290 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని జైనథ్ పోలీసులు శుక్రవారం ఉదయం పట్టుకున్నారు. పీడీఎస్ బియ్యాన్ని లారీలో తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో వాహనాల తనిఖీ చేపట్టారు. బోరజ్ మండల కేంద్రం జాతీయ రహదారి–44పై బస్టాండ్ వద్ద ఓ లారీని తనిఖీ చేయగా అందులో 290 క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించారు. హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌లోని బాలగట్‌కు తరలిస్తున్నట్లు జైనథ్ సీఐ డి.సాయినాథ్ తెలిపారు. పట్టుకున్న బియ్యం విలువ సుమారు రూ.16 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. సంఘటన స్థలానికి ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి చేరుకుని వివరాలను అడిగి తెలుకున్నారు. అక్రమంగా బియ్యం, ఇసుక రవాణా చేసేవారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. లారీడ్రైవర్ తాహిర్‌ను అదుపులో తీసుకుని, ఆయనతోపాటు లారీ యజమాని ఎండీ.నజీమ్, బియ్యం సరఫరా చేస్తున్న నిందితులు నాగనాథ్, షఫీలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పట్టుకున్న బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. జైనథ్ ఎస్సై పురుషోత్తం, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment