ఆధ్యాత్మికతతో శాంతియుత జీవనం
బజార్‌హత్నూర్: ఆధ్యాత్మికత పెంపొందిస్తే శాంతియుత జీవనం అలవడుతుందని స్థానిక ఎంపీ గోడం నగేశ్ అన్నారు. మండలంలోని జాతర్ల గ్రామంలో గల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈనెల 3న ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అనంతరం గ్రామంలో నవజ్యోతి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఇందులో వెంకన్న యాదవ్, గణేశ్, రాజేశ్వర్, ఈశ్వర్, రవి, చందన్, కష్ణారావు, గంగారాం, రమణ, శంకర్, తదితరులున్నారు
Comments
Please login to add a commentAdd a comment