పనులు పరిశీలించిన కలెక్టర్
నార్నూర్: మండలంలోని గిరిజన గ్రామాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సహకారంతో బీఏఐఎఫ్ సంస్థ గిరిజన గ్రామాల్లో చేపట్టిన పనులను క లెక్టర్ రాజర్షిషా శుక్రవారం పరిశీలించారు. తా డిహత్నూర్ జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గది, గ్రంథాలయాన్ని ప్రారంభించారు. గ్రామ శివారులో నాటిన మొక్కల ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. హెచ్‌డీఎఫ్ సీ బ్యాంక్, బీఏఐఎఫ్ సంస్థ సహకారంతో ప లు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. గిరిజన రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ఏజెన్సీలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించా ల్సిన అవసరముందని చెప్పారు. అడ్మినిస్ట్రేషన్‌తో సమన్వయం చేసుకుని ముందుకెళ్తే పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. లాభదాయక పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమాల్లో హెచ్‌డీఎఫ్‌సీ రీజినల్ మేనేజర్ వెంకటేశ్ చల్లావార్, జోనల్ హెడ్ కర్ణాకర్‌రెడ్డి, సీఎస్‌ఆర్ టీం ఆసియా సాహిద్, రాష్ట్ర ప్రతినిధి హేమంత్, తహసీల్దార్ రాజలింగు, ఎంపీడీవో జవహర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment