ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన బెల్ట్‌షాప్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు జైనథ్ సీఐ డి.సాయినాథ్ తెలిపారు. భోరజ్ మండలంలోని కౌట గ్రామంలో వాగ్డే మోహన్ కిరాణా దుకాణంలో బెల్ట్‌షాప్ నిర్వహిస్తున్నాడని అందిన సమాచారంతో గురువారం ఏఎస్సై సిరాజ్ ఖాన్, సిబ్బంది దాడులు నిర్వహించారు. అతని వద్ద నుంచి 8 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. వీటి విలువ రూ.5,500 ఉంటుందన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా మద్యం అమ్ముతున్న ఆయనపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తులపై..
నస్పూర్: ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. తీగల్ పహడ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ వద్ద గురువారం సీసీసీ నస్పూర్ ఎస్సై సుగుణాకర్ విధులు నిర్వహిస్తున్నాడు. కమలాకర్‌రావు, మరికొందరు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి, నిర్దేశించిన హద్దును దాటి ఎస్సైతో వాగ్వాదానికి అతని విధులకు ఆటంకం కలిగించారు. ఎస్సై ఫిర్యాదుతో కమలాకర్‌రావు, మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment