పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
ఆదిలాబాద్‌టౌన్: ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈవో రవీంద్రకుమార్ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డీఐఈవో కార్యాలయంలో సీఎస్, డీవోలతో సమావేశమై మాట్లాడారు. ఈనెల 5నుంచి ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 31 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఫస్టియర్ పరీక్షలకు 9,108 మంది విద్యార్థులు, సెకండియర్ పరీక్షలకు 9,774 మంది హాజరు కానున్నట్లు తెలిపారు. రెండు సిట్టింగ్, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను నియమించినట్లు పేర్కొన్నారు. పరీక్షాకేంద్రాల్లో అన్ని వసతులు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఓటీపీ ద్వారా హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకుని నేరుగా పరీక్షకు హాజరు కావాలని సూచించారు. ప్రిన్సిపాల్‌లు, గణేశ్‌జాదవ్, భగవాండ్లు, సూర్యప్రకాశ్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.
వీసీ ద్వారా సీఎస్ సమీక్ష
కై లాస్‌నగర్: ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ, ఎల్‌ఆర్‌ఎస్‌పై సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఈ నెల 5నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షల ఏర్పాట్లపై సమీక్షించారు. నిబంధనల గురించి వివరించి తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. వీసీలో సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్, ఆర్డీవో వినోద్ కుమార్, విద్యుత్, ప్రిన్సిపాల్, డీఎల్పీవో, డీఎంహెచ్‌వో, కలెక్టరేట్ ఏవో తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment