బోథ్‌లో ఉద్రిక్తత
● యువతిని తల్లిదండ్రులకు అప్పజెప్పాలంటూ ఆందోళన
● పోలీస్‌స్టేషన్ ఎదుట బీజేపీ, హిందూ సంఘాల ధర్నా
బోథ్: ఓ వర్గానికి చెందిన యువకుడు ప్రేమ పేరి ట తీసుకెళ్లిన యువతిని తిరిగి తల్లిదండ్రులకు అ ప్పగించాలంటూ బీజేపీ, హిందూ సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానందం, హిందూవాహని నాయకుడు మహేందర్‌తో పాటు సుమా రు 300 మంది యువకులు స్టేషన్ ఎదుట భైఠాయించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... బోథ్‌కు చెందిన ఓ యువతి మిస్సింగ్ కావడంతో కుటుంబీకులు ఫిబ్రవరి 26న స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోపోలీసులు విచారణ చేపట్టి యువతి జాడ తెలుసుకున్నారు. గతనెల 28న బోథ్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. సదరు యు వతి మండల కేంద్రానికి చెందిన ఓ వర్గానికి చెందిన యువకుడితో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం అంద డంతో బీజేపీ, హిందూ సంఘాల నాయకులు సాయంత్రం స్టేషన్‌కు వచ్చి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బ్రహ్మానంద్ మాట్లాడుతూ, పో లీసులు సదరు యువతిని గత నెల 28న రాత్రి ఆది లాబాద్‌లోని సఖీ కేంద్రానికి పంపుతామని చెప్పి పంపలేదన్నారు. వెంటనే ఆమెను వారి తల్లి దండ్రులకు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. భారీగా యువకులు తరలిరావడంతో స్టేషన్ ఎదు ట ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది. సమాచారం అందుకున్న ఉట్నూర్ డీఎస్పీ నా గేందర్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. మరోవైపు ఆదిలాబాద్ నుంచి ప్రత్యేక బలగాలను రప్పించారు. స్థానిక ఎస్సై ప్రవీణ్‌కుమార్ సాయంత్రం సదరు యువతిని బోథ్‌కు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. అనంతరం ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ విలేకరులతో మాట్లాడారు. యువతిని తల్లిదండ్రులకు అప్పజెప్పామని తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ శాంతియుతంగా వ్యవహరించాలన్నారు. అలాగే సదరు యువకుడు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వయస్సు మార్పిడి చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయంపై విచారణ చేపడతామన్నారు. ఆయన వెంట సీఐ వెంకటేశ్వరరావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment