ఆదిలాబాద్‌టౌన్: ఇన్ని రోజులు పుస్తకాలతో కుస్తీ పడ్డ విద్యార్థులు ఇక పరీక్షలకు హాజరుకానున్నారు. నేటి నుంచి ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు షురూ కానున్నాయి. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో రాసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికా రులు పేర్కొంటున్నారు. ఆందోళన వీడి పరీక్ష రా యాలని సూచిస్తున్నారు. బుధవారం ప్రథమ సంవత్సరం, గురువారం ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 25 వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదివరకు నిమిషం ఆలస్యం నిబంధన ఉండగా, కొంతమంది విద్యార్థులు సమయానికి కేంద్రానికి చేరుకోకపోవడంతో పరీక్షలకు దూరమయ్యారు. దీంతో ఇంటర్మీడియెట్ బోర్డు ఈసారి 5 నిమిషాల వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత కేంద్రంలోనికి విద్యార్థులను అనుమతించరు.
31 కేంద్రాలు ఏర్పాటు..
ఇంటర్ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 31 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 13 ప్రభు త్వ జూనియర్ కళాశాలలు,ఐదు సాంఘిక సంక్షేమ, రెండు ట్రైబల్ వెల్ఫేర్, తొమ్మిది ప్రైవేట్ జూనియర్ కళాశాలలు,ఒక మోడల్ స్కూల్,ఒక మైనార్టీ స్కూ ల్ ఉన్నాయి. పరీక్షలకు 18,880 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో ఫస్టియర్ జనరల్ విద్యార్థులు 8,093 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1,013,సెకండియర్ జనరల్‌విద్యార్థులు8,754 మంది, ఒకేషనల్ విద్యార్థులు1,020మంది ఉన్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి..
పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈవో జాదవ్ గణేశ్ తెలిపారు. ఏ ఒక్క విద్యార్థి కింద కూర్చోకుండా ఫర్నిచర్ సమకూర్చినట్లుగా పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 31 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 31 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, ముగ్గురు కస్టోడియన్లు, రెండు సిట్టింగ్, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
ప్రశాంతంగా పరీక్షలు రాయాలి
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు జిల్లాలో 31 పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు హాజరుకానున్న 18,880 మంది విద్యార్థులు
జిల్లాలో..
మొత్తం పరీక్ష కేంద్రాలు : 31
ప్రథమ సంవత్సరం విద్యార్థులు : 9,106
ద్వితీయ సంవత్సరం విద్యార్థులు : 9,774
స్క్వాడ్‌లు : 4( సిట్టింగ్ 2, ఫ్లయింగ్ 2)
హెల్ప్‌డెస్క్ నంబర్లు :
08732– 297115, 9848781808
ఇంటర్మీడియెట్ పరీక్షలకు పకడ్బందీ బందోబస్తు నిర్వహించనున్నట్లు ఎస్పీ గౌస్ ఆలం ప్రకటనలో తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఆయా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లను మూసి ఉంచాలని ఆదేశించారు. కేంద్రాల్లోకి సెల్‌ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి సౌండ్ సిస్టంలకు అనుమతి లేదని పేర్కొన్నారు. ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు వీలైనంత త్వరగా సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. పరీక్షలు బాగా రాయాలని శుభాకాంక్షలు తెలిపారు.
కై లాస్‌నగర్: జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు ఆన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో మంగళవారం ఆయ న టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థులు అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవా లని సూచించారు. ప్రతీ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరా యం కలగకుండా చూడాలని ఆ శాఖ అధికారుల ను ఆదేశించారు. సకాలంలో ప్రశ్నపత్రాలు కేంద్రాలకు చేరేలా చర్యలు చేపట్టాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. అలాగే కాపీయింగ్‌కు ఆస్కా రం లేకుండా సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని వారికి అల్ ది బెస్ట్ తెలిపారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, డీఐఈవో గణేశ్, డీఈవో ప్రణీత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment