కై లాస్‌నగర్: మాదక ద్రవ్యాలు, గంజాయిని జిల్లాలో పూర్తిగా నిర్మూలించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో మాదక ద్రవ్యాల నిర్మూలనపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతీ కళాశాలలో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేసి, అందులో పోలీస్, విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులకు ప్రతీ వారం గంజాయి, మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్ధాల గురించి అవగాహన కల్పించాలని తెలిపారు. ఎవరైనా గంజాయి లేదా మాదకద్రవ్యాల బారిన పడితే స్థానిక డీఅడిక్షన్ సెంటర్లలో చేర్పించి బాగు చేయాలని సూచించారు. ఎస్పీ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్, పోలీస్, వైద్యారోగ్య, ట్రాన్స్‌పోర్టు, ఎకై ్సజ్ శాఖల అధికారులు, మెడికల్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment