ఆ ఆడపడుచుల కొత్త ఆనవాయితీ
ఇచ్చోడ: ఆ ఊరి అమ్మాయి వివాహానికి గ్రామంలోని అన్ని కుటుంబాలకు చెందిన పెళ్లయిన ఆడపడుచులు కానుకలు సమర్పించడం ఆనవాయి తీ. ఇందులో భాగంగా స్టీల్, ఇత్తడి సామగ్రి అందించేవారు. అయితే వీటితో ఎక్కువగా ఉపయో గం ఉండడం లేదు. అలాగే పెళ్లి ఖర్చులు కూడా పెరిగిన నేపథ్యంలో ఆ వధువు తల్లిదండ్రులకు అండగా ఉండాలని నిర్ణయించుకున్న ఆ ఆడపడుచులు కానుకలకు బదులు నగదు అందజేయాలని నిర్ణయించుకున్నారు. విషయాన్ని కుల పెద్దలకు వివరించగా వారు సైతం ఒప్పుకున్నారు. దీంతో నూతన ఆనవాయితీకి శ్రీకారం చుట్టారు నేరడిగొండ మండలం తర్నం పంచాయతీ పరిధి అనుబంధ గ్రామమైన మంగల్‌మోట్‌కు చెందిన ఆడపడుచులు. గ్రామంలో ఈ నెల 3న పెందూర్ వసంత వివాహం జరిగింది. గ్రామానికి చెందిన పెళ్లయిన ఆడపడుచులంతా కలిసి సుమారు 60 మంది వరకు రూ.12వేల నగదు జమ చేసి అందజేశారు. వీరు తీసుకున్న నిర్ణయంపై ఆదివాసీ పెద్దలు హర్షం వ్యక్తం చేశా రు. సంప్రదాయాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment