ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత
బజార్‌హత్నూర్: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్ర శాంతత లభిస్తుందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. గురువారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో కలిసి మండలంలోని గిర్నూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయ విగ్రహ ప్రతి ష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జా దవ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఆలయాల అ భివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. మాజీ సర్పంచ్ కృష్ణ, నాయకులు రాజారాం, భూమయ్య, సకేశ్, మారుతి, నాన రమణ, అల్కె గణేశ్, నాన రమణ, పోరెడ్డి శ్రీనివాస్, కొత్త శంకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment