● అర్హులైన అభ్యర్థులకు అన్యాయం ● మరాఠీ మీడియంలో ఓ అనర్హుడికి పోస్టింగ్‌ ● ఉర్దూ మీడియంలో అర్హత లేదంటూ ఒకరిని రిజెక్ట్‌ .. ● మరో అభ్యర్థి విషయంలో విచారణ పేరిట జాప్యం ● విద్యాశాఖ తీరుపై సర్వత్రా విమర్శలు | - | Sakshi
Sakshi News home page

● అర్హులైన అభ్యర్థులకు అన్యాయం ● మరాఠీ మీడియంలో ఓ అనర్హుడికి పోస్టింగ్‌ ● ఉర్దూ మీడియంలో అర్హత లేదంటూ ఒకరిని రిజెక్ట్‌ .. ● మరో అభ్యర్థి విషయంలో విచారణ పేరిట జాప్యం ● విద్యాశాఖ తీరుపై సర్వత్రా విమర్శలు

Published Sun, Mar 2 2025 2:26 AM | Last Updated on Sun, Mar 2 2025 2:23 AM

● అర్

● అర్హులైన అభ్యర్థులకు అన్యాయం ● మరాఠీ మీడియంలో ఓ అనర్హ

ఆదిలాబాద్‌టౌన్‌: ఎన్ని విమర్శలు ఎదుర్కొంటు న్నా విద్యాశాఖ తీరులో మార్పు రావడం లేదు. ఆ శాఖలో తవ్వినకొద్దీ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మెరిట్‌ సాధించినా పలువురికి అన్యాయం జరుగుతుందనే ఆరోపణలున్నాయి. అనర్హులుగా ఉన్నప్పటికీ కొందరికి పోస్టింగ్‌ కల్పించడంపై ‘మామూలు’గా వ్యవహరించారనే ఆరోపణలు లేకపోలేదు. అధికారులు, ఉద్యోగుల తప్పిదమో, లేక కావాలనే ఇలా చేశారో.. అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన పకడ్బందీగా చేపట్టాల్సిన అధికారులు నామ్‌కే వాస్తే జరిపి చేతులు దులుపుకున్నారు. దీంతో తుది జాబితాలో అనర్హులకు చోటు దక్కిందని చెబుతున్నారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళితే మిన్నకుండిపోతున్నారు. చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదివరకు జిల్లాలో పనిచేసిన ఉన్నతాధికారి అండదండలు ఉండడంతో తాము ఏమి చేసినా చెల్లుతుందనే ధీమాలో ఉన్నట్లు తెలుస్తోంది. కింది స్థాయి ఉద్యోగులు, ఉపాధ్యాయులు చిన్నపాటి పొరపాట్లు చేస్తే సస్పెండ్‌ వేటువేసే అధికారులు డీఎస్సీ 2024 నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నా నోరు మెదపకపోవడం వెనుక ఆంతర్యమేమిటో తెలియడం లేదు. విచారణ జరిపించి అర్హులైన వారికి పోస్టింగ్‌ ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇష్టారీతిన కౌన్సెలింగ్‌..

డీఎస్సీ కౌన్సెలింగ్‌ ఇష్టారీతిన చేపట్టారని పలువురు అభ్యర్థులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ప్రభుత్వం డీఎస్సీ నియామకాలను చేపట్టింది. విద్యాశాఖ అధికారులు, ఉద్యోగుల అక్రమాలతో అనేక తప్పిదాలు చోటుచేసుకున్నాయి. వీటిని సరిదిద్దేందుకు మరికొన్ని తప్పిదాలు చేయడం వారికి పరిపాటిగా మారింది. ఇన్ని తప్పిదాలు జరిగినప్పటికీ సదరు ఉద్యోగులు సర్టిఫికెట్లను పరిశీలించిన వారిపై చర్యలు తీసుకోకపోవడం వెనక ఆంతర్యం ఏమిటో తెలియరావడం లేదు. తప్పిదాలను సవరించి అర్హులైన వారికి పోస్టింగ్‌ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

కౌన్సెలింగ్‌లో అక్రమాలు జరిగాయని ఉపాధ్యాయ సంఘాల నాయకుల ఆందోళన (ఫైల్‌)

సమగ్ర విచారణ చేపట్టాలి

డీఎస్సీ 2024లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలి. సర్టిఫికెట్లను పరిశీలించిన అధికారులు, నియామకాలు చేపట్టిన ఉద్యోగులు, అధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలి. అర్హులైన వారికి పోస్టింగ్‌ ఇవ్వాలి. నిరుద్యోగులకు న్యాయం చేయాలి. లేనట్లయితే ఆందోళనలు చేపడతాం.

– శ్రీకాంత్‌, టీయూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

డీఎస్‌ఈకి లేఖ రాశాం

బేలకు చెందిన ఎస్జీటీ విషయంలో ఫిర్యాదు వచ్చింది. దీంతో ఆయనకు సంబంధించిన విషయంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు లేఖ రాశాం. అలాగే ఉర్దూ మీడియం ఎస్జీటీ అభ్యర్థికి సంబంధించి కూడా డైరెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం. ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదు.

– ప్రణీత, డీఈవో

No comments yet. Be the first to comment!
Add a comment
● అర్హులైన అభ్యర్థులకు అన్యాయం ● మరాఠీ మీడియంలో ఓ అనర్హ1
1/1

● అర్హులైన అభ్యర్థులకు అన్యాయం ● మరాఠీ మీడియంలో ఓ అనర్హ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement