Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

I was not at home at the time  Omprakash Son Karthikesh1
‘నేను లేని టైమ్ చూసి నాన్నను చంపేశారు’

బెంగళూరు: ఓ రాష్ట్రానికి డీజీపీగా పని చేసిన వ్యక్తి దారుణంగా హత్య గావించబడటం చాలా విచారకరం. అది కూడా భార్య, కూతురు కలిసి చేసిన మాస్టర్ ప్లాన్ కు బలికావడం ఇంకా దురదృష్టకరం. కర్ణాటక రాష్ట్ర మాజీ డీజీపీ ఓమ్ ప్రకాష్ హత్య అనంతరం అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్య పల్లవి బాధ పడలేక తన సోదరి సరితా కుమారి ఇంటి వద్దే ఉంటున్న ఓమ్ ప్రకాష్ ను ఇంటికి రప్పించి మరీ హత్య చేయడం సమాజంలోని పరిస్థితులు ఇంతలా దిగజారిపోవడానికి అద్దం పడుతోంది. నేను ఇంట్లో లేని సమయంలోనే నాన్న హత్యఅయితే ఈ విషయంలో కుమారుడు కార్తీకేష్ ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం తల్లి, సోదరి పాత్రలను ప్రముఖంగా ప్రస్తావించాడు. గత కొంతకాలంగా తల్లి పల్లవి.. నాన్నను చంపుతానంటూ బెదిరిస్తోందనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే గతంలో నాన్నపై హత్యాయత్నం చేయడానికి అమ్మ యత్నించిందన్నాడు. పెద్ద రాయి తీసుకుని తలపై కొట్టి చంపాలని చూసిందన్నాడు.‘ మా తండ్రిని చంపుతానని పదే పదే అమ్మ బెదిరిస్తూ వస్తోంది. ఈ బెదిరింపులతో మా నాన్న కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయి బయటే ఉంటున్నారు. నాన్న సోదరి( మా అత్త) సరితా కుమారి ఇంటికి వెళ్లిపోయి అక్కడే ఉంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం నా సోదరి కృతి.. నాన్న వద్దకు వెళ్లింది. ఇంటికి తిరిగి రావాలని పట్టుబట్టింది. నేను రానని నాన్న చెప్పినా పట్టుబట్టుకుని కూర్చొంది. దాంతో నాన్న తిరిగి ఇంటికి వచ్చారు.నాన్నను వెంట తీసుకునే వచ్చింది కృతి. ఇష్టంలేకుండానే నాన్న ఇంటికి వచ్చారు. ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. నేను ఇంట్లో లేని సమయం చూసి వాళ్లిద్దరూ కలిసి నాన్నను హత్య చేశారు. నాకు ఓ స్నేహితుడు ఫోన్ చేసి చెప్పాడు. మీ నాన్నకు ఇలా అయ్యిందనే విషయాన్ని చెప్పాడు. నేను సరిగ్గా నిన్న సాయంత్రం(ఆదివారం) గం. 5.45 ని.లకు ఇంటికి తిరిగి వచ్చేశాను. అప్పటికే మా ప్రాంగణమంతా పోలీసులు, చుట్టుపక్కల వారితో నిండిపోయి ఉంది. నేను మా నాన్న రక్తమడుగులో పడి ఉండటం చూశాం. ఆయన శరీరమంతా గాయాలతో నిండిపోయింది. నాన్న శరీరంలో పగిలిన బాటిల్, కత్తి ఉండటాన్ని గమనించాను. అప్పుడు సెయింట్ జాన్స్ హాస్పిటల్ప్ కి నాన్నని తీసుకెళ్లాం. మా అమ్మ, చెల్లి కూడా పూర్తి డిప్రెషన్ లో ఉన్నారు. అమ్మా, సోదరి కలిసే నాన్నను హత్య చేశారనే విషయాన్ని బలంగా నమ్ముతున్నా’ అని పోలీస్ లకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో కార్తీకేష్ చెప్పుకొచ్చాడు.12 ఏళ్లుగా.. భయం భయంగానే?

Gold hits all time high 10 grams price toches Rs 1 lakh2
రూ.ల‌క్ష‌కు చేరిన బంగారం ధ‌ర‌.. ఆల్ టైం హై

దేశంలో బంగారం ధరలు ఆల్‌టైమ్‌ హైకి చేరాయి. భారత లైవ్‌ మార్కెట్‌లో సోమవారం సాయంత్రానికి (April 21) తులం బంగారం ధర రూ. లక్షను తాకినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు 10 గ్రాముల బంగారం రూ.2,350 పెరిగింది. అంతర్జాతీయంగా జౌన్స్‌ బంగారం 3400 డాలర్లు దాటింది.ప్రస్తుత ధరలు👉హైదరాబాద్‌లో 24 కేరట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.99,660 వద్ద ఉంది. 👉బెంగళూరులో రూ.99,860👉విశాఖపట్నంలో రూ.99,770👉చెన్నైలో రూ.99,740👉ఢిల్లీలో రూ.99,555ఈ ధరల పెరుగుదలకు గ్లోబల్ ఆర్థిక అనిశ్చితులు, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికన్ డాలర్ బలహీనత, సురక్షిత ఆస్తుల కొనుగోలు పెరగడం కారణాలుగా ఉన్నాయి. అంతర్జాతీయ స్పాట్ బంగారం ధరలు ఔన్స్‌కు 3,391-3,404 డాలర్ల వద్ద ఉన్నాయి.కాగా ఈరోజు ఉదయం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 90,150 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,350 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి రేటు ఈ రోజు కూడా రూ. 700 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 770 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.👉ఇది చదివారా? ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్‌ బంగారం’చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 700, రూ. 770 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 90,150 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 98,350 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 9030 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 98,500 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 700, రూ. 770 ఎక్కువ. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్‌టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

YSRCP President YS Jagan Condoles Pope Francis death3
పోప్‌ ఫ్రాన్సిస్ మృతిపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్భాంతి

తాడేపల్లి : క్రైస్తవ మతపెద్ద పోప్‌ ఫ్రాన్సిస్(88) కన్నుమూయడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా సంతాపం తెలిపారు వైఎస్‌ జగన్‌. ‘పోప్ మృతి చాలా బాధాకరం. కాథలిక్ చర్చి సమాజానికి ప్రభావవంతమైన వ్యక్తి. ఆయన లాటిన్ అమెరికా నుండి వచ్చిన మొదటి పోప్. శాంతి, కరుణ కోసం ప్రపంచ వ్యాప్త గొంతుకగా నిలిచిన నిజమైన మానవతావాది. పోప్ ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అని వైఎస్‌ జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు. Saddened by the passing of Pope Francis. A transformative and influential head of the Catholic Church — the first Pope from the Latin Americas. A true humanitarian and global voice for peace and compassion. His humility and humanity touched the world.May his soul rest in eternal…— YS Jagan Mohan Reddy (@ysjagan) April 21, 2025 కాగా క్రైస్తవ మతపెద్ద పోప్‌ ఫ్రాన్సిస్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందారు.ఈస్టర్‌ సందర్భంగా నిన్న ఆయన పేరిట సందేశం వెలువడగా.. కొన్ని గంటలకే ఆయన మృతి చెందారని వీడియో సందేశం విడుదల చేయడం గమనార్హం.పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో 1936 డిసెంబర్ 17న ఈయన జన్మించారు. 2013లో నాటి పోప్‌ బెనెడిక్ట్‌-16 రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్‌ కేథలిక్‌ చర్చి అధిపతి అయ్యారు. ఆ ఏడాది మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. అమెరికా ఖండం నుంచి ఎన్నికైక తొలి పోప్‌గా ఈయనకంటూ ఓ గుర్తింపు ఉంది.

Supreme Court Reacts On BJP leaders Criticism4
ఇప్పటికే అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాం

న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థపై ఉపరాష్ట్రపతి సహా పలువురు బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. ప్రస్తుతం తాము కార్య నిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నామంటూ సోమవారం వ్యాఖ్యానించింది.ముర్షిదాబాద్‌ అల్లర్ల కేసు నేపథ్యంతో.. పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన(Bengal President Rule) విధించాలని కోరుతూ విష్ణు శంకర్‌ జైన్‌ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో జస్టిస్‌ గవాయ్‌ పిటిషన్‌ను పరిశీలిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘మేం ఇప్పటికే కార్య నిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాం. ఇలాంటి తరుణంలో.. బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని, సైన్యాన్ని మోహరింపజేయాలని మాండమస్‌ రిట్‌ ప్రకారం రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా?’’ అని పిటిషనర్‌ లాయర్‌ను ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పిటిషనర్‌ కోరిన ఆదేశాలు జారీ చేయడానికి బెంచ్‌ నిరాకరించింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రాలు రూపొందించే బిల్లుల విషయంలో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరును సుప్రీం కోర్టు తప్పుబడుతూ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో గవర్నర్‌, రాష్ట్రపతికి సైతం కాలపరిమితి విధించింది. ఈ వ్యవహారంలో రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక అధికారాలు పని చేయబోవని.. ఒకవేళ ఆ కాలపరిమితిని ఉల్లంఘిస్తే కోర్టులను ఆశ్రయించొచ్చని రాష్ట్రాలకు సూచించింది. అదే సమయంలో వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లనూ విచారిస్తూ.. స్టే ఆదేశాలు జారీ చేసింది కూడా. అయితే ఈ రెండు పరిణామాలపై బీజేపీ నేతలు కొందరు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే సుప్రీం కోర్టుపై చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఒకవేళ సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే గనుక.. పార్లమెంట్‌ భవనాన్ని మూసివేయాలి’’ అని ఎంపీ వ్యాఖ్యానించారు. మరో బీజేపీ నేత దినేశ్‌ శర్మ సైతం సుప్రీం కోర్టుపై విమర్శలు గుప్పించారు. ఆఖరికి ఉపరాష్ట్రపతి జగదీప్‌ దన్‌ఖడ్‌ కూడా సుప్రీం కోర్టు తీర్పును తప్పుబట్టారు. ‘రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం తగదు. అది ప్రజాస్వామ్యశక్తులపై అణుక్షిపణిని ప్రయోగించడమే అవుతుంది. ఇప్పుడు.. శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకు ఉన్నారు! కార్యనిర్వాహక విధులూ వారే నిర్వర్తించేస్తారు. సూపర్‌ పార్లమెంటులా వ్యవహరిస్తారు. వారికి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. ఎందుకంటే దేశ చట్టాలు వారికి వర్తించవు’’ అని అన్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి నోట్ల కట్టల వ్యవహారంపై స్పందిస్తూ దన్‌ఖడ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇక బీజేపీ నేతల వ్యాఖ్యలను వ్యతిగతం అని పేర్కొంటూ అధిష్టానం దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ ప్రతిపక్షాలు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి.ప్రస్తుతం సీజేఐగా ఉన్న సంజీవ్‌ ఖన్నా పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఆ స్థానంలో బీఆర్‌ గవాయ్‌(BR Gavai) బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కీలకమైన వక్ఫ్‌ పిటిషన్లపై ఈయనే విచారణ జరపబోతున్నారు. ఈ క్రమంలో.. ఆయన కార్య నిర్వాహక వ్యవస్థపై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్‌ 8-12 తేదీల మధ్య షంషేర్‌గంజ్‌, సూటి, ధులియాన్‌, జంగిపూర్‌ ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ముగ్గురు మరణించగా.. వందల మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లనువిచారించే క్రమంలోనూ ఈ అల్లర్లను సీజేఐ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం ప్రస్తావించింది. మే 5వ తేదీన ఈ పిటిషన్లపై విచారణ జరగనుంది.

Pope Francis Passed Away Vatican says in video statement5
Pope Francis: పోప్‌ ఫ్రాన్సిస్‌ కన్నుమూత

వాటికన్‌ సిటీ: క్రైస్తవ మతపెద్ద పోప్‌ ఫ్రాన్సిస్‌(88) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందినట్లు వాటికన్‌ సిటీ వర్గాలు ప్రకటించాయి. ఈస్టర్‌ సందర్భంగా నిన్న ఆయన పేరిట సందేశం వెలువడగా.. కొన్ని గంటలకే ఆయన మృతి చెందారని వీడియో సందేశం విడుదల చేయడం గమనార్హం.పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో 1936 డిసెంబర్ 17న ఈయన జన్మించారు. 2013లో నాటి పోప్‌ బెనెడిక్ట్‌-16 రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్‌ కేథలిక్‌ చర్చి అధిపతి అయ్యారు. ఆ ఏడాది మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. అమెరికా ఖండం నుంచి ఎన్నికైక తొలి పోప్‌గా ఈయనకంటూ ఓ గుర్తింపు ఉంది. Pope Francis died on Easter Monday, April 21, 2025, at the age of 88 at his residence in the Vatican's Casa Santa Marta. pic.twitter.com/jUIkbplVi2— Vatican News (@VaticanNews) April 21, 2025పోప్‌ ఫ్రాన్సిస్‌ తరచూ సమకాలీన సామాజిక అంశాలపై వ్యాఖ్యలు చేస్తుండేవారు. వలసదారులు, శరణార్థుల పట్ల మానవత్వంతో మెలగాలని ప్రపంచ దేశాలకు పిలుపు ఇచ్చిన ఈయన.. అదాయ అసమానతలు, వాతావరణ మార్పులు, మరణ శిక్షలకు వ్యతిరేకంగా పోరాడారు కూడా. 2016లో రోమ్‌ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడగడం తీవ్ర చర్చనీయాంశమైంది. మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికల టైంలోనూ.. అటు ట్రంప్‌, ఇటు కమలా హారిస్‌ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు కూడా. తాజాగా ఈస్టర్‌ సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌(JD Vance) పోప్‌ను కలుసుకున్నారు కూడా. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్‌ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడ్డ పోప్‌ ఫ్రాన్సిస్‌.. కొన్నాళ్లపాటు ఆస్పత్రిలో చికిత్స కూడా పొందారు. వాటికన్‌ సిటీలోని కాసా శాంటా మార్టా (Casa Santa Marta) నివాసంలో సోమవారం కన్నుమూసినట్లు తెలుస్తోంది. పోప్‌ మృతి పట్ల పలు దేశాల అధినేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

MLA Adinarayana Reddy followers obstruct operations at Ultratech Cement Industry6
తారాస్థాయికి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అరాచకాలు

వైఎస్సార్‌,సాక్షి : అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీకి జమ్మల­మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బెదిరింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఐదు సున్నపు రాయి టిప్పర్లను సీజ్‌ చేయించారు. కంపెనీలోని కాంట్రాక్ట్‌ కార్మికులపై జులుం ప్రదర్శించారు. కాంట్రాక్ట్‌ కార్మికులను బయటకు పంపించేశారు. కాంట్రాక్ట్‌ కార్మికులు లేకపోవడంతో కంపెనీలో పనులు నిలిచిపోయాయి.సీఎం చంద్రబాబుతో మాట్లాడి దాడులు చేయిస్తామంటూ ఇటీవల వార్నింగ్‌ ఇచ్చారు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి.అల్ట్రాటెక్‌ సిమెంట్‌పై తాను వ్యవహరించిన తీరు తప్పు కాదంటూ సమర్థించుకున్నారు. అక్కడి కాంట్రాక్ట్‌లన్నీ తనకే కావాలని ఉత్పత్తిని అడ్డుకున్నారు. ఇన్ని చేస్తూనే తన తప్పులేదని బుకాయించడం చూసి విస్తుపోతున్నారు స్థానికులు. మూడున్నర దశాబ్దాలుగా స్థానికులకు ఉపాధి..చిలంకూరు సిమెంట్‌ పరిశ్రమలో సుమారు 35 ఏళ్ల నుంచి స్థానికులు ఉపాధి పొందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమకే అన్ని పనులు కావాలంటూ పరిశ్రమకు రవాణా అవుతున్న సున్నపురాయి, ఫ్‌లైయాష్‌ను బీజేపీ ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి అనుచరులు శనివారం నుంచి అడ్డుకుంటున్నారు. దీంతో సిమెంట్‌ పరిశ్రమకు సున్నపురాయి సరఫరా అగిపోయి మూతపడే దశకు వచ్చింది.అల్ట్రాటెక్‌ పరిశ్రమలో ఉత్తరం వైపు సున్నపురాయి మైనింగ్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చినా మొత్తం పనులు తమకే కావాలని ఆదినారాయణరెడ్డి వర్గం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. చిలంకూరులోని ఐసీఎల్‌ (అల్ట్రాటెక్‌) సిమెంట్‌ పరిశ్రమకు సరఫరా అయ్యే సున్నపురాయిని ఆదినారాయణరెడ్డి వర్గం అడ్డుకోవటంపై యజమాన్యం ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కలెక్టర్‌ ఆదేశించారు.చిలంకూరు సిమెంట్‌ పరిశ్రమకు సున్నపురాయి సరఫరా అడ్డుకోవడంపై ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి అనుచరులైన ఎస్‌.జగదీశ్వర్‌రెడ్డితో పాటు పది మందిపై కేసు నమోదు చేసినట్లు యర్రగుంట్ల సీఐ నరేష్‌బాబు తెలిపారు. చిలంకూరు ఐసీఎల్‌ (అల్ట్రాటెక్‌) మైనింగ్‌ క్వారీ వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.ఇవి అరాచకాలు👉గండికోట రిజర్వాయర్‌ ఆధారంగా చేపట్టిన అదానీ హైడ్రో పవర్‌ ప్రాజెక్టు పనులను తమ వర్గీయులకే అప్పగించాలంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరులు మందీ మార్బలంతో విధ్వంసం సృష్టించారు.👉ఆర్టీపీపీ నుంచి సిమెంట్‌ కంపెనీలకు ఫ్‌లైయాష్‌ రవాణా చేస్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన లారీలను అడ్డుకున్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం దీన్ని తమకే అప్పగించాలంటూ వీరంగం సృష్టించింది.👉 ఎర్రగుంట్ల మండలం చిలంకూరు పరిధిలో అల్ట్రాటెక్‌ (ఐసీఎల్‌) సిమెంటు పరిశ్రమకు ఫ్‌లైయాష్, సున్నపురాయి, ఇతర ముడి ఖనిజం సరఫరా, ప్యాకింగ్‌ ప్లాంట్‌ కాంట్రాక్టు పనులను 40 ఏళ్లుగా మాజీ మంత్రి మైసూరారెడ్డి సోదరుడు ఎంవీ రమణారెడ్డి చేస్తున్నారు. ఆ పనులన్నీ తమ వర్గీయులకే ఇవ్వాలంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కొంతకాలంగా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తోంది.

IPL 2025: List Of Cricketers Who Failed In Spite Of Taking High Remuneration7
IPL 2025: తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేకపోతున్న స్టార్లు వీరే..!

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో చాలా మంది క్రికెటర్లు తాము తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేకపోతున్నారు. వీరిలో లక్నో కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ ముందు వరుసలో ఉన్నాడు. ఈ సీజన్‌ వేలంలో లక్నో పంత్‌ను రూ. 27 కోట్ల రికార్డు ధర చెల్లించి సొంతం చేసుకుంది. ఇది ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర. ఇంత భారీ మొత్తం పెట్టినా ఈ సీజన్‌లో పంత్‌ దారుణంగా విఫలమవుతున్నాడు. 8 మ్యాచ్‌ల్లో నామమాత్రపు స్ట్రయిక్‌రేట్‌తో (98.15) కేవలం ఒకే ఒక హాఫ్‌ సెంచరీ సాయంతో 106 పరుగులు మాత్రమే చేశాడు.ఈ సీజన్‌లో లభించిన మొత్తానికి న్యాయం చేయలేకపోతున్న రెండో ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌. వెంకటేశ్‌ అయ్యర్‌ను కేకేఆర్‌ ఈ సీజన్‌ మెగా వేలంలో రూ. 23.75 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే వెంకటేశ్‌ జట్టు తనపై పెట్టుకున్న అంచనాలకు కనీస న్యాయం​ చేయలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో నామమాత్రపు ప్ట్రయిక్‌రేట్‌తో ఒకే ఒక హాఫ్‌ సెంచరీ చేసి 121 పరుగులు చేశాడు.ఈ సీజన్‌లో తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేని మూడో ఆటగాడు మహ్మద్‌ షమీ. షమీని ఈ సీజన్‌ మెగా వేలంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎంతో నమ్మకంతో రూ. 10 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అతను 7 మ్యాచ్‌లు ఆడి 5 వికెట్లు మాత్రమే తీశాడు.ఈ సీజన్‌లో చెత్త ప్రదర్శనలతో ఉసూరుమనిపిస్తున్న మరో క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌. రషీద్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ ఈ సీజన్‌ మెగా వేలానికి ముందు రూ. 18 కోట్లకు రీటైన్‌ చేసుకుంది. అయితే రషీద్‌ ఎన్నడూ లేనట్లుగా ఈ సీజన్‌లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. రషీద్‌ ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌ల్లో కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. అతని ఎకానమీ (9.73) కూడా చాలా దారుణంగా ఉంది.ఈ సీజన్‌లో అంచనాలు తగ్గట్టుగా రాణించలేని మరో క్రికెటర్‌ జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌. ఇతన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ భారీ అంచనాలు పెట్టుకుని మెగా వేలంలో రూ. 9 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఇతగాడు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 105.77 స్ట్రయిక్‌రేట్‌తో కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు గుండు సున్నాలు ఉన్నాయి.పైన పేర్కొన్న ఆటగాళ్లతో పాటు మరికొందరు కూడా తీసుకున్న మొత్తానికి న్యాయం చేయలేకపోతున్నారు. వారిలో లివింగ్‌స్టోన్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌, క్లాసెన్‌, ట్రవిస్‌ హెడ్‌, ఆండ్రీ రసెల్‌, హెట్‌మైర్‌, రబాడ, జన్సెన్‌ లాంటి విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. టి నటరాజన్‌ (10.75 కోట్లు, ఢిల్లీ) లాంటి ఆటగాళ్లు భారీ మొత్తం లభించినా అవకాశాలు లేక బెంచ్‌కే పరిమితమవుతున్నారు. ఇదిలా ఉంటే, కొందరు దేశీయ ఆటగాళ్లు మాత్రం ఈ సీజన్‌లో అంచనాలకు మించి తీసుకున్న డబ్బుకు న్యాయం చేస్తున్నారు. వీరిలో ప్రియాంశ్‌ ఆర్య (3.8 కోట్లు), అశుతోష్‌ శర్మ (3.8 కోట్లు), దిగ్వేశ్‌ రాఠీ (30 లక్షలు), విప్రాజ్‌ నిగమ్‌ (50 లక్షలు), అనికేత్‌ వర్మ (30 లక్షలు), వైభవ్‌ సూర్యవంశీ (1.1 కోట్లు), ఆయుశ్‌ మాత్రే లాంటి ఆటగాళ్లు ఉన్నారు.

Singer Pravasthi Aradhya Sensational Comments On MM Keeravani, Sunitha, Chandra Bose8
బొడ్డు కింద చీర కట్టుకోమన్నారు.. బాడీ షేమింగ్‌ చేశారు: లేడీ సింగర్‌ ఆవేదన

లెజండరీ సింగర్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించిన ‘పాడుతా తీయగా’(Padutha Theeyaga) సింగింగ్‌ షో ఇప్పటికీ దిగ్విజయంగా కొనసాగుతుంది. బాలు గారి మరణానంతరం ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల మొదలైన ఈ షో సిల్వర్ జూబ్లీ సిరీస్‌కి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్‌, సింగర్‌ సునీత జడ్జీలుగా ఉన్నారు. సింగింగ్‌ రియాల్టీ షోలలో ముందంజలో ఉన్న ‘పాడుతా తీయగా’పై గాయని ప్రవస్తి ఆరాధ్య(Pravasthi Aradhya ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ షో న్యాయంగా జరగడం లేదని, టాలెంట్‌ ఉన్నవాళ్లను కాకుండా నచ్చిన వాళ్లను విజేతలుగా చేస్తున్నారని ఆరోపించారు. ఈ షో నుంచి ఎలిమినేట్‌ అయిన ప్రవస్తి.. తాజాగా య్యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్‌ చేస్తూ..కీరవాణి(M. M. Keeravani), సునీత, చంద్రబోస్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జి సీట్లలో కూర్చొని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు తనను మెంటల్‌గా హింసించారని, బాడీ షేమింగ్‌ చేశారని ఆరోపించారు.‘మ్యూజిక్‌ ఫిల్డ్‌ నుంచి వెళ్లిపోవాలని డిసైడ్‌ అయ్యాకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో పెద్ద పెద్ద వాళ్ల పేర్లును ప్రస్తావించాను కాబట్టి నాకు ఎలాగో అవకాశాలు రావు. కానీ మీఅందరికి నిజం తెలియాలని ధైర్యంతో ఈ వీడియో చేశాను. పాడుతా తీయగా ప్రోగ్రామ్‌లో పాల్గొన్న నన్ను జడ్జీలు(కీరవాణి, చంద్రబోస్‌, సునీత) మెంటల్‌గా హింసించి, అన్యాయంగా ఎలిమేట్‌ చేశారు.ముందుగా సునీత(Sunitha) గురించి చెబుతా. ఫస్ట్‌ ఎపిసోడ్‌ నుంచి కూడా నేను స్టేజ్‌ మీదకు రాగానే ఆమె ముఖం అదోలా పెట్టేవారు. నా ఫ్యాన్స్‌ కూడా నన్ను అడిగారు. ఆమెతో మీకేమైనా గొడవ జరిగిందా అని మెసేజ్‌ చేశారు. కానీ నేను అది నమ్మలేదు. కానీ అంతరామమయం పాడే ముందు నేను గమనించాను. ఆమెకు నేనంటే నచ్చదు. అందుకే తప్పు లేకున్నా నెగెటివ్‌ కామెంట్స్‌ చేసేవారు. ఓ సారి మైక్‌ ఆన్‌లో లేదని అనుకొని ‘ఈ అమ్మాయికి హైపిచ్‌ రాదు కానీ మ్యానేజ్‌ చేస్తుంది చూడు’ అని కీరవాణికి చెప్పారు. నాకు ఏడుపు వచ్చింది. కానీ తట్టుకొని అంతరామమయం పాడాను. చాలా మంది మెచ్చుకున్నారు. కానీ ఆమె మాత్రం నెగెటివ్‌ కామెంట్స్‌ చేశారు. కానీ మిగతావారు పాడినప్పుడు మాత్రం తప్పులు జరిగితే సైగలు చేసేవారు.ఇక చంద్రబోస్‌(chandrabose) గారు.. లిరిక్స్‌ తప్పులు ఉంటే ఆయన చెప్పాలి. మొదటి రెండు ఎపిసోడ్స్‌ నన్ను మెచ్చుకున్నారు. లిరిక్స్‌లో తప్పులు దొరకపోవడంతో నన్ను మరోలా వేధించారు.కీరవాణి.. ఆయన నుంచి నెగెటివ్‌ కామెంట్స్‌ రాలేదు. కానీ సెట్‌లో ఎలా మాట్లాడతారో చెబుతాను. మెలోడీ పాడిన వారికి ఎక్కువ మార్కులు ఇస్తానని చెబుతారు. ఆయన కంపోజ్‌ చేసిన పాటలు పాడితే మంచి మార్కులు వేస్తారు. డబ్బుల కోసం నేను వెడ్డింగ్‌ షోస్‌ చేయాల్సి వచ్చిందని గతంలో చెప్పాను. ఈ పాయింట్‌పై కీరవాణి మాట్లాడుతూ.. ‘వెడ్డింగ్‌ షోస్‌ చేసేవాళ్లు నా దృష్టిలో సింగర్సే కాదు. వాళ్లంటే నాకు అసహ్యం’ అని అన్నారు. అది చాలా హర్టింగ్‌గా అనిపించింది. అలాగే పాడుతా తీయగాలో ఐదో ఫ్రైజ్‌ సాధించినవాళ్లను నా దగ్గరకు వచ్చి చాకిరీ చేసేవాళ్ల గ్రూప్‌లో చేర్చుకుంటానని చెప్పారు. చాకిరీ అనే పదం వాడినందుకు నాకు బాధగా అనిపించింది. జడ్జీలు వివక్ష చూపడం, నన్ను చీడ పురుగులా చూడడం, నా బాడీ మీద జోకులు చేయడం..నన్ను మెంటల్‌గా ఎఫెక్ట్‌ అయ్యేలా చేశాయి.పొడ్రక్షన్‌ వాళ్లు కూడా మమ్మల్ని అవమానించారు. చీరలు ఇచ్చి బొడ్డు కిందకు కట్టుకో, ఎక్స్‌ఫోజింగ్‌ చేయాలి అన్నట్లుగా చెప్పారు. చాలా సార్లు తిట్టారు. బాడీ షేమింగ్‌ చేశారు. ‘ఇలాంటి బాడీకి ఇంకేం ఇవ్వగలను’ అని కాస్ట్యూమ్ డిజైనర్ అన్నారు. వీళ్ల మాటల వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. బాలు సార్‌ ఉన్నప్పుడు ఇలాంటివి జరిగేవి కాదు. ఎప్పుడైతే జ్ఞాపిక ప్రొడక్షన్స్‌ వచ్చిందో పాడుతా తీయగా ఇలా మారిపోయింది. డ్యాన్సులు చేయమని, కుల్లు జోకులు చేయమని చెప్పారు.ఇక నా ఎలిమినేషన్‌ రోజు ఏం జరిగిందో చెబుతాను. ఆ రోజు టాప్‌ 1 వచ్చిన అమ్మాయి చంద్రబోస్‌ గారి పాట పాడింది. లిరిక్స్‌ మరిచిపోయినా చంద్రబోస్‌ గారు కామెంట్స్‌లో అది చెప్పలేదు. ఇంకో అబ్బాయి కీరవాణి పాట పాడితే స్కోర్‌ ఎక్కువ వేశారు. ఎలిమేషన్‌ రౌండ్‌లో జరిగింది ఇది. ఎలిమినేషన్‌ జరిగినప్పుడు కీరవాణి, చంద్రబోస్‌ అక్కడ నుంచి లేచి వెళ్లిపోయారు. సునీత మాత్రం అక్కడే నవ్వుతూ కూర్చున్నారు. ఎలిమేట్‌ అయ్యాక.. నేను ఎమోషనల్‌ అయ్యాను. మా అమ్మ సునీత దగ్గరకు వచ్చి ‘ఎందుకు ఇంత అన్యాయం చేశారు’ అని అడిగితే..‘నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో’అని సీరియస్‌గా అన్నారు. నేను చాలా షోస్‌ చేశాను కానీ ఏ జడ్జి కూడా ఇలా మాట్లాడలేదు.నేను ఈ కెరీయర్‌ వదిలేద్దామని డిసైడ్‌ అయ్యాకే ఈ వీడియో చేశాను. పెద్ద పెద్ద వాళ్ల పేర్లు బయటపెట్టాను. నాకు ఎలాగో అవకాశం రాదు. మీ అందరికి చెప్పేది ఒక్కటే ఇలాంటి ఫేక్‌ షోస్‌ చూడడం మానేయండి. నాలాగే చాలా మంది సఫర్‌ అయ్యారు. జడ్జిలు ఆ సీటులో కూర్చొని అన్యాయం చేసి సరస్వతి దేవిని అవమానించకండి. చిత్రమ్మ, మనోగారు, శైలజగారు ఉంటే చాలా బాగుంటుంది. మాలాంటి జీవితాలతో ఆడుకోకండి. నాకు ఏమైనా అయినా, నా ఫ్యామిలీకి ఏమైనా జరిగినా కీరవాణి, చంద్రబోస్‌, సునీతతో పాటు జ్ఞాపిక ప్రొడక్షన్స్‌ వాళ్లదే బాధ్యత’ అని సింగర్‌ ప్రవస్తి పేర్కొంది.

Congress Rahul Gandhi Sensational Allegations On EC At  Boston9
Boston: ఈసీపై రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వ్యవస్థ రాజీ పడినట్లు కనిపిస్తోందని, ఆ వ్యవస్థలోనే ఏదో తప్పు ఉందంటూ వ్యాఖ్యానించారాయన. ఈ క్రమంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రస్తావననూ ఆయన తీసుకొచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ(Rahul Gandhi).. ఆదివారం బోస్టన్‌లో ప్రవాస భారతీయులు పాల్గొన్న ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. ‘‘ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో(Maharashtra Election Fraud) 5.30 గంటల నుంచి 7.30 గంటల మధ్య 65 లక్షల మంది ఓటు వేసినట్లు ఎన్నికల సంఘం చెప్పింది. ఒక్కో ఓటర్‌ ఓటు వేయడానికి 3 నిమిషాల సమయం పడుతుంది. అలాంటప్పుడు అంత తక్కువ వ్యవధిలో అంతమంది ఎలా ఓటు వేయగలరు?. అక్కడ ఏదో తప్పు జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది’’ అని రాహుల్‌ అన్నారు.बोस्टन : चुनाव आयोग ने हमें शाम 5:30 बजे तक के मतदान के आंकड़े दिए और शाम 5:30 बजे से 7:30 बजे के बीच 65 लाख मतदाताओं ने मतदान किया. ऐसा होना शारीरिक रूप से असंभव है :राहुल गांधी #RahulGandhi #MaharashtraElection #ElectionCommission #RahulGandhiUSA #Boston pic.twitter.com/8kSVOhZ6BU— Sumit Kumar (@skphotography68) April 21, 2025‘‘ఎన్నికల సంఘం(Election Commission) రాజీ పడినట్లు ఇక్కడే అర్థమవుతోంది. ఆ వ్యవస్థలోనే ఏదో తప్పిదం ఉంది. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు ప్రస్తావించాను. మహా ఎన్నికలకు సంబంధించిన వీడియోలు చూపించాలని మేం అడిగాం. అందుకు ఈసీ తిరస్కరించింది. ఇప్పుడు అలా అడగడానికి వీలు లేదంటూ చట్టాన్ని కూడా మార్చేశారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే వేదికగా ఆయన అమెరికా భారత్‌ మధ్య సంబంధాల గురించి కూడా మాట్లాడారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌.. సోమవారం బ్రౌన్‌ యూనివర్సిటీలో ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే.. రాహుల్‌ గాంధీ ఈసీపై ఈ తరహా ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. అయితే.. రాహుల్‌ సహా పలువురు ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా ఈవీఎంలను మేనేజ్‌ చేయొచ్చనే ఆరోపణలను కూడా తోసిపుచ్చుతూ వస్తోంది. అయినప్పటికీ వరుసగా ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ఓటర్ల జాబితాల ఆధారంగా ప్రతిపక్షాలు ఈసీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి.

Meet Khushboo Patani Dishas Sister once worked Indian Army10
వాడికి భయపడి పబ్లిక్‌ టాయ్‌లెట్‌లో దాక్కుంది..కట్‌ చేస్తే ఆర్మీ మేజర్‌!

బాలీవుడ్ నటి దిశా పటానీ అక్క ఖుష్బూ పఠానీ ఒక పసికందును రక్షించి ఇంటర్నెట్ హృదయాన్ని గెలుచుకుంది. ఆమె ప్రదర్శించిన కరుణ , ధైర్యసాహసాలు నెట్టింట ప్రశంసలు దక్కించుకున్నాయి. ఇంతకీ ఎవరీ ఖుష్బూ పటానీ? సోదరి దిశా గ్లామర్‌ ప్రపంచాన్ని ఏలుతోంటే.. ఖుష్బూ దేశానికి సేవ చేసే ఆర్మీ ఆఫీసర్‌ ఎలా అయింది? మాజీ ఆర్మీ అధికారిణి ఖుష్బూ పటానీ ఇంట్రస్టింగ్‌ జర్నీ గురించి తెలుసుకుందామా.అద్భుతనటిగా, ఫిట్‌నెస్ ప్రియురాలిగా పేరు తెచ్చుకున్న దిశా పటానీతో పాటు, ఆమె అక్క ఖుష్బూ పటానీ పేరు కూడా పాపులరే. భారతీయ ఆర్మీలో పనిచేసి రిటైర్‌ అయిన ఖుష్బూ ఇప్పుడు బహుళ పాత్రల్లో నిమగ్నమై ఉంది. వదిలివేయబడిన బిడ్డను రక్షించిన తర్వాత ఖుష్బూ ఇటీవల చాలా మంది దృష్టిని ఆకర్షించింది. తన సోదరి దిశాతో సమానంగా అద్భుతమైన ఇపుడు బరేలీలో పాపను రక్షించి వార్తల్లో నిలిచింది.1991 నవంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జన్మించింది ఖుష్బూ. బిబిఎల్ పబ్లిక్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసి, తరువాత DIT స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చేరింది. ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఖుష్బూ పటానీ తెలివైన విద్యార్థి. కానీ కాలేజీ చదువుకొనే రోజుల్లో వేధింపులకు గురైంది. కొంతమంది అబ్బాయిలు ఆమెను కారులో వెంబడించి వేధించారు. ఒక ప్రాజెక్ట్ పని తర్వాత తన స్నేహితుడితో కలిసి రాత్రి ఆలస్యంగా తన హాస్టల్‌కు వచ్చేది. ఆ సమయంలో కారులో ఒకడు పిచ్చిగా వెంటబడి, వేధించేవాడు. ఒక సందర్భంగా ఖుష్బూ ఒక మహిళల పబ్లిక్ వాష్‌రూమ్‌లో దాక్కుని తనను తాను రక్షించుకుంది. ఈ సమయంలో చాలా భయపడేపోయేదట. దీంతో ఆమె ఒంటరిగా వెళ్లడం మానేసింది. చదవండి: 25 ఏళ్ల క్రితం చెత్తకుప్పలో వదిలేస్తే.. ఓ అంధురాలి సక్సెస్‌ స్టోరీపట్టుదలగా చదువుకు పూర్తి చేసి ఎంఎన్‌సీలో జాబ్‌ సంపాదించింది కానీ ఆ ఉద్యోగం ఖుష్బూ​​కి సంతొషాన్నివ్వలేదు. కాలేజీ రోజుల నాటి భయంకరమైన అనుభవం వెంటాడేది. ఆ భయంనుంచి వచ్చిన ఆలోచనే సైన్యంలో చేరడానికి ప్రేరేపించింది. అప్పటి వరకు, ఆమెకు సైన్యంలో చేరాలనే ఆలోచన లేదు.భారత సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నాక, తన వేధింపుల గురించి తన తండ్రితో చెప్పుకుంది. SSB ప్రవేశ పరీక్షకు సిద్ధమైంది. తొలి ప్రయత్నంలోనే పరీక్షలో ఉత్తీర్ణురాలై లెఫ్టినెంట్‌గా ఆర్మీలో చేరింది. నిజమైన దేశభక్తురాలిగా దేశానికి సేవ చేసింది. ఖుష్బూ పటానీ 34 సంవత్సరాల వయసులో మేజర్ హోదాలో సైన్యం నుండి పదవీ విరమణ చేసి వెల్‌నెస్ కోచ్‌గా ఉంది. అంతేకాదు ఆమె TEDx స్పీకర్‌ కూడాసోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అభమానులకు స్ఫూర్తినిస్తోంది. ఖుష్బూ టారో కార్డ్ రీడర్ కూడా, కెరీర్, వ్యాపారం, డబ్బు, అనేక ఇతర విషయాలలో సూచనలిస్తుంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement