‘పువ్వు’ను ఉపాధిగా మలిచి | - | Sakshi
Sakshi News home page

‘పువ్వు’ను ఉపాధిగా మలిచి

Published Sat, Mar 8 2025 2:12 AM | Last Updated on Sat, Mar 8 2025 2:09 AM

‘పువ్

‘పువ్వు’ను ఉపాధిగా మలిచి

ఆమె అడుగు ప్రగతి బాటన పడింది. సంఘటితమై ఆర్థిక స్వావలంబన దిశగా సాగుతోంది. ప్రకృతి నీడన స్వశక్తితో ఎదుగుతున్న వారు కొందరైతే.. సామాజిక బాధ్యతగా అండగా నిలుస్తున్న వారు ఇంకొందరు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఏజెన్సీకే పరిమితమైన ఆదివాసీ మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
● ఉట్నూర్‌, ఖైర్డాట్వాలో ఇప్ప లడ్డూ తయారీ కేంద్రాలు

ఖైర్డాట్వాలో..

నార్నూర్‌: మండలంలోని ఖైర్డాట్వా గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన మహిళలు 12మంది ఓ గ్రూపుగా ఏర్పడ్డారు. మండల సమాఖ్య సహకారంతో రూ.3.50 లక్షలు రుణం తీసుకుని గ్రామంలోనే ఇప్పపువ్వు లడ్డూ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఫిబ్రవరి 4న కలెక్టర్‌ రాజర్షి షా చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రస్తుతం నెలకు 60వేల లడ్డూలను తయారు చేస్తున్నారు. వీటిని స్వయంగా వీరే మార్కెటింగ్‌ చేస్తున్నారు. నార్నూర్‌, ఇంద్రవెల్లి, గాదిగూడ తదితర ప్రాంతాల్లో ఉన్న బేకరీలు, స్వీట్‌ హౌస్‌ల్లో రూ.300 నుంచి రూ.350 కిలో చొప్పున విక్రయిస్తున్నారు. ఇవి రక్తహీనత నివారణకు దోహదపడుతుండడంతో ఆదరణ లభిస్తుందని నిర్వాహకులు చెబుతున్నా రు. అన్ని ఖర్చులు పోనూ గత నెలలో రూ.40వేల వరకు ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు.

మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత

ఇంద్రవెల్లి: స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని కలెక్టర్‌ రాజర్షి షా, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. మండలకేంద్రంలోని ఇంద్రా యి మహిళా సమాఖ్య కార్యాలయంలో సెర్ప్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిల్లెట్‌ బిస్కెట్‌ తయారీ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందన్నా రు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని మహిళలు సద్వి నియోగం చేసుకోవాలన్నారు. ఇందులో ఉట్నూర్‌ సబ్‌ కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, డీ ఆర్డీవో రాథోడ్‌ రవీందర్‌, రాష్ట్ర మహిళా కమి షన్‌ సభ్యురాలు కుమ్ర ఈశ్వరిబాయి, ఇంద్రవెల్లి ఏఎంసీ చైర్మన్‌ ముఖడే ఉత్తం, తహసీ ల్దార్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎంపీడీవో భాస్కర్‌, ఏపీఎం రామారావ్‌ తదితరులున్నారు.

ఖైర్డాట్వా గ్రామంలో లడ్డ్డూ తయారు చేస్తున్న

ఆదివాసీ గిరిజన మహిళలు

ఉపాధి మార్గం దొరికింది..

ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలని మేమంతా ఓ గ్రూపుగా ఏర్పడ్డాం. ఇప్పపువ్వు లడ్డూ తయారీని ఎంచుకున్నాం. ఐటీడీఏ సహకారంతో సామగ్రి కొనుగోలు చేసి యూనిట్‌ ప్రారంభించాం. ఇందులో పోషకవిలువలు ఎక్కువగా ఉండడంతో అధికారులు వీటిని గుర్తించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, చిన్నారులతో పాటు వసతిగృహ విద్యార్థులకు అందిస్తున్నారు. అన్ని ఖర్చులు పోనూ ప్రస్తుతం ఒక్కొక్కరికి రూ.15వేల నుంచి రూ.20 వేలకు మిగులుతున్నాయి.

– కుమ్రబాయి,

ఆదివాసీ భీంబాయి సంఘం అధ్యక్షురాలు

ఆదాయం పెరుగుతుంది

గ్రామానికి చెందిన 12 మంది మహిళలం కలిసి ఒక గ్రూప్‌గా ఏర్పడ్డాం. మండల సమాఖ్య ద్వారా రూ.3.50 లక్షలు రుణం తీసుకున్నాం. ఇప్పపువ్వు లడ్డూల తయారీకి శ్రీకారం చుట్టాం. నెల రోజుల్లోనే 60వేల లడ్డూలు తయారు చేశాం. మార్కెటింగ్‌ కూడా మేమే చేసుకుంటున్నాం. అన్ని ఖర్చులు పోనూ ప్రస్తుతం నెలకు రూ.40వేల వరకు ఆదాయం వస్తుంది. మున్ముందు మరింత పెరగనుంది.

– ఆత్రం కౌసల్యబాయి,

గ్రూప్‌ అధ్యక్షురాలు, ఖైర్డాట్వా

వారంతా అడవి తల్లి ఒడిలో సేదతీరే గిరిజనులు. సంఘంగా ఏర్పడి ప్రభుత్వ చేయూతతో ముందడుగు వేశారు. ప్రకృతి ప్రసాదించే ఇప్పపువ్వునే ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు. ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారు. వారే ఉట్నూర్‌, నార్నూర్‌ మండలంలోని ఖైర్డాట్వాకు చెందిన ఆదివాసీ మహిళలు.

ఉట్నూర్‌రూరల్‌: ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ఆదివాసీ మహిళలు సంఘటితమై స్వశక్తితో ఎదగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఉట్నూర్‌కు చెందిన 12 మంది భీంబాయి సంఘంగా ఏర్పడ్డారు. నాటి కాలంలో ఆదివాసీ లు రక్తహీనత నివారణకు ప్రకృతి ప్రసాదించిన ఇప్పపువ్వుతో చేసిన లడ్డూలను తినేవారని గుర్తించి వాటి తయారీకి పూనుకున్నారు. విషయాన్ని ఐటీడీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. లడ్డూల తయారీతో కలిగే ప్రయోజనాలను గుర్తించిన అప్పటి కలెక్టర్‌ దివ్యా దేవరాజన్‌, పీవో ప్రత్యేక చొరవ చూపారు. వీటిని గర్భిణులు, పిల్లలకు అందించాలనే ఆలోచనతో ముందుకెళ్లారు. ఐటీడీఏ సహకారంతో రూ.14 లక్షలతో 2019లో తయారీ యూనిట్‌ ప్రారంభించారు. అప్పటి నుంచి లడ్డూలు తయారు చేస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు ఈ సంఘం సభ్యులు. ఆర్డర్‌ ప్రకా రం జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు సరఫరా చేస్తూ ఉపాధి పొందుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
‘పువ్వు’ను ఉపాధిగా మలిచి 1
1/6

‘పువ్వు’ను ఉపాధిగా మలిచి

‘పువ్వు’ను ఉపాధిగా మలిచి 2
2/6

‘పువ్వు’ను ఉపాధిగా మలిచి

‘పువ్వు’ను ఉపాధిగా మలిచి 3
3/6

‘పువ్వు’ను ఉపాధిగా మలిచి

‘పువ్వు’ను ఉపాధిగా మలిచి 4
4/6

‘పువ్వు’ను ఉపాధిగా మలిచి

‘పువ్వు’ను ఉపాధిగా మలిచి 5
5/6

‘పువ్వు’ను ఉపాధిగా మలిచి

‘పువ్వు’ను ఉపాధిగా మలిచి 6
6/6

‘పువ్వు’ను ఉపాధిగా మలిచి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement