అక్రమంగా ఇంటినంబర్లిస్తే కఠిన చర్యలు
● బల్దియా సమీక్షలో ఎమ్మెల్యే పాయల్ శంకర్
కై లాస్‌నగర్: మున్సిపల్ పరిధిలో అక్రమంగా ఇంటినంబర్లు జారీ చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే పాయల్ శంకర్ హెచ్చరించారు. ము న్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సి పల్ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఇంజినీరింగ్, శానిటేషన్, మెప్మా, టౌన్‌ప్లానింగ్ విభాగాల వారీగా సమీక్షించిన ఆయన అందులోని అక్రమాలను ప్రస్తావిస్తూ అధికారుల తీ రుపై మండిపడ్డారు. అక్రమంగా ఇంటి నంబర్లు జా రీ చేయడంతోనే కబ్జాదారులు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారని, అడ్డుకుంటే కోర్టుకు వెళ్లి రూ.కోట్ల విలు వైన భూములు బల్దియాకు దక్కకుండా చేస్తున్నారన్నారు. బాధ్యులైన వారిని సస్పెండ్ చేయించేదాకా వదలమని హెచ్చరించారు. పట్టణంలో ఆక్రమణల ను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబ ర్‌పై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. అ లాగే ఇంటి అనుమతుల కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా సకాలంలో జారీ చేయాలన్నా రు. బయోమైనింగ్ కాంట్రాక్టర్‌కు ఎలాంటి పర్యవేక్షణ లేకుండా రూ.1.5కోట్లు ఎలా చెల్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లీచింగ్ పౌడర్, డీజిల్ బిల్లుల్లో అనేక అక్రమాలు జరిగినట్లుగా తన వద్ద పూర్తి ఆధారాలున్నాయని, అయితే ఈ సమావేశంలో వాటిని ప్రస్తావించడం లేదన్నారు. ఇప్పటికై నా సదరు అధి కారులు తమ వైఖరి మార్చుకోవాలన్నారు. నిధుల వినియోగంపై సరైన పర్యవేక్షణ లేదని మండిపడ్డా రు. వార్డు ప్రత్యేకాధికారులు, ఇంజినీరింగ్ అధికా రులు సంయుక్తంగా ప్రతీ వార్డులో క్షేత్రస్థాయిలో జియోట్యాగింగ్ ద్వారా నీటి ఎద్దడిని పరిశీలించి రెండు రోజుల్లో నివేదిక అందజేయాలన్నారు.షెల్టర్ హోంల నిర్వహణ పేరిట అక్రమంగా బిల్లులు తీసుకుంటున్నారని మెప్మా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు, ఈఈ పెరిరాజు, డీఈలు తిరుపతి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment