ఎమ్మెల్సీ ఎన్నికలపై మహిళల అనాసక్తి
● జిల్లాలో ఓటరు నమోదు అంతంతే ● పోలింగ్‌లో పాల్గొన్నది సగం మందే
కై లాస్‌నగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహిళా ఓటర్లు అంతగా ఆసక్తి చూపలేదు. చాలా మంది మహిళలు ఓటరుగా నమోదు చేసుకునేందుకే ముందుకు రాలేదు. ఓటుహక్కు పొందిన వారిలోనూ సగం మంది వినియోగించుకోలేదు. గురువారం జరిగిన టీచర్స్, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల అధిపత్యం ఉండగా, విద్యావంతులైన మహిళలు ఎమ్మెల్సీలను ఎన్నుకునే ప్రక్రియను పట్టించుకోలేనట్లు తెలుస్తోంది. పట్టభద్రుల నుంచి టీచర్స్ వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా టీచర్స్ ఓటరుగా 498 మంది మహిళా టీచర్లు దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 443 మంది మాత్రమే ఓటేశారు. 55 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. జిల్లాలో ఎంతో మంది డిగ్రీ ఉత్తీర్ణులైన యువతులు, మహిళలు ఉండగా ఓటరు నమోదుపై అంతగా ఆసక్తి చూపలేదు. 4,612 మంది మాత్రమే ఓటరుగా నమోదు చేసుకున్నారు. ఇందులో 2,913 మంది మాత్రమే ఓటు వేయగా, 1,699 మంది పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. ఇందుకు మహాశివరాత్రి మరుసటి రోజే పోలింగ్ ఉండడం కొంత కారణమై ఉండొచ్చు. కానీ.. అన్ని రంగాల్లో ముందుండే అతివలు, ఇందులో విద్యావంతులైన వారు ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆసక్తి చూపకపోవడం చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment