‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి

Published Fri, Mar 7 2025 10:15 AM | Last Updated on Fri, Mar 7 2025 10:15 AM

-

కైలాస్‌నగర్‌: ఈ నెల 21నుంచి ఏప్రిల్‌ 4వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పరీక్షల నిర్వహణపై ఎస్పీ గౌస్‌ ఆలంతో కలిసి సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు నిర్వహించనున్న పరీక్షలకు జిల్లాలో రెగ్యులర్‌ వి ద్యార్థులు 10,051, ప్రైవేట్‌గా 55 మంది హాజరు కానున్నట్లు తెలిపారు. వీరి కోసం 52 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తూ పోలీస్‌ బందోబస్తు ఏర్పా టు చేస్తామని చెప్పారు. కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. పరీక్ష సమయాల్లో విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా బస్సులు నడపాలని ఆర్టీసీకి సూచించారు. కేంద్రాలను తనిఖీ చే సేందుకు ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌లను నియమించినట్లు పేర్కొన్నారు. మాస్‌ కాపీయింగ్‌కు తావులేకుండా ఇన్విజిలేటర్లు, చీఫ్‌ సూపరింటెండెంట్లు ప్ర త్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ప్రతీ కేంద్రంలో మహిళా కానిస్టేబుల్‌ ఉండేలా చూసుకోవాలని, అ ధికారులంతా సమన్వయంతో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలన్నారు. డీఈవో ప్ర ణిత, సీఎస్‌లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement