8న అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం
ఆదిలాబాద్‌రూరల్: మావల మండలం బట్టిసావర్‌గాం శివారులోని కుమురం భీం కాలనీలో ఈనెల 8వ తేదీన అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేశ్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ కోదండరాం, విత్తన శుద్ధి చైర్మన్ అన్వేశ్‌రెడ్డి, మధుయాష్కిగౌడ్‌ను కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ సందర్భంగా గణేశ్ మాట్లాడుతూ.. అధి కసంఖ్యలో హాజరై అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు వెట్టి మనోజ్, గోడం రేణుక, ఉయిక ఇందిరాబాయి, సోయం లలిత, కుమ్ర శాంతాబాయి, ఆత్రం గణపతి, తొడసం ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment