జిల్లా కోర్టులో డిస్పెన్సరీ
● ప్రారంభించిన హైకోర్టు జడ్జి
ఆదిలాబాద్‌టౌన్: కోర్టుకు వచ్చే నేరస్తులతో పాటు కక్షిదారులు, సిబ్బందికి ఆరోగ్య సమస్యలు తలెత్తిన సమయంలో డిస్పెన్సరీ దోహదపడుతుందని హైకోర్టు జడ్జి రేణుక యార అన్నారు. జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన డిస్పెన్సరిని శనివారం ప్రారంభించారు. పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కోర్టు ఆవరణలో మొక్క నాటారు. ముందుగా పెన్‌గంగ గెస్ట్‌హౌజ్‌లో జిల్లా జడ్జి ప్రభాకర రావు, కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌస్ ఆలం తదితరులు ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. డిస్పెన్సరీలో అందుబాటులో ఉండే వైద్య సేవల వివరాలను కలెక్టర్ జడ్జికి వివరించారు. అనంతరం జడ్జిలు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం
బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైకోర్టు జడ్జి ని ఘనంగా సన్మానించారు. వారి సమస్యలను జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లాలో జడ్జిల పోస్టు ఖాళీల భర్తీకి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి ప్రభాకరరావు, జడ్జిలు శివరాం ప్రసాద్, ప్రమీళ జైన్, దుర్గారాణి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్, పీపీలు, న్యాయవాదులు పాల్గొన్నారు.
సంక్షేమ ఫలాలు సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్‌టౌన్: కార్మికశాఖ ద్వారా అందే సంక్షేమ ఫలాలను భవన నిర్మాణ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఏఐటీయూసీ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు గాజెంగుల రాజు అన్నారు. ఈనెల 11న జిల్లా కేంద్రంలో నిర్వహించే మహాసభను జయప్రదం చేయాలని జిల్లా కేంద్రంలో శనివారం ప్రచారం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment