కైలాస్‌నగర్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల ని యంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం అధి కారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రోడ్డు భద్రతపై సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడా రు. రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి అక్కడ రంబుల్ స్టెప్స్, సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, స్పీడ్ లేజర్ గన్ ఏర్పాటు చేయాలని సూచించారు. సాయంత్రం డ్రంకెన్‌డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీలు జీవన్‌రెడ్డి, శ్రీనివాస్, ఆర్డీవో వినోద్‌కుమార్, ఆర్‌అండ్‌బీ, ఎకై ్సజ్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment