ఎకై ్సజ్ సీఐ విజేందర్‌కు నగదు పురస్కారం
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ ఎకై ్సజ్ సీఐ రేండ్ల విజేందర్‌ను నగదు పురస్కారం వరించింది. దేశీదారు కట్టడితో పాటు సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు గాను ఈ అవార్డు దక్కింది. ఈమేరకు హైదరా బాద్‌లోని ఎకై ్సజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆ శాఖ రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, జాయింట్ కమిషనర్ ఖురేషీ చేతుల మీదుగా ఆయన రూ.12వేల నగదు పురస్కారం అందుకున్నారు. పలువురు అధికారులు, ఉద్యోగులు ఆయనకు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment