వేధింపులా..‘181’కు కాల్ చేయండి
కైలాస్‌నగర్: వేధింపులకు గురయ్యే మహిళలు హెల్ప్‌లైన్ 181కు కాల్ చేసి లేదా www. shebox. nic. in వెబ్‌సైట్ ద్వారా లేదా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక పరిష్కార చట్టం–2013పై కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. ఈ చట్టంపై ప్రతీ మహిళ అవగాహన కలిగి ఉండాలన్నారు. వేధింపులను నియంత్రించడంలో భాగంగా ఫిర్యాదు చేసేందుకు ప్రతీ కార్యాలయంలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చట్టం ఆవశ్యకతను తెలిపే పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలోని ఫ్రీడం పార్కులో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్యతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యా మలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, ఆర్డీవో వినోద్ కుమార్, ట్రెయినీ కలెక్టన్ అభిగ్యాన్, జిల్లా సంక్షేమాధికారి మిల్కా తదితరులు పాల్గొన్నారు.
ఇఫ్తార్‌కు హాజరైన కలెక్టర్..
రంజాన్ మాసంలో ముస్లింలు నియమనిష్ఠలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరిస్తారని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఎస్‌వో వాజిద్ అలీ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌లో కలెక్టర్ పా ల్గొని మాట్లాడారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్, డీఎల్పీవో ఫణింద్రరావు, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment