ్ స్ఫూర్తితో సినిమా టైటిల్స్ రిజిస్టర్ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే 30కి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఆపరేషన్ తరువాత ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐఎంపీపీఏ), ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (ఐఎఫ్‌టీపీసీ), వెస్ట్రన్ ఇండియా ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (డబ్ల్యూఐఎఫ్పీఏ)లకు సినిమా టైటిల్స్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులు పెరిగాయి. ఈ మెయిల్ ద్వారా ఇప్పటికే 30కి పైగా టైటిల్ అప్లికేషన్లు అందగా, ఈ సంఖ్య 50–60 వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ‘ఇది భారతదేశం గరి్వంచదగ్గ విషయం. అందుకే ఈ కథను సినిమా తీయాలని చాలామంది అనుకుంటున్నారు’ అని ఐఎంపీపీఏ కార్యదర్శి అనిల్ నగ్రాత్ తెలిపారు. ఒక వ్యక్తి ఎన్ని టైటిల్స్కైనా దరఖాస్తు చేసుకోవచ్చని, అయితే మొదట దరఖాస్తు చేసుకున్న వ్యక్తికే టైటిల్ కేటాయిస్తామని తెలిపారు. గతంలో కార్గిల్, ఉరీ, కుంభమేళాలకు కూడా ఇలాగే టైటిల్ అప్లికేషన్లు అధికంగా వచ్చాయి. టైటిల్ నమోదుకు దరఖాస్తు రుసుము రూ.300 ప్లస్ జీఎస్టీ, అత్యవసర ప్రాతిపదికన అయితే రూ.3,000 ప్లస్ జీఎస్టీగా నిర్ణయించారు. ఒక్కసారి టైటిల్ వచి్చన తరువాత సినిమా తీసేందుకు మూడేళ్ల కాలపరిమితి ఉంటుంది. మూడేళ్లలో సినిమా రెడీ కాకపోతే టైటిల్ తీసేసుకుంటారు. ఈ పేరుతో ట్రేడ్‌మార్క్ రిజి్రస్టేషన్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తోపాటు మరో ఐదు సంస్థలు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ అండ్ ట్రేడ్‌మార్క్‌ను సంప్రదించాయి. అయితే దేశానికి గర్వకారణమైన విషయంతో తాము వ్యాపారం చేయబోమని, తమ ఉద్యోగి పొరపాటున చేశారని చెప్పిన రిలయన్స్.. దరఖాస్తును వెనక్కి తీసుకుంది.
ఎన్ఆర్ఐ

వైట్‌హౌస్‌లో కోనసీమ వాసికి కీలక బాధ్యత
ఐ.పోలవరం: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాల భద్రతా సంస్థకు డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా తెలుగు వ్యక్తి డాక్టర్ గొట్టుముక్కల మధు (Gottumukkala Madhu) నియమితులయ్యారు. మధు తల్లిదండ్రులు గొట్టుముక్కల వెంకట సూర్య సత్యనారాయణరాజు (కొండరాజు), సత్యవాణి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రు (Kesanakurru) గ్రామానికి చెందినవారు. మధు కాకినాడలో ఇంటర్ చదువుకొని ఏలూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఎంఎస్, ఎంబీఏ చేశారు. మోటోరోలా, శాంసంగ్ కంపెనీల్లో పనిచేశారు. ప్రస్తుతం అమెరికన్ సైబర్ సెక్యూరిటీ విభాగం (CISA)లో డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.చదవండి: అమరావతి ఐకానిక్.. అమాంతం పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్‌కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్‌కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్‌లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్‌షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్‌తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.
క్రైమ్

నారాయణరెడ్డి హత్య కేసులో.. 11 మందికి జీవిత ఖైదు
కర్నూలు (సెంట్రల్)/వెల్దుర్తి: కర్నూలు జిల్లా పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి భర్త లక్ష్మీనారాయణరెడ్డి, ఆయన అనుచరుడు బోయ సాంబశివుడు హత్య కేసులో 11 మంది నిందితులపై నేరం రుజువైంది. వీరందరికీ జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు జడ్జి జి. కబర్థి గురువారం తీర్పు చెప్పారు. మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించారు. 2017 మే 21న చెరుకులపాడు నారాయణరెడ్డి అనుచరులతో కలిసి కృష్ణగిరి మండలం రామకృష్ణాపురంలో పెళ్లికి రెండు వాహనాల్లో బయల్దేరారు. నిందితులు రెండు ట్రాక్టర్లలో వచ్చి నారాయణరెడ్డి కారును ఢీకొట్టి నారాయణరెడ్డిపై దాడిచేసి హత్యచేశారు. అడ్డుకోబోయిన సాంబశివుడునూ అంతమొందించారు. కృష్ణగిరి పోలీసులు కేసు నమోదుచేసి 19 మందిపై చార్జిషీటు దాఖలు చేశారు. నిందితులుగా ఉన్న ప్రస్తుత పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, ప్రస్తుత వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మలు హైకోర్టును ఆశ్రయించగా వీరి పేర్లు కేసు నుంచి తొలగించారు. ఏ4గా ఉన్న కోతుల రామాంజనేయులు చనిపోవడంతో మొత్తం 16 మందిపై తుది విచారణ సాగింది. ఇందులో 11 మందికి జీవిత ఖైదు పడగా, ఐదుగురిపై నేరం రుజువు కాలేదు. జీవిత ఖైదు పడిన నిందితులు వీరే.. కురువ రామాంజనేయులు, రామయ్యనాయుడు, కురువ రామకృష్ణ, కోతుల బాలు, కోతుల చిన్న ఎల్లప్ప, కోతుల పెద్ద ఎల్లప్ప, గంటల వెంకటరాముడు, గంటల శీను, బీసన్నగారి రామాంజనేయులు(40), బీసన్నగారి రామాంజనేయులు(42), బీసన్నగారి పెద్ద బీసన్నలకు జీవితఖైదు పడింది. చాకలి నారాయణ, కర్రి గిడ్డయ్య, చెరుకులపాడు గోపాల్, చిన్న వెంకటలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. బీసన్నగారి పెద్ద బీసన్న వయస్సు ప్రస్తుతం 83 ఏళ్లు. నిందితుడు ఆత్మహత్యా యత్నం.. నిందితుల్లో ఒకరైన రామాంజనేయులును వాహనంలో కడపకు తీసుకెళ్తుండగా తలను వాహనం కిటికీకి కొట్టుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో కిటికీ అద్దాలు పగిలిపోయాయి. పోలీసులు అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు. కేఈ కుటుంబాన్ని నమ్ముకుంటే జైలుకే.. నారాయణరెడ్డి, బోయ సాంబశివుడు హత్యకేసులో తమకే ఎందుకు జీవితఖైదు పడిందని, కేఈ శ్యాంబాబుకు ఎందుకు శిక్ష పడలేదని నిందితులు కురువ రామాంజనేయులు, బీసన్నగారి రామాంజనేయులు ప్రశ్నించారు. కేఈ కుటుంబాన్ని నమ్ముకుంటే జైలుకు పోవాల్సిందేనని, ఆ కుటుంబాన్ని ఎవరూ నమ్మొద్దని.. వారెలాంటి సాయం చేయరని, తమకు తగిన శాస్తి జరిగిందని కన్నీళ్లు పెట్టుకున్నారు.చట్టం, కోర్టులపై నమ్మకం పెరిగింది.. నారాయణరెడ్డి సతీమణి,మాజీఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనంతరం.. కర్నూలులోని తన స్వగృహంలో నారాయణరెడ్డి సతీమణి, కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఈ అంశంపై స్పందించారు. కోర్టు తీర్పుతో, పోలీసులు కేసులో చూపిన తెగువతో తమకు, ప్రజలకు చట్టంపై, కోర్టులపై నమ్మకం పెరుగుతోందన్నారు. తన భర్త నారాయణరెడ్డి బతికుంటే ఎమ్మెల్యే కాలేమన్న భయంతోనే కేఈ శ్యాంబాబు కుట్ర పన్ని హత్య చేయించారని ఆమె ఆరోపించారు. నారాయణరెడ్డి హత్య కేసు తీర్పును చూసి ప్రజలు కక్షపూరిత రాజకీయాలకు దూరంగా ఉండాలని శ్రీదేవి విజ్ఞప్తి చేశారు. నారాయణరెడ్డి సోదరుడు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి మాట్లాడుతూ.. కేఈ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడే తన తండ్రిని, తన సోదరుడిని పోగొట్టుకున్నామన్నారు.

మందుపాతర్లు పేల్చిన మావోయిస్టులు
వాజేడు/ఎంజీఎం/సాక్షి, హైదరాబాద్: కర్రిగుట్టలు మరోసారి దద్దరిల్లాయి. ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుట్టల పైనున్న పెనుగోలు గ్రామ సమీప నూగూరు అటవీ ప్రాంతంలో అమర్చిన మందుపాతరలను మావోయిస్టులు పేల్చేశారు. అనంతరం కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గ్రే హౌండ్స్‌కు చెందిన కమాండోలు వడ్ల శ్రీధర్ (జేసీ4973/పీసీ1785), ఎన్.పవన్‌కల్యాణ్ (జేసీ10541/పీసీ) టి.సందీప్ (జేసీ 4638/పీసీ8124) అక్కడికక్కడే మృతి చెందారు. పైడిపల్లికి చెందిన అర్ఎస్ఐ సీహెచ్ రణదీర్ గాయపడ్డారు. మరో ఇద్దరు జవాన్లు కూడా గాయపడినట్లు సమాచారం. కాగా మెరుగైన వైద్యం కోసం రణదీర్‌ను హైదరాబాద్‌కు తరలించినట్లు తెలంగాణ డీజీపీ జితేందర్ ప్రకటించారు. ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. భారీ ఎన్కౌంటర్ మరుసటి రోజే.. కర్రిగుట్టల్లో చేపట్టిన కగార్ ఆపరేషన్ 17 రోజులకు చేరుకుంది. కర్రి గుట్టలను చుట్టు ముట్టిన భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే బుధవారం ఎన్కౌంటర్ చోటు చేసుకోగా భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో కూంబింగ్ కోసం వచ్చే దళాలను మావోయిస్టులు లక్ష్యంగా చేసుకుని ముందే అమర్చిన మందుపాతరలను రిమోట్ల సహాయంతో పేల్చివేసినట్లు తెలుస్తోంది. 35 – 40 మందితో కూడిన మావోయిస్టుల బృందం (మహిళలు కూడా ఉన్నారు) ఇందులో పాల్గొన్నట్టు సమాచారం. మృతదేహాలు పరిశీలించిన మంత్రి, డీజీపీ గ్రేహౌండ్స్ కమాండర్ల మృతదేహాలను రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క, డీజీపీ జితేందర్, గ్రే హౌండ్స్ ఏడీజీ స్టీఫెన్ రవీంద్ర, ఎమ్మెల్యేలు నాగరాజు, రాజేందర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్, ము లుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ మార్చురీ వద్ద పరిశీలించారు. ఈ ఘటనపై వాజేడు పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్ 62, 148, 191(1), 191(3), 103, 109 ఆర్/డబ్ల్యూ 190 బీఎన్ఎస్, సెక్షన్ 25(1–బీ)(ఏ), 27 ఏఆర్‌ఎమ్‌ఎస్ యాక్ట్, సెక్షన్ 10, 13 ,18,20, కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు. కాగా మందుపాతర్ల పేలుడులో మరణించిన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి చెందిన వడ్ల శ్రీధర్ (30)కు 9 నెలల క్రితమే వివాహమైనట్లు తెలిసింది. నాలుగు గంటల పాటు పోస్టుమార్టం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో వరంగల్ ఎంజీఎం మార్చురీకి చేరుకున్న పోలీసుల మృతదేహాలకు ఫోరెన్సిక్ నిపుణులు నాలుగు గంటల పాటు పోస్టుమార్టం జరిపారు. బుల్లెట్ల గాయాలతోనే జవాన్లు మృతి చెందినట్లు ఫోరెన్సిక్ డాక్టర్లు ప్రాథమికంగా నిర్ధారించారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు: డీజీపీ ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఐఈడీల కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న పోలీసులపై దూరంలో మాటేసిన మావోయిస్టులు మందుపాతరలు పేల్చారని డీజీపీ తెలిపారు. సెర్చ్ బృందాన్ని లక్ష్యంగా చేసుకుని విచక్షణా రహితంగా భారీ కాల్పులకు తెగబడ్డారని చెప్పారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో మావోయిస్టులు కాల్పులు ఆపేసి పారిపోయారన్నారు. ప్రజలెవరూ కర్రిగుట్టల వైపు రావొద్దు: మావోయిస్టులు పోలీసుల వలలోపడి ప్రజలెవరూ కర్రిగుట్టల వైపు రావొద్దని మావోయిస్టులు మరోమారు హెచ్చరించారు. ఈ మేరకు మావోయిస్టు వెంకటాపురం–వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరిట గురువారం ఒక లేఖ విడుదల అయ్యింది. ‘పోలీసు బలగాల కగార్ దాడి నుంచి రక్షణ పొందడానికి కర్రిగుట్టలపై బాంబులు అమర్చాం. ఈ విషయం ప్రజలకు వివిధ రూపాల్లో తెలియజేశాం. అయినా కొంతమంది ఆదివాసీ, ఆదివాసీయేతర ప్రజలకు పోలీసులు మాయ మాటలు చెప్పి నమ్మిస్తూ, డబ్బులు ఇస్తూ ఇన్ఫార్మర్లుగా మార్చుకుంటున్నారు. షికారు పేరుతో వారిని కర్రిగుట్టల వైపు పంపిస్తున్నారు. మా రక్షణ కోసం అమర్చిన బాంబులు పేలి వారు చనిపోతున్నారు. కాబట్టి ప్రజలెవరూ కర్రిగుట్టల వైపు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం..’అని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఏడేళ్ల ప్రేమ అంతలోనే .. ! పాపం ఆ యువకుడు..
జమ్మికుంట(కరీంనగర్): ఇటీవల యువతలో ఒకరిని ప్రేమించడం, మరొకరిని పెళ్లాడటం కామన్‌గా మారిపోయింది. అయితే కొందరు దీన్ని జీర్ణించుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతుండటమే బాధకరం. అలాంటి దారుణ ఘటనే కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల్లోకెళ్తే..కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లక్ష్మణపల్లి గ్రామానికి చెందిన దార ఎల్లేష్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన వరలక్ష్మి అనే యువతితో ప్రేమలో పడ్డాడు. ఏడేళ్లుగా గాఢంగా ప్రేమించుకున్నారు. ఏమైందో ఏమో ఆమె ఇటీవలే వేరే వ్యక్తిని పెళ్లిచేసుకుంది. ఇది తెలిసి మనస్తాపం చెందిన ఎల్లేష్ సెల్ఫీ వీడియో తీసుకోని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పైగా ఆ వీడియోలో తన ఫోన్లో ఆమెకు సంబంధించిన కాల్ రికార్డింగ్స్ అన్ని ఉన్నాయని..యువతి వచ్చే వరకు తన శవాన్ని తీయవద్దని కోరాడు. అలాగే తనను ఇంతలా మోసం చేసిన ఆ యువతి కుటుంబంపై గట్టి చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని రైలు కింద పడ్డ యువకుడు7 ఏళ్ళు ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వేరే పెళ్లి చేసుకుందని.. సెల్ఫీ వీడియో తీసి రైలు కింద పడి యువకుడి ఆత్మహత్యకరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లక్ష్మణపల్లి గ్రామానికి చెందిన దార ఎల్లేష్ అనే యువకుడితో ఏడేళ్ల నుండి ప్రేమ… pic.twitter.com/lx0DPxyUEd— Telugu Scribe (@TeluguScribe) May 8, 2025

ఐదేళ్లుగా వివాహేతర సంబంధం.. చివరికి..!
మహబూబ్‌నగర్ క్రైం: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళతో డబ్బుల విషయంలో ఏర్పడిన గొడవలో ఓ వ్యక్తి సదరు మహిళను గొంతు నులిమి హత్య చేశాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ హత్య తాజాగా వెలుగులోకి వచ్చింది. రూరల్ ఎస్ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని దొడ్డలోనిపల్లికి చెందిన శాంతమ్మ (35) ఒంటరిగా జీవనం సాగించేది. ఈ క్రమంలో ఆమెకు నవాబ్‌పేట మండలం తీగలపల్లికి చెందిన కృష్ణయ్యతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఐదేళ్లుగా ఇద్దరు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. అయితే డబ్బుల వ్యవహారంలో గత కొన్ని రోజులుగా ఇద్దరు గొడవ పడేవారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం కూడా గొడవ జరగగా కృష్ణయ్య, శాంతమ్మను గొంతు నులిమి హత్య చేసి పారిపోయాడు. ఇంట్లో మంచంపై పడి ఉన్న శాంతమ్మ మృతదేహన్ని స్థానికులు బుధవారం గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని ఏఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ గాం«దీనాయక్ పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.
వీడియోలు


పాక్ దాడుల వెనుక టర్కీ, చైనా హస్తం..


పాక్.. ప్రపంచాన్ని మోసం చేసే కుట్ర


Army Jawan: తల్లిదండ్రులును ఎదిరించి ఆర్మీలోకి వెళ్ళాడు


Himanshi Narwal: ఆ వీరుడి ఆత్మకు సంపూర్ణ శాంతి


400 డ్రోన్లతో విరుచుకుపడ్డ పాక్ ఒక్కటి కూడా మిగల్లేదు


141కోట్ల ప్రజల రక్షణకై అడ్డునిలిచి వీర మరణం పొందాడు


పంజాబ్ లో చైనా మిస్సైల్..!?


LOC వెంట ఉన్న పాక్ పోస్టులను ధ్వంసం చేస్తున్న ఇండియన్ ఆర్మీ


భారత అమ్ములపొదిలో మూడు ప్రధాన యుద్ధ ట్యాంకులు


యుద్ధానికి ముందు ఫోన్ చేసి.. వీర జవాను మురళీ నాయక్ తల్లిదండ్రులు కన్నీరు