Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Pinnelli Villagers Meets YSRCP President YS Jagan Mohan Reddy1
బహిష్కరణకు గురైన కుటుంబాలకు అండగా వైఎస్ జగన్‌

తాడేపల్లి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసే మంచి ఏమీ లేకపోయినా కక్ష సాధింపు చర్యలు మాత్రం తీవ్రతరమవుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే పల్నాడు జిల్లా పిన్నెళ్లి గ్రామంలోని 400 కుటుంబాలపై బహిష్కరణ వేటు వేసింది. బహిష్కరణకు గురైన వారంతా ఎస్సీ, బీసీ, మైనార్టీలే. గురువారం తాడేప‌ల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామస్తులు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. బహిష్కరణకు గురైన పిన్నెళ్లి గ్రామంలోని కుటుంబాలకు అండగా నిలిచారు వైఎస్‌ జగన్‌ఈ క్రమంలోనే అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు వైఎస్‌ జగన్‌. గ్రామంలోకి వస్తే తమను చంపుతామని బెదిరిస్తున్నారని వారు వైఎస్‌ జగన్‌కు విన్నవించుకున్నారు. వీరికి వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. దీనిలో భాగంగా ‘చలో పిన్నెళ్లి’ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ‘ సిద్ధమైంది. రెండు నెలల్లో చలో పిన్నెళ్లి’ కార్యక్రమం చేపట్టాలని వైఎస్సార్‌సీపీ‘ నిర్ణయించింది. వైఎస్‌ జగన్‌ను కలిసిన వారిలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సహా పిన్నెల్లి, తురకపాలెం, మాదెనపాడు, చెన్నాయపాలెం గ్రామస్తులున్నారు.

Who Designed The Indian Rupee Symbol In 20102
ఆ మాజీ ఎమ్మెల్యే కుమారుడే.. ఈ రూపాయి (₹) సింబల్‌ను డిజైన్‌ చేసింది..

ఢిల్లీ: జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాష సూత్రం అమలుపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర వివాదం తారా స్థాయికి చేరింది. ప్రస్తుతం,తమిళనాడు బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా, ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ ప్రతుల్లో రూపాయి (₹) సింబల్‌ను (Rupee symbol row) తొలగించింది. ఆ స్థానంలో తమిళనాడులో రూ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చింది. దీంతో భాషల వివాదం మరింత ముదిరినట్లైంది. ఈ క్రమంలో ఆ రూపాయి సింబల్‌ డిజైన్‌ ఎవరు తయారు చేశారు? అనే అంశంపై నెట్టింట్లో పెద్ద ఎత్తున జరుగుతోంది.రూపాయి సింబల్‌ను ఎవరు డిజైన్‌ చేశారు?ఇక ఆ రూపాయి డిజైన్‌ను చేసింది మరెవరోకాదు తమిళనాడు అధికార డీఎంకే మాజీ ఎమ్మెల్యే ఎన్‌.ధర్మలింగం కుమారుడు ఐఐటీ ప్రొఫెసర్‌ డీ.ఉదయ్‌కుమార్‌ ధర్మలింగం. తొలిసారిగా ఈ రూపాయి సింబల్‌ 2010లో నాటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ వినియోగంలోకి తెచ్చారు. రూపాయి డిజైన్‌ ఎలా చేశారంటే?2010 నాటి యూపీఏ ప్రభుత్వం రూపాయి డిజైన్‌ చేసేందుకు దేశవ్యాప్తంగా పోటీ నిర్వహించింది. అయితే, ఈ కాంటెస్ట్‌లో ఐఐటీ ముంబైలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఉదయ కుమార్ సైతం పాల్గొన్నారు. రూపాయి సంకేతం డిజైన్ చేయడంలో దేవనాగరి, రోమన్ భాషల్ని కలుపుతూ రూపాయి డిజైన్‌ చేశారు. రూపాయి సింబల్‌ కోసం దేవనగరి భాషలోని ‘ర’ను రోమన్‌లోని ‘ఆర్‌’ కలిపి రూ (₹) సింబల్‌ను తయారు చేశారు. సరిగ్గా ఐఐటీ గౌహతి డిజైన్ విభాగంలో కొత్త ఉద్యోగంలో చేరే ఒక రోజు ముందు కేంద్రం రూపాయి సింబల్‌ కోసం ఏర్పాటు చేసిన పోటీ విజేతల్ని ప్రకటించింది. దేశ వ్యాప్తంగా వందల కొద్ది డిజైన్లు పరిశీలించగా.. ఆ డిజైన్లు అన్నింటిల్లో ఉదయకుమార్‌ డిజైన్‌ చేసిన రూపాయి డిజైన్‌ను కేంద్రం ఎంపిక చేసింది.భారత కరెన్సీలో రూపాయి సింబల్‌ 2010 జూలై 15న,మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కరెన్సీ నోట్లపై ఉదయ కుమార్‌ డిజైన్‌ చేసిన రూపాయి సింబల్‌ను చేర్చింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా భారత కరెన్సీ గుర్తింపు అమాంతం పెరిగినట్లు ఆర్ధిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో తిరువణ్ణామలై సమీపంలో ఉన్న మారూరు గ్రామంలో జన్మించిన ఉదయ కుమార్‌ రూపాయి సింబల్‌ను ఎలా డిజైన్‌ చేశారో వివరించారు. ఇక, ప్రస్తుతం ఉదయ కుమార్‌ ఐఐటీ గౌహతి డిజైన్ విభాగం హెచ్‌ఓడీగా ఉన్నారు. ఐఐటీ-హైదరాబాద్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వంటి అనేక సంస్థలకు లోగోలు డిజైన్ చేశారు.

Mumbai Indians Appoint Bollywood Icon Jackie Shroff As Spirit Coach3
ముంబై ఇండియ‌న్స్ కీల‌క నిర్ణ‌యం.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో తొలిసారి

ఐపీఎల్‌-2025(IPL 2025) సీజన్ కోసం ముంబై ఇండియన్స్(Mumba Indians) తమ సన్నాహకాలను ప్రారంభించింది. వాంఖ‌డే స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంపులో ముంబై ఆట‌గాళ్లు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు స్టార్ ప్లేయ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, సూర్య‌కుమార్ యాద‌వ్ ఆట‌గాళ్లు ఇప్ప‌టికే ముంబై శిబిరంలో చేరారు. ఇక ఈ ఏడాది సీజ‌న్ ఆరంభానికి ముందు ముంబై ఇండియ‌న్స్ మెనెజ్‌మెంట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.త‌మ జట్టు స్పిరిట్ కోచ్' గా బాలీవుడ్ ఐకాన్ జాకీ ష్రాఫ్‌ను ముంబై ఇండియ‌న్స్ యాజ‌మాన్యం నియ‌మించింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను ముంబై సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. త‌మ జ‌ట్టు ఆట‌గాళ్ల‌లో ఉత్సాహాన్ని, ప‌ట్టుద‌ల పెంచేందుకు ముంబై ఫ్రాంఛైజీ ఈ వినూత్న ఆలోచన చేసింది. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఏ ఫ్రాంచైజీ కూడా ఇటువంటి నిర్ణయం తీసు​కోలేదు. ఇక ఈ ఏడాది సీజ‌న్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తానైట్‌రైడ‌ర్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇక ముంబై ఇండియ‌న్స్ విష‌యానికి వ‌స్తే.. త‌మ తొలి మ్యాచ్‌లో మార్చి 23న చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో ఆడ‌నుంది. ఐపీఎల్‌-2024లో గ్రూపు స్టేజికే ప‌రిమిత‌మైన ముంబై ఇండియ‌న్స్‌.. ఈ ఏడాది సీజ‌న్‌లో మాత్రం స‌త్తాచాటాల‌ని భావిస్తోంది.భారీ షాక్‌.. అయితే ఈ ఏడాది సీజ‌న్ ఆరంభానికి ముందే ముంబై ఇండియ‌న్స్ గ‌ట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బ‌మ్రా గాయం కార‌ణంగా ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ సీజన్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. బుమ్రా ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నాడు. అతడు కోలుకోవడానికి మరో నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు సమాచారం. ఏప్రిల్‌లో బుమ్రా ముంబై జట్టులో చేరనున్నట్లు ఐపీఎల్‌ వర్గాలు వెల్లడించాయి.ఐపీఎల్‌-2025కు ముంబై ఇండియన్స్‌ జట్టు: హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, రాబిన్ మింజ్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, ర్యాన్ రికెల్టన్, దీపక్ చాహర్, అల్లా గజన్‌ఫర్, విల్ జాక్స్, అశ్వని కుమార్, మిచెల్ సాంట్నర్, రీస్ టోప్లీ, క్రిష్ణన్ ష్రిజిత్, రాజ్ బవా, సత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్, సీ బోచ్‌, విగ్నేష్ పుతుర్.చదవండి: IPL 2025: అతడి గురించి ఎవరూ మాట్లాడమే లేదు.. మూడో స్థానంలో ఆడిస్తారా? Saans le lamba & shaanti coz 𝙅𝘼𝙂𝙂𝙐 𝘿𝘼𝘿𝘼 - aapla Spirit Coach is here! 🧘‍♂️😎#MumbaiIndians #PlayLikeMumbai pic.twitter.com/md5fnlJKX9— Mumbai Indians (@mipaltan) March 13, 2025

IT Fresher Hiring Set to Double in FY264
ఫ్రెషర్లకు డిమాండ్: ఐటీలో నియామకాలు డబుల్

గతకొన్ని నెలలుగా దిగ్గజ ఐటీ కంపెనీలు సైతం.. కొత్త ఉద్యోగులను నియమించుకోకపోవడం మాత్రమే కాకుండా, ఉన్న వారిని కూడా ఉద్యోగాల్లో నుంచి తీసేస్తోంది. అయితే త్వరలోనే ఐటీ రంగం పుంజుకుంటుందని.. ఉద్యోగ నియామకాలు కూడా భారీగా ఉంటాయని రిక్రూటింగ్‌ సంస్థ టీమ్‌లీజ్‌ తన నివేదికలో వెల్లడించింది.2026 ఆర్థిక సంవత్సరంలో టెక్నాలజీ సేవల రంగంలో ఫ్రెషర్ల నియామకం దాదాపు రెట్టింపు అవుతుందని, గత సంవత్సరంతో పోలిస్తే నియామకాలు 1,50,000 కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. టీమ్‌లీజ్ డేటా ప్రకారం, మార్చి 2025 నాటికి దాదాపు 85,000 - 95,000 మంది ఫ్రెషర్ల నియమాలకు జరుగుతాయి.అన్ఎర్త్‌ఇన్‌సైట్ పరిశోధన ప్రకారం.. యాక్సెంచర్, క్యాప్‌జెమిని, కాగ్నిజెంట్ వంటి ప్రపంచ ఐటీ సేవల సంస్థలు కొత్తగా 1.6 లక్షల నుంచి 1.8 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలలో పెరుగుతున్న డిమాండ్ కారణంగా కొత్త ఉద్యోగాల సంఖ్య కూడా పెరుగుతుంది.ఇదీ చదవండి: నెలకు 10 రోజులు.. టెక్ కంపెనీ కొత్త రూల్! 2024 ప్రారంభం నుంచి కూడా చాలా కంపెనీలు.. తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చాయి. కాబట్టి కొత్త నియమాల విషయం కొంత ఆలోచించి, ప్రస్తుత టెక్నాలజీకు అవసరమైన నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగావకాశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇండియన్, మల్టి నేషనల్ కంపెనీలు రెండూ కూడా కొత్తవారి నియామకాలను చేపట్టనున్నాయి. అయితే కొత్త నైపుణ్యాలను నేర్చుకున్న.. ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయని టీమ్‌లీజ్ సర్వేలో వెల్లడైంది.

How stupid can you become MK Stalin Slams BJP5
‘స్టాలిన్.. అది నీ మూర్ఖత్వానికి నిదర్శనం’

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం రూపాయి సింబల్ ను మార్చడంపై ఆ రాష్ట్ర బీజేపీ తీవ్రంగా మండిపడింది. అది మూర్ఖపు చర్య అంటూ అభివర్ణించారు తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై. భారత మొత్తం తమ కరెన్సీలో 'Rs' అని ఉంటే 'Ru' అని తమిళనాడు ప్రభుత్వం మార్చడం అతి తెలివి తక్కువ పని అంటూ ధ్వజమెత్తారు. దీన్ని మూర్ఖపు చర్య కాకపోతే ఇంకేమనాలి అని ఆయన ప్రశ్నించారు అసలు స్టాలిన్ ఎలా సీఎం అయ్యారో అంటూ విమర్శలు గుప్పించారు.కాగా, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 2025 - 26 బడ్జెట్‌లో సాధారణ రూపాయి చిహ్నానికి బదులుగా.. తమిళ చిహ్నంతో భర్తీ చేయడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఇప్పటికే జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వం.. తాజాగా ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రూపాయి సింబల్ ను మార్చడమే కాకుండా ‘రు’ అని ఆ సింబల్ పై పేర్కొనడమే వివాదాన్ని మరింత పెంచింది.The DMK Government's State Budget for 2025-26 replaces the Rupee Symbol designed by a Tamilian, which was adopted by the whole of Bharat and incorporated into our Currency. Thiru Udhay Kumar, who designed the symbol, is the son of a former DMK MLA. How stupid can you become,… pic.twitter.com/t3ZyaVmxmq— K.Annamalai (@annamalai_k) March 13, 2025తమిళనాడుపై హిందీ భాష రుద్దుతారా?తాము ఎంతో గౌరవించే తమిళభాషపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతున్నారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విమర్శించారు. తమిళనాడులో హిందీ భాషను తీసుకొస్తే తమిళనాడు ఎడ్యుకేషన్ సిస్టం అంతా సర్వనాశనం అవుతుందని మండిపడ్డారు. వారి తీసుకొచ్చే ఎడ్ముకేషన్ పాలసీ.. అది ఎడ్యుకేషన్ పాలసీ కాదు.. కుంకుమ, పసుపు పాలసీ. ఇది భారత్ ను అభివృద్ధి చేయడం కోసం తెచ్చిన పాలసీ ఎంతమాత్రం కాదు. కేవలం హిందీని అభివృద్ధి చేయడం కోసం తీసుకొచ్చిన పాలసీ.’ అని ధ్వజమెత్తారు స్టాలిన్.

MLA Jagadish Reddy Suspended From The House6
అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి సస్పెన్షన్‌

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి (Jagadish Reddy) సస్పెన్షన్‌ గురయ్యారు. ఆయన్ను సభ నుంచి సస్పెండ్‌ చేస్తూ అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ నిర్ణయం తీసుకున్నారు. గురువారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశిస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంపై దుమారం చెలరేగింది. దీంతో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు జగదీష్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. మధ్యాహ్నం వరకు ఇదే అంశంపై చర్చ జరిగింది. ఆ సమయంలో అసెంబ్లీ వాయిదా పడింది. దీంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు.. స్పీకర్‌ను ఉద్దేశిస్తూ జగదీష్‌ రెడ్డి మాట్లాడిన వీడియోని వీక్షించారు.తిరిగి మధ్యాహ్నం సభ ప్రారంభం కావడంతో జగదీష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు, మంత్రులు డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా.. ఏ తప్పు చేయకపోయినా కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సంపత్‌ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎథిక్స్‌ కమిటీకి సిఫార్స్‌లు చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డిని సభ నుంచి సస్పెండ్‌ చేశారు. బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్‌ కొనసాగుతుందని అసెంబ్లీలో ప్రకటించారు. సస్పెండ్‌ అయిన సభ్యుడిని బయటకు పట్టాలని ఆదేశించారు. స్పీకర్‌ గురించి జగదీష్‌ రెడ్డి ఏం మాట్లాడారంటే?తొలుత జగదీష్‌ రెడ్డి స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘ఈ సభ అందరిదీ.. సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. మా అందరి తరఫున పెద్ద మనిషిగా, స్పీకర్‌గా మీరు కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కాదు’’ అని వ్యాఖ్యానించారు.

Relief for Posani Krishna Murali in AP High Court7
ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట

సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. తనపై బాపట్ల పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును క్వాష్‌ చేయాలంటూ హైకోర్టులో పోసాని పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. BNS 35(3) సెక్షన్‌ను ఫాలో కావాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.కాగా, పోసానిని సీఐడీ పోలీసులు నిన్న (బుధవారం) రాత్రి( గుంటూరులో ఎక్సైజ్‌ కోర్టు న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరు పరిచారు. ఈ సందర్భంగా పోసాని అనారోగ్య సమస్యల గురించి విన్నవించుకున్నారు. బెయిల్‌ రాకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని పోసాని కృష్ణమురళి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులకు సంబంధించి తనకు ఎటువంటి పాపం తెలియదని, తానేం చేయలేదని న్యాయమూర్తి ఎదుట బోరున విలపించారు.నిజం మాట్లాడినందుకు తన మీద కక్ష కట్టి ఇలాంటి అన్యాయమైన కేసులు పెట్టారని విన్నవించారు. తల్లి మీద, పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నానని తనకే పాపమూ తెలియదని న్యాయమూర్తిని వేడుకొన్నారు. బెయిల్‌ ఇవ్వాలని కోరారు. వయసు మీదపడడంతో కూర్చోలేక పోతున్నానని చెప్పుకొచ్చారు. పోలీసులు ఎక్కడినుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియడం లేదని, ఇప్పటికే కొన్ని వందల మైళ్లు ప్రయాణం చేయించారని, ఎందుకు నన్ను తిప్పుతున్నారో అర్థం కావడం లేదని, ఇలా చేస్తే తాను ఎక్కువ రోజులు బతకనని మొరపెట్టుకున్నారు.టీడీపీలోకి రమ్మంటే రానందుకు లోకేశ్‌ తనను వేధిస్తున్నారని, నంది అవార్డుల ప్రకటనలో పక్షపాతాన్ని ఎత్తిచూపడంతో కక్ష కట్టారని తెలిపారు. అన్నీ నిజాలే చెబుతున్నానని నార్కో ఎనాలసిస్‌ టెస్టుకూ సిద్ధమన్నారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే ఇన్ని కేసులు కడతారా అని ఆవేదన వ్యక్తం చేశారు.

BRS Harish Rao Reacts On Jagadish Reddy Speaker Row8
అవసరమైతే స్పీకర్‌పై అవిశ్వాసం పెడతాం: హరీష్‌ రావు

హైదరాబాద్‌, సాక్షి: స్పీకర్‌ను ‘మీ’ అని సంబోధించడం.. అవమానించడం ఎలా అవుతుంది? అని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌ రావు అంటున్నారు. గురువారం అసెంబ్లీలో జరిగిన పరిణామాలు.. జగదీష్‌రెడ్డి అంశంపై తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను జగదీష్‌రెడ్డి అవమానించలేదు. సభ మీ ఒక్కరిది కాదు.. అందరిదీ అన్నారు. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధమేమీ కాదు. అదేం అన్‌పార్లమెంటరీ పదమూ కాదు. కాంగ్రెస్‌ పార్టీ డిఫెన్స్‌లో పడింది. స్పీకర్‌ను కలిసి రికార్డులు తీయాలని అడిగాం. పదిహేను నిమిషాలు ఎదురు చూసినా.. ఆయన వీడియో రికార్డులు చూపించలేదు. అసలు సభ ఎందుకు వాయిదా వేశారో కూడా తెలియదు. స్పీకర్‌ గనుక ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించకపోతే.. అవిశ్వాసం పెట్టడానికైనా మేం సిద్ధం’’ అని హరీష్‌రావు అన్నారు. సభలో సభ్యులందరికీ సమానమైన హక్కులు ఉంటాయని సీనియర్‌ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ అంటే మాకు అపారమైన గౌరవం ఉంది. కానీ, కాంగ్రెస్ నేతలు మాట్లాడే మాటలు విచిత్రంగా ఉన్నాయి అని అన్నారాయన. మరోవైపు.. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. స్పీకర్ అందరికి సమానం.. అందరి తరఫున సభలో కూర్చున్నారని జగదీష్ రెడ్డి అన్నారు మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.. అందుకే స్పీకర్‌ కుర్చీతో డైవర్షన్‌ పాలిటిక్స్‌కు దిగింది అని ప్రశాంత్‌ రెడ్డి విమర్శించారు. ఇదీ చదవండి: స్పీకర్‌పై జగదీష్‌రెడ్డి వ్యాఖ్యలు.. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

 Gudivada Amarnath Strong Counter To Vijayasai Reddy Kotary Comments9
Vijayasaireddy: ఆయన నుంచి ఇంతకంటే ఏం ఆశిస్తాం?

విశాఖపట్నం, సాక్షి: వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ వల్లే తాను వైఎస్సార్‌సీపీకి దూరమయ్యానని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు(Vijayasai Kotary Comments) మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్‌ ఇచ్చారు. ఆయన గతంలో ఢిల్లీలో మాట్లాడిన మాటలకు.. ఇప్పుడు విజయవాడలో మాట్లాడిన మాటలకు ఎక్కడా పొంతన లేదని అమర్నాథ్‌ చురకలంటించారు. ‘‘వైఎస్ జగన్(YS Jagan) కోటరీ అంటే అది ప్రజలే. అయినా ఏ రాజకీయ పార్టీ చుట్టూ కోటరీ ఉండదో చెప్పండి. ఆ మాటకొస్తే చంద్రబాబు చుట్టూ కోటరీ లేదా?. మొన్నటి వరకు కోటరిలో ఉన్న మనమే.. ఇప్పుడు ఆ కోటరీ గురించి మాట్లాడితే ఏమి బాగుంటుంది?. ఒకరి మీద ప్రేమ పుడితే మరొకరి మీద ప్రేమ విరిగిపోతుంది. మరి విజయసాయిరెడ్డికి ఎవరి మీద ప్రేమ పుట్టిందో తెలియదు. అయినా పార్టీ మారిన ఆ వ్యక్తి నుంచి ఇంతకంటే ఏమి ఆశిస్తాం?.ప్రస్తుతం రాష్ట్రంలో మూడు వర్గాలు ఉన్నాయి. ఒకటి కూటమి వర్గం.. రెండోది వైఎస్సార్‌సీపీ వర్గం. ఇక మూడోది.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు చూసే వర్గం. గతంలో వైఎస్సార్‌సీపీలో కీలకమైన పదవులు అనుభవించారు. మళ్ళీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే పార్టీ నుంచి వెళ్లే పోయేవారా?. ఇదే విధంగా మాట్లాడేవారా?. అసలు ఇటువంటి వ్యాఖ్యలను ప్రజలు హర్షిస్తారా?. ఆ మధ్య రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. ఇప్పుడేమో కోటరీ అంటూ మాట్లాడుతున్నారు. ఆయన మాటలు చూస్తే తేడాగా కనిపిస్తోంది. ఆయన తాజా వ్యాఖ్యలు మళ్లీ రాజకీయాల వైపు చూస్తున్నారనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది’’ అని గుడివాడ అమర్నాథ్‌(Gudivada Amarnath) అన్నారు. ఒక్క హామీ అమలు చేయలేదుకూటమి ప్రభుత్వం ఒక్క హామీని నెరవేర్చలేదు. హామీలు అమలు చేయకపొగా.. వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తున్నారు. నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తామన్నారు. కానీ, బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి కోసం రూపాయి కూడా కేటాయించలేదు. అలాగే ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఇప్పటిదాకా కాలేదు. జగన్‌ హయాంలో తీసుకొచ్చిన 17 మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారు. ఈ సమస్యలపై పోరాటంలో యువత పోరు కార్యక్రమం చేపట్టాం.. అది విజయవంతం అయ్యింది. ప్రజలకు ఎల్లప్పుడూ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది అని అమర్నాథ్‌ అన్నారు.

Court: State Vs A Nobody Movie Review In Telugu10
Court Movie Review: నాని ‘కోర్ట్‌’ మూవీ రివ్యూ

టైటిల్‌:'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' నటీనటులు: ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్‌, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి తదితరులుసమర్పణ: నానినిర్మాణ సంస్థ: వాల్ పోస్టర్ సినిమానిర్మాత: ప్రశాంతి తిపిర్నేనికథ, దర్శకత్వం: రామ్ జగదీష్సంగీతం: విజయ్ బుల్గానిన్సినిమాటోగ్రఫీ: దినేష్‌ పురుషోత్తమన్‌ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్విడుదల తేది: మార్చి 14, 2025హీరో నాని ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కొత్త చిత్రాలను నిర్మిస్తున్నాడు. వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌ ద్వారా కొత్త కంటెంట్‌తో పాటు కొత్త నటీనటులను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. తాజాగా ఆయన బ్యానర్‌లో తెరకెక్కిన చిత్రమే ‘కోర్ట్‌’. ‘‘కోర్ట్‌’ నచ్చకపోతే నా ‘హిట్‌ 3’సినిమా చూడకండి’ అంటూ నాని సవాల్‌ విసరడంతో ఈ చిన్న చిత్రంపై అందరిలో ఆసక్తి పెరిగింది. అంతేకాదు రిలీజ్‌కి రెండు రోజుల ముందే మీడియాకు స్పెషల్‌ షో వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2013లో సాగుతుంది. విశాఖపట్నంలో మంగపతి(శివాజీ)కి మంచి రాజకీయ పలుకుబడి ఉంటుంది. తన మామయ్య(శుభలేఖ సుధాకర్‌) ఇంట్లో కూడా తన పెత్తనమే సాగుతుంది. ఆడవాళ్లను తన హద్దుల్లో పెట్టుకోవాలనే మనస్తత్వం తనది. ఇంట్లో ఉన్న అమ్మాయిలు కాస్త ఫ్యాషన్‌ దుస్తులు ధరించినా సహించలేడు. అలాంటి వ్యక్తికి తన కోడలు జాబిలి(శ్రీదేవి) ప్రేమ కథ తెలుస్తుంది. ఇంటర్‌ చదువుతున్న జాబిలి.. ఇంటర్‌ ఫెయిల్‌ అయి పార్ట్‌ టైం జాబ్‌ చేస్తున్న వాచ్‌మెన్‌ కొడుకు చంద్రశేఖర్‌ అలియాస్‌ చందు(రోషన్‌)తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం మంగపతికి తెలిసి.. తనకున్న పలుకుబడితో చందుపై పోక్సో కేసు పెట్టించి అరెస్ట్‌ చేయిస్తాడు. మరి ఈ కేసు నుంచి చందు ఎలా బయటపడ్డాడు? జూనియర్‌ లాయర్‌ సూర్యతేజ(ప్రియదర్శి) ఎలాంటి సహాయం చేశాడు? అసలు పోక్సో చట్టం ఏం చెబుతోంది? ఈ చట్టాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకుల్ని ఎలా బలి చేస్తున్నారు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘కోర్ట్‌’ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని రాజ్యాంగం చెబుతోంది. కానీ అదే చట్టాలను కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకులను జైలుపాలు చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ‘కోర్ట్‌’ సినిమా చూస్తున్నంతసేపు అలాంటి ఘటనలు గుర్తుకొస్తూనే ఉంటాయి. చిన్న పిల్లల రక్షణ కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పోక్సో చట్టాన్ని కొంతమంది ఎలా మిస్‌ యూజ్‌ చేస్తున్నారు? ఇలాంటి పవర్‌ఫుల్‌ చట్టాలలో ఉన్న లొసుగులను పోలీసులతో పాటు ‘లా’ వ్యవస్థ ఎలా వాడుకుంటుంది? పోక్సో చట్టం ఏం చెబుతోంది? అందులో ఉన్న ప్లస్‌, మైనస్‌ పాయింట్స్‌ ఏంటి? తదితర విషయాలను ఈ చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు రామ్‌ జగదీష్‌.దర్శకుడు ఎంచుకున్న టాపిక్‌ చాలా సెన్సిబుల్‌. ఎక్కడా అసభ్యతకు తావులేకుండా చాలా నీట్‌గా ఆ టాపిక్‌ని చర్చించాడు. ఈ విషయంలో దర్శకుడిని ప్రశంసించాల్సిందే. అయితే కథనం మాత్రం ఊహకందేలా సాగించాడు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి సీన్‌ మన ఊహకందేలా సాగుతుంది. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది. అలాగే లవ్‌ స్టోరీని కూడా రొటీన్‌గానే చూపించాడు. కుర్రాడిపై పోక్సో కేసు నమోదైన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. బెయిల్‌ కోసం ప్రయత్నించిన ప్రతిసారి చట్టంలోని లొసుగులు ఉపయోగించి లాయర్‌ దాము(హర్ష వర్ధన్‌) అడ్డుపడే విధానం ఆకట్టుకుంటుంది. క్రాస్ ఎగ్జామినేషన్‌లో అవన్నీ అబద్దాలని తేలిపోతాయని తెలిసినా.. తెరపై చూస్తుంటే ఆసక్తికరంగా అనిపిస్తాయి. సెకండాఫ్‌ మొత్తం కోర్టు వాదనల చుట్టే తిరుగుతుంది. కొన్ని చోట్ల ప్రియదర్శి వాదనలు ఆకట్టుకుంటాయి. చిన్నచిన్న ట్విస్టులు కూడా ఎంటర్‌టైన్‌ చేస్తాయి. ఎమోషనల్‌ సీన్లను బలంగా రాసుకున్నాడు. క్లైమాక్స్‌లో లా వ్యవస్థను ప్రశ్నిస్తూ ప్రియదర్శి చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. ఎవరెలా చేశారంటే.. ప్రియదర్శి నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్ర అయినా సరే నేచురల్‌ యాక్టింగ్‌తో అదరగొట్టేస్తాడు. జూనియర్‌ లాయర్‌ సూర్యతేజ పాత్రలో ఒదిగిపోయాడు. కోర్టులో ఆయన వినిపించే వాదనలు ఆకట్టుకుంటాయి. పలు సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన హర్ష రోషన్‌ ఈ సినిమాలో చందు పాత్ర పోషించి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. జాబిలిగా కొత్తమ్మాయి శ్రీదేవి చక్కగా నటించింది. ఇక ఈ సినిమాలో బాగా పండిన పాత్ర శివాజీది అని చెప్పాలి. తెరపై ఆయన పండించిన విలనిజం సినిమా స్థాయిని పెంచేసింది. సాయి కుమార్‌, రోహిణి, శుభలేఖ సుధాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. విజయ్ బుల్గానిన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలమైంది. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
ఆ మాజీ ఎమ్మెల్యే కుమారుడే.. ఈ రూపాయి (₹) సింబల్‌ను డిజైన్‌ చేసింది..

ఢిల్లీ: జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాష సూత్ర

title
ప్రమాదంలో విద్యార్థుల భవిష్యత్‌.. పేపర్‌ లీకేజీలపై రాహుల్‌ ట్వీట్‌

ఢిల్లీ: ప్రశ్నాపత్రాల లీకేజీలను వ్యవస్థాగత వైఫల్యంగా కాంగ్రె

title
‘స్వార్‌గేట్‌’ కేసు : నిందితుడి పోలీసు కస్టడీ పొడిగింపు

‘స్వార్‌గేట్‌’అత్యాచారం కేసు నిందితుడికి కోర్టు మార్చి 26 వరకు పోలీసు కస్టడీ విధించింది.

title
రూపాయి చిహ్నం మార్చేసిన తమిళనాడు ప్రభుత్వం

జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు - కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం జరుగుతోంది.

title
నిర్మలమ్మ వ్యాఖ్యలకు విజయ్‌ కౌంటర్‌

చెన్నై: ద్రవిడ ఉద్యమ నేత, తమిళ సామాజికవేత్త పెరియార్‌పై కేంద

NRI View all
title
ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

title
భారత విద్యార్థుల చూపు.. ఆ దేశాలవైపు!

ఉన్నత విద్య కోసం అగ్ర రాజ్యాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.

title
సుదీక్ష మిస్సింగ్‌.. కిడ్నాపైందా?

న్యూఢిల్లీ: కరీబియన్‌ దేశం డొమినికన్‌ రిపబ్లిక్‌లో తెలుగు వి

title
టీటీఏ (TTA) న్యూయార్క్‌ చాప్టర్‌ రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపురి

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA)  న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి &

title
న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు

మహిళలకు  ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి  పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోస

Advertisement

వీడియోలు

Advertisement