బజార్‌హత్నూర్: జిల్లాలో క్రీడల అభివృద్ధికి, మినీ స్టేడియాల ఏర్పాటుకు కృషి చేస్తానని ఎంపీ గో డం నగేశ్ తెలిపారు. మండలంలోని తన సొంత గ్రామం జాతర్లలో నవజ్యోతి యూత్ క్ల బ్ ఆధ్వర్యంలో శివరా త్రి సందర్భంగా కబడ్డీ, వాలీబాల్, షటీల్ అంతర్రాష్ట్ర క్రీడా పోటీలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 2014–19 ఎంపీగా ఉన్న సమయంలో జాతర్ల గ్రామంలో మినీ స్టేడియం, మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేశానని, రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లాల క్రీడా పోటీలు నిర్వహించి గ్రామానికి పేరు తీసుకువచ్చానని తెలిపారు. మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌కు అదనంగా మరో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తున్నామన్నారు. నవజ్యోతి యూత్ క్లబ్ గత 48 ఏళ్లుగా క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్యాక్స్ చైర్మన్ వెంకన్నయాదవ్, బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీలు శంకర్, రాజు, గణేశ్, రమణ, సుఖ్‌దేవ్, రాములు, ఈశ్వర్, రవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment