మూడు రోజుల్లో ప్రతిపాదనలు అందించాలి
● కలెక్టర్ రాజర్షి షా
కై లాస్‌నగర్: నీతి అయోగ్ కింద ఎంపికై న నార్నూర్ బ్లాక్‌కు డెల్టా ర్యాంకింగ్ నిధులు విడుదలైనట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆ బ్లాక్ పరిధిలో చేపట్టే విద్య, అంగన్‌వాడీ, సమాజ అభివృద్ధి కార్యక్రమాల పనులకు సంబంధించిన ప్రతిపాదనలు మూడు రోజుల్లోగా అందజేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్‌వో ప్లాంట్, ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుకు స్థలాలను సేకరించాలన్నారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు, ప్లే మెటీరియల్, న్యూట్రిషన్ గార్డెన్, డిజిటల్ క్లాస్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులు చర్చించి వివరాలతో ప్రతిపాదనలను అందించాలన్నారు. సమావేశంలో సబ్ కలెక్టర్ యువరాజ్ , ట్రెయినీ కలెక్టర్ అభిగ్యాన్, ఐసీడీఎస్ పీడీ సబిత, ట్రెబల్ వెల్ఫేర్ డీడీ వసంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.
తొమ్మిది గ్రామాల్లో 4జీ మొబైల్ టవర్ల నిర్మాణం
బీఎస్‌ఎన్‌ఎల్ సేవల విస్తరణలో భాగంగా జిల్లాలోని తొమ్మిది గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో 4జీ మొబైల్ టవర్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో శని వారం సమీక్ష నిర్వహించారు. అసోదబుర్కి, గణేశ్‌పూర్, గేర్జాయి, మాన్కాపూర్, కేశవగూడ, డెడ్రా, నాగా పూర్, సావ్రి, యాపల్‌గూడ గ్రామాల్లో టవర్ల నిర్మాణానికి అవసరమైన 200 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన స్థలాలు గుర్తించాలని ఆదేశించారు. అలాగే విద్యుత్ కనెక్షన్ అందించే దిశగానూ చర్యలు చేపట్టాలన్నారు. ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్ వేసేందుకు అవసరమైన అనుమతులు పొందేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ పనుల సమన్వయం కోసం ప్రత్యేక నోడల్ అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రెయినీనీ కలెక్టర్ అభిగ్యాన్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment