లెక్కింపు పెద్ద కథే..!
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 3న కరీంనగర్‌లో నిర్వహించనున్నారు. ఫలితం తేలేందుకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.
ఆదివారం : 6:18
సోమవారం : 5:17
ఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2025
8లోu
● డీఎస్సీ 2024 నియామకాల్లో భాగంగా బేల మండలంలో ఎస్జీటీ మరాఠీ మీడియంలో ఓ అభ్యర్థికి పోస్టింగ్ ఇచ్చారు. సదరు అభ్యర్థి తెలుగు మీడియంలో పదో తరగతి, ఇంటర్, తర్వాత డీఎడ్ పూర్తి చేశాడు. మళ్లీ ఓపెన్ స్కూల్ విధానం మరాఠీ మీడియంలో టెన్త్, ఇంటర్ చదివాడు. నిబంధనల ప్రకారం మళ్లీ డీఎడ్ చేస్తేనే పోస్టింగ్ కల్పించాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఆ అభ్యర్థికి పోస్టింగ్ కల్పించారు. ఈ విషయంపై విద్యాశాఖ అధికారులు, ఉద్యోగులకు ఫిర్యాదు అందగా తమ కారణంగానే తప్పిదం జరిగిందని అనుకున్నారు. ఈ విషయమై డీఎస్‌ఈకి లేఖ రాశారు. సదరు అభ్యర్థికి వేతనం చెల్లించవద్దని సంబంధిత మండల అధికారికి మౌఖికంగా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో సదరు అభ్యర్థి నాలుగు నెలల నుంచి వేతనం చెల్లించడం లేదని అధికారులకు వినతిపత్రం సమర్పించగా.. ఇప్పటికీ ఎటూ తేల్చలేదు.
● ఉట్నూర్‌కు చెందిన ఓ అభ్యర్థి ఉర్దూ మీడియం ఎస్జీటీ పోస్టుకు ఎంపికయ్యారు. పదో తరగతి, ఇంటర్, డీఎడ్ తెలుగు మీడియంలో సదరు అభ్యర్థి చదివారు. ఆ తర్వాత డిగ్రీలో ఓ సబ్జెక్టు ఉర్దూలో చదివారు. అయితే ఈ అభ్యర్థికి అర్హత లేదని విద్యాశాఖ పోస్టింగ్ కల్పించలేదు. సర్టిఫికెట్లు పరిశీలించిన అధికారి ఆమెను అనర్హురాలిగా చూపించారు. ఈ విషయమై డీఎస్‌ఈకి లేఖ రాశారు. అయితే మరాఠీ మీడియం అభ్యర్థికి పోస్టింగ్ ఇవ్వగా, ఉర్దూ మీడియం అభ్యర్థికి పోస్టింగ్ కల్పించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
● ఎస్జీటీ మరాఠీ మీడియంలో ఓ అభ్యర్థి పోస్టుకు ఎంపికయ్యారు. ఇదే విభాగంలో ఓ అభ్యర్థి ఆయన సర్టిఫికెట్లు సరిగా లేవని ఫిర్యాదు చేయడంతో ఆ అభ్యర్థికి పోస్టింగ్ ఇవ్వకుండా అభియన్స్‌లో పెట్టారు. అక్టోబర్ 16న ఈ ప్రక్రియ జరగగా, ఇంతవరకు విచారణ పూర్తి కావడం లేదు. మొదట ఓ ఎంఈవోను విచారణ అధికారిగా నియమించగా, అంతా సరిగానే ఉన్నాయని నివేదిక సమర్పించారు. ఆ తర్వాత ఓ పీజీ హెచ్‌ఎంను విచారణ అధికారిగా నియమించగా ఆయన మహారాష్ట్రకు వెళ్లి విచారణ చేపట్టారు. అక్కడి ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాధికారి మహారాష్ట్రలో చదివినట్లు ద్రువీకరించారు. వారి నుంచి పత్రాన్ని తీసుకొచ్చి అధికారులకు సమర్పించారు. మళ్లీ ఓ హెచ్‌ఎంను విచారణ అధికారిగా నియమించగా, విచారణ చేపట్టేందుకు నిరాకరించారు. దీంతో మరో హెచ్‌ఎంను విచారణకు నియమించారు. దాదాపు ఐదు నెలల నుంచి ఈ తంతు ముందుకు సాగడం లేదు.
● మరో అభ్యర్థి ఫిజికల్ సైన్స్, ఎస్‌ఏ తెలుగుకు ఎంపిక కాగా, ఆయన ఇష్టమున్న సబ్జెక్ట్ ఫిజికల్ సైన్స్ కోరుకున్నప్పటికీ ఆయనకు ఆ పోస్టింగ్ ఇవ్వకుండా భయభ్రాంతులకు గురిచేసి తెలుగు సబ్జెక్టును కట్టబెట్టారు. స్పెషల్ డీఎడ్ అభ్యర్థికి పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ఆయన వారం పాటు విధులు నిర్వహించిన అనంతరం రోస్టర్‌లో తప్పిదం జరిగిందని మళ్లీ ఆయనను తప్పించి మరో అభ్యర్థికి పోస్టింగ్ కల్పించారు.
ఇలా డీఎస్సీలో అనేక పొరపాట్లు, తప్పిదాలు కొన్ని కావాలనే చేసినట్లు అభ్యర్థులు విమర్శి స్తున్నారు. అక్రమాలు చోటు చేసుకున్నాయని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
డీఐఈవోగా జాదవ్ గణేశ్‌కుమార్
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా ఇంటర్మీడియెట్ (ఎఫ్‌ఏసీ) అధికారిగా జాదవ్ గణేశ్‌కుమార్‌ను నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కృష్ణ ఆదిత్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదివరకు డీఐఈవోగా పనిచేసిన రవీంద్రకుమార్ ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. దీంతో జాదవ్ గణేశ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment