నేరాల నియంత్రణపై ఫోకస్
● ట్రాఫిక్ సమస్యలు, శాంతిభద్రతలపై నిఘా ● సంఘవిద్రోహ శక్తుల కట్టడికి చర్యలు ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో నూతన ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో నేరాల అదుపు, శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపా దం మోపుతానని జిల్లా నూతన ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఎస్పీగా సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే..
సాక్షి: సర్, గుడ్‌మార్నింగ్.. వెల్‌కం ఆదిలాబా ద్. మీ నేపథ్యం, ఐపీఎస్ శిక్షణ.. ఇప్పటివర కు ఏయేప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు?
ఎస్పీ: స్వస్థలం వచ్చి కశ్మీర్. పాఠశాల విద్య అక్కడే సాగింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో ని జేఎన్‌టీయూలో పట్టభద్రుడిని అయ్యా ను. అమ్మ ఊర్మిళ గృహిణి. నాన్న రాకేశ్ వ్యా పారి. భార్య దివ్యాన్షి డాక్టర్. నాది 2017 ఐపీఎస్ బ్యాచ్. మొదటగా సిద్దిపేటలో శిక్షణ పూర్తి చేశాను. తర్వాత మంచిర్యాల ఏసీపీ, డీసీపీగా పెద్దపల్లి, రామగుండం డీసీపీగా, సిరిసిల్ల ఎస్పీగా పనిచేశాను.
సాక్షి:జిల్లాలో మాదకద్రవ్యాలు, పేకాట నిర్మూ లనకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు..?
ఎస్పీ: మాదకద్రవ్యాలను అరికట్టేందుకు ప్రత్యే క చర్యలు చేపడతాం. అసాంఘిక కార్యకలా పాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదు. యువత చెడువ్యసనాలకు దూరంగా ఉండా లి.విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్ సరఫరా చేస్తే స మాచారం అందించాలి. క్రైమ్ రేట్‌ను తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం. గుట్కా, మట్కా, పేకాటపై దృష్టి సారిస్తాం.
సాక్షి: మీ ప్రాధాన్యత అంశాలు..?
ఎస్పీ: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్ర త్యేక చర్యలు తీసుకుంటాం. నేరాలను అదుపులో ఉంచేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తాం. అసాంఘిక కార్యకలాపాల కు తావు లేకుండా చూస్తాం. సరిహద్దు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నిఘాతో పాటు సంఘ విద్రోహ శక్తుల కట్టడికి కృషి చేస్తాం. రౌడీ షీటర్లపై నిఘాతో పాటు ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అవగాహన కార్యక్రమాలు చేపడతాం.
సాక్షి: జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఎలాంటి చర్యలు చేపడతారు..?
ఎస్పీ: విషయం నా దృష్టికి వచ్చింది. ట్రాఫిక్ పోలీసులు, అధికారులతో సమావేశం నిర్వహించి ప్రత్యేక చర్యలు చేపడతాం. అంతేకా కుండా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటాం.తల్లిదండ్రులు కూడా మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారి స్తాం. బ్లాక్‌స్పాట్లను గుర్తించి అవసరమైన చర్యలు చేపడతాం.
సాక్షి: మహిళల భద్రత కోసం ఎలా ముందుకెళ్తారు..?
ఎస్పీ: మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడతాం. షీటీంల ద్వారా మహిళలు, యు వతులు, విద్యార్థినులకు అవగాహన కల్పి స్తాం. అవసరమైతే అదనంగా బృందాలను ఏర్పాటు చేస్తాం. పోకిరీలు వేధిస్తే డయల్ 100కు సమాచారం అందించాలి. తక్షణమే పోలీసులు అక్కడికి చేరుకొని బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం. నేరాల నియంత్రణకు పెట్రోలింగ్, గస్తీ ముమ్మరం చేస్తాం.
సాక్షి: జిల్లా కేంద్రంలో పలుచోట్ల సీసీ కెమెరా లు పనిచేయట్లేదు. దొంగతనాలు, ప్రమాదా లు జరిగిన సమయంలో గుర్తించలేని పరిస్థి తి ఉంది. ఎలాంటి చర్యలు చేపడతారు?
ఎస్పీ: జిల్లాకేంద్రంలోని అన్ని చౌక్‌లు, ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు పనిచేసేలా చూస్తాం. అవసరమైన వాటికి మరమ్మతులు చేయిస్తాం. దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాల నివారణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహద పడతాయి. ప్రజలు, వ్యాపారులు వీటి ఏర్పాటు కోసం స్వచ్ఛందంగా ముందుకు రావాలి. సంఘటనలు జరిగినప్పుడు పోలీసు దర్యాప్తు సులువు అవ్వడంతో పాటు ఫుటేజీ ఆధారంగా ఉంటుంది.
సాక్షి: మావోయిస్టుల కదలికలపై ఎలాంటి దృష్టి సారిస్తారు..?
ఎస్పీ: జిల్లాలో మావోయిస్టుల ప్రభావం అంతగా లేదు. అయినప్పటికీ వారి కదలికలపై చర్యలు చేపడతాం.అమాయక గిరిజన యు వత అటువైపు ఆకర్షితులు కాకుండా అవగా హన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. వారికి ఉపాధి అవకాశాలు కల్పించేలా చూడడంతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తాం.
బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ..
నూతన ఎస్పీ అఖిల్ మహాజన్ స్థానిక పోలీసు కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయనకు పోలీసులు గౌ రవ వందనం చేశారు. ఇక్కడ ఎస్పీగా పనిచేసి కరీంనగర్ సీపీగా బదిలీపై వెళ్తున్న గౌస్ ఆలం నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఎస్పీ అఖిల్ మాట్లాడుతూ.. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయమన్నారు. ఇందులో అదనపు ఎస్పీ సురేంద్రరావు, డీఎస్పీలు శ్రీనివాస్, జీవన్‌రెడ్డి,నాగేందర్,హసీబుల్లా తదితరులున్నారు.
నేరాల నియంత్రణపై ఫోకస్
నేరాల నియంత్రణపై ఫోకస్
Comments
Please login to add a commentAdd a comment