కలెక్టరేట్ ఎదుట సీపీఐ ధర్నా
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ రూరల్ మండలం నిషాన్‌ఘాట్‌లోని సర్వేనంబర్ 38లో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి సిర్ర దేవేందర్ మాట్లాడుతూ, కాలనీలో ఎనిమిదేళ్లుగా నిరుపేదలు అంధకారంలో ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్ర జాప్రతినిధులు పట్టించుకోకపోవడం విచా రకరమన్నారు. కలెక్టర్ చొరవ చూపి కాలనీ లో విద్యుత్ సౌకర్యంతో పాటు తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతులు క ల్పించాలని కోరారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో పార్టీ నాయకులు గంగారెడ్డి, దేవిదాస్, కేశవ్, కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment