‘స్పాట్’ రెమ్యూనరేషన్ చెల్లించాలి
ఆదిలాబాద్‌టౌన్: 2024లో నిర్వహించిన ఎస్సెస్సీ స్పాట్ వాల్యుయేషన్‌కు సంబంధించిన రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్‌టీఎఫ్) జిల్లా అధ్యక్షుడు రామగిరి శివకుమార్ అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయంలో జిల్లా వి ద్యాశాఖ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్‌ను సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. రెమ్యూనరేషన్ చెల్లించని పక్షంలో ఈ సారి స్పాట్ విధులు బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఇందులో సంఘం ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి విద్యాసాగర్‌రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment