ఆరు గ్యారంటీలు అమలు చేయాలి
కై లాస్‌నగర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను తక్షణమే అమలు చేయాలని ఎంసీపీఐ (యు) జిల్లా కార్యదర్శి కుంటాల రాములు డిమాండ్ చేశారు. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ రూరల్, అర్బన్, మావల మండల తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల అమలుకు అవసరమైన ప్రత్యేక నిధులు ఈ బడ్జెట్ సమావేశాల్లో కేటాయించాలని డిమాండ్ చేశారు. వంద కోట్ల ఆస్తులు కలిగిన ప్రతీ ఒక్కరి నుంచి ప్రజాసంక్షేమ ట్యాక్స్ వసూలు చేయాలని కోరారు. విద్య, వైద్యం, మహిళ, యువజన సంక్షేమ రంగాలకు 40శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని ఏళ్లుగా జీవిస్తున్న పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను ఆరు నెలల్లో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో పార్టీ నాయకులు దేవేందర్, గణేశ్, నరేందర్, సుజాత, రేణుక, లింగన్న, సాయి, హరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment