ఉపాధిహామీ కూలీలందరికీ పనులు కల్పించాలి
తలమడుగు: దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఉ పాధి కూలీకి పని కల్పించాలని డీఆర్డీవో ర వీందర్ రాథోడ్ సూచించారు. గురువారం మండలంలోని సుంకిడి, కుచులాపూర్ గ్రా మాల్లో చేపట్టిన ఉపాధిహామీ పనులను పరి శీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. పనుల్లో అక్రమాలు చోటు చేసుకోకుండా పర్యవేక్షించాలని సిబ్బందిని ఆదేశించారు. పనులకు వస్తున్న కూలీల వివరాలు ప్రతీరోజు రెండుసార్లు ఫొటో తీసుకుని వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కల పెంపకం వేగవంతం చేయాలని, వేసవిలో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించారు. ఎంపీడీవో చంద్రశేఖర్, ఏపీవో మేఘమాల, ఈసీ ప్రవీణ్‌కుమార్, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment