కొనుగోలు కేంద్రంలో మద్దతు ధర
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): శనగ విక్రయాల కోసం వచ్చే రైతులకు మార్కెట్ యార్డులో మద్దతు ధర లభిస్తుందని ఏడీఏ అష్రఫ్ అలీ అన్నారు. జైనథ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో నాఫెడ్, మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ సహకారంతో ఏర్పాటు చేసిన శనగ పంట కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు యార్డుకు వచ్చేటప్పుడు పట్టా పాసు బుక్‌తో పాటు ఆధార్ జిరాక్స్‌లను వెంట తెచ్చుకోవాలని సూచించారు. అలాగే పంట నమోదు వివరాలు ఆన్‌లైన్‌లో మరో సారి పరిశీలించుకోవాలని పేర్కొన్నారు. తేమ 14 శాతం మించకుండా చూసుకోవా లన్నారు. కనీస మద్దతు ధర 5,650 ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. కార్యక్రమంలో పీఏసీఎస్ బ్యాంక్ మేనేజర్ జితేందర్‌రెడ్డి, సహకార సంఘం సీఈవో గంగన్న, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment