రిటైర్డ్ ఎస్సైకి సన్మానం
ఆదిలాబాద్‌టౌన్: భీంపూర్ ఎస్సైగా విధులు నిర్వహించి రిటైర్డయిన మహ్మద్ కలీమ్‌ను శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ గౌస్ ఆలం సన్మానించారు. అనంత రం పోలీస్ వాహనంలో అతడిని సాగనంపా రు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కలీ మ్ ఎలాంటి రిమార్క్ లేకుండా సర్వీస్ పూర్తి చేయడం అభినందనీయమని కొనియాడారు. 1983లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సైగా ప్రమోషన్లు పొంది 41 ఏళ్ల తొమ్మిది నెలలపాటు సేవలందించారని పేర్కొన్నారు. ప్రభుత్వం కలీమ్‌ను సేవ, ఉత్తమ సేవా పతకాలతో గౌరవించిందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ సురేందర్‌రావు, డీఎస్పీలు శ్రీనివాస్, జీవన్‌రెడ్డి, జైనథ్ సీఐ సాయినాథ్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ గుణవంతురావ్, సీసీ శ్రీనివాస్, సిబ్బంది కవిత జైస్వాల్, సత్యనారాయణ, అనసూయ, కలీమ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment