పెనవేసుకున్న అనుబంధం!
● సలీం కోలుకోవాలని యాగం
● హనుమాన్ ఆలయంలో శ్యాంపూర్‌వాసుల పూజలు
ఉట్నూర్‌రూరల్: ఎప్పుడో ఆ ఊరిలో విధులు నిర్వర్తించిన ఆ వ్యక్తి ఆ గ్రామస్తుల సుఖ దుఃఖాల్లో మ మేకమయ్యాడు. మూడు దశాబ్దాల క్రితం అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లినా.. ఆ ఊరి వారిని మా త్రం మరువలేదు. ఆ గ్రామస్తులు కూడా అతడితో ఉన్న అనుబంధాన్ని కొనసాగించారు. సీన్ కట్ చేస్తే.. ముస్లిం వర్గానికి చెందిన ఆ వ్యక్తి ప్రస్తుతం అనారోగ్యం బారిన పడడంతో ఆ ఊరంతా కలిసి అతడు కోలుకోవాలని యాగం నిర్వహించారు. ఈ ఘటన ఉట్నూర్ మండలం శ్యాంపూర్‌లో చోటు చే సుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన షేక్‌సలీం 30 ఏళ్ల క్రితం ఉట్నూర్,ఇంద్రవెల్లి మండలాల్లోని పోలీసుస్టేషన్లలో హోంగార్డుగా విధులు నిర్వహించాడు. ఆ సమయంలో గ్రామస్తులతో మమేకమయ్యాడు. కుటుంబ సభ్యుడిలా అందరితో ఆత్మీయంగా వ్యవహరించాడు. 30 ఏళ్ల క్రితం ఇక్కడ విధులు మానేసిన సలీం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అక్కడే ఉద్యోగం చేస్తూ ఉండిపోయాడు. గ్రామస్తులతో ఉన్న పరిచయాల కారణంగా ఇక్కడి నుంచి అనారోగ్య సమస్యతో వెళ్లిన వారంతా ఆయన్నే సంప్రదించేవారు.ఆయన కూడా వారి సమస్య తీరే వరకు దగ్గరుండి అన్నీ చూసుకునేవాడు.అయితే సలీం ఇటీవల అనారోగ్యం బారిన పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆయ న ఆరోగ్యం కుదుటపడాలని స్థానిక హనుమాన్ ఆ లయంలో శనివారం పూజలు చేసి యాగం నిర్వహించారు. కులమతాలకతీంగా పెనవేసుకున్న అ నుబంధాన్ని చాటేలా ఆ ఊరి వారంతా చేపట్టిన ఈ కార్యం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. ఇందులో గ్రా మస్తులు వెంకట్, బాలాజీ తదితరులుపాల్గొన్నారు.
పెనవేసుకున్న అనుబంధం!
Comments
Please login to add a commentAdd a comment