ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
ఆదిలాబాద్‌టౌన్: వైకల్యం గల పిల్లలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని డీఈవో ప్రణీత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ డైట్ కళాశాలలో అలింకో, విద్యశాఖ ద్వారా దివ్యాంగులకు సోమవారం ఉపకరణాలు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 123 మంది చిన్నారులకు సీపీ చైర్, కృత్రిమ అవయవాలు, ఎలక్ట్రిక్ ట్రైసైకిల్, వినికిడి యంత్రాలు, రోలేటర్ తదితర పరికరాలను అందించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ,దివ్యాంగులు సకలాంగులతో సమానంగా పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులుగా తీర్చి దిద్దాలన్నారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు సుజాత్ ఖాన్, శ్రీకాంత్‌గౌడ్, ఎంఈవోలు సోమయ్య, శ్రీనివాస్,హెచ్‌ఎంలు లచ్చిరాం, లక్ష్మణ్, డైట్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment